Check out the new design

Tradução dos significados do Nobre Qur’an. - Tradução telugu de interpretação abreviada do Nobre Alcorão. * - Índice de tradução


Tradução dos significados Surah: Ghafir   Versículo:

గాఫిర్

Dos propósitos do capítulo:
بيان حال المجادلين في آيات الله، والرد عليهم.
అల్లాహ్ ఆయతుల విషయంలో వాదించే వారి పరిస్థితి ప్రకటన మరియు వారిని ప్రతిస్పందించటం

حٰمٓ ۟ۚ
హా-మీమ్ సూరతుల్ బఖరహ్ ఆరంభంలో వీటి సారుప్యం పై చర్చ జరిగింది.
Os Tafssir em língua árabe:
تَنْزِیْلُ الْكِتٰبِ مِنَ اللّٰهِ الْعَزِیْزِ الْعَلِیْمِ ۟ۙ
ఎవరు ఆధిక్యత చూపని సర్వాధిక్యుడైన,తన దాసుల ప్రయోజనముల గురించి జ్ఞానము కలిగిన అల్లాహ్ తరపు నుండి తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఖుర్ఆన్ అవతరణ
Os Tafssir em língua árabe:
غَافِرِ الذَّنْۢبِ وَقَابِلِ التَّوْبِ شَدِیْدِ الْعِقَابِ ذِی الطَّوْلِ ؕ— لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ؕ— اِلَیْهِ الْمَصِیْرُ ۟
పాపాలకు పాల్పడే వారి పాపములను మన్నించేవాడు, తన దాసుల్లోంచి తన వైపునకు తౌబా చేసేవారి తౌబాను స్వీకరించేవాడు, ఎవరైతే తన పాపముల నుండి తౌబా చేయడో వారిని కఠినంగా శిక్షించేవాడు, దాతృత్వం కలవాడు,అనుగ్రహించేవాడు. ఆయన తప్ప సత్య ఆరాధ్యదైవం వేరేది లేదు. ప్రళయదినమున దాసుల మరలింపు ఆయన ఒక్కడి వైపే జరుగును. అప్పుడు ఆయన వారు దేనికి హక్కుదారులో అది వారికి ప్రసాదిస్తాడు.
Os Tafssir em língua árabe:
مَا یُجَادِلُ فِیْۤ اٰیٰتِ اللّٰهِ اِلَّا الَّذِیْنَ كَفَرُوْا فَلَا یَغْرُرْكَ تَقَلُّبُهُمْ فِی الْبِلَادِ ۟
అల్లాహ్ తౌహీద్ పై మరియు ఆయన ప్రవక్త నిజాయితీపై సూచించే అల్లాహ్ ఆయతుల విషయంలో తమ బుద్ధులు చెడిపోవటం వలన అల్లాహ్ పట్ల అవిశ్వాసమునకు పాల్పడిన వారు మాత్రమే తగువులాడుతారు. వారి మూలంగా మీరు దుఃఖించకండి. మరియు ఆహారోపాధిలో,అనుగ్రహాల్లో వారికి ఉన్న పుష్కలము మిమ్మల్ని మోసగించకూడదు. కావున వారికి గడువివ్వటం వారికి నెమ్మదినెమ్మదిగా (శిక్షకు) దగ్గర చేయటం మరియు వారి పట్ల వ్యూహ రచన చేయటం.
Os Tafssir em língua árabe:
كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوْحٍ وَّالْاَحْزَابُ مِنْ بَعْدِهِمْ ۪— وَهَمَّتْ كُلُّ اُمَّةٍ بِرَسُوْلِهِمْ لِیَاْخُذُوْهُ وَجٰدَلُوْا بِالْبَاطِلِ لِیُدْحِضُوْا بِهِ الْحَقَّ فَاَخَذْتُهُمْ ۫— فَكَیْفَ كَانَ عِقَابِ ۟
