د قرآن کریم د معناګانو ژباړه - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - د ژباړو فهرست (لړلیک)


د معناګانو ژباړه آیت: (70) سورت: الأنفال
یٰۤاَیُّهَا النَّبِیُّ قُلْ لِّمَنْ فِیْۤ اَیْدِیْكُمْ مِّنَ الْاَسْرٰۤی ۙ— اِنْ یَّعْلَمِ اللّٰهُ فِیْ قُلُوْبِكُمْ خَیْرًا یُّؤْتِكُمْ خَیْرًا مِّمَّاۤ اُخِذَ مِنْكُمْ وَیَغْفِرْ لَكُمْ ؕ— وَاللّٰهُ غَفُوْرٌ رَّحِیْمٌ ۟
ఓ ప్రవక్తా మీ చేతుల్లో మష్రికుల్లోంచి ఖైదీలుగా ఉన్న వారు ఎవరినైతే మీరు బదర్ యుద్ధము రోజున ఖైదీలుగా చేసుకున్నారో వారితో ఇలా అనండి : ఒక వేళ అల్లాహ్ మీ హృదయాల్లో మేలు చేసే ఉద్దేశాన్ని,మంచి సంకల్పాన్ని తెలుసుకుంటే పరిహారంగా మీ నుండి తీసుకున్న దాని కన్న మంచిది ఆయన మీకు ప్రసాధిస్తాడు.అయితే మీ నుండి తీసుకున్న దాని గురించి బాధపడకండి.మరియు మీ పాపములను మన్నించి వేస్తాడు.మరియు అల్లాహ్ తన దాసుల్లోంచి పశ్చాత్తాపము పడేవారిని మన్నించేవాడును,వారిపై కరుణించేవాడును.నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పిన తండ్రి అయిన అబ్బాస్ రజి అల్లాహు అన్హు కొరకు,ఆయనే కాకుండా ఇస్లాం స్వీకరించిన వారి కొరకు అల్లాహ్ వాగ్దానం నిరూపితమైనది.
عربي تفسیرونه:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• يجب على المؤمنين ترغيب الأسرى في الإيمان.
ఖైదీలను విశ్వాస విషయంలో ప్రోత్సహించడం విశ్వాసపరులపై తప్పనిసరి.

• تضمنت الآيات بشارة للمؤمنين باستمرار النصر على المشركين ما داموا آخذين بأسباب النصر المادية والمعنوية.
విశ్వాసపరులు భౌతిక మరియు నైతిక విజయానికి కారకాలను ఎంచుకున్నంత వరకు ముష్రికులపై విజయం కొనసాగించటానికి విశ్వాసపరులకు ఈ ఆయతుల్లో శుభవార్త ఉన్నది.

• إن المسلمين إذا لم يكونوا يدًا واحدة على أهل الكفر لم تظهر شوكتهم، وحدث بذلك فساد كبير.
నిశ్చయంగా ముస్లిములు అవిశ్వాసపరులకు వ్యతిరేకంగా ఒకటవ్వకపోతే వారు తమ బలమును ప్రదర్శించలేరు.దాని వలన పెద్ద ఉపద్రవము పుట్టుకొస్తుంది.

• فضيلة الوفاء بالعهود والمواثيق في شرعة الإسلام، وإن عارض ذلك مصلحة بعض المسلمين.
ఇస్లాం ధర్మంలో ఒప్పందాలను,నిబంధనలను నెరవేర్చటమునకు ప్రాముఖ్యత ఉన్నది.ఒక వేళ అది కొందరు ముస్లిముల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నా కూడా.

 
د معناګانو ژباړه آیت: (70) سورت: الأنفال
د سورتونو فهرست (لړلیک) د مخ نمبر
 
د قرآن کریم د معناګانو ژباړه - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - د ژباړو فهرست (لړلیک)

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

بندول