Check out the new design

Tradução dos significados do Nobre Qur’an. - Tradução telugu de interpretação abreviada do Nobre Alcorão. * - Índice de tradução


Tradução dos significados Surah: Ash-Shu'araa   Versículo:
قَالَ وَمَا عِلْمِیْ بِمَا كَانُوْا یَعْمَلُوْنَ ۟ۚ
నూహ్ అలైహిస్సలాం వారితో ఇలా పలికారు : ఈ విశ్వాసపరులందరు ఏమి చేసేవారో నాకు తెలియదు. నేను వారి ఆచరణలను లెక్కవేసే పరిరక్షకుడిగా వారిపై లేను.
Os Tafssir em língua árabe:
اِنْ حِسَابُهُمْ اِلَّا عَلٰی رَبِّیْ لَوْ تَشْعُرُوْنَ ۟ۚ
వారి లెక్క మాత్రం వారి రహస్యాలను,వారి బహిరంగాలను తెలిసిన అల్లాహ్ పై ఉన్నది. నా వద్ద లేదు. మీరు ఏమి చెప్పారో ఒక వేళ మీరు తెలుసుకుంటే చెప్పేవారు కాదు.
Os Tafssir em língua árabe:
وَمَاۤ اَنَا بِطَارِدِ الْمُؤْمِنِیْنَ ۟ۚ
మరియు నేను మీరు విశ్వసించటానికి మీ కోరికను అంగీకరిస్తూ విశ్వాసపరులను నా సభ నుండి గెంటివేసే వాడను కాను.
Os Tafssir em língua árabe:
اِنْ اَنَا اِلَّا نَذِیْرٌ مُّبِیْنٌ ۟ؕ
నేను హెచ్చరికను స్పష్టపరిచే హెచ్చరిక చేసేవాడను మాత్రమే నేను మిమ్మల్ని అల్లాహ్ శిక్ష నుండి హెచ్చరిస్తున్నాను.
Os Tafssir em língua árabe:
قَالُوْا لَىِٕنْ لَّمْ تَنْتَهِ یٰنُوْحُ لَتَكُوْنَنَّ مِنَ الْمَرْجُوْمِیْنَ ۟ؕ
ఆయనతో ఆయన జాతి వారు ఇలా పలికారు : నీవు మమ్మల్ని పిలుస్తున్న దాని నుండి ఆపకపోతే నీవు తప్పకుండా దూషించబడిన వారిలో నుంచి,రాళ్ళతో కొట్టబడి హతమార్చబడిన వారిలో నుంచి అయిపోతావు.
Os Tafssir em língua árabe:
قَالَ رَبِّ اِنَّ قَوْمِیْ كَذَّبُوْنِ ۟ۚۖ
నూహ్ అలైహిస్సలాం తన ప్రభువుతో వేడుకుంటూ ఇలా పలికారు : ఓ నా ప్రభువా నిశ్చయంగా నా జాతి వారు నన్ను తిరస్కరించారు. మరియు నేను నీ వద్ద నుండి తీసుకుని వచ్చిన దాని విషయంలో నన్ను సత్యవంతుడని నమ్మలేదు.
Os Tafssir em língua árabe:
فَافْتَحْ بَیْنِیْ وَبَیْنَهُمْ فَتْحًا وَّنَجِّنِیْ وَمَنْ مَّعِیَ مِنَ الْمُؤْمِنِیْنَ ۟
అయితే నీవు నాకూ,వారికి మధ్య అసత్యముపై వారు మొండిగా ఉండటం వలన వారిని తుదిముట్టించే ఒక తీర్పును ఇవ్వు. నీవు నా జాతి వారిలో నుంచి అవిశ్వాసపరులని దేనితోనైతే వినాశనమునకు గురి చేస్తావో దాని నుండి నన్ను,నాతోపాటు ఉన్న విశ్వాసపరులని రక్షించు.
Os Tafssir em língua árabe:
فَاَنْجَیْنٰهُ وَمَنْ مَّعَهٗ فِی الْفُلْكِ الْمَشْحُوْنِ ۟ۚ
అప్పుడు మేము అతని కొరకు అతని దుఆను స్వీకరించాము. మరియు మేము అతనిని,అతనితోపాటు ఉన్న విశ్వాసపరులని మనుషులతో,జంతువులతో నిండి ఉన్న నావలో రక్షించాము.
Os Tafssir em língua árabe:
