Check out the new design

د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه. * - د ژباړو فهرست (لړلیک)


د معناګانو ژباړه سورت: نجم   آیت:

అ-నజ్మ్

د سورت د مقصدونو څخه:
إثبات صدق الوحي وأنه من عند الله.
దైవవాణి సత్యమని మరియు అది అల్లాహ్ వద్ద నుండి వచ్చినదని నిరూపించడం

وَالنَّجْمِ اِذَا هَوٰی ۟ۙ
పరిశుద్ధుడైన ఆయన నక్షత్రము రాలినప్పుడు ప్రమాణం చేశాడు.
عربي تفسیرونه:
مَا ضَلَّ صَاحِبُكُمْ وَمَا غَوٰی ۟ۚ
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఋజుమార్గము నుండి మరల లేదు మరియు ఆయన అపమార్గమునకు లోను కాలేదు కాని ఆయన హేతుబద్ధమైనవారు.
عربي تفسیرونه:
وَمَا یَنْطِقُ عَنِ الْهَوٰی ۟ؕۚ
మరియు ఆయన ఈ ఖుర్ఆన్ ను తన మనోవాంఛను అనుసరించి పలకలేదు.
عربي تفسیرونه:
اِنْ هُوَ اِلَّا وَحْیٌ یُّوْحٰی ۟ۙ
ఈ ఖుర్ఆన్ అల్లాహ్ జిబ్రయీల్ అలైహిస్సలాం మార్గము నుండి ఆయన వైపునకు అల్లాహ్ అవతరింపజేసిన ఒక దైవవాణి మాత్రమే.
عربي تفسیرونه:
عَلَّمَهٗ شَدِیْدُ الْقُوٰی ۟ۙ
మహా బలవంతుడు ఒక దూత అయిన జిబ్రయీల్ అలైహిస్సలాం దాన్ని ఆయనకు నేర్పించాడు.
عربي تفسیرونه:
ذُوْ مِرَّةٍ ؕ— فَاسْتَوٰی ۟ۙ
మరియు జిబ్రయీల్ అలైహిస్సలాం మంచి రూపము కలవారు. మరియు ఆయన అలైహిస్సలాం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు అల్లాహ్ ఆయనను సృష్టించిన రూపములో (నిజ రూపములో) ప్రత్యక్షమై నిలబడ్డారు.
عربي تفسیرونه:
وَهُوَ بِالْاُفُقِ الْاَعْلٰی ۟ؕ
మరియు జిబ్రయీల్ ఆకాశపు ఎత్తైన అంచులపై ఉన్నారు.
عربي تفسیرونه:
ثُمَّ دَنَا فَتَدَلّٰی ۟ۙ
ఆ తరువాత జిబ్రయీల్ అలైహిస్లాం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమునకు దగ్గరయ్యారు. ఆ తరువాత ఆయనకు ఇంకా ఎక్కువ దగ్గరయ్యారు.
عربي تفسیرونه:
فَكَانَ قَابَ قَوْسَیْنِ اَوْ اَدْنٰی ۟ۚ
ఆయనకు ఆయన దగ్గరవ్వటం రెండు విల్లులంత లేదా దానికి ఇంచుమించుగా ఉన్నది.
عربي تفسیرونه:
فَاَوْحٰۤی اِلٰی عَبْدِهٖ مَاۤ اَوْحٰی ۟ؕ
అప్పుడు జిబ్రయీల్ అల్లాహ్ దాసుడగు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంనకు దైవవాణి చేర్చవలసినది చేర్చారు.
عربي تفسیرونه:
مَا كَذَبَ الْفُؤَادُ مَا رَاٰی ۟
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హృదయం ఆయన చూపులు చూసిన దాన్ని అబద్దమనలేదు.
عربي تفسیرونه:
اَفَتُمٰرُوْنَهٗ عَلٰی مَا یَرٰی ۟
ఓ ముష్రికులారా అల్లాహ్ ఆయనను రాత్రివేళ తీసుకుని వెళ్ళి ఆయనకు చూపిన దాని విషయంలో మీరు ఆయనతో వాదులాడుతున్నారా ?!
عربي تفسیرونه:
وَلَقَدْ رَاٰهُ نَزْلَةً اُخْرٰی ۟ۙ
మరియు వాస్తవానికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జిబ్రయీల్ అలైహిస్సలాంను రెండవ సారి ఆయన నిజరూపములో ఆయనకు రాత్రి వేళ తీసుకుని వెళ్ళినప్పుడు చూశారు.
عربي تفسیرونه:
عِنْدَ سِدْرَةِ الْمُنْتَهٰی ۟
సిద్రతుల్ ముంతహా (చివరి హద్దుల్లో ఉన్న రేగు చెట్టు) వద్ద. ఏడవ ఆకాశములో ఉన్న చాలా గొప్ప వృక్షము అది.
عربي تفسیرونه:
عِنْدَهَا جَنَّةُ الْمَاْوٰی ۟ؕ
ఆ వృక్షము వద్దనే జన్నతుల్ మావా (స్వర్గ ధామం) కలదు.
عربي تفسیرونه:
اِذْ یَغْشَی السِّدْرَةَ مَا یَغْشٰی ۟ۙ
అప్పుడు సిద్రహ్ ను అల్లాహ్ ఆదేశముతో ఒక గొప్ప వస్తువు కప్పివేస్తుంది. దాని వాస్తవికత అల్లాహ్ కు తప్ప ఇంకెవరికీ తెలియదు.
عربي تفسیرونه:
مَا زَاغَ الْبَصَرُ وَمَا طَغٰی ۟
ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చూపులు కుడి యడమలకు వాలనూ లేదు మరియు ఆయనకి నిర్ణయించిన హద్దులను అతిక్రమించలేదు.
عربي تفسیرونه:
لَقَدْ رَاٰی مِنْ اٰیٰتِ رَبِّهِ الْكُبْرٰی ۟
వాస్తవానికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తనను గగన యాత్ర చేయించబడిన రాత్రి తన ప్రభువు సామర్ధ్యమును సూచించే గొప్ప సూచనలను చూశారు. అప్పుడు ఆయన స్వర్గమును చూశారు మరియు నరకమును ఇతరవాటిని చూశారు.
عربي تفسیرونه:
اَفَرَءَیْتُمُ اللّٰتَ وَالْعُزّٰی ۟ۙ
ఓ ముష్రికులారా మీరు అల్లాహ్ ను వదిలి ఆరాధించే ఈ విగ్రహాలు లాత్ మరియు ఉజ్జాలను గురించి ఆలోచించారా.
عربي تفسیرونه:
وَمَنٰوةَ الثَّالِثَةَ الْاُخْرٰی ۟
మరియు మీ విగ్రహాల్లోంచి మూడవదైన ఇంకొకటి మనాత్ ను గరించి. నాకు చెప్పండి మీరు అవి మీకు ఏదైన ప్రయోజనం గాని నష్టం గాని కలిగించే అధికారం కలవా ?!
عربي تفسیرونه:
اَلَكُمُ الذَّكَرُ وَلَهُ الْاُ ۟
ఓ ముష్రికులారా మీకు మీరు ఇష్డపడే మగ సంతానమా మరియు పరిశుద్ధుడైన ఆయనకు మీరు ఇష్టపడని ఆడ సంతానమా ?!.
عربي تفسیرونه:
تِلْكَ اِذًا قِسْمَةٌ ضِیْزٰی ۟
మీ ఇచ్ఛానుసారం మీరు పంచిన ఈ పంపకము ఒక అన్యాయమైన పంపకం.
عربي تفسیرونه:
اِنْ هِیَ اِلَّاۤ اَسْمَآءٌ سَمَّیْتُمُوْهَاۤ اَنْتُمْ وَاٰبَآؤُكُمْ مَّاۤ اَنْزَلَ اللّٰهُ بِهَا مِنْ سُلْطٰنٍ ؕ— اِنْ یَّتَّبِعُوْنَ اِلَّا الظَّنَّ وَمَا تَهْوَی الْاَنْفُسُ ۚ— وَلَقَدْ جَآءَهُمْ مِّنْ رَّبِّهِمُ الْهُدٰی ۟ؕ
