Check out the new design

పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - తెలుగు అనువాదం - అల్ ఖుర్ఆన్ అల్ కరీమ్ సంక్షