Check out the new design

Përkthimi i kuptimeve të Kuranit Fisnik - El Muhtesar fi tefsir el Kuran el Kerim - Përkthimi teluguisht * - Përmbajtja e përkthimeve


Përkthimi i kuptimeve Surja: El Enfal   Ajeti:
ذٰلِكَ بِاَنَّ اللّٰهَ لَمْ یَكُ مُغَیِّرًا نِّعْمَةً اَنْعَمَهَا عَلٰی قَوْمٍ حَتّٰی یُغَیِّرُوْا مَا بِاَنْفُسِهِمْ ۙ— وَاَنَّ اللّٰهَ سَمِیْعٌ عَلِیْمٌ ۟ۙ
ఈ కఠినమైన శిక్షకు కారణం అల్లాహ్ ఏదైన జాతి వారిపై తన వద్ద నుండి ఏదైన అనుగ్రహమును కలిగించి ఉంటే అనుగ్రహాల పట్ల కృతజ్ఞత,స్థిరత్వము,విశ్వాసము లాంటి వారి మంచి స్థితి నుండి అల్లాహ్ పట్ల అవిశ్వాసము,ఆయనపట్ల అవిధేయత,ఆయన అనుగ్రహాలపట్ల తిరస్కారము లాంటి చెడ్డ స్థితికి తమ స్వయాన్ని మార్చుకోనంతవరకు దానిని (అనుగ్రహమును) వారి నుండి ఉపసంహరించుకోడు మరియు అల్లాహ్ తన దాసుల మాటలను వినేవాడు.వారి కర్మలను తెలుసుకునేవాడు.వాటిలోంచి ఏది కూడా ఆయన పై గోప్యంగా ఉండదు.
Tefsiret në gjuhën arabe:
كَدَاْبِ اٰلِ فِرْعَوْنَ ۙ— وَالَّذِیْنَ مِنْ قَبْلِهِمْ ؕ— كَذَّبُوْا بِاٰیٰتِ رَبِّهِمْ فَاَهْلَكْنٰهُمْ بِذُنُوْبِهِمْ وَاَغْرَقْنَاۤ اٰلَ فِرْعَوْنَ ۚ— وَكُلٌّ كَانُوْا ظٰلِمِیْنَ ۟
ఈ అవిశ్వాసపరులందరి పరిస్ధితి అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కలిగిన ఇతరులైన ఫిర్ఔన్ వంశీయులు,వారికన్న ముందు తిరస్కరించిన జాతుల మాదిరిగా ఉన్నది.వారు తమ ప్రభువు సూచనలను (ఆయతులను) తిరస్కరించారు.అయితే అల్లాహ్ వారిని వారు చేసిన పాపముల వలన హతమార్చాడు.అల్లాహ్ ఫిర్ఔన్ వంశీయులను సముద్రంలో ముంచి హతమార్చాడు.ఫిర్ఔన్ వంశీయుల్లో నుండి,వారి కన్న ముందు జాతుల వారిలోంచి ప్రతి ఒక్కరు అల్లాహ్ పట్ల తమ అవిశ్వాసము,ఆయనతోపాటు సాటి కల్పించటం వలన దుర్మార్గమునకు పాల్పడేవారు.వాటి మూలంగానే వారు ఆయన సుబహానహు వ తఆలా శిక్షను అనివార్యం చేసుకున్నారు.వారిపై ఆయన దాన్ని కురిపించాడు.
Tefsiret në gjuhën arabe:
اِنَّ شَرَّ الدَّوَآبِّ عِنْدَ اللّٰهِ الَّذِیْنَ كَفَرُوْا فَهُمْ لَا یُؤْمِنُوْنَ ۟ۖۚ
నిశ్చయంగా అల్లాహ్ పట్ల,ఆయన ప్రవక్త పట్ల అవిశ్వాసమును కనబరిచేవారు నేలపై ప్రాకే ప్రాణుల్లోంచి అత్యంత చెడ్డవైనవారు.వారిలో నుండి మార్గదర్శకత్వ కారకాలైన బుద్ది,వినికిడి,విజయము వృధా అయిపోయినవి.
Tefsiret në gjuhën arabe:
اَلَّذِیْنَ عٰهَدْتَّ مِنْهُمْ ثُمَّ یَنْقُضُوْنَ عَهْدَهُمْ فِیْ كُلِّ مَرَّةٍ وَّهُمْ لَا یَتَّقُوْنَ ۟
మీరు ఒప్పొందాలు,ఒడంబడికలు ఎవరితోనైతే చేసుకున్నారో బనూ ఖురైజా లాంటి వారు .ఆ పిదప మీరు వారితో చేసుకున్న ఒడంబడికలను వారు ప్రతీసారి భంగపరిచారు.వారు అల్లాహ్ తో భయపడేవారు కాదు.తమ వాగ్ధానాలను పూర్తి చేసేవారు కాదు.వారితో తీసుకోబడిన ఒప్పందాలకు వారు కట్టుబడి ఉండేవారు కాదు.
Tefsiret në gjuhën arabe:
فَاِمَّا تَثْقَفَنَّهُمْ فِی الْحَرْبِ فَشَرِّدْ بِهِمْ مَّنْ خَلْفَهُمْ لَعَلَّهُمْ یَذَّكَّرُوْنَ ۟
ఓ ప్రవక్తా ఒకవేళ మీరు తమ ఒప్పందాలను భంగపరిచే వీరందరితో యుద్ధంలో ఎదురుపడితే వారిని కఠినంగా వారి వెనుక ఉన్న ఇతరులు దాన్ని వినే విధంగా శిక్షించండి.బహుశా వారు వారి పరిస్థితి వలన గుణపాఠం నేర్చుకుని మీతో యుద్ధం చేయటం నుండి,మీకు వ్యతిరేకంగా మీ శతృవులకు సహాయం చేయటం నుండి భయపడవచ్చు.
Tefsiret në gjuhën arabe:
وَاِمَّا تَخَافَنَّ مِنْ قَوْمٍ خِیَانَةً فَانْۢبِذْ اِلَیْهِمْ عَلٰی سَوَآءٍ ؕ— اِنَّ اللّٰهَ لَا یُحِبُّ الْخَآىِٕنِیْنَ ۟۠
