Check out the new design

د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه. * - د ژباړو فهرست (لړلیک)


د معناګانو ژباړه سورت: انعام   آیت:
اِنَّ اللّٰهَ فَالِقُ الْحَبِّ وَالنَّوٰی ؕ— یُخْرِجُ الْحَیَّ مِنَ الْمَیِّتِ وَمُخْرِجُ الْمَیِّتِ مِنَ الْحَیِّ ؕ— ذٰلِكُمُ اللّٰهُ فَاَنّٰی تُؤْفَكُوْنَ ۟
నిశ్చయంగా అల్లాహ్ ఒక్కడే విత్తనములను చీల్చి దాని ద్వారా పంటలను తీస్తున్నాడు. మరియు అతడు టెంకను చీల్చి దాని ద్వారా ఖర్జూరపు చెట్లను తీస్తున్నాడు,నిర్జీవం నుండి జీవమును తీస్తున్నాడు అప్పుడే మానవుడిని,జంతువులన్నింటిని వీర్య బిందువు నుండి తీస్తున్నాడు. మరియు జీవము నుండి నిర్జీవమును తీస్తున్నాడు అప్పుడే మనిషి నుండి వీర్య బిందువును,కోడి నుండి గ్రుడ్డును తీస్తున్నాడు. ఇదంతా మిమ్మల్ని సృష్టించిన ఆ అల్లాహ్ చేస్తున్నాడు. అయితే ఓ బహు దైవారాదుకులారా మీరు ఆయన అద్భుతమైన సృష్టిని చూసి కూడా సత్యము నుండి ఎలా మరలిపోతున్నారు.
عربي تفسیرونه:
فَالِقُ الْاِصْبَاحِ ۚ— وَجَعَلَ الَّیْلَ سَكَنًا وَّالشَّمْسَ وَالْقَمَرَ حُسْبَانًا ؕ— ذٰلِكَ تَقْدِیْرُ الْعَزِیْزِ الْعَلِیْمِ ۟
మరియ ఆయనే సుబహానహు తఆలా రాత్రి చీకటి నుండి ఉదయపు వెలుగును చీల్చి వెలికి తాస్తున్నాడు. మరియు ఆయనే రాత్రిని మానవుల కొరకు విశ్రాంతి సమయంగా చేశాడు. పగలు ఆహారోపాధిని పొందటం కొరకు,దానిని పొందటంలో కలిగిన తమ అలసట నుండి సేద తీరటం కొరకు వారు అందులో చలనం నుండి విశ్రాంతి తీసుకుంటారు. మరియు ఆయనే సూర్యచంద్రులను ఒక నిర్ధారిత లెక్కప్రకారం ప్రకాశించటానికి సృష్టించాడు. ఈ ప్రస్తావించబడిన అద్భుతమైన సృష్టిని ఎవరూ అపజయానికి గురిచేయలేని సర్వాధిక్యుడి నిర్ధారణ. మరియు అతడు తన సృష్టితాల గురించి,వారికి ఏది శ్రేయెస్కరమో అంతా తెలిసినవాడు.
عربي تفسیرونه:
وَهُوَ الَّذِیْ جَعَلَ لَكُمُ النُّجُوْمَ لِتَهْتَدُوْا بِهَا فِیْ ظُلُمٰتِ الْبَرِّ وَالْبَحْرِ ؕ— قَدْ فَصَّلْنَا الْاٰیٰتِ لِقَوْمٍ یَّعْلَمُوْنَ ۟
ఓ ఆదమ్ సంతతివారా అల్లాహ్ సుబహానహు తఆలా భూమి,సముద్రపు మార్గముల్లో మీప్రయాణముల్లో మిమ్మల్ని మార్గము సందేహంలో పడవేసినప్పుడు దారి తెలుసుకోవటానికి మీ కొరకు ఆకాశములో నక్షత్రములను సృష్టించాడు. నిశ్చయంగా మేము ఈ ఆధారాల్లో,రుజువుల్లో యోచన చేసి వాటిద్వారా లబ్ది పొందే జాతి వారి కొరకు మా సామర్ధ్యమును నిరూపించే ఆధారాలను,రుజువులను చూపించినాము.