ఈ విగ్రహాలు కొన్ని అర్దరహిత పేర్లు మాత్రమే. దైవత్వ గుణముల్లో వాటికి ఎటువంటి భాగము లేదు. వాటిని మీరు మీ తాత ముత్తాతలు మీ స్వయంతరపు నుండి పేర్లు పెట్టుకున్నారు. వాటి గురించి అల్లాహ్ ఎటువంటి ఆధారము అవతరింపజేయలేదు. ముష్రికులు తమ మనసులు కోరిన తమ హృదయములలో షైతాను అలంకరించిన విశాసములను మాత్రమే అనుసరిస్తున్నారు. వాస్తవానికి వారి ప్రభువు వద్ద నుండి ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైైహి వసల్లం నాలుక ద్వారా వారి వద్దకు సన్మార్గము వచ్చినది. కాని వారు ఆయన ద్వారా మార్గము పొందలేదు.
عربي تفسیرونه:
اَمْ لِلْاِنْسَانِ مَا تَمَنّٰی ۟ؗۖ
లేదా మానవునికి తాను ఆశించిన విగ్రహాల సిఫారసు అల్లాహ్ యందు కలదా ?!
عربي تفسیرونه:
فَلِلّٰهِ الْاٰخِرَةُ وَالْاُوْلٰی ۟۠
లేదు అతను ఆశించినది అతనికి లభించదు. పరలోకము మరియు ఇహలోకము అల్లాహ్ దే. వాటిలో నుండి ఆయన తాను కోరిన దాన్ని ఇస్తాడు మరియు తాను కోరిన దాన్ని ఆపుతాడు.
عربي تفسیرونه:
وَكَمْ مِّنْ مَّلَكٍ فِی السَّمٰوٰتِ لَا تُغْنِیْ شَفَاعَتُهُمْ شَیْـًٔا اِلَّا مِنْ بَعْدِ اَنْ یَّاْذَنَ اللّٰهُ لِمَنْ یَّشَآءُ وَیَرْضٰی ۟
మరియు ఆకాశముల్లో ఎందరో దూతలున్నారు ఒక వేళ వారు ఎవరికోసమైన సిఫారసు చేయదలచితే వారి సిఫారసు ఏమాత్రం పనికిరాదు కాని అల్లాహ్ వారిలో నుంచి ఎవరికి తలచుకుని సిఫారసు చేసే అనుమతించిన తరువాత మరియు దానికి సిఫారసు చేయబడే వాడి నుండి ప్రసన్నుడు అయితే తప్ప. అల్లాహ్ సాటి కల్పించే వారి కొరకు సిఫారసు చేసే అనుమతివ్వడు మరియు అల్లాహ్ ను వదిలి అతను ఆరాధించే ఆతని సిఫరసు చేయబడే వాడి నుండి ఆయన ప్రసన్నుడవడు.
عربي تفسیرونه:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• كمال أدب النبي صلى الله عليه وسلم حيث لم يَزغْ بصره وهو في السماء السابعة.
ప్రవక్త సల్లల్లాహు అలైహి సల్లం గారి గుణము యొక్క పరిపూర్ణత ఎప్పుడైతే ఆయన ఏడవ ఆకాశంలో ఉన్నా ఆయన దృష్టి తప్పిపోలేదు.

• سفاهة عقل المشركين حيث عبدوا شيئًا لا يضر ولا ينفع، ونسبوا لله ما يكرهون واصطفوا لهم ما يحبون.
ముష్రికుల బుద్ధిలేమి తనం ఎప్పుడైతే వారు నష్టం కలిగించని,లాభం కలిగించని వాటిని ఆరాధించారో మరియు అల్లాహ్ కు తాము ఇష్టపడని వాటిని అంటగట్టారో,తాము ఇష్టపడే వాటిని తమ కొరకు ప్రత్యేకించుకున్నారో.

• الشفاعة لا تقع إلا بشرطين: الإذن للشافع، والرضا عن المشفوع له.
సిఫారసు చేయటం రెండు షరతులతో ఏర్పడుతుంది : 1) సిఫారసు చేసే వాడికి అనుమతి ఉండాలి. 2) సిఫారసు చేయబడే వ్యక్తి నుండి ప్రసన్నత.

 
د معناګانو ژباړه سورت: نجم
د سورتونو فهرست (لړلیک) د مخ نمبر
 
د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه. - د ژباړو فهرست (لړلیک)

د مرکز تفسیر للدراسات القرآنیة لخوا خپور شوی.

بندول