ثُمَّ اَغْرَقْنَا بَعْدُ الْبٰقِیْنَ ۟ؕ
ఆ తరువాత మేము వారిలో మిగిలి ఉన్న వారిని ముంచి వేశాము, వారు నూహ్ జాతివారు.
Os Tafssir em língua árabe:
اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیَةً ؕ— وَمَا كَانَ اَكْثَرُهُمْ مُّؤْمِنِیْنَ ۟
నిశ్ఛయంగా ఈ ప్రస్తావించబడిన నూహ్,అతని జాతి వారి గాధలో,నూహ్,అతనితో పాటు ఉన్న విశ్వాసపరుల విముక్తిలో,అతని జాతి వారిలో నుండి అవిశ్వాసపరుల వినాశనంలో గుణపాఠం నేర్చుకునే వారి కొరకు గుణపాఠం కలదు. మరియు వారిలో నుండి చాలా మంది విశ్వసించటం లేదు.
Os Tafssir em língua árabe:
وَاِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِیْزُ الرَّحِیْمُ ۟۠
ఓ ప్రవక్తా నిశ్ఛయంగా మీ ప్రభువు ఆయనే తన శతృవులతో ప్రతీకారం తీసుకునే ఆధిక్యుడు. మరియు వారిలో నుండి తౌబా చేసే వారిపై కరుణించేవాడును.
Os Tafssir em língua árabe:
كَذَّبَتْ عَادُ ١لْمُرْسَلِیْنَ ۟ۚۖ
ఆద్ జాతి వారు తమ ప్రవక్త హూద్ అలైహిస్సలాంను తిరస్కరించినప్పుడు ప్రవక్తలను తిరస్కరించారు.
Os Tafssir em língua árabe:
اِذْ قَالَ لَهُمْ اَخُوْهُمْ هُوْدٌ اَلَا تَتَّقُوْنَ ۟ۚ
వారితో వంశ పరంగా సోదరుడైన హూద్ ఇలా పలికినప్పుడు : ఏమీ మీరు అల్లాహ్ భయంతో ఇతరుల ఆరాధనను విడనాడి ఆయనతో భయపడరా ?!.
Os Tafssir em língua árabe:
اِنِّیْ لَكُمْ رَسُوْلٌ اَمِیْنٌ ۟ۙ
నిశ్ఛయంగా నేను మీ కొరకు అల్లాహ్ మీ వైపునకు పంపించిన ఒక ప్రవక్తను. అల్లాహ్ నన్ను చేరవేయమని ఆదేశించిన దానిలో నేను అధికం చేయని,అందులో తరగించని నీతిమంతుడను.
Os Tafssir em língua árabe:
فَاتَّقُوا اللّٰهَ وَاَطِیْعُوْنِ ۟ۚ
అయితే మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశించిన వాటిని పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి. మరియు నేను మీకు ఆదేశించిన వాటి విషయంలో,మీకు వారించిన వాటి విషయంలో నాకు విధేయత చూపండి.
Os Tafssir em língua árabe:
وَمَاۤ اَسْـَٔلُكُمْ عَلَیْهِ مِنْ اَجْرٍ ۚ— اِنْ اَجْرِیَ اِلَّا عَلٰی رَبِّ الْعٰلَمِیْنَ ۟ؕ
మరియు నేను నా ప్రభువు తరపు నుండి మీకు చేరవేసిన దానిపై మీ నుండి ఎటువంటి ప్రతిఫలమును నేను కోరను. నా ప్రతిఫలము సృష్టితాల ప్రభువైన అల్లాహ్ పై మాత్రమే ఉన్నది ఇతరులపై లేదు.
Os Tafssir em língua árabe:
اَتَبْنُوْنَ بِكُلِّ رِیْعٍ اٰیَةً تَعْبَثُوْنَ ۟ۙ
ఏమీ మీరు ప్రతీ ఎత్తైన స్థలంలో మీ ఇహములో లేదా మీ పరములో మీపై మరలని ప్రయోజనం లేని ఒక నిష్ప్రయోజనమైన స్మారక కట్టడమును నిర్మిస్తారా ?!.
Os Tafssir em língua árabe:
وَتَتَّخِذُوْنَ مَصَانِعَ لَعَلَّكُمْ تَخْلُدُوْنَ ۟ۚ