عربي تفسیرونه:
وَهُوَ الَّذِیْۤ اَنْشَاَكُمْ مِّنْ نَّفْسٍ وَّاحِدَةٍ فَمُسْتَقَرٌّ وَّمُسْتَوْدَعٌ ؕ— قَدْ فَصَّلْنَا الْاٰیٰتِ لِقَوْمٍ یَّفْقَهُوْنَ ۟
మరియు ఆయన సుబహానహు తఆలా మిమ్మల్ని ఒకే ప్రాణం తో పుట్టించాడు. అది మీ తండ్రి అయిన ఆదం ప్రాణము. ఆయన మిమ్మల్ని సృష్టించటంను మీ తండ్రిని మట్టితో సృష్టించటం ద్వారా మొదలు పెట్టాడు. ఆ తరువాత దానితో ఆయన మిమ్మల్ని సృష్టించాడు. మరియు ఆయన మీ కొరకు మీరు దేనిలోనైతే ఎక్కువ కాలం స్థిరంగా ఉంటారో దానిని మీ తల్లుల గర్భాల మాదిరిగా,తక్కువ కాలం స్థిరంగా ఉంటారో దానిని మీ తండ్రుల వెన్నుల మాదిరిగా సృష్టించాడు. నిశ్చయంగా మేము అల్లాహ్ వాక్కును అర్ధంచేసుకునే జాతి వారి కొరకు ఆయతులను విడమరచి తెలిపాము.
عربي تفسیرونه:
وَهُوَ الَّذِیْۤ اَنْزَلَ مِنَ السَّمَآءِ مَآءً ۚ— فَاَخْرَجْنَا بِهٖ نَبَاتَ كُلِّ شَیْءٍ فَاَخْرَجْنَا مِنْهُ خَضِرًا نُّخْرِجُ مِنْهُ حَبًّا مُّتَرَاكِبًا ۚ— وَمِنَ النَّخْلِ مِنْ طَلْعِهَا قِنْوَانٌ دَانِیَةٌ ۙ— وَّجَنّٰتٍ مِّنْ اَعْنَابٍ وَّالزَّیْتُوْنَ وَالرُّمَّانَ مُشْتَبِهًا وَّغَیْرَ مُتَشَابِهٍ ؕ— اُنْظُرُوْۤا اِلٰی ثَمَرِهٖۤ اِذَاۤ اَثْمَرَ وَیَنْعِهٖ ؕ— اِنَّ فِیْ ذٰلِكُمْ لَاٰیٰتٍ لِّقَوْمٍ یُّؤْمِنُوْنَ ۟
మరియు ఆయనే సుబహానహు వతఆలా ఆకాశము నుండి నీటిని కరిపించాడు అది వర్షపు నీరు. దాని ద్వారా మేము అన్ని రకాల మొక్కలను మొలకెత్తించినాము. మేము మొక్కల నుండి పచ్చని చేల మాదిరిగా,వృక్షాల మాదిరిగా వెలికి తీశాము. దాని నుండి మేము ఒక దానిపై ఒకటి పేరుకుపోయిన వెన్నులో ఉండినట్లుగా గింజలను తీస్తాము. మరియు ఖర్జూరపు పాళి నుండి వాటి గెలలు దగ్గరగా ఉంటాయి. నిలబడిన వాడు,కూర్చున్న వాడు వాటిని పొందుతాడు. మరియు మేము ద్రాక్ష తోటలను తీసినాము. మరియు మేము జైతూనును (ఆలివ్ పండ్లను),దానిమ్మకాయలను తీసినాము. వాటి ఆకులు ఒక దానితో ఒకటి పోలి ఉంటాయి. వాటి ఫలాల్లో వేరు వేరుగా ఉంటాయి. ఓ ప్రజలారా వాటి పండ్లు మొదలు ప్రారంభమయ్యే వేళ,అది పండే వేళ దాని వైపున నిశిత దృష్టితో చూడండి. ఓ ప్రజలారా నిశ్చయంగా ఇందులో అల్లాహ్ ను విశ్వసించే జాతి వారి కొరకు అల్లాహ్ సామర్ధ్యమును నిరూపించే స్పష్టమైన ఆధారాలున్నవి. వారే ఈ ఆధారాలు,రుజువుల ద్వారా లబ్ది పొందుతారు.
عربي تفسیرونه:
وَجَعَلُوْا لِلّٰهِ شُرَكَآءَ الْجِنَّ وَخَلَقَهُمْ وَخَرَقُوْا لَهٗ بَنِیْنَ وَبَنٰتٍ بِغَیْرِ عِلْمٍ ؕ— سُبْحٰنَهٗ وَتَعٰلٰی عَمَّا یَصِفُوْنَ ۟۠
