Check out the new design

Përkthimi i kuptimeve të Kuranit Fisnik - El Muhtesar fi tefsir el Kuran el Kerim - Përkthimi teluguisht * - Përmbajtja e përkthimeve


Përkthimi i kuptimeve Surja: Esh Shuara   Ajeti:
مَاۤ اَغْنٰی عَنْهُمْ مَّا كَانُوْا یُمَتَّعُوْنَ ۟ؕ
ఇహ లోకంలో వారికి ఉన్నఅనుగ్రహాలు వారికి ఏమి ప్రయోజనం కలిగించగలవు ?!. నిశ్ఛయంగా ఈ అనుగ్రహాలన్నీఅంతమైపోయాయి. మరియు అవి ఏవి లాభం కలిగించవు.
Tefsiret në gjuhën arabe:
وَمَاۤ اَهْلَكْنَا مِنْ قَرْیَةٍ اِلَّا لَهَا مُنْذِرُوْنَ ۟
సమాజాల్లోంచి ఏ సమాజమును కూడా వారి వద్దకు ప్రవక్తలను పంపించి,గ్రంధాలను అవతరింపజేసి సాకులు లేకుండా చేసిన తరువాతే మేము నాశనం చేశాము.
Tefsiret në gjuhën arabe:
ذِكْرٰی ۛ۫— وَمَا كُنَّا ظٰلِمِیْنَ ۟
వారికి ఉపదేశముగా,హితోపదేశముగా. మరియు ప్రవక్తలను పంపించి,గ్రంధములను అవతరింపజేసి వారి వద్ద సాకులు లేకుండా చేసిన తరువాత వారిని శిక్షించటం వలన మేము అన్యాయము చేసిన వారము కాము.
Tefsiret në gjuhën arabe:
وَمَا تَنَزَّلَتْ بِهِ الشَّیٰطِیْنُ ۟ۚ
ఈ ఖుర్ఆన్ ను తీసుకుని షైతానులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హృదయంపై దిగలేదు.
Tefsiret në gjuhën arabe:
وَمَا یَنْۢبَغِیْ لَهُمْ وَمَا یَسْتَطِیْعُوْنَ ۟ؕ
వారు ఆయన హృదయంపై దిగటం సరి కాదు. మరియు వారికి దాని శక్తి లేదు.
Tefsiret në gjuhën arabe:
اِنَّهُمْ عَنِ السَّمْعِ لَمَعْزُوْلُوْنَ ۟ؕ
వారికి దాని శక్తి లేదు ఎందుకంటే వారు ఆకాశము నుండి దూరపు స్థలంలో తొలగించబడ్డారు. అప్పుడు వారు దాని వద్దకు ఎలా చేర గలరు. మరియు దాన్ని తీసుకుని ఎలా దిగ గలరు ?!.
Tefsiret në gjuhën arabe:
فَلَا تَدْعُ مَعَ اللّٰهِ اِلٰهًا اٰخَرَ فَتَكُوْنَ مِنَ الْمُعَذَّبِیْنَ ۟ۚ
అయితే మీరు అల్లాహ్ తో పాటు వేరే ఆరాధ్య దైవమును ఆయనతో పాటు మీరు సాటి కల్పిస్తూ ఆరాధించకండి. అప్పుడు మీరు దాని కారణం వలన శిక్షింపబడే వారిలో అయిపోతారు.
Tefsiret në gjuhën arabe:
وَاَنْذِرْ عَشِیْرَتَكَ الْاَقْرَبِیْنَ ۟ۙ
ఓ ప్రవక్తా మీరు మీ జాతి వారిలోంచి దగ్గర బంధువులను ఒక వేళ వారు షిర్కు పై ఉంటే వారికి అల్లాహ్ శిక్ష కలగనంత వరకు హెచ్చరిస్తూ ఉండండి.
Tefsiret në gjuhën arabe:
وَاخْفِضْ جَنَاحَكَ لِمَنِ اتَّبَعَكَ مِنَ الْمُؤْمِنِیْنَ ۟ۚ
మరియు విశ్వాసపరులోంచి నిన్ను అనుసరించిన వారి కొరకు నీ రెక్కలను కర్మ పరంగా,మాట పరంగా వారిపై కనికరిస్తూ,దయను చూపుతూ మృధు వైఖరిని కలిగి ఉండు.
Tefsiret në gjuhën arabe:
فَاِنْ عَصَوْكَ فَقُلْ اِنِّیْ بَرِیْٓءٌ مِّمَّا تَعْمَلُوْنَ ۟ۚ
ఒక వేళ వారు నీపై అవిధేయత చూపి,నీవు వారికి ఆదేశించిన అల్లాహ్ ఏకత్వమును,ఆయన విధేయతను స్వీకరించకపోతే, మీరు వారితో ఇలా పలకండి : మీరు చేస్తున్న షిర్కు,పాప కార్యాల నుండి నేను అతీతుడను.
Tefsiret në gjuhën arabe:
وَتَوَكَّلْ عَلَی الْعَزِیْزِ الرَّحِیْمِ ۟ۙ
మరియు నీవు నీ వ్యవహారాలన్నింటిలో తన శతృవులతో ప్రతీకారం తీసుకునే సర్వ శక్తిమంతుడి పై,వారిలోంచి అతని వైపు మరలే వారిపై కరుణించేవాడిపై నమ్మకమును కలిగి ఉండు.
Tefsiret në gjuhën arabe:
الَّذِیْ یَرٰىكَ حِیْنَ تَقُوْمُ ۟ۙ
పరిశుద్ధుడైన ఆయనే నీవు నమాజు కొరకు నిలబడినప్పుడు చూస్తున్నాడు.
Tefsiret në gjuhën arabe:
وَتَقَلُّبَكَ فِی السّٰجِدِیْنَ ۟
మరియు పరిశుద్ధుడైన ఆయన నమాజ్ చదివే వారిలో ఒక స్థితి నుండి ఇంకొక స్థితికి మీ మారటమును చూస్తున్నాడు. మీరు నెలకొల్పిన (నమాజులను) వాటిలోంచి,ఇతరులు నెలకొల్పిన వాటిలో నుంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.
Tefsiret në gjuhën arabe:
اِنَّهٗ هُوَ السَّمِیْعُ الْعَلِیْمُ ۟
నిశ్ఛయంగా ఆయనే మీరు పఠించిన ఖుర్ఆన్ ను,మీ నమాజులో స్మరణను వినే వాడును,మీ ఉద్దేశమును తెలిసినవాడును.
Tefsiret në gjuhën arabe:
هَلْ اُنَبِّئُكُمْ عَلٰی مَنْ تَنَزَّلُ الشَّیٰطِیْنُ ۟ؕ
ఈ ఖుర్ఆన్ ను తీసుకుని షైతానులు దిగుతారని మీరు వాదించారో వారు ఎవరిపై దిగుతారో మీకు నేను తెలియపరచనా ?.
Tefsiret në gjuhën arabe:
تَنَزَّلُ عَلٰی كُلِّ اَفَّاكٍ اَثِیْمٍ ۟ۙ
షైతానులు జ్యోతిష్యుల్లోంచి అధికంగా పాపాలకు,అవిధేయ కార్యాలకు పాల్పడే ప్రతీ అసత్యపరునిపై దిగుతారు.
Tefsiret në gjuhën arabe:
یُّلْقُوْنَ السَّمْعَ وَاَكْثَرُهُمْ كٰذِبُوْنَ ۟ؕ
షైతానులు పై లోకాల్లో ఉన్న దూతల (మలయే ఆలా) నుండి విన్న వాటిని ఎత్తుకుని వచ్చి జ్యోతిష్యుల్లోంచి తమ స్నేహితులకు చేరవేసేవారు. చాలామంది జ్యోతిష్యులు అసత్యపరులై ఉంటారు. ఒక వేళ వారు ఒక మాట నిజం పలికినా దానితో పాటు వంద మాటలు అబద్దాలు పలుకుతారు.
Tefsiret në gjuhën arabe:
وَالشُّعَرَآءُ یَتَّبِعُهُمُ الْغَاوٗنَ ۟ؕ
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కవుల్లోంచి అని మీరు వాదిస్తున్నారో వారిని సన్మార్గము నుండి,ఋజు మార్గము నుండి తప్పిపోయిన వారే అనుసరిస్తారు. వారు ఏ కవిత్వాలను పలుకుతారో వాటినే వారు చదువుతారు.
Tefsiret në gjuhën arabe:
اَلَمْ تَرَ اَنَّهُمْ فِیْ كُلِّ وَادٍ یَّهِیْمُوْنَ ۟ۙ
ఓ ప్రవక్తా మీరు చూడలేదా - వారి అపమార్గపు దృశ్యాల్లోంచి వారు ప్రతీ లోయలో ఒకోసారి పొగుడుతూ తచ్చాడితే ఒకోసారి దూషిస్తూ తచ్చాడితే,ఒకో సారి వేరే వాటిలో తచ్చాడతున్నారు.
Tefsiret në gjuhën arabe:
وَاَنَّهُمْ یَقُوْلُوْنَ مَا لَا یَفْعَلُوْنَ ۟ۙ
మరియు వారు అబద్దం పలుకుతున్నారని, మేము ఇలా చేశాము అని అంటారు. కాని వార అలా చేయలేదు.
Tefsiret në gjuhën arabe:
اِلَّا الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ وَذَكَرُوا اللّٰهَ كَثِیْرًا وَّانْتَصَرُوْا مِنْ بَعْدِ مَا ظُلِمُوْا ؕ— وَسَیَعْلَمُ الَّذِیْنَ ظَلَمُوْۤا اَیَّ مُنْقَلَبٍ یَّنْقَلِبُوْنَ ۟۠
కవుల్లోంచి ఎవరైతే విశ్వసించారో, సత్కార్యాలు చేశారో, అధికంగా అల్లాహ్ స్మరణ చేశారో, అల్లాహ్ శతృవులు వారిపై అన్యాయమునకు పాల్పడిన తరువాత వారిపై గెలుస్తారో వారు కాదు. ఉదాహరణకు హస్సాన్ బిన్ సాబిత్ రజిఅల్లాహు అన్హు. మరియు అల్లాహ్ తో పాటు సాటి కల్పించి,ఆయన దాసులపై హింసకు పాల్పడిన వారు ఎవరి వైపు మరల వలసినదో తొందలోనే మరలి వెళుతారు. వారు గొప్ప స్థానము,ఖచ్చితమైన గణన వైపునకు మరలుతారు.
Tefsiret në gjuhën arabe:
Dobitë e ajeteve të kësaj faqeje:
• إثبات العدل لله، ونفي الظلم عنه.
న్యాయమును అల్లాహ్ కొరకు నిరూపించటం,హింసను ఆయన నుండి జరగటంను తిరస్కరించటం.

• تنزيه القرآن عن قرب الشياطين منه.
షైతానులు ఖుర్ఆన్ దరిదాపులకు రావటం నుండి అది పరిశుద్ధమైనది.

• أهمية اللين والرفق للدعاة إلى الله.
అల్లాహ్ వైపునకు పిలిచే వారికి మృధుత్వము,మెత్తదనము ఉండటం యొక్క ప్రాముఖ్యత.

• الشعر حَسَنُهُ حَسَن، وقبيحه قبيح.
కవిత్వము దాని మంచితనము మంచిది మరియు దాని చెడు చెడ్డది.

 
Përkthimi i kuptimeve Surja: Esh Shuara
Përmbajtja e sureve Numri i faqes
 
Përkthimi i kuptimeve të Kuranit Fisnik - El Muhtesar fi tefsir el Kuran el Kerim - Përkthimi teluguisht - Përmbajtja e përkthimeve

Botuar nga Qendra e Tefsirit për Studime Kuranore.

Mbyll