அல்குர்ஆன் மொழிபெயர்ப்பு - தெலுங்கு மொழிபெயர்ப்பு - அப்துர் ரஹீம் பின் முஹம்மத் * - மொழிபெயர்ப்பு அட்டவணை

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

மொழிபெயர்ப்பு வசனம்: (136) அத்தியாயம்: ஸூரா அந்நிஸா
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اٰمِنُوْا بِاللّٰهِ وَرَسُوْلِهٖ وَالْكِتٰبِ الَّذِیْ نَزَّلَ عَلٰی رَسُوْلِهٖ وَالْكِتٰبِ الَّذِیْۤ اَنْزَلَ مِنْ قَبْلُ ؕ— وَمَنْ یَّكْفُرْ بِاللّٰهِ وَمَلٰٓىِٕكَتِهٖ وَكُتُبِهٖ وَرُسُلِهٖ وَالْیَوْمِ الْاٰخِرِ فَقَدْ ضَلَّ ضَلٰلًا بَعِیْدًا ۟
ఓ విశ్వాసులారా! అల్లాహ్ ను, ఆయన సందేశహరుణ్ణి, ఆయన తన సందేశహరునిపై (ముహమ్మద్ పై) అవతరింపజేసిన గ్రంథాన్ని మరియు ఆయన ఇంతకు పూర్వం అవతరింపజేసిన గ్రంథాలన్నింటినీ విశ్వసించండి.[1] అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంతాలను, ఆయన ప్రవక్తలను, అంతిమ దినాన్ని తిరస్కరించినవాడు, వాస్తవానికి మార్గభ్రష్టుడై, మార్గభ్రష్టత్వంలో చాలా దూరం పోయినట్లే!
[1] ఇంతకు పూర్వం అవతరింపజేయబడిన దివ్యగ్రంథాలను విశ్వసించడం అంటే, అల్లాహ్ (సు.తా.) తరఫు నుండి అవతరింపజేయబడిన, తౌరాత్ మరియు ఇంజీల్ మొదలైన దివ్య గ్రంథాలలో మిగిలి ఉన్న సత్యాలను అన్నమాట. అంటే అల్లాహుతా'ఆలా తరఫు నుండి అవతరింపజేయబడి ఉన్న విషయాలను విశ్వసించడం. ఈ రోజు కేవలం ఈ దివ్యఖుర్ఆన్ తప్ప ఏ ఇతర దివ్యగ్రంతం కూడా అవతరింపజేయబడిన నిజరూలంలో లేదు. ఎందుకంటే ఆ మతపు ధర్మవేత్తలు కాలక్రమేణా వాటిలో ఎన్నో హెచ్చుతగ్గులు చేస్తూ వచ్చారు. ఉదారహణకు ఇప్పుడు వాడుకలో నున్న బైబిల్ లో ఎన్నో సార్లు మార్పులు చేశారు. ఇప్పుడు వాడుకలో ఉన్న ఆధునిక బైబిల్ లో చివరి మార్పు 1977 క్రీ.శకంలో చేశారు. ఇది (Revised) Authorized KJV అనబడుతుంది. ఇక్కడ సంబోధన, ఇప్పుడు వాడుకలో ఉన్న ఆ దివ్యగ్రంథాలలో ఉన్న సత్యాలను మాత్రమే సూచిస్తునంది. చూడండి, 3:3
அரபு விரிவுரைகள்:
 
மொழிபெயர்ப்பு வசனம்: (136) அத்தியாயம்: ஸூரா அந்நிஸா
அத்தியாயங்களின் அட்டவணை பக்க எண்
 
அல்குர்ஆன் மொழிபெயர்ப்பு - தெலுங்கு மொழிபெயர்ப்பு - அப்துர் ரஹீம் பின் முஹம்மத் - மொழிபெயர்ப்பு அட்டவணை

புனித அல் குர்ஆனுக்கான தெலுங்கு மொழிபெயர்ப்பு- அப்துர்ரஹீம் இப்னு முஹம்மது மூலம் மொழிபெயர்க்கப்பட்டது

மூடுக