Check out the new design

Tradução dos significados do Nobre Qur’an. - Tradução telugu de interpretação abreviada do Nobre Alcorão. * - Índice de tradução


Tradução dos significados Surah: Az-Zukhruf   Versículo:
وَلِبُیُوْتِهِمْ اَبْوَابًا وَّسُرُرًا عَلَیْهَا یَتَّكِـُٔوْنَ ۟ۙ
మరియు మేము వారి గృహముల కొరకు తలుపులను తయారు చేసేవారము. మరియు మేము వారి కొరకు పీఠాలను తయారు చేసేవారము వారు వాటిపై ఆనుకుని కూర్చునేవారు. ఇది వారికి నెమ్మది నెమ్మదిగా తీసుకుని వెళ్ళటానికి,పరీక్షగా.
Os Tafssir em língua árabe:
وَزُخْرُفًا ؕ— وَاِنْ كُلُّ ذٰلِكَ لَمَّا مَتَاعُ الْحَیٰوةِ الدُّنْیَا ؕ— وَالْاٰخِرَةُ عِنْدَ رَبِّكَ لِلْمُتَّقِیْنَ ۟۠
మరియు మేము వారి కొరకు బంగారంతో కూడా చేసేవారము. ఇవన్ని ప్రపంచిక జీవిత సుఖసంతోషాలు మాత్రమే. కాబట్టి అది నిరంతరం కాకుండా ఉండటం వలన దాని ప్రయోజనం తక్కువ. మరియు ఓ ప్రవక్తా నీ ప్రభువు వద్ద పరలోకంలో ఉన్న అనుగ్రహాలు అల్లాహ్ ఆదేశాలను పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి అల్లాహ్ కు బయపడే వారి కొరకు మేలైనవి.
Os Tafssir em língua árabe:
وَمَنْ یَّعْشُ عَنْ ذِكْرِ الرَّحْمٰنِ نُقَیِّضْ لَهٗ شَیْطٰنًا فَهُوَ لَهٗ قَرِیْنٌ ۟
మరియు ఎవరైతే సాధికారత లేని దృక్పదంతో ఖుర్ఆన్ లో చూస్తారో అది అతనిని విముఖత వైపునకు దారితీస్తే అతడు తనను అపమార్గములో అధికం చేసే షైతాన్ ఆదీనంలో చేయబడటంతో శిక్షింపబడుతాడు.
Os Tafssir em língua árabe:
وَاِنَّهُمْ لَیَصُدُّوْنَهُمْ عَنِ السَّبِیْلِ وَیَحْسَبُوْنَ اَنَّهُمْ مُّهْتَدُوْنَ ۟
మరియు నిశ్చయంగా ఖుర్ఆన్ నుండి విముఖత చూపే వారిపై నియమింపబడిన ఈ స్నేహితులందరు వారిని అల్లాహ్ ధర్మం నుండి ఆపుతారు. అప్పుడు వారు ఆయన ఆదేశములను పాటించరు మరియు ఆయన వారించిన వాటి నుండి దూరంగా ఉండరు. మరియు వారు సత్యం వైపునకు మార్గం పొందారని భావిస్తారు. మరియు ఎవరైతే ఆ స్థానంలో ఉంటారో వారు తమ మార్గ భ్రష్టకు గురి అవటం నుండి పశ్ఛాత్తాప్పడరు.
Os Tafssir em língua árabe:
حَتّٰۤی اِذَا جَآءَنَا قَالَ یٰلَیْتَ بَیْنِیْ وَبَیْنَكَ بُعْدَ الْمَشْرِقَیْنِ فَبِئْسَ الْقَرِیْنُ ۟
అల్లాహ్ స్మరణ నుండి విముఖత చూపినవాడు ప్రళయదినమున మా వద్దకు వచ్చినప్పుడు ఆశతో ఇలా పలుకుతాడు : ఓ స్నేహితుడా నీకూ నాకూ మధ్య తూర్పు పడమరల మధ్య దూరమంత దూరముంటే ఎంత బాగుండేది. అయితే నీవు అసహ్యించుకోబడ్డ స్నేహితుడివి.
Os Tafssir em língua árabe:
وَلَنْ یَّنْفَعَكُمُ الْیَوْمَ اِذْ ظَّلَمْتُمْ اَنَّكُمْ فِی الْعَذَابِ مُشْتَرِكُوْنَ ۟
ప్రళయదినమున అల్లాహ్ అవిశ్వాసపరులతో ఇలా పలుకుతాడు : మరియు ఈ రోజు మీ సాటి కల్పించటం శిక్ష విషయంలో ప్రయోజనం కలిగించదు - వాస్తవానికి మీరు షిర్కు,పాపకార్యముల ద్వారా మీ స్వయానికి అన్యాయం చేసుకున్నారు - కాబట్టి మీరు భాగస్వాములుగా చేసుకున్న వారు మీ నుండి శిక్షను కొంచము కూడా మోయలేరు.
Os Tafssir em língua árabe:
اَفَاَنْتَ تُسْمِعُ الصُّمَّ اَوْ تَهْدِی الْعُمْیَ وَمَنْ كَانَ فِیْ ضَلٰلٍ مُّبِیْنٍ ۟
నిశ్చయంగా వీరందరు సత్యమును వినటం నుండి చెవిటివారు మరియు దాన్ని చూడటం నుండి గ్రుడ్డివారు. అయితే ఓ ప్రవక్త ఏమిటీ మీరు చెవిటివారిని వినిపించగలరా లేదా గ్రుడ్డి వారికి మార్గం చూపగలరా లేదా సన్మార్గము నుండి స్పష్టంగా అపమార్గంలో ఉన్న వారిని మార్గదర్శకత్వం చేయగలరా ?.
