Check out the new design

Përkthimi i kuptimeve të Kuranit Fisnik - El Muhtesar fi tefsir el Kuran el Kerim - Përkthimi teluguisht * - Përmbajtja e përkthimeve


Përkthimi i kuptimeve Surja: El A’raf   Ajeti:
قَالَ مَا مَنَعَكَ اَلَّا تَسْجُدَ اِذْ اَمَرْتُكَ ؕ— قَالَ اَنَا خَیْرٌ مِّنْهُ ۚ— خَلَقْتَنِیْ مِنْ نَّارٍ وَّخَلَقْتَهٗ مِنْ طِیْنٍ ۟
అల్లాహ్ ఇబ్లీసును మందలిస్తూ ఇలా అన్నాడు : నా ఆదేశమును పాటిస్తూ ఆదం కు సాష్టాంగ పడటం నుండి నిన్ను ఏది వారించింది. ఇబ్లీసు తన ప్రభువు కు సమాధానమిస్తూ ఇలా అన్నాడు : నేను అతని కంటే గొప్ప వాడిని అవ్వటం నన్ను ఆపింది. నీవు నన్ను అగ్గితో సృష్టించావు,అతనిని నీవు మట్టితో సృష్టించినావు. అగ్ని మట్టి కన్న గొప్పది.
Tefsiret në gjuhën arabe:
قَالَ فَاهْبِطْ مِنْهَا فَمَا یَكُوْنُ لَكَ اَنْ تَتَكَبَّرَ فِیْهَا فَاخْرُجْ اِنَّكَ مِنَ الصّٰغِرِیْنَ ۟
అల్లాహ్ అతనితో ఇలా అన్నాడు : నీవు స్వర్గం నుండి దిగిపో. అందులో నీవు గర్వాన్ని చూపటం నీకు తగదు. ఎందుకంటే అది పరిశుద్ధులు,స్వచ్చందుల నివాసము. నీవు అక్కడ ఉండటం సరికాదు. ఓ ఇబ్లీసు ఒక వేళ నీవు నిన్ను ఆదము కన్న గొప్ప వాడిగా భావిస్తే నిశ్చయంగా నీవు నీచుల్లోంచి,దిగజారిన వారిలోంచి వాడివి.
Tefsiret në gjuhën arabe:
قَالَ اَنْظِرْنِیْۤ اِلٰی یَوْمِ یُبْعَثُوْنَ ۟
ఇబ్లీసు ఇలా వేడుకున్నాడు : ఓ నా ప్రభువా పునరుత్థాన దినం వరకు ప్రజల్లోంచి నేను ఎవరిని భ్రష్టుడిని చేయగలనో అతడిని భ్రష్టుడు చేయటానికి నాకు గడువును ప్రసాదించు.
Tefsiret në gjuhën arabe:
قَالَ اِنَّكَ مِنَ الْمُنْظَرِیْنَ ۟
అల్లాహ్ అతనితో ఇలా అన్నాడు : ఓ ఇబ్లీసు నిశ్చయంగా మొదటి బాకా ఊదబడే రోజు నేను మరణమును రాసిపెట్టిన,గడువు ఇవ్వబడిన వారిలోంచి నీవు ఉంటావు. అప్పుడు ప్రాణులన్నీ చనిపోతాయి. వారి సృష్టికర్త ఒక్కడే మిగులుతాడు.
Tefsiret në gjuhën arabe:
قَالَ فَبِمَاۤ اَغْوَیْتَنِیْ لَاَقْعُدَنَّ لَهُمْ صِرَاطَكَ الْمُسْتَقِیْمَ ۟ۙ
ఇబ్లీసు ఇలా పలికాడు : నీవు నన్ను భ్రష్టుణ్ణి చేసిన కారణంగా చివరికి ఆదం కు సాష్టాంగ పడమన్న నీ ఆదేశమును పాటించటంను నేను వదిలి వేశాను. నేను ఆదం సంతతి కొరకు నీ సన్మార్గం పై మాటు వేసి కూర్చుంటాను. నేను ఏ విధంగా నైతే వారి తండ్రి ఆదంనకు సాష్టాంగ పడటం నుండి భ్రష్టుడినయ్యానో అలా వారిని దాని నుండి మరలించుతాను,వారిని దాని నుండి భ్రష్టుల్ని చేస్తాను.
Tefsiret në gjuhën arabe:
ثُمَّ لَاٰتِیَنَّهُمْ مِّنْ بَیْنِ اَیْدِیْهِمْ وَمِنْ خَلْفِهِمْ وَعَنْ اَیْمَانِهِمْ وَعَنْ شَمَآىِٕلِهِمْ ؕ— وَلَا تَجِدُ اَكْثَرَهُمْ شٰكِرِیْنَ ۟
ఆ తరువాత సందేహాల్లో పడవేసి విస్మరణ ద్వారా,కోరికలను అందంగా అలంకరించటం ద్వారా నేను వారి వద్దకు అన్ని దిశల నుండి వస్తాను. వారికి అవిశ్వాసమును నిర్దేశించటం వలన ఓ నా ప్రభూ వారిలో చాలా మందిని కృతజ్ఞులుగా నీవు పొందవు.
Tefsiret në gjuhën arabe:
قَالَ اخْرُجْ مِنْهَا مَذْءُوْمًا مَّدْحُوْرًا ؕ— لَمَنْ تَبِعَكَ مِنْهُمْ لَاَمْلَـَٔنَّ جَهَنَّمَ مِنْكُمْ اَجْمَعِیْنَ ۟
అల్లాహ్ అతనితో ఇలా ఆదేశించాడు : ఓ ఇబ్లీసు నీవు అల్లాహ్ కారుణ్యం నుండి తుచ్ఛుడవై,బహిష్కరించబడిన వాడై స్వర్గం నుండి వెళ్లిపో. నేను తప్పకుండా ప్రళయ దినాన నరకమును నీతో మరియు నిన్ను అనుసరించి నీపై విధేయత చూపి తన ప్రభువు ఆదేశంను దిక్కరించిన ప్రతీ ఒక్కరితో నరకమును నింపి వేస్తాను.
Tefsiret në gjuhën arabe:
وَیٰۤاٰدَمُ اسْكُنْ اَنْتَ وَزَوْجُكَ الْجَنَّةَ فَكُلَا مِنْ حَیْثُ شِئْتُمَا وَلَا تَقْرَبَا هٰذِهِ الشَّجَرَةَ فَتَكُوْنَا مِنَ الظّٰلِمِیْنَ ۟
మరియు అల్లాహ్ ఆదం తో ఇలా ఆదేశించాడు : ఓ ఆదం నువ్వు నీ భార్య హవ్వా స్వర్గంలో ఉండండి. మీరిద్దరు అందులో ఉన్న పరిశుధ్ధమైన వాటిలోంచి మీరు కోరిన వాటిని తినండి. మరియు మీరిద్దరు ఈ వృక్షము ఫలాల్లోంచి తినకండి (అల్లాహ్ ఒక వృక్షమును వారిద్దరికి నిర్దేశించాడు). ఒక వేళ మీరిద్దరు నా వారింపు తరువాత దాని నుండి తింటే నిశ్చయంగా మీరిద్దరు అల్లాహ్ హద్దులను దాటిన వారవుతారు.
Tefsiret në gjuhën arabe:
فَوَسْوَسَ لَهُمَا الشَّیْطٰنُ لِیُبْدِیَ لَهُمَا مَا وٗرِیَ عَنْهُمَا مِنْ سَوْاٰتِهِمَا وَقَالَ مَا نَهٰىكُمَا رَبُّكُمَا عَنْ هٰذِهِ الشَّجَرَةِ اِلَّاۤ اَنْ تَكُوْنَا مَلَكَیْنِ اَوْ تَكُوْنَا مِنَ الْخٰلِدِیْنَ ۟
అయితే ఇబ్లీసు వారిద్దరి మర్మావయవాలు ఏవైతే కప్పి ఉన్నవో వాటిని భహిర్గతం చేయటం కొరకు వారిద్దరి మనస్సులో నెమ్మదిగా ఒక మాట వేశాడు. వారితో ఇలా అన్నాడు : మీరిద్దరు దైవ దూతలుగా అయిపోవటం ఇష్టం లేక,మీరిద్దరు స్వర్గంలో శాస్వతంగా ఉండి పోవటం ఇష్టం లేక అల్లాహ్ మీరిద్దరిని ఆ వృక్షం నుండి తినటం గురించి వారించాడు.
Tefsiret në gjuhën arabe:
وَقَاسَمَهُمَاۤ اِنِّیْ لَكُمَا لَمِنَ النّٰصِحِیْنَ ۟ۙ
(షైతాను) వారిద్దరి ముందు అల్లాహ్ పై (ఇలా) ప్రమాణం చేశాడు : ఓ ఆదం,హవ్వా నిశ్ఛయంగా నేను మీరిద్దరికి సలహా ఇవ్వటంలో శ్రేయోభిలాషిని.
Tefsiret në gjuhën arabe:
فَدَلّٰىهُمَا بِغُرُوْرٍ ۚ— فَلَمَّا ذَاقَا الشَّجَرَةَ بَدَتْ لَهُمَا سَوْاٰتُهُمَا وَطَفِقَا یَخْصِفٰنِ عَلَیْهِمَا مِنْ وَّرَقِ الْجَنَّةِ ؕ— وَنَادٰىهُمَا رَبُّهُمَاۤ اَلَمْ اَنْهَكُمَا عَنْ تِلْكُمَا الشَّجَرَةِ وَاَقُلْ لَّكُمَاۤ اِنَّ الشَّیْطٰنَ لَكُمَا عَدُوٌّ مُّبِیْنٌ ۟
అయితే అతడు (షైతాను) వారిద్దరిని వారు ఉన్న స్థానం నుండి మోసగించి దించి వేశాడు. ఎప్పుడైతే వారిద్దరు తాము వారించబడిన వృక్షము నుండి తిన్నారో వారిద్దరి మర్మావయవాలు ఒండొకరి ముందు బహిర్గతం అయిపోయాయి. వారిద్దరు తమ మర్మావయవాలను కప్పుకోవటం కొరకు స్వర్గం యొక్క ఆకులను తమ పై కప్పుకో సాగారు. వారి ప్రభువు వారిద్దరిని పిలుస్తూ ఇలా అన్నాడు : నేను మిమ్మల్ని ఈ వృక్షమునుండి తినటం గురించి వారించలేదా?. నిశ్చయంగా షైతాను మీ శతృవని,అతని శతృత్వం బహిర్గతం అవుతుందని,అతని నుండి జాగ్రత్తగా ఉండమని మీకు నేను చెప్పలేదా?.
Tefsiret në gjuhën arabe:
Dobitë e ajeteve të kësaj faqeje:
• دلّت الآيات على أن من عصى مولاه فهو ذليل.
దైవానికి అవిధేయత చూపేవాడు అవమానానికి గురి అవుతాడని ఆయతులు తెలుపుతున్నవి.

• أعلن الشيطان عداوته لبني آدم، وتوعد أن يصدهم عن الصراط المستقيم بكل أنواع الوسائل والأساليب.
ఆదమ్ సంతతి కొరకు షైతాను తన శతృత్వమును ప్రకటించాడు. మరియు వారిని అన్ని రకాల పద్దతుల ద్వార,కారకాల ద్వారా సన్మార్గం నుండి ఆపుతాడని బెదిరించాడు.

• خطورة المعصية وأنها سبب لعقوبات الله الدنيوية والأخروية.
అవిధేయత ఆధిక్యత అల్లాహ్ యొక్క ఇహ,పరలోక శిక్షలకు కారణమవుతుంది.

 
Përkthimi i kuptimeve Surja: El A’raf
Përmbajtja e sureve Numri i faqes
 
Përkthimi i kuptimeve të Kuranit Fisnik - El Muhtesar fi tefsir el Kuran el Kerim - Përkthimi teluguisht - Përmbajtja e përkthimeve

Botuar nga Qendra e Tefsirit për Studime Kuranore.

Mbyll