Check out the new design

Përkthimi i kuptimeve të Kuranit Fisnik - El Muhtesar fi tefsir el Kuran el Kerim - Përkthimi teluguisht * - Përmbajtja e përkthimeve


Përkthimi i kuptimeve Surja: El Kamer   Ajeti:
وَنَبِّئْهُمْ اَنَّ الْمَآءَ قِسْمَةٌ بَیْنَهُمْ ۚ— كُلُّ شِرْبٍ مُّحْتَضَرٌ ۟
మరియు వారి బావి నీరు వారికి మరియు ఒంటె మధ్య పంచబడినదని వారికి తెలియపరచండి. ఒక రోజు దానికి మరియు ఒక రోజు వారికి. వంతుకల ప్రతీ ఒక్కరు తనకోసం ప్రత్యేకించబడిన తన దినములో దాని వద్దకు రావాలి.
Tefsiret në gjuhën arabe:
فَنَادَوْا صَاحِبَهُمْ فَتَعَاطٰی فَعَقَرَ ۟
అప్పుడు వారు ఒంటెను హతమార్చటానికి తమ సహచరుడికి పిలుపునిచ్చారు. అప్పుడు అతడు ఖడ్గమును తీసుకుని దాన్ని హతమార్చాడు. తాన జాతి వారి ఆదేశమును పాటిస్తూ.
Tefsiret në gjuhën arabe:
فَكَیْفَ كَانَ عَذَابِیْ وَنُذُرِ ۟
ఓ మక్కా వాసులారా వారికి నా శిక్ష ఎలా ఉన్నదో మరియు వారి శిక్షంచటం ద్వారా ఇతరులకు నా హెచ్చరిక ఎలా ఉన్నదో యోచన చేయండి.
Tefsiret në gjuhën arabe:
اِنَّاۤ اَرْسَلْنَا عَلَیْهِمْ صَیْحَةً وَّاحِدَةً فَكَانُوْا كَهَشِیْمِ الْمُحْتَظِرِ ۟
నిశ్ఛయంగా మేము వారిపై ఒక భయంకరమైన శబ్ధమును పంపాము అది వారిని హతమార్చింది. అప్పుడు వారు సంరక్షకుడు తన గొర్రెలకు గాదెగా చేసుకునే ఎండిపోయిన చెట్ల వలే అయిపోయారు.
Tefsiret në gjuhën arabe:
وَلَقَدْ یَسَّرْنَا الْقُرْاٰنَ لِلذِّكْرِ فَهَلْ مِنْ مُّدَّكِرٍ ۟
మరియు నిశ్ఛయంగా హితబోధన మరియు హితోపదేశం కొరకు ఖుర్ఆన్ ను సులభతరం చేశాము. అయితే అందులో ఉన్న గుణపాఠము మరియు హితబోధనల ద్వారా గుణపాఠం నేర్చుకునేవాడు ఎవడైన ఉన్నాడా ?!
Tefsiret në gjuhën arabe:
كَذَّبَتْ قَوْمُ لُوْطٍۭ بِالنُّذُرِ ۟
లూత్ జాతి వారు వారి ప్రవక్త అయిన లూత్ అలైహిస్సలాం గారు వారిని హెచ్చరించిన దాన్ని తిరస్కరించారు.
Tefsiret në gjuhën arabe:
اِنَّاۤ اَرْسَلْنَا عَلَیْهِمْ حَاصِبًا اِلَّاۤ اٰلَ لُوْطٍ ؕ— نَجَّیْنٰهُمْ بِسَحَرٍ ۟ۙ
నిశ్ఛయంగా మేము వారిపై రాళ్ళను విసిరే పెను గాలిని పంపాము.కాని లూత్ ఇంటి వారిపై కాదు. వారికి శిక్ష కలగలేదు. వాస్తవానికి మేము వారిని దాని నుండి రక్షించాము. అప్పుడే ఆయన శిక్ష వాటిల్లక ముందే రాత్రి చివరి వేళలో వారిని తీసుకుని బయలుదేరారు.
Tefsiret në gjuhën arabe:
نِّعْمَةً مِّنْ عِنْدِنَا ؕ— كَذٰلِكَ نَجْزِیْ مَنْ شَكَرَ ۟
మా తరపు నుండి వారిపై ఉపకారముగా మేము వారిని శిక్ష నుండి రక్షించాము. లూత్ అలైహిస్సలాంనకు మేము ప్రసాదించిన ఈ ప్రతిఫలం వంటిదే అల్లాహ్ అనుగ్రహాలపై కృతజ్ఞత తెలుపుకునేవారికి ప్రతిఫలమును ప్రసాదిస్తాము.
