Check out the new design

Tradução dos significados do Nobre Qur’an. - Tradução telugu de interpretação abreviada do Nobre Alcorão. * - Índice de tradução


Tradução dos significados Versículo: (32) Surah: At-Tawbah
یُرِیْدُوْنَ اَنْ یُّطْفِـُٔوْا نُوْرَ اللّٰهِ بِاَفْوَاهِهِمْ وَیَاْبَی اللّٰهُ اِلَّاۤ اَنْ یُّتِمَّ نُوْرَهٗ وَلَوْ كَرِهَ الْكٰفِرُوْنَ ۟
ఈ అవిశ్వాసపరులందరు,అవిశ్వాస ధర్మాల్లోంచి ఒక ధర్మం పై ఉన్న ఇతరులు తమ ఈ కట్టుకధల ద్వారా,ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొని వచ్చిన దాన్ని వారి తిరస్కారము ద్వారా ఇస్లాం ను అంతమొందించాలని,దాన్ని అసత్యముగా చేయాలని,అల్లాహ్ యొక్క తౌహీదును నిరూపించటానికి అందులో వచ్చిన స్పష్టమైన వాదనలను,ఆధారాలను నసింపజేయాలని నిర్ణయించుకున్నారు.మరియు ఆయన ప్రవక్త తీసుకుని వచ్చినది సత్యము.మరియు పరిశుద్ధుడైన,మహోన్నతుడైన అల్లాహ్ తన ధర్మమును పూర్తి చేయటమును,దాన్ని ఇతర వాటిపై ఆధిక్యతను,ఉన్నతను కలిగించటమును తప్ప మిగతా వాటిని కానివ్వడు.ఒక వేళ అవిశ్వాసపరులు ఆయన ధర్మమును పరిపూర్ణము చేయటమును,దానిని ఆధిక్యతనివ్వటమును,ఉన్నత స్థానమునకు చేర వేయటమును ఇష్టపడకపోయినా ఆల్లాహ్ దాన్ని పరిపూర్ణం చేసేవాడును,ఆధిక్యతను ఇచ్చేవాడును,ఉన్నత స్థానమును కలిగించే వాడును.అల్లాహ్ ఏ విషయమునైనా నిర్ణయించుకుంటే ఇతరవారి నిర్ణయం వృధా అయిపోతుంది.
Os Tafssir em língua árabe:
Das notas do versículo nesta página:
• دين الله ظاهر ومنصور مهما سعى أعداؤه للنيل منه حسدًا من عند أنفسهم.
అల్లాహ్ శతృవులు తమ తరుపునుండి అసూయతో ధర్మమును అపనిందపాలు చేయటానికి ప్రయత్నము చేసినప్పుడల్లా అల్లాహ్ ధర్మము ఆధిక్యతను చూపుతుంది,సహాయం చేయబడుతుంది.

• تحريم أكل أموال الناس بالباطل، والصد عن سبيل الله تعالى.
ప్రజల సొమ్మును దుర్మార్గంతో తినటం,మహోన్నతుడైన అల్లాహ్ మార్గము నుండి ఆపటం నిషేధము.

• تحريم اكتناز المال دون إنفاقه في سبيل الله.
ధనాన్ని అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టకుండా కూడబెట్టటం నిషేధము.

• الحرص على تقوى الله في السر والعلن، خصوصًا عند قتال الكفار؛ لأن المؤمن يتقي الله في كل أحواله.
రహస్యంగా,బహిర్గంగా అల్లాహ్ కు భయపడటం పై ప్రోత్సహించటం,ప్రత్యేకించి అవిశ్వాసపరులతో యుద్ధం చేసే సమయంలో.ఎందుకంటే విశ్వాసపరుడు తన పరిస్థితులన్నింటిలో అల్లాహ్ కు భయపడుతూ ఉంటాడు.

 
Tradução dos significados Versículo: (32) Surah: At-Tawbah
Índice de capítulos Número de página
 
Tradução dos significados do Nobre Qur’an. - Tradução telugu de interpretação abreviada do Nobre Alcorão. - Índice de tradução

emitido pelo Centro de Tafssir para Estudos do Alcorão

Fechar