د قرآن کریم د معناګانو ژباړه - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - د ژباړو فهرست (لړلیک)


د معناګانو ژباړه آیت: (12) سورت: المائدة
وَلَقَدْ اَخَذَ اللّٰهُ مِیْثَاقَ بَنِیْۤ اِسْرَآءِیْلَ ۚ— وَبَعَثْنَا مِنْهُمُ اثْنَیْ عَشَرَ نَقِیْبًا ؕ— وَقَالَ اللّٰهُ اِنِّیْ مَعَكُمْ ؕ— لَىِٕنْ اَقَمْتُمُ الصَّلٰوةَ وَاٰتَیْتُمُ الزَّكٰوةَ وَاٰمَنْتُمْ بِرُسُلِیْ وَعَزَّرْتُمُوْهُمْ وَاَقْرَضْتُمُ اللّٰهَ قَرْضًا حَسَنًا لَّاُكَفِّرَنَّ عَنْكُمْ سَیِّاٰتِكُمْ وَلَاُدْخِلَنَّكُمْ جَنّٰتٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ ۚ— فَمَنْ كَفَرَ بَعْدَ ذٰلِكَ مِنْكُمْ فَقَدْ ضَلَّ سَوَآءَ السَّبِیْلِ ۟
మరియు నిశ్చయంగా అల్లాహ్ ఇస్రాయీలు సంతతివారితో దృఢమైన ప్రమాణమును దగ్గరలోనే ప్రస్తావన వచ్చే వాటితో తీసుకున్నాడు. మరియు వారిపై పన్నెండు మంది నాయకులను నియమించాడు. ప్రతీ నాయకుడు తన ఆదీనంలో ఉన్న వారిపై పర్యవేక్షకుడిగా ఉంటాడు. మరియు అల్లాహ్ ఇస్రాయీలు సంతతివారితో ఇలా పలికాడు : నిశ్చయంగా మీరు నమాజును పరిపూర్ణ పద్దతిలో పాటించి,మీ సంపదల నుండి జకాత్ ను చెల్లించి,నా ప్రవక్తలందరిని వారి మధ్య ఎటువంటి బేధబావం లేకుండా విశ్వసించి ,వారిని గౌరవించి,వారికి సహాయం చేసి మరియు మంచి మార్గముల్లో మీరు ఖర్చు చేసినప్పుడు నేను సహాయముతో మరియు మద్దతుతో మీకు తోడుగా ఉంటాను. మీరు వీటన్నింటిని నెలకొల్పినప్పుడు నేను మీరు పాల్పడిన పాపములన్నింటిని మీ నుండి ప్రక్షాళన చేస్తాను. మరియు ప్రళయదినమున మిమ్మల్ని నేను స్వర్గవనముల్లో ప్రవేశింపజేస్తాను వాటి భవనముల క్రింది నుండి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. ఎవరైతే ఈ దృఢప్రమాణమును తీసుకున్న తరువాత అవిశ్వసిస్తాడో అతడు తెలిసి ఉద్దేశపూర్వకంగా సత్య మార్గము నుండి మరలిపోయాడు.
عربي تفسیرونه:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• من عظيم إنعام الله عز وجل على النبي عليه الصلاة والسلام وأصحابه أن حماهم وكف عنهم أيدي أهل الكفر وضررهم.
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరులను పరిరక్షించటం మరియు అవిశ్వాసపరుల చేతుల నుండి మరియు వారి కీడు నుండి వారిని కాపాడటం వారిపై అల్లాహ్ అజ్జవజల్ల యొక్క గొప్ప బహుమానము.

• أن الإيمان بالرسل ونصرتهم وإقامة الصلاة وإيتاء الزكاة على الوجه المطلوب، سببٌ عظيم لحصول معية الله تعالى وحدوث أسباب النصرة والتمكين والمغفرة ودخول الجنة.
ప్రవక్తలపై విశ్వాసము మరియు వారికి సహాయం చేయటం మరియు నమాజును నెలకొల్పటం మరియు కోరిన విధంగా జకాతును ఇవ్వటం మహోన్నతుడైన అల్లాహ్ తోడును పొందటానికి మరియు సహాయము,సాధికారతకు మరియు మన్నింపునకు మరియు స్వర్గములో ప్రవేశమునకు కారకాలు ఉపలబ్ది అవటానికి పెద్ద కారణం.

• نقض المواثيق الملزمة بطاعة الرسل سبب لغلظة القلوب وقساوتها.
దైవప్రవక్తలకు విధేయత చూపించే వాటితో ఇమిడి ఉన్న ప్రమాణములను విచ్ఛిన్నం చేయడం హృదయాల కాఠిన్యం మరియు క్రూరత్వానికి కారణం.

• ذم مسالك اليهود في تحريف ما أنزل الله إليهم من كتب سماوية.
అల్లాహ్ యూదలపై అవతరింపజేసిన దివ్య గ్రంధముల వక్రీకరణ విషయంలో యూదుల మార్గముల పై విమర్శన.

 
د معناګانو ژباړه آیت: (12) سورت: المائدة
د سورتونو فهرست (لړلیک) د مخ نمبر
 
د قرآن کریم د معناګانو ژباړه - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - د ژباړو فهرست (لړلیک)

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

بندول