Check out the new design

Përkthimi i kuptimeve të Kuranit Fisnik - Përkthimi në gjuhën telugu - Abdurrahim ibn Muhamed * - Përmbajtja e përkthimeve

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

Përkthimi i kuptimeve Surja: En Nahl   Ajeti:
اَلَّذِیْنَ كَفَرُوْا وَصَدُّوْا عَنْ سَبِیْلِ اللّٰهِ زِدْنٰهُمْ عَذَابًا فَوْقَ الْعَذَابِ بِمَا كَانُوْا یُفْسِدُوْنَ ۟
ఎవరైతే సత్యాన్ని తిరస్కరించి (ప్రజలను) అల్లాహ్ మార్గం నుండి నిరోధించారో వారికి, మేము వారు చేస్తూ ఉండిన దౌర్జన్యాలకు శిక్ష మీద శిక్ష విధిస్తాము.[1]
[1] తాము స్వయంగా మార్గభ్రష్టులైనదే కాక ఇతరులను, అల్లాహ్ (సు.తా.) మార్గం నుండి ఆపేవారికి రెట్టింపు శిక్ష విధించబడుతుంది.
Tefsiret në gjuhën arabe:
وَیَوْمَ نَبْعَثُ فِیْ كُلِّ اُمَّةٍ شَهِیْدًا عَلَیْهِمْ مِّنْ اَنْفُسِهِمْ وَجِئْنَا بِكَ شَهِیْدًا عَلٰی هٰۤؤُلَآءِ ؕ— وَنَزَّلْنَا عَلَیْكَ الْكِتٰبَ تِبْیَانًا لِّكُلِّ شَیْءٍ وَّهُدًی وَّرَحْمَةً وَّبُشْرٰی لِلْمُسْلِمِیْنَ ۟۠
మరియు (జ్ఞాపకముంచుకోండి) ఆ రోజు మేము ప్రతి సమాజంలో నుండి వారికి వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చే వానిని (ప్రవక్తను) లేపి నిలబెడ్తాము. మరియు (ఓ ప్రవక్తా!) మేము నిన్ను వీరికి వ్యతిరేకంగా సాక్ష్యమివ్వటానికి తీసుకువస్తాము.[1] ప్రతి విషయాన్ని స్పష్టపరచటానికి నీపై ఈ దివ్యగ్రంథాన్ని అవతరింపజేశాము. మరియు ఇందులో అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అయిన వారికి మార్గదర్శకత్వం, కారుణ్యం మరియు శుభవార్తలూ ఉన్నాయి.
[1] ప్రతి ప్రవక్త తన జాతివారిలో సత్యాన్ని తిరస్కరించిన వారికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాడు. మరియు ము'హమ్మద్ ('స'అస) మరియు అతని అనుచరులు (ర'ది.'అన్హుమ్) ప్రవక్త ('అలైహిమ్ స.) ల విషయంలో వారు సత్యవాదులు మరియు వారు అల్లాహ్ (సు.తా.) సందేశాన్ని ప్రచారం చేశారని సాక్ష్యమిస్తారు. ('స.బు'ఖారీ, తఫ్సీర్ సూరహ్ అన్-నిసా').
Tefsiret në gjuhën arabe:
اِنَّ اللّٰهَ یَاْمُرُ بِالْعَدْلِ وَالْاِحْسَانِ وَاِیْتَآئِ ذِی الْقُرْبٰی وَیَنْهٰی عَنِ الْفَحْشَآءِ وَالْمُنْكَرِ وَالْبَغْیِ ۚ— یَعِظُكُمْ لَعَلَّكُمْ تَذَكَّرُوْنَ ۟
నిశ్చయంగా, అల్లాహ్ న్యాయం చేయమని మరియు (ఇతరులకు) మేలు చేయమని మరియు దగ్గరి బంధువులకు సహాయం చేయమని మరియు అశ్లీలత, అధర్మం మరియు దౌర్జన్యాలకు దూరంగా ఉండమని ఆజ్ఞాపిస్తున్నాడు.[1] ఆయన ఈ విధంగా మీకు బోధిస్తున్నాడు, బహుశా మీరు హితబోధ గ్రహిస్తారని.
[1] అల్-'అద్లు: తన వారితోనే కాక ఇతరులతో కూడా న్యాయం చేయటం. ఎవరితోనైనా ఉన్న ప్రేమ లేక శత్రుత్వం, న్యాయానికి అడ్డు రాకూడదు. మరొక అర్థం న్యాయంలో హెచ్చు తగ్గులు చేయగూడదు. ధర్మవిషయంలో కూడా ఏ విధమైన అన్యాయం జరుగకూడదు. అల్-ఎ'హ్సాను: అంటే, ఒకటి: మంచినడవడిక మరియు క్షమాగుణం. రెండోది: న్యాయంగా ఇవ్వవలసిన దాని కంటే ఎక్కువ ఇవ్వటం. ఉదా: నూరు రూపాయలు కూలి మాట్లాడుకున్న వానికి పని ముగిసిన తరువాత 110 రూపాయలు ఇవ్వటం. మూడవది: ఏ పని చేసినా కర్తవ్యంగా హృదయపూర్వకంగా చేయటం మరియు ఏకాగ్రచిత్తంతో అల్లాహ్ (సు.తా.)ను ఆరాధించటం (అన్ త'అబుదుల్లాహ్ క అన్నక తరాహు). అల్-ఫ'హ్ షా ఉ': అశ్లీలత, చెడు నడత, అసభ్యకరమైన పని, సిగ్గుమాలిన నడవడిక. ఈ కాలంలో ఫ్యాషన్ పేరు మీద జరిగేవి. స్త్రీపురుషులు సిగ్గు విడిచి, కలసి మెలసి తిరుగటం, డాన్సులు చేయటం, మొదలైనవి. అల్-మున్కరు: షరీయత్ నిషేధించిన పని. అల్-బ'గీ: ఆందోళన, అక్రమము, దౌర్జన్యం.
Tefsiret në gjuhën arabe:
وَاَوْفُوْا بِعَهْدِ اللّٰهِ اِذَا عٰهَدْتُّمْ وَلَا تَنْقُضُوا الْاَیْمَانَ بَعْدَ تَوْكِیْدِهَا وَقَدْ جَعَلْتُمُ اللّٰهَ عَلَیْكُمْ كَفِیْلًا ؕ— اِنَّ اللّٰهَ یَعْلَمُ مَا تَفْعَلُوْنَ ۟
మరియు మీరు అల్లాహ్ పేరుతో వాగ్దానం చేస్తే మీ వాగ్దానాలను తప్పక నెరవేర్చండి. మరియు మీరు ప్రమాణాలను దృఢపరచిన తర్వాత భంగపరచకండి.[1] (ఎందుకంటే) వాస్తవానికి, మీరు అల్లాహ్ ను మీకు జామీనుదారుగా[2] చేసుకున్నారు. నిశ్చయంగా మీరు చేసేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు.
[1] దృఢంగా చేసిన ప్రమాణాలు. ఆలోచించకుండా చేసిన ప్రమాణాలకు చూడండి, 2:225. 'ఒక వ్యక్తి ప్రమాణం చేసిన తరువాత తాను చేసిన ప్రమాణం తప్పు అని తెలుసుకుంటే, తన ప్రమాణాన్ని తెంపి పరిహారం (కఫ్ఫార) ఇవ్వాలి.' ('స. ముస్లిం. నం. 1272). [2] కఫీలున్: అంటే జామీనుదారు, లేక హామీ ఇచ్చేవాడు అని అర్థం.
Tefsiret në gjuhën arabe:
وَلَا تَكُوْنُوْا كَالَّتِیْ نَقَضَتْ غَزْلَهَا مِنْ بَعْدِ قُوَّةٍ اَنْكَاثًا ؕ— تَتَّخِذُوْنَ اَیْمَانَكُمْ دَخَلًا بَیْنَكُمْ اَنْ تَكُوْنَ اُمَّةٌ هِیَ اَرْبٰی مِنْ اُمَّةٍ ؕ— اِنَّمَا یَبْلُوْكُمُ اللّٰهُ بِهٖ ؕ— وَلَیُبَیِّنَنَّ لَكُمْ یَوْمَ الْقِیٰمَةِ مَا كُنْتُمْ فِیْهِ تَخْتَلِفُوْنَ ۟
మరియు మీరు ఆ స్త్రీవలే కాకండి, ఏ స్త్రీ అయితే స్వయంగా కష్టపడి నూలు వడికి గట్టి దారాన్ని చేసిన తరువాత దాన్ని ముక్కులు ముక్కులుగా త్రెంచి వేసిందో! ఒక వర్గం వారు మరొక వర్గం వారి కంటే అధికంగా ఉన్నారని, పరస్పరం మోసగించుకోవటానికి, మీ ప్రమాణాలను ఉపయోగించుకోకండి. నిశ్చయంగా అల్లాహ్ మిమ్మల్ని వీటి (ఈ ప్రమాణాల) ద్వారా పరీక్షిస్తున్నాడు. మరియు నిశ్చయంగా, పునరుత్థాన దినమున ఆయన మీకు, మీరు వాదులాడే విషయాలను గురించి స్పష్టంగా తెలియజేస్తాడు.
Tefsiret në gjuhën arabe:
وَلَوْ شَآءَ اللّٰهُ لَجَعَلَكُمْ اُمَّةً وَّاحِدَةً وَّلٰكِنْ یُّضِلُّ مَنْ یَّشَآءُ وَیَهْدِیْ مَنْ یَّشَآءُ ؕ— وَلَتُسْـَٔلُنَّ عَمَّا كُنْتُمْ تَعْمَلُوْنَ ۟
ఒకవేళ అల్లాహ్ కోరితే మిమ్మల్ని అందరినీ ఒకే సమాజంగా చేసి ఉండేవాడు. కాని ఆయన తాను కోరిన వారిని మార్గభ్రష్టత్వానికి గురి చేస్తాడు. మరియు తాను కోరిన వారికి సన్మార్గం చూపుతాడు.[1] మరియు నిశ్చయంగా, మీరు చేస్తున్న కర్మలను గురించి మీరు తప్పక ప్రశ్నించబడతారు.
[1] చూడండి, 14:4 మరియు 2:26-27. అల్లాహుతా'ఆలాకు ప్రతివాని భవిష్యత్తు తెలుసు. కాబట్టి ఎవడైతే సన్మార్గానికి రాడని ఆయనకు తెలుసో అలాంటి వాడిని, మార్గభ్రష్టత్వంలో వదలి పెడతాడే కానీ, ఎవ్వడిని కూడా బలవంతంగా తప్పు దారిలో వేయడని దీని అర్థం.
Tefsiret në gjuhën arabe:
 
Përkthimi i kuptimeve Surja: En Nahl
Përmbajtja e sureve Numri i faqes
 
Përkthimi i kuptimeve të Kuranit Fisnik - Përkthimi në gjuhën telugu - Abdurrahim ibn Muhamed - Përmbajtja e përkthimeve

Përktheu Abdurrahim ibn Muhamed.

Mbyll