వీరందరికన్న ముందు నూహ్ అలైహిస్సలాం జాతివారు తిరస్కరించారు. మరియు వారి కన్న ముందు నూహ్ అలైహిస్సలాం జాతి వారి తరువాత వర్గాల వారు తిరస్కరించారు. ఆద్ జాతి తిరస్కరించింది మరియు సమూద్,లూత్ జాతి,మద్యన్ వారు తిరస్కరించారు. మరియు ఫిర్ఔన్ తిరస్కరించాడు. మరియు సమాజముల్లోంచి ప్రతీ సమాజము తమ ప్రవక్తను పట్టుకుని అతన్ని హతమార్చటానికి దృఢ సంకల్పం చేసుకున్నారు. మరియు వారు తమ వద్దనున్న అసత్యముతో సత్యమును తొలగించటానికి వాదులాడారు. ఆ సమాజములన్ని పట్టుబడ్డాయి. వారిపై నా శిక్ష ఎలా ఉన్నది యోచన చేయండి. అది కఠినమైన శిక్ష.
Os Tafssir em língua árabe:
وَكَذٰلِكَ حَقَّتْ كَلِمَتُ رَبِّكَ عَلَی الَّذِیْنَ كَفَرُوْۤا اَنَّهُمْ اَصْحٰبُ النَّارِ ۟
మరియు ఏ విధంగానైతే ఈ తిరస్కార సమాజముల వినాశనము యొక్క అల్లాహ్ తీర్పునిచ్చాడో ఓ ప్రవక్తా అవిశ్వాసపరులు నరకవాసులన్న దానిపై నీ ప్రభువు యొక్క మాట అనివార్యమైనది.
Os Tafssir em língua árabe:
اَلَّذِیْنَ یَحْمِلُوْنَ الْعَرْشَ وَمَنْ حَوْلَهٗ یُسَبِّحُوْنَ بِحَمْدِ رَبِّهِمْ وَیُؤْمِنُوْنَ بِهٖ وَیَسْتَغْفِرُوْنَ لِلَّذِیْنَ اٰمَنُوْا ۚ— رَبَّنَا وَسِعْتَ كُلَّ شَیْءٍ رَّحْمَةً وَّعِلْمًا فَاغْفِرْ لِلَّذِیْنَ تَابُوْا وَاتَّبَعُوْا سَبِیْلَكَ وَقِهِمْ عَذَابَ الْجَحِیْمِ ۟
ఓ ప్రవక్తా నీ ప్రభువు యొక్క సింహాసమును మోస్తున్న దైవదూతలు మరియు దాని చుట్టు ఉన్న వారు తమ ప్రభువుకు తగని వాటి నుండి పరిశుద్ధతను కొనియాడుతారు. మరియు ఆయనను విశ్వసిస్తారు. మరియు అల్లాహ్ పై విశ్వాసమును కనబరచిన వారి కొరకు మన్నింపును వేడుకుంటారు. తమ దుఆల్లో ఇలా పలుకుతూ : ఓ మా ప్రభువా నీ జ్ఞానం మరియు నీ కారుణ్యం ప్రతీ వస్తువుని చుట్టుముట్టి ఉన్నది. అయితే నీవు తమ పాపముల నుండి మన్నింపును వేడుకుని నీ ధర్మమును అనుసరించిన వారిని మన్నించు. మరియు వారికి నరకాగ్ని ముట్టుకోవటం నుంచి వారిని రక్షించు.
Os Tafssir em língua árabe:
Das notas do versículo nesta página:
• الجمع بين الترغيب في رحمة الله، والترهيب من شدة عقابه: مسلك حسن.
అల్లాహ్ కారుణ్యము విషయంలో ఆశ చూపటమునకు మరియు ఆయన శిక్ష తీవ్రత నుండి భయపెట్టటం మధ్య సమీకరణ మంచి పద్దతి.

• الثناء على الله بتوحيده والتسبيح بحمده أدب من آداب الدعاء.
అల్లాహ్ తౌహీద్ తో ఆయనను పొగడటం మరియు ఆయన పొగడ్తలతో పరిశుద్ధతను కొనియాడటం దుఆ చేసే పద్దతుల్లోంచి ఒక పద్దతి.

• كرامة المؤمن عند الله؛ حيث سخر له الملائكة يستغفرون له.
అల్లాహ్ వద్ద విశ్వాసపరునికి గౌరవం కలదు. ఎందుకంటే ఆయన అతని కొరకు మన్నింపుని వేడుకోవటానికి దైవదూతలను అతనికి ఉపయుక్తంగా చేశాడు.

 
Tradução dos significados Surah: Ghafir
Índice de capítulos Número de página
 
Tradução dos significados do Nobre Qur’an. - Tradução telugu de interpretação abreviada do Nobre Alcorão. - Índice de tradução

emitido pelo Centro de Tafssir para Estudos do Alcorão

Fechar