Os Tafssir em língua árabe:
فَاِمَّا نَذْهَبَنَّ بِكَ فَاِنَّا مِنْهُمْ مُّنْتَقِمُوْنَ ۟ۙ
అయితే ఒక వేళ మేము వారిని శిక్షించక ముందే మిమ్మల్ని మరణింపజేసి తీసుకుని వెళ్ళిపోయినా నిశ్చయంగా మేము వారిని ఇహలోకంలో,పరలోకంలో శిక్షకు గురి చేసి వారిపై ప్రతీకారం తీర్చుకుంటాము.
Os Tafssir em língua árabe:
اَوْ نُرِیَنَّكَ الَّذِیْ وَعَدْنٰهُمْ فَاِنَّا عَلَیْهِمْ مُّقْتَدِرُوْنَ ۟
లేదా మేము వారికి వాగ్దానం చేసిన కొంత శిక్షను మీకు తప్పకుండా చూపుతాము. నిశ్చయంగా మేము వారిపై పూర్తి అధికారము కలవారము. వారు ఏ విషయంలో కూడా మమ్మల్ని ఓడించజాలరు.
Os Tafssir em língua árabe:
فَاسْتَمْسِكْ بِالَّذِیْۤ اُوْحِیَ اِلَیْكَ ۚ— اِنَّكَ عَلٰی صِرَاطٍ مُّسْتَقِیْمٍ ۟
కావున ఓ ప్రవక్త మీ ప్రభువు మీ వైపునకు దైవ వాణి ద్వారా అవతరింపజేసిన దాన్ని అట్టిపెట్టుకొని దానిపై ఆచరించండి. నిశ్చయంగా మీరు ఎటువంటి సందేహం లేని సత్య మార్గముపై ఉన్నారు.
Os Tafssir em língua árabe:
وَاِنَّهٗ لَذِكْرٌ لَّكَ وَلِقَوْمِكَ ۚ— وَسَوْفَ تُسْـَٔلُوْنَ ۟
నిశ్చయంగా ఈ ఖుర్ఆన్ మీ కొరకు ఒక కీర్తి మరియు మీ జాతి వారి కొరకు ఒక కీర్తి. మరియు మీరు తొందరలోనే ప్రళయదినమున దానిపై విశ్వాసము గురించి,దాని సూచనలపై అనుసరించటం గురించి,దాని వైపునకు పిలవటం గురించి ప్రశ్నించబడుతారు.
Os Tafssir em língua árabe:
وَسْـَٔلْ مَنْ اَرْسَلْنَا مِنْ قَبْلِكَ مِنْ رُّسُلِنَاۤ اَجَعَلْنَا مِنْ دُوْنِ الرَّحْمٰنِ اٰلِهَةً یُّعْبَدُوْنَ ۟۠
ఓ ప్రవక్తా మీరు మీ కన్న పూర్వం మేము పంపించిన ప్రవక్తలను మేము అనంత కరుణామయుడిని కాకుండా ఇతర దైవాలను ఆరాధించటానికి చేశామా ? అడగండి.
Os Tafssir em língua árabe:
وَلَقَدْ اَرْسَلْنَا مُوْسٰی بِاٰیٰتِنَاۤ اِلٰی فِرْعَوْنَ وَمَلَاۡىِٕهٖ فَقَالَ اِنِّیْ رَسُوْلُ رَبِّ الْعٰلَمِیْنَ ۟
మరియు నిశ్చయంగా మేము మూసా అలైహిస్సలాం ను మా ఆయతులను ఇచ్చి ఫిర్ఔన్ మరియు అతని జాతివారిలో నుండి గొప్ప వారి వద్దకు పంపించాము. అప్పుడు ఆయన వారితో నిశ్చయంగా నేను సృష్టిరాసులందరి ప్రభువు వద్ద నుండి పంపించబడ్డ ప్రవక్తను అని పలికారు.
Os Tafssir em língua árabe:
فَلَمَّا جَآءَهُمْ بِاٰیٰتِنَاۤ اِذَا هُمْ مِّنْهَا یَضْحَكُوْنَ ۟
ఆయన వారి వద్దకు మా ఆయతులను తీసుకుని వచ్చినప్పుడు వారు వాటిని పరిహాసంగా,ఎగతాళిగా చేసుకుని నవ్వసాగారు.
Os Tafssir em língua árabe:
Das notas do versículo nesta página:
• خطر الإعراض عن القرآن.
ఖుర్ఆన్ నుండి విముఖత చూపటం యొక్క ప్రమాదం.

• القرآن شرف لرسول الله صلى الله عليه وسلم ولأمته.
ఖుర్ఆన్ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన జాతి వారి కొరకు కీర్తి.

• اتفاق الرسالات كلها على نبذ الشرك.
షిర్కును త్యజించటంపై సందేశాలన్నింటి యొక్క అంగీకారము.

• السخرية من الحق صفة من صفات الكفر.
సత్యం విషయంలో హేళన చేయటం అవిశ్వాస లక్షణం.

 
Tradução dos significados Surah: Az-Zukhruf
Índice de capítulos Número de página
 
Tradução dos significados do Nobre Qur’an. - Tradução telugu de interpretação abreviada do Nobre Alcorão. - Índice de tradução

emitido pelo Centro de Tafssir para Estudos do Alcorão

Fechar