మీరు ఈ ఇహలోకములో శాస్వతంగా ఉండిపోయేటట్లుగా కోటలను,భవనములను నిర్మిస్తున్నారు. మీరు వాటి నుండి మరలించరని.
Os Tafssir em língua árabe:
وَاِذَا بَطَشْتُمْ بَطَشْتُمْ جَبَّارِیْنَ ۟ۚ
మరియు మీరు హత్య ద్వారా,కొట్టడం ద్వారా దాడి చేసినప్పుడు దయా,దాక్షిణ్యాలు లేని దౌర్జన్యపరులుగా దాడి చేస్తారు.
Os Tafssir em língua árabe:
فَاتَّقُوا اللّٰهَ وَاَطِیْعُوْنِ ۟ۚ
అయితే మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశించిన వాటిని పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి మరియు నేను మీకు ఆదేశించిన వాటి విషయంలో,మీకు వారించిన వాటి విషయంలో నాకు విధేయత చూపండి.
Os Tafssir em língua árabe:
وَاتَّقُوا الَّذِیْۤ اَمَدَّكُمْ بِمَا تَعْلَمُوْنَ ۟ۚ
మరియు మీరు మీకు తెలిసిన అనుగ్రహాలు ప్రసాదించిన ఆ అల్లాహ్ క్రోధము నుండి మీరు భయపడండి.
Os Tafssir em língua árabe:
اَمَدَّكُمْ بِاَنْعَامٍ وَّبَنِیْنَ ۟ۚۙ
ఆయన మీకు పశువులను ప్రసాదించాడు,మీకు సంతానమును ప్రసాదించాడు.
Os Tafssir em língua árabe:
وَجَنّٰتٍ وَّعُیُوْنٍ ۟ۚ
మీకు తోటలను,ప్రవహించే చెలమలను ప్రసాదించాడు.
Os Tafssir em língua árabe:
اِنِّیْۤ اَخَافُ عَلَیْكُمْ عَذَابَ یَوْمٍ عَظِیْمٍ ۟ؕ
ఓ నా జాతి వారా నిశ్ఛయంగా నేను మీపై గొప్ప దినపు శిక్ష నుండి భయపడుతున్నాను. అది ప్రళయదినము.
Os Tafssir em língua árabe:
قَالُوْا سَوَآءٌ عَلَیْنَاۤ اَوَعَظْتَ اَمْ لَمْ تَكُنْ مِّنَ الْوٰعِظِیْنَ ۟ۙ
అతని జాతి వారు అతనితో ఇలా పలికారు : మాకు నీ హితబోధన చేయటం,చేయకపోవటం మా వద్ద సమానము. మేము నిన్ను విశ్వసించమంటే విశ్వసించము. మేము ఉన్న దాని నుండి మరలమంటే మరలము.
Os Tafssir em língua árabe:
Das notas do versículo nesta página:
• أفضلية أهل السبق للإيمان حتى لو كانوا فقراء أو ضعفاء.
విశ్వాసములో మందంజ వేసే వారి ప్రాముఖ్యత ఉన్నది చివరికి ఒక వేళ వారు పేదవారైనా,బలహీనులైనా.

• إهلاك الظالمين، وإنجاء المؤمنين سُنَّة إلهية.
దుర్మార్గులను తుది ముట్టించటం,విశ్వాసపరులను విముక్తి కలిగించటం దైవ సంప్రదాయము.

• خطر الركونِ إلى الدنيا.
ఇహలోకముపై ఆధారపడటం యొక్క ప్రమాదము.

• تعنت أهل الباطل، وإصرارهم عليه.
అసత్యపరుల యొక్క మొండితనము,దానిపై వారి పట్టుబట్టడం.

 
Tradução dos significados Surah: Ash-Shu'araa
Índice de capítulos Número de página
 
Tradução dos significados do Nobre Qur’an. - Tradução telugu de interpretação abreviada do Nobre Alcorão. - Índice de tradução

emitido pelo Centro de Tafssir para Estudos do Alcorão

Fechar