Check out the new design

Ibisobanuro bya qoran ntagatifu - Ibisobanuro bya Qur'an Ntagatifu mu rurimi rw'igitelugu, bikaba ari incamacye y'ibisobanuro bya Qur'an Ntagatifu. * - Ishakiro ry'ibisobanuro


Ibisobanuro by'amagambo Isura: Al An’am   Umurongo:
ذٰلِكَ اَنْ لَّمْ یَكُنْ رَّبُّكَ مُهْلِكَ الْقُرٰی بِظُلْمٍ وَّاَهْلُهَا غٰفِلُوْنَ ۟
ఈ మన్నింపు మానవులు,జిన్నాతుల వద్దకు ప్రవక్తలను పంపించటం ద్వారా ఎవరూ కూడా తన వద్దకు ఏ ప్రవక్తను పంపించబడకుండా,తన వద్దకు ఏ దావత్ (పిలుపు,సందేశము) చేరకుండా ఉన్న స్థితిలో శిక్షింపబడకుండా ఉండటానికి. జాతుల్లోంచి ఏ జాతిని మేము వారి వద్దకు ప్రవక్తలను పంపించిన తరువాతే శిక్షిస్తాము.
Ibisobanuro by'icyarabu:
وَلِكُلٍّ دَرَجٰتٌ مِّمَّا عَمِلُوْا ؕ— وَمَا رَبُّكَ بِغَافِلٍ عَمَّا یَعْمَلُوْنَ ۟
వారిలోంచి ప్రతి ఒక్కరిని వారి ఆచరణలను బట్టి అంతస్తులు (స్థానాలు) ఉంటాయి. అయితే ఎక్కువ చెడులు కలవాడు,తక్కువ చెడులు కలవాడు సమానులు కారు. అనుసరించేవాడు అనుసరించబడినవాడు సమానులు కారు. అదే విధంగా సత్కర్మలు చేసేవారి యొక్క పుణ్యం సమానం కాదు. నీ ప్రభువు వారు చేస్తున్న కర్మల నుండి నిర్లక్ష్యం వహించేవాడు కాడు. కాని ఆయన వాటి గురించి తెలుసుకునే వాడు. వాటిలోంచి ఏది ఆయనకు గోప్యంగా ఉండదు. తొందరలోనే ఆయన వారి కర్మలకు అనుగుణంగా వారికి ప్రతిఫలాన్ని ప్రసాధిస్తాడు.
Ibisobanuro by'icyarabu:
وَرَبُّكَ الْغَنِیُّ ذُو الرَّحْمَةِ ؕ— اِنْ یَّشَاْ یُذْهِبْكُمْ وَیَسْتَخْلِفْ مِنْ بَعْدِكُمْ مَّا یَشَآءُ كَمَاۤ اَنْشَاَكُمْ مِّنْ ذُرِّیَّةِ قَوْمٍ اٰخَرِیْنَ ۟ؕ
ఓ ప్రవక్తా మీ ప్రభువు,ఆయన తన దాసుల నుండి ఎటువంటి అక్కర లేనివాడు. ఆయనకి వారి అవసరం లేదు,వారి ఆరాధనల అవసరం లేదు. వారి తిరస్కారము ఆయనకు నష్టం కలిగించదు. వారి నుండి ఆయనకి అక్కర లేకపోవటంతోపాటు ఆయన వారిపై కరుణ కలవాడు. ఓ అవిధేయ దాసుల్లారా ఒక వేళ ఆయన మిమ్మల్ని హతమార్చాలనుకుంటే తన వద్ద ఉన్న శిక్ష ద్వారా మీమ్మల్ని కూకటివ్రేళ్ళతో పెకిలించివేస్తాడు. మీ కన్న మునుపు వేరే జాతి వారి వంశము నుండి మిమ్మల్ని ఆయన పుట్టించినట్లే మిమ్మల్ని హతమార్చిన తరువాత తనను విశ్వసించే వారిలోంచి,తనపై విధేయత చూపే వారిలోంచి తాను కోరుకున్న వారిని తీసుకుని వస్తాడు.
Ibisobanuro by'icyarabu:
اِنَّ مَا تُوْعَدُوْنَ لَاٰتٍ ۙ— وَّمَاۤ اَنْتُمْ بِمُعْجِزِیْنَ ۟
ఓ విశ్వాసపరులారా మీతో వాగ్ధానం చేయబడిన మరణాంతరంలేపబడటం,మరలించబడటం,లెక్కతీసుకోవటం,శిక్షించటం జరగటం అనివార్యము. మీరు పారిపోయి మీ ప్రభువు నుండి తప్పించుకోలేరు. ఆయన మీ నుదుట్లను పట్టుకుంటాడు,తన శిక్ష ద్వారా మిమ్మల్ని శిక్షిస్తాడు.
Ibisobanuro by'icyarabu:
قُلْ یٰقَوْمِ اعْمَلُوْا عَلٰی مَكَانَتِكُمْ اِنِّیْ عَامِلٌ ۚ— فَسَوْفَ تَعْلَمُوْنَ ۙ— مَنْ تَكُوْنُ لَهٗ عَاقِبَةُ الدَّارِ ؕ— اِنَّهٗ لَا یُفْلِحُ الظّٰلِمُوْنَ ۟
ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ఓ నా జాతివారా మీ పద్దతిని మీరు పాటిస్తూ ఉండండి,మీరు దేని పైనైతే ఉన్నారో అవిశ్వాసం,మార్గభ్రష్టతను పాటించండి. నేను మన్నింపు వైఖరిని అవలంబించాను,స్పష్టమైన సందేశముతో నేను మీపై వాదనను ఉంచాను. మీ అవిశ్వాసము,సన్మార్గమును తప్పి పోవటంను నేను పట్టించుకోను. కాని నేను దేనిపైనైతే ఉన్నానో సత్యము పై నిలకడ చూపుతాను. ఇహలోకంలో సహాయం ఎవరి కొరకు ఉంటుందో,ఎవరు భూమిని వారసత్వంగా పొందుతారో,పరలోక నివాసము ఎవరి కొరకో మీరు తొందరలోనే తెలుసుకుంటారు. ముష్రికులు ఇహలోకంలోను,పరలోకంలోను సాఫల్యం చెందలేరు. కాని నష్టము వారి పరిణామము అవుతుంది. ఒకవేళ మీరు లభ్ది పొందాలనుకుంటే ఇహలోకంలోనే లభ్ది పొందండి.
Ibisobanuro by'icyarabu:
وَجَعَلُوْا لِلّٰهِ مِمَّا ذَرَاَ مِنَ الْحَرْثِ وَالْاَنْعَامِ نَصِیْبًا فَقَالُوْا هٰذَا لِلّٰهِ بِزَعْمِهِمْ وَهٰذَا لِشُرَكَآىِٕنَا ۚ— فَمَا كَانَ لِشُرَكَآىِٕهِمْ فَلَا یَصِلُ اِلَی اللّٰهِ ۚ— وَمَا كَانَ لِلّٰهِ فَهُوَ یَصِلُ اِلٰی شُرَكَآىِٕهِمْ ؕ— سَآءَ مَا یَحْكُمُوْنَ ۟
అల్లాహ్ సృష్టించిన పంట పొలాల్లోంచి,పశువుల్లోంచి కొంత భాగమును అల్లాహ్ కోసం నిర్ధారించుకుని ముష్రికులు తమ తరుపు నుంచి ఆవిష్కరించుకునేవారు. అది అల్లాహ్ కొరకు అని విడ్ఢూరంగా చెప్పేవారు. మరియు మరి కొంత భాగమును తమ విగ్రహాల కొరకు,తమ స్మారక చిహ్నాల కొరకు తమ తరుపు నుండి ఆవిష్కరించుకునేవారు. అయితే వారు తాము సాటి కల్పించుకున్న వారి కొరకు ప్రత్యేకించుకున్నది అల్లాహ్ ఖర్చు చేయమన్న పేదలకు,అగత్యపరులకు చేరేది కాదు. మరియు వారు అల్లాహ్ కొరకు ప్రత్యేకించుకున్నది తాము సాటి కల్పించుకున్న విగ్రహాలకు చేరుతుంది. వాటి ప్రయోజనాల్లో ఖర్చు చేయబడుతుంది. వినండి వారి తీర్పు,వారి విభజన ఎంతో చెడ్డదైనది.
Ibisobanuro by'icyarabu:
وَكَذٰلِكَ زَیَّنَ لِكَثِیْرٍ مِّنَ الْمُشْرِكِیْنَ قَتْلَ اَوْلَادِهِمْ شُرَكَآؤُهُمْ لِیُرْدُوْهُمْ وَلِیَلْبِسُوْا عَلَیْهِمْ دِیْنَهُمْ ؕ— وَلَوْ شَآءَ اللّٰهُ مَا فَعَلُوْهُ فَذَرْهُمْ وَمَا یَفْتَرُوْنَ ۟
మరియు ఏ విధంగా ముష్రికులకు షైతాను ఈ దుర్మార్గపు తీర్పును మంచిగా చేసి చూపించాడో అలాగే చాలామంది ముష్రికులకు వారు సాటి కల్పిస్తున్న షైతానులు అల్లాహ్ అన్యాయంగా హత్య చేయటంను నిషేదించిన ప్రాణమును హత్య చేయటంలో పడవేసి వారిని హతమార్చటం కొరకు,వారికి ఏది ధర్మమో,ఏది అధర్మమో తెలియకుండా వారి ధర్మమును సంశయాస్పదమైనదిగా చేయటానికి వారి సంతానమును పేదరికం భయంతో హతమార్చటంను మంచిదిగా చేసి చూపించారు. ఒక వేళ అల్లాహ్ వారు ఇలా చేయకూడదు అని తలచుకుంటే వారు అలా చేసేవారు కాదు. కాని ఆయన విపరీత వివేకము కొరకు దాన్నే కోరుకున్నాడు. ఓ ప్రవక్తా వారిని,అల్లాహ్ పై వారు అబధ్ధం ను అంటగట్టడంను వదిలి వేయండి. ఎందుకంటే అది మీకు ఎటువంటి నష్టం చేయదు. వారి విషయాన్ని అల్లాహ్ కు అప్పజెప్పండి.
Ibisobanuro by'icyarabu:
Inyungu dukura muri ayat kuri Uru rupapuro:
• تفاوت مراتب الخلق في أعمال المعاصي والطاعات يوجب تفاوت مراتبهم في درجات العقاب والثواب.
పాపకార్యాల్లో,సత్కార్యాల్లో సృష్టి యొక్క శ్రేణుల తేడా పుణ్యముల,శిక్షల స్థానాల విషయంలో వారి శ్రేణుల తేడాకు కారణమవుతాయి.

• اتباع الشيطان موجب لانحراف الفطرة حتى تصل لاستحسان القبيح مثل قتل الأولاد ومساواة أصنامهم بالله سبحانه وتعالى.
షైతానును అనుసరించటం స్వభావము నుండి మరలిపోవటమునకు కారణమవుతుంది. చివరికి చెడును మంచిగా భావించటమునకు కారణమవుతుంది. ఉదాహరణకి సంతానమును హతమార్చటం,తమ విగ్రహాలను అల్లాహ్ కు సమానంగా చేయటం.

 
Ibisobanuro by'amagambo Isura: Al An’am
Urutonde rw'amasura numero y'urupapuro
 
Ibisobanuro bya qoran ntagatifu - Ibisobanuro bya Qur'an Ntagatifu mu rurimi rw'igitelugu, bikaba ari incamacye y'ibisobanuro bya Qur'an Ntagatifu. - Ishakiro ry'ibisobanuro

Yasohowe n'ikigo Tafsir of Quranic Studies.

Gufunga