ఓ ప్రవక్తా మీతో ఒప్పందం కుదుర్చుకున్న జాతి వారితో ఏదైన ద్రోహం,ఒప్పందమును భంగం చేయటం గురించి ఏదైన సూచన మీ ముందు బహిర్గతమై మీకు వారితో భయం ఉంటే వారి ఒప్పందమును విసిరేయటం గురించి వారు దాన్ని తెలుసుకునే విషయంలో మీతో సమానమయ్యే వరకు వారికి తెలియపరచండి.వారికి తెలియపరచక ముందే వారిపై మీరు అకస్మాత్తుగా దాడీ చేయకండి.వారికి తెలియపరచకముందు వారిపై అకస్మిక దాడి ద్రోహమవుతుంది.మరియు అల్లాహ్ ద్రోహానికి పాల్పడే వారిని ఇష్టపడడు.అంతేకాదు వారిని ద్వేషిస్తాడు.అయితే మీరు ద్రోహానికి పాల్పడటం నుండి జాగ్రత్తపడండి.
Tefsiret në gjuhën arabe:
وَلَا یَحْسَبَنَّ الَّذِیْنَ كَفَرُوْا سَبَقُوْا ؕ— اِنَّهُمْ لَا یُعْجِزُوْنَ ۟
మరియు అవిశ్వాసపరులు తాము అల్లాహ్ శిక్ష నుండి తప్పించుకున్నామని,దాని నుండి దూరమైపోయామని భావించకూడదు.నిశ్చయంగా వారు దాని నుండి తప్పిxచుకోలేరు.అతని శిక్ష నుండి వారు దూరం కాలేరు.కాని అది వారికి చేరుతుంది.వారికి అంటుకుంటుంది.
Tefsiret në gjuhën arabe:
وَاَعِدُّوْا لَهُمْ مَّا اسْتَطَعْتُمْ مِّنْ قُوَّةٍ وَّمِنْ رِّبَاطِ الْخَیْلِ تُرْهِبُوْنَ بِهٖ عَدُوَّ اللّٰهِ وَعَدُوَّكُمْ وَاٰخَرِیْنَ مِنْ دُوْنِهِمْ ۚ— لَا تَعْلَمُوْنَهُمْ ۚ— اَللّٰهُ یَعْلَمُهُمْ ؕ— وَمَا تُنْفِقُوْا مِنْ شَیْءٍ فِیْ سَبِیْلِ اللّٰهِ یُوَفَّ اِلَیْكُمْ وَاَنْتُمْ لَا تُظْلَمُوْنَ ۟
ఓ విశ్వాసపరులారా మీ శక్తిమేరకు సంఖ్యాబలమును ,యుద్ధసామగ్రిని విల్లు విసరటం లాంటి వాటిని సిద్ధం చేసుకోండి.మరియు వారితో యుద్ధం కొరకు అల్లాహ్ మార్గంలో మీరు కట్టి ఉంచిన గుర్రములను సిద్ధం చేసుకోండి.వాటి ద్వారా మీరు అల్లాహ్ శతృవులను,మీ శతృవులైన అవిశ్వాసపరులు ఎవరైతే మీ కొరకు పలు ప్రాంతాల్లో మాటు వేసి కూర్చున్నారో వారిని భయపెట్టండి.మరియు దాని ద్వారా మీరు వేరే జాతిని బయపెట్టండి.మీరు వారిని,వారు మీ గురించి దాచిపెట్టిన శతృత్వమును కనిపెట్టలేరు.కాని అల్లాహ్ ఒక్కడే వారిని,వారి మనస్సుల్లో దాచి ఉంచిన దాన్ని కనిపెట్టుకుని ఉంటాడు.మరియు మీరు ఏదైతే ధనాన్ని ఎక్కువ కాని తక్కువ కాని ఖర్చు చేస్తారో (దైవ మార్గంలో) దాన్ని అల్లాహ్ ఇహలోకంలోనే రెట్టింపు చేసి మీకు ప్రసాధిస్తాడు.మరియు దాని పూర్తి ప్రతిఫలాన్ని తక్కువ చేయకుండా మీకు పరలోకంలో ప్రసాధిస్తాడు.అయితే మీరు ఆయన మార్గంలో ఖర్చు చేయటానికి త్వరపడండి.
Tefsiret në gjuhën arabe:
وَاِنْ جَنَحُوْا لِلسَّلْمِ فَاجْنَحْ لَهَا وَتَوَكَّلْ عَلَی اللّٰهِ ؕ— اِنَّهٗ هُوَ السَّمِیْعُ الْعَلِیْمُ ۟
ఒకవేళ వారు ఓ ప్రవక్తా నీతో యుద్ధం చేయటమును వదిలి ఒప్పందం వైపునకు మొగ్గితే నీవు కూడా దాని వైపునకు మగ్గు.మరియు వారితో ఒప్పందం కుదుర్చుకో,అల్లాహ్ పై నమ్మకమును కలిగి ఉండు,ఆయనపైనే ఆధారపడు.ఆయన నిన్ను పరాభవమునకు గురిచేయడంటే చేయడు.నిశ్చయంగా ఆయన వారి మాటలను వినేవాడును,వారి ఉద్దేశాలను,వారి కర్మలను తెలుసుకునేవాడును.
Tefsiret në gjuhën arabe:
Dobitë e ajeteve të kësaj faqeje:
• من فوائد العقوبات والحدود المرتبة على المعاصي أنها سبب لازدجار من لم يعمل المعاصي، كما أنها زجر لمن عملها ألا يعاودها.
పాపాలపై విధించబడిన శిక్షలు,ఆంక్షల ప్రయోజనాల్లోంచి అది పాపములను చేయని వారిని హెచ్చరించటం కొరకు.ఏ విధంగా నంటే పాపమును చేసిన వారికి దాన్ని పునరావృత్తం చేయకుండా ఉండటానికి హెచ్చరిక.

• من أخلاق المؤمنين الوفاء بالعهد مع المعاهدين، إلا إن وُجِدت منهم الخيانة المحققة.
ఒప్పందం చేసుకున్న వారి ఒప్పందమును ఒక వేళ వారితో నిరూపించబడిన ద్రోహం జరగకుండా ఉంటే పూర్తి చేయటం విశ్వాసపరుల నైతికత.

• يجب على المسلمين الاستعداد بكل ما يحقق الإرهاب للعدو من أصناف الأسلحة والرأي والسياسة.
శతృవులను భయపెట్టటం కొరకు కావలసిన ఆయుధాల రకాల్లోంచి,సలహాల్లోంచి ప్రతీది సిద్ధం చేసుకోవటం ముస్లిములపై తప్పనిసరి.

• جواز السلم مع العدو إذا كان فيه مصلحة للمسلمين.
ముస్లిముల ప్రయోజనార్థం ఉంటే శతృవులతో సంధి చేసుకోవటం ధర్మసమ్మతమే.

 
Përkthimi i kuptimeve Surja: El Enfal
Përmbajtja e sureve Numri i faqes
 
Përkthimi i kuptimeve të Kuranit Fisnik - El Muhtesar fi tefsir el Kuran el Kerim - Përkthimi teluguisht - Përmbajtja e përkthimeve

Botuar nga Qendra e Tefsirit për Studime Kuranore.

Mbyll