ముష్రికులు జిన్నులు లాభం చేస్తాయని,నష్టం కలిగిస్తాయని విశ్వసించినప్పుడు వారు ఆరాధనలో జిన్నులను అల్లాహ్ కి భాగస్వాములుగా ఖరారు చేసుకున్నారు. వాస్తవానికి అల్లాహ్ వారిని సృష్టించినాడు. ఆయన కాక మరెవ్వరూ వాటిని సృష్టించలేదు. ఆయనే ఆరాధనకు అర్హుడు. వారు కుమారులను కల్పించుకున్నారు ఏ విధంగానైతే యూదులు ఉజైరును కల్పించుకున్నారో,క్రైస్తవులు ఈసాను కల్పించుకున్నారో. మరియు వారు కుమార్తెలను కల్పించుకున్నారు ఏ విధంగానైతే ముష్రికులు దైవదూతలను కల్పించుకున్నారో. అసత్యవాదులు తెలుపుతున్న ఈ గుణాల నుండి ఆయన పరిశుద్ధుడు,పవిత్రుడు.
عربي تفسیرونه:
بَدِیْعُ السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— اَنّٰی یَكُوْنُ لَهٗ وَلَدٌ وَّلَمْ تَكُنْ لَّهٗ صَاحِبَةٌ ؕ— وَخَلَقَ كُلَّ شَیْءٍ ۚ— وَهُوَ بِكُلِّ شَیْءٍ عَلِیْمٌ ۟
మరియు ఆయనే పూర్వ నమూనా లేకుండా ఆకాశములను సృష్టించిన వాడు,భూమిని సృష్టించిన వాడు. ఆయనకు భార్యయే లేనప్పుడు ఆయనకు సంతానము ఎలా ఉండును ?. ఆయనే ప్రతి వస్తువును సృష్టించినాడు. మరియు ఆయన ప్రతి వస్తువు గురించి తెలిసిన వాడు. ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు.
عربي تفسیرونه:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• الاستدلال ببرهان الخلق والرزق (تخليق النبات ونموه وتحول شكله وحجمه ونزول المطر) وببرهان الحركة (حركة الأفلاك وانتظام سيرها وانضباطها)؛ وكلاهما ظاهر مشاهَد - على انفراد الله سبحانه وتعالى بالربوبية واستحقاق الألوهية.
సృష్టి మరియు ఆహారోపాధి యొక్క ఆధారము ద్వారా (మొక్కలను సృష్టించటం,వాటి పెరుగుదల,వాటి రూపు రేఖలు మారటం మరియు వర్షం కురవటం) మరియు చలనము యొక్క ఆధారము ద్వారా (సౌర వ్యవస్థ చలనము,వాటి చలనంలో క్రమశిక్షణ,వాటి క్రమబద్దత) నిరూపణ. ఆ రెండు రుబూబియ్యత్ లో అల్లాహ్ ఒక్కడే అన్న దానికి,అల్లాహ్ ఒక్కడే ఆరాధనకు హక్కుదారుడు అనటానికి ప్రత్యక్ష సాక్ష్యం.

• بيان ضلال وسخف عقول المشركين في عبادتهم للجن.
ముష్రికులు జిన్నుల కొరకు తమ ఆరాధన విషయంలో వారి బుధ్ధి హీనత,మార్గభ్రష్టత వివరణ.

 
د معناګانو ژباړه سورت: انعام
د سورتونو فهرست (لړلیک) د مخ نمبر
 
د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه. - د ژباړو فهرست (لړلیک)

د مرکز تفسیر للدراسات القرآنیة لخوا خپور شوی.

بندول