Tefsiret në gjuhën arabe:
وَلَقَدْ اَنْذَرَهُمْ بَطْشَتَنَا فَتَمَارَوْا بِالنُّذُرِ ۟
మరియు వాస్తవానికి లూత్ వారిని మా శిక్ష నుండి భయపెట్టాడు. కాని వారు అతని హెచ్చరికల గురించి వాదులాడి అతన్ని తిరస్కరించారు.
Tefsiret në gjuhën arabe:
وَلَقَدْ رَاوَدُوْهُ عَنْ ضَیْفِهٖ فَطَمَسْنَاۤ اَعْیُنَهُمْ فَذُوْقُوْا عَذَابِیْ وَنُذُرِ ۟
మరియు వాస్తవానికి లూత్ అలైహిస్సలాంను ఆయన జాతివారు వారికి మరియు ఆయన అతిధులైన దైవదూతలకు మధ్య రావద్దని అశ్లీల కార్యమును ఆశిస్తూ దువ్వ సాగారు. అప్పుడు మేము వారి కళ్ళను తుడిచి వేశాము. అప్పుడు అవి వారిని చూడలేకపోయాయి. మరియు మేము వారితో ఇలా పలికాము : మీరు నాశిక్షను మరియు మీకు నేను చేసిన హెచ్చరిక ఫలితమును చవిచూడండి.
Tefsiret në gjuhën arabe:
وَلَقَدْ صَبَّحَهُمْ بُكْرَةً عَذَابٌ مُّسْتَقِرٌّ ۟ۚ
మరియు నిశ్ఛయంగా ఉదయం వేళ వారి వద్దకు శిక్ష వచ్చినది. అది వారు పరలోకమునకు చేరి దాని శిక్ష వారి వద్దకు వచ్చేవరకు వారితో కొనసాగింది.
Tefsiret në gjuhën arabe:
فَذُوْقُوْا عَذَابِیْ وَنُذُرِ ۟
మరియు వారితో ఇలా పలకబడింది : నేను మీపై కురిపించిన శిక్షను మరియు లూత్ అలైహిస్సలాం మీకు హెచ్చరించిన దాని ప్రతిఫలమును మీరు చవిచూడండి.
Tefsiret në gjuhën arabe:
وَلَقَدْ یَسَّرْنَا الْقُرْاٰنَ لِلذِّكْرِ فَهَلْ مِنْ مُّدَّكِرٍ ۟۠
మరియు నిశ్చయంగా హితబోధన మరియు హితోపదేశం కొరకు ఖుర్ఆన్ ను సులభతరం చేశాము. అయితే అందులో ఉన్న గుణపాఠము మరియు హితబోధనల ద్వారా గుణపాఠం నేర్చుకునేవాడు ఎవడైన ఉన్నాడా ?!
Tefsiret në gjuhën arabe:
وَلَقَدْ جَآءَ اٰلَ فِرْعَوْنَ النُّذُرُ ۟ۚ
మరియు నిశ్చయంగా ఫిర్ఔన్ వంశీయుల వద్దకు మూసా మరియు హారూన్ అలైహిమస్సలాం నోట మా హెచ్చరిక వచ్చినది.
Tefsiret në gjuhën arabe:
كَذَّبُوْا بِاٰیٰتِنَا كُلِّهَا فَاَخَذْنٰهُمْ اَخْذَ عَزِیْزٍ مُّقْتَدِرٍ ۟
మా వద్ద నుండి వారి వద్దకు వచ్చిన ఆధారాలను మరియు ఋజువులను తిరస్కరించారు. అప్పుడు వాటిని తిరస్కరించటం పై ఎవరు ఓడించలేని సర్వ శక్తిమంతుడు మరియు దేని నుండి అశక్తుడు కాని సర్వాధికారి శిక్షించిన విధంగా మేము వారిని శిక్షించాము.
Tefsiret në gjuhën arabe:
اَكُفَّارُكُمْ خَیْرٌ مِّنْ اُولٰٓىِٕكُمْ اَمْ لَكُمْ بَرَآءَةٌ فِی الزُّبُرِ ۟ۚ
ఓ మక్కా వాసులారా ఏమీ మీలోని అవిశ్వాసపరులు ఈ ప్రస్తా వించబడిన అవిశ్వాసపరులందరైన నూహ్ జాతి,ఆద్ జాతి,సమూద్ జాతి,లూత్ జాతి మరియు ఫిర్ఔన్ మరియు అతని జతివారి కన్న ఉత్తములా ?! లేదా అల్లాహ్ శిక్ష నుండి దివ్య గ్రంధములు తీసుకుని వచ్చిన మినహాయింపు ఏదైన మీకు ఉన్నదా ?!
Tefsiret në gjuhën arabe:
اَمْ یَقُوْلُوْنَ نَحْنُ جَمِیْعٌ مُّنْتَصِرٌ ۟
లేక మక్కా వాసుల్లోంచి ఈ అవిశ్వాసపరులందరు "మాకు చెడు చేయదలచిన మరియు మనందరిని విభజించదలచిన వారిపై మేమందరము గెలుపొందే వారము" అని అంటున్నారా ?!
Tefsiret në gjuhën arabe:
سَیُهْزَمُ الْجَمْعُ وَیُوَلُّوْنَ الدُّبُرَ ۟
తొందరలోనే ఈ అవిశ్వాసపరులందరి వర్గము పరాజయము చెంది వారు విశ్వాసపరుల ముందు నుండి వీపు త్రిప్పి పారిపోతారు. వాస్తవానికి బదర్ దినమున ఇది సంభవించినది.
Tefsiret në gjuhën arabe:
بَلِ السَّاعَةُ مَوْعِدُهُمْ وَالسَّاعَةُ اَدْهٰی وَاَمَرُّ ۟
అంతే కాదు వారు తిరస్కరించే ప్రళయమే అందులో వారు శిక్షింపబడే వారి వాగ్దాన సమయము. మరియు ప్రళయము వారు బదర్ దినమున వారు పొందే ఇహలోక శిక్ష కన్న ఎంతో పెద్దది మరియు కఠినమైనది.
Tefsiret në gjuhën arabe:
اِنَّ الْمُجْرِمِیْنَ فِیْ ضَلٰلٍ وَّسُعُرٍ ۟ۘ
నిశ్ఛయంగా అవిశ్వాసమునకు,పాపకార్యములకు పాల్పడి అపరాధము చేసిన వారు సత్యము నుండి తప్పిపోవటంలో మరియు శిక్షలో మరియు ఇబ్బందిలో ఉంటారు.
Tefsiret në gjuhën arabe:
یَوْمَ یُسْحَبُوْنَ فِی النَّارِ عَلٰی وُجُوْهِهِمْ ؕ— ذُوْقُوْا مَسَّ سَقَرَ ۟
ఆ రోజు వారు తమ ముఖాల మీద నరకాగ్ని లోకి ఈడ్చబడతారు; వారిని మందలిస్తూ ఇలా పలకబడుతుంది : మీరు నరకాగ్ని శిక్ష రుచి చూడండి.
Tefsiret në gjuhën arabe:
اِنَّا كُلَّ شَیْءٍ خَلَقْنٰهُ بِقَدَرٍ ۟
నిశ్చయంగా మేము విశ్వంలో ఉన్న ప్రతీ దాన్ని మా ముందస్తు అంచనా ప్రకారం సృష్టించాము. అది మా జ్ఞానమునకు మరియు మా ఇచ్చకు మరియు మేము లౌహె మహ్ఫూజ్ లో రాసిన దానికి అనుగుణంగా అయినది.
Tefsiret në gjuhën arabe:
Dobitë e ajeteve të kësaj faqeje:
• شمول العذاب للمباشر للجريمة والمُتَمالئ معه عليها.
అపరాధమునకు పాల్పడే వాడికి అతనితో పాటు దానిని చేయటానికి పురిగొల్పే వాడికి శిక్షను చేర్చడం.

• شُكْر الله على نعمه سبب السلامة من العذاب.
అల్లాహ్ కు ఆయన అనుగ్రహములపై కృతజ్ఞతలు తెలుపుకోవటం శిక్ష నుండి రక్షణకు కారణమగును.

• إخبار القرآن بهزيمة المشركين يوم بدر قبل وقوعها من الإخبار بالغيب الدال على صدق القرآن.
ముష్రికులు బదర్ దినమున పరాభవమును పొందటం అది సంభవించక ముందే ఖుర్ఆన్ తెలియపరచటం ఖుర్ఆన్ నిజాయితీపై సూచించే అగోచర విషయముల గురించి సమాచారమివ్వటంలోంచిది.

• وجوب الإيمان بالقدر.
తఖ్ధీర్ పై విశ్వాసమును కనబరచటం తప్పనిసరి.

 
Përkthimi i kuptimeve Surja: El Kamer
Përmbajtja e sureve Numri i faqes
 
Përkthimi i kuptimeve të Kuranit Fisnik - El Muhtesar fi tefsir el Kuran el Kerim - Përkthimi teluguisht - Përmbajtja e përkthimeve

Botuar nga Qendra e Tefsirit për Studime Kuranore.

Mbyll