Check out the new design

Tradução dos significados do Nobre Qur’an. - Tradução Telegráfica - Abdul Rahim bin Muhammad * - Índice de tradução

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

Tradução dos significados Versículo: (44) Surah: Al-Maidah
اِنَّاۤ اَنْزَلْنَا التَّوْرٰىةَ فِیْهَا هُدًی وَّنُوْرٌ ۚ— یَحْكُمُ بِهَا النَّبِیُّوْنَ الَّذِیْنَ اَسْلَمُوْا لِلَّذِیْنَ هَادُوْا وَالرَّبّٰنِیُّوْنَ وَالْاَحْبَارُ بِمَا اسْتُحْفِظُوْا مِنْ كِتٰبِ اللّٰهِ وَكَانُوْا عَلَیْهِ شُهَدَآءَ ۚ— فَلَا تَخْشَوُا النَّاسَ وَاخْشَوْنِ وَلَا تَشْتَرُوْا بِاٰیٰتِیْ ثَمَنًا قَلِیْلًا ؕ— وَمَنْ لَّمْ یَحْكُمْ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ فَاُولٰٓىِٕكَ هُمُ الْكٰفِرُوْنَ ۟
నిశ్చయంగా, మేము తౌరాత్ ను (మూసాపై) అవతరింపజేశాము. అందులో మార్గదర్శకత్వం మరియు జ్యోతి ఉన్నాయి. అల్లాహ్ కు విధేయులైన (ముస్లింలైన) ప్రవక్తలు దానిని అనుసరించి, యూదుల మధ్య తీర్పు చేస్తూ ఉండేవారు.[1] అదే విధంగా ధర్మ వేత్తలు (రబ్బానియ్యూన్) మరియు యూద మతాచారులు (అహ్ బార్ లు) కూడా (తీర్పు చేస్తూ ఉండేవారు). ఎందుకంటే వారు అల్లాహ్ గ్రంథానికి రక్షకులుగా మరియు దానికి సాక్షులుగా నియమింపబడి ఉండేవారు. కావున మీరు (యూదులారా) మానవులకు భయపడ కండి. నాకే భయపడండి. నా సూక్తులను (ఆయాత్ లను) స్వల్ప లాభాలకు అమ్ము కోకండి. మరియు ఎవరు అల్లాహ్ అవతరింపజేసిన (శాసనం) ప్రకారం తీర్పు చేయరో, అలాంటి వారే సత్యతిరస్కారులు.
[1] యూదుల ప్రవక్తలందరూ అల్లాహ్ (సు.తా.)కు విధేయులైన వారే అంటే ముస్లింలే. ఆ ఇస్లాం వైపునకే దైవప్రవక్త ము'హమ్మద్ ('స'అస) పిలుస్తున్నారు. ఈ ఇస్లాం ధర్మమే ఆదమ్ ('అ.స.) నుండి ప్రతి ప్రవక్త బోధించిన ధర్మం. ఇక హిందూ ధర్మానికి మూలమైన వేదాలు మరియు భగవద్గీత కూడా ఏకైక పరమేశ్వరునికి అంటే అల్లాహుతా'ఆలాకు మాత్రమే విధేయులై ఉండి, కేవలం ఆయననే ఆరాధించాలని బోధిస్తున్నాయి. ఆ పరమేశ్వరుడు, సంతానం లేదనివాడు అని కూడా వివరిస్తున్నాయి. అంతేగాక పామరులే కల్పిత దైవాలను, సృష్టించబడిన వాటిని ఆరాధిస్తారని కూడా బోధిస్తున్నాయి.
Os Tafssir em língua árabe:
 
Tradução dos significados Versículo: (44) Surah: Al-Maidah
Índice de capítulos Número de página
 
Tradução dos significados do Nobre Qur’an. - Tradução Telegráfica - Abdul Rahim bin Muhammad - Índice de tradução

Traduziu Maulana Abder-Rahim ibn Muhammad.

Fechar