Check out the new design

Ibisobanuro bya qoran ntagatifu - Ibisobanuro bya Qur'an Ntagatifu mu rurimi rw'igitelugu, bikaba ari incamacye y'ibisobanuro bya Qur'an Ntagatifu. * - Ishakiro ry'ibisobanuro


Ibisobanuro by'amagambo Isura: Annisau   Umurongo:
وَالّٰتِیْ یَاْتِیْنَ الْفَاحِشَةَ مِنْ نِّسَآىِٕكُمْ فَاسْتَشْهِدُوْا عَلَیْهِنَّ اَرْبَعَةً مِّنْكُمْ ۚ— فَاِنْ شَهِدُوْا فَاَمْسِكُوْهُنَّ فِی الْبُیُوْتِ حَتّٰی یَتَوَفّٰهُنَّ الْمَوْتُ اَوْ یَجْعَلَ اللّٰهُ لَهُنَّ سَبِیْلًا ۟
మీ స్త్రీలలో ఎవరైతే వ్యభిచారానికి పాల్పడతారో వారు వివాహితులైన అవివాహితులైన వారికి వ్యతిరేకంగా న్యాయం పలికే నలుగురు పురుషులు సాక్ష్యం ఇవ్వాలి. ఒకవేళ ఆ (నలుగురు) సాక్షులు ఆ స్త్రీలు వ్యభిచరించారని సాక్ష్యం పలికితే దానికి శిక్షగా వారిని గృహాలలో నిర్భధించండి వారికి మరణం వచ్చేంతవరకు లేదా అల్లాహ్ వేరే మార్గం చూపించేంతవరకు, ఆ తరువాత అల్లాహ్ వారి కొరకు ఆ మార్గాన్ని బయలు పరిచాడు అదేమిటంటే వారు అవివాహితులు అయితే వంద కొరడా దెబ్బలు ఒక ఏడాది పాటు ఊరు నుండి బహిష్కరణ మరియు వివాహితులు అయితే శిలా శిక్ష విధించాలి.
Ibisobanuro by'icyarabu:
وَالَّذٰنِ یَاْتِیٰنِهَا مِنْكُمْ فَاٰذُوْهُمَا ۚ— فَاِنْ تَابَا وَاَصْلَحَا فَاَعْرِضُوْا عَنْهُمَا ؕ— اِنَّ اللّٰهَ كَانَ تَوَّابًا رَّحِیْمًا ۟
పురుషులలో ఏ ఇద్దరైనా వ్యభిచారానికి పాల్పడితే వారు వివాహితులైన అవివాహితులైన వారు నిందింపబడి అవమానానికి గురయ్యేలా వారిని నిందించి చేతులతో దండించండి. ఒకవేళ వారు గనక ఆపనిని పూర్తిగా విడిచిపెట్టి తమ కర్మలను సంస్కరించుకుంటే వారిని బాధపెట్టకండి. ఎందుకంటే పాపం పట్ల పశ్చాత్తాప పడేవాడు ఎలాంటి అపరాధం చేయని వానితో సమానం. నిశ్చయంగా అల్లాహ్ పశ్చాత్తాపపడే వారిని కరుణించి క్షమిస్తాడు.ఈ విధమైన శిక్ష తొలికాలపు ఆదేశాలకు సంబంధించినది తరువాత ఈ ఆదేశం రద్దు చేయబడి వ్యభిచరించినవాడు అవివాహితుడైతే కొరడా దెబ్బలు, ఊరు నుండి బహిష్కరణ మరియు వివాహితుడైతే శిలాశిక్ష విధించబడింది.
Ibisobanuro by'icyarabu:
اِنَّمَا التَّوْبَةُ عَلَی اللّٰهِ لِلَّذِیْنَ یَعْمَلُوْنَ السُّوْٓءَ بِجَهَالَةٍ ثُمَّ یَتُوْبُوْنَ مِنْ قَرِیْبٍ فَاُولٰٓىِٕكَ یَتُوْبُ اللّٰهُ عَلَیْهِمْ ؕ— وَكَانَ اللّٰهُ عَلِیْمًا حَكِیْمًا ۟
నిశ్ఛయంగా అల్లాహ్ వారి పశ్ఛాత్తాపమును అంగీకరిస్తాడు ఎవరైతే పాపాల పరిణామము మరియు వాటి దుష్ఫలితాలు తెలియక పోవటం వలన పాపాలకు,అవిధేయ కార్యాలకు పాల్పడుతారో. మరియు ఈ పరిస్థితి ఉద్దేశపూర్వకంగా పాపమునకు పాల్పడే వారి మరియు ఉద్దేశపూర్వకంగా కాక పాపమునకు పాల్పడే ప్రతి ఒక్కరిది. ఆ తరువాత వారు మరణమును కళ్ళారా చూడక ముందే తమ ప్రభువు వైపునకు పశ్ఛాత్తాపముతో మరలుతారు. వారందరి పశ్చాత్తాపమును అల్లాహ్ స్వీకరిస్తాడు. వారి పాపములను మన్నించివేస్తాడు. మరియు అల్లాహ్ తన సృష్టితాల స్థితులను బాగా తెలిసినవాడు. మరియు తన విధి వ్రాతలో మరియు తన శాసనముల్లో వివేకవంతుడు.
Ibisobanuro by'icyarabu:
وَلَیْسَتِ التَّوْبَةُ لِلَّذِیْنَ یَعْمَلُوْنَ السَّیِّاٰتِ ۚ— حَتّٰۤی اِذَا حَضَرَ اَحَدَهُمُ الْمَوْتُ قَالَ اِنِّیْ تُبْتُ الْـٰٔنَ وَلَا الَّذِیْنَ یَمُوْتُوْنَ وَهُمْ كُفَّارٌ ؕ— اُولٰٓىِٕكَ اَعْتَدْنَا لَهُمْ عَذَابًا اَلِیْمًا ۟
మరియు అల్లాహ్ వారి పశ్చాత్తాపమును అంగీకరించడు ఎవరైతే అవిధేయకార్యాలపై మొండిగా ఉండి వాటి నుండి మరణ ఘడియలు చూడనంత వరకు పశ్ఛాత్తాప్పడరు. అప్పుడు వారిలో నుండి ఒకడు ఇలా పలుకుతాడు : నేను పాల్పడిన పాపముల నుండి ఇప్పుడు పశ్చాత్తాప్పడుతున్నాను. మరియు అల్లాహ్ స్వీకరించడు. ఇదే విధంగా వారి పశ్చాత్తాపమును ఎవరైతే అవిశ్వాసముపై మొండిగా ఉన్న స్థితిలో మరణిస్తారో. వారందరు పాపకార్యములపై మొండిగా ఉన్న పాపాత్ములు. మరియు ఎవరైతే తమ అవిశ్వాస స్థితిలో మరణిస్తారో వారి కొరకు మేము బాధాకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము.
Ibisobanuro by'icyarabu:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا یَحِلُّ لَكُمْ اَنْ تَرِثُوا النِّسَآءَ كَرْهًا ؕ— وَلَا تَعْضُلُوْهُنَّ لِتَذْهَبُوْا بِبَعْضِ مَاۤ اٰتَیْتُمُوْهُنَّ اِلَّاۤ اَنْ یَّاْتِیْنَ بِفَاحِشَةٍ مُّبَیِّنَةٍ ۚ— وَعَاشِرُوْهُنَّ بِالْمَعْرُوْفِ ۚ— فَاِنْ كَرِهْتُمُوْهُنَّ فَعَسٰۤی اَنْ تَكْرَهُوْا شَیْـًٔا وَّیَجْعَلَ اللّٰهُ فِیْهِ خَیْرًا كَثِیْرًا ۟
ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన ప్రవక్తను అనుసరించేవారా మీరు సంపదను వారసత్వంగా పొందినట్లు మీ తండ్రుల భార్యలను వారసత్వంగా పొందటం మరియు వారిని వివాహం చేసుకోవటం ద్వారా లేదా వారిని మీరు కోరిన వారికిచ్చి వివాహం చేయటం ద్వారా లేదా వారిని వివాహం చేసుకోవటం నుండి నిరోధించటం ద్వారా మీరు వారి విషయంలో వ్యవహరించటం మీకు సమ్మతం కాదు. మరియు మీరు అసహ్యించుకునే మీ భార్యలను మీరు వారు ఇచ్చి ఉన్న మహర్,ఇతరవాటిలో నుంచి కొంత భాగం మీకు ఇచ్చేంత వరకు వారికి హాని తలపెట్టటానికి ఆపివేయటం మీకు సమ్మతం కాదు. కాని వారు వ్యభిచారము లాంటి బాహాటమైన నీతిమాలిన పనికి పాల్పడితే తప్ప. వారు అలా చేస్తే మీరు వారికి ఇచ్చిన వాటి ద్వారా వారు మీ నుండి విమోచించబడేనంత వరకు వారిని ఆపి ఉంచటం మరియు వారిని ఇబ్బందికి గురి చేయటం మీకు సమ్మతమే. ఒక వేళ మీరు ఏదైన ప్రాపంచిక విషయం వలన వారిని మీరు అసహ్యించుకుంటే మీరు వారిని భరించండి. బహుశా అల్లాహ్ మీరు అసహ్యించుకునే దాని విషయంలో ఇహపరలోక జీవితంలో చాలా మేలును కలిగిస్తాడు.
Ibisobanuro by'icyarabu:
Inyungu dukura muri ayat kuri Uru rupapuro:
• ارتكاب فاحشة الزنى من أكثر المعاصي خطرًا على الفرد والمجتمع؛ ولهذا جاءت العقوبات عليها شديدة.
వ్యభిచార అశ్లీల కార్యమునకు పాల్పడటం వ్యక్తి మరియు సమాజంపై అత్యంత ప్రమాదకరమైన పాపాలలో ఒకటి అందుకనే వాటిపై తీవ్రమైన శిక్షలు వచ్చినవి.

• لطف الله ورحمته بعباده حيث فتح باب التوبة لكل مذنب، ويسر له أسبابها، وأعانه على سلوك سبيلها.
అల్లాహ్ యొక్క దయ మరియు ఆయన కరుణ తన దాసుల పట్ల కలదు. అందుకనే ఆయన ప్రతీ పాపాత్ముడి కొరకు తౌబా ద్వారమును తెరిచాడు మరియు అతని కొరకు దాని కారకాలను శులభతరం చేశాడు. మరియు అతనికి ఆయన దాని మార్గముపై నడవటములో సహకరించాడు.

• كل من عصى الله تعالى بعمد أو بغير عمد فهو جاهل بقدر من عصاه جل وعلا، وجاهل بآثار المعاصي وشؤمها عليه.
ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోకుండా అల్లాహ్ కు అవిధేయత చూపిన ప్రతి ఒక్కడు తాను అల్లాహ్ కు అవిధేయత చూపిన దాని పరిణామము గురించి అజ్ఞానుడై ఉంటాడు. మరియు అవిధేయ కార్యాల ప్రభావముల నుండి,దాని దుష్ఫలితాల నుండి అజ్ఞానుడై ఉంటాడు.

• من أسباب استمرار الحياة الزوجية أن يكون نظر الزوج متوازنًا، فلا يحصر نظره فيما يكره، بل ينظر أيضا إلى ما فيه من خير، وقد يجعل الله فيه خيرًا كثيرًا.
భర్త యొక్క అభిప్రాయము సమతుల్యంగా ఉండటం వైవాహిక జివితం కొనసాగించే కారకాల్లోంచిది. కావున అతని అభిప్రాయం తాను ద్వేషించే వాటికే పరిమితం కాదు. అంతే కాదు మేలు ఉన్న వాటి విషయంలో కూడా తన అభిప్రాయమును చూపుతాడు. మరియు అల్లాహ్ అందులో చాలా మేలును కలిగిస్తాడు.

 
Ibisobanuro by'amagambo Isura: Annisau
Urutonde rw'amasura numero y'urupapuro
 
Ibisobanuro bya qoran ntagatifu - Ibisobanuro bya Qur'an Ntagatifu mu rurimi rw'igitelugu, bikaba ari incamacye y'ibisobanuro bya Qur'an Ntagatifu. - Ishakiro ry'ibisobanuro

Yasohowe n'ikigo Tafsir of Quranic Studies.

Gufunga