Përkthimi i kuptimeve të Kuranit Fisnik - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Përmbajtja e përkthimeve


Përkthimi i kuptimeve Ajeti: (33) Surja: Suretu Er Rad
اَفَمَنْ هُوَ قَآىِٕمٌ عَلٰی كُلِّ نَفْسٍ بِمَا كَسَبَتْ ۚ— وَجَعَلُوْا لِلّٰهِ شُرَكَآءَ ؕ— قُلْ سَمُّوْهُمْ ؕ— اَمْ تُنَبِّـُٔوْنَهٗ بِمَا لَا یَعْلَمُ فِی الْاَرْضِ اَمْ بِظَاهِرٍ مِّنَ الْقَوْلِ ؕ— بَلْ زُیِّنَ لِلَّذِیْنَ كَفَرُوْا مَكْرُهُمْ وَصُدُّوْا عَنِ السَّبِیْلِ ؕ— وَمَنْ یُّضْلِلِ اللّٰهُ فَمَا لَهٗ مِنْ هَادٍ ۟
అయితే ఏమీ సృష్టితాలన్నింటి జీవనోపాదిని పరిరక్షించేవాడు, ప్రతీ వ్యక్తి చేసే కార్యాలను పర్యవేక్షించి వారి ఆచరణల పరంగా వారికి ప్రతిఫలాన్ని ప్రసాదించేవాడు ఆరాధించబడటానికి ఎక్కువ అర్హుడా లేదా ఆరాధనకు అర్హత లేని ఈ విగ్రహాలా ?.వాస్తవానికి అవిశ్వాసపరులు అల్లాహ్ కొరకు అన్యాయముగా,అబద్దముగా కొందరిని సాటి కల్పించుకున్నారు.ఓ ప్రవక్తా వారితో ఇలా పలకండి : ఒక వేళ మీరు మీ వాదనలో సత్యవంతులే అయితే మీరు అల్లాహ్ తోపాటు ఆరాధించిన భాగస్వాముల పేర్లను మాకు తెలపండి. లేదా మీరు అల్లాహ్ కు తెలియని భూమిలో ఉన్న భాగస్వాముల గురించి తెలియపరుస్తున్నారా ?.లేదా మీరు ఆయనకు ఎటువంటి వాస్తవికత లేని మాటను బహిర్గపరుస్తూ తెలుపుతున్నారా ?.వాస్తవానికి షైతాను అవిశ్వాసపరులకు వారి దుర కార్య నిర్వహణను అందంగా చేసి చూపించాడు అప్పుడు వారు అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరిచారు.మరియు అతడు వారిని సన్మార్గము నుండి,ఋజు మార్గము నుండి మరలించాడు.మరియు అల్లాహ్ ఎవరిని సన్మార్గము నుండి తప్పించివేస్తే వారికి సన్మార్గము చూపేవాడు ఎవడూ ఉండడు.
Tefsiret në gjuhën arabe:
Dobitë e ajeteve të kësaj faqeje:
• أن الأصل في كل كتاب منزل أنه جاء للهداية، وليس لاستنزال الآيات، فذاك أمر لله تعالى يقدره متى شاء وكيف شاء.
అవతరింపబడిన ప్రతీ గ్రంధంలోని ప్రాధమిక సూత్రం ఏమిటంటే అది మార్గదర్శకత్వానికి వచ్చింది.అది సూచనలను అవతరించటమును కోరటానికి రాలేదు.అది మహోన్నతుడైన అల్లాహ్ ఆజ్ఞ దాన్ని ఆయన ఎప్పుడు తలచుకుంటే అప్పుడు, ఎలా తలచుకుంటే అలా నిర్ధారిస్తాడు.

• تسلية الله تعالى للنبي صلى الله عليه وسلم، وإحاطته علمًا أن ما يسلكه معه المشركون من طرق التكذيب، واجهه أنبياء سابقون.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంనకు అల్లాహ్ ఓదార్పు మరియు ముష్రికులు ఆయనతో వ్యవహరించిన తిరస్కార మార్గములను మునుపటి ప్రవక్తలు ఎదుర్కొన్నారని ఆయనకు జ్ఞానోదయం చేయటం.

• يصل الشيطان في إضلال بعض العباد إلى أن يزين لهم ما يعملونه من المعاصي والإفساد.
షైతాను కొంతమంది దాసుల కొరకు వారు చేస్తున్న పాప కార్యములను,అవినీతి కార్యాలను అలంకరించి వారిని తప్పుదారి పట్టించాడు.

 
Përkthimi i kuptimeve Ajeti: (33) Surja: Suretu Er Rad
Përmbajtja e sureve Numri i faqes
 
Përkthimi i kuptimeve të Kuranit Fisnik - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Përmbajtja e përkthimeve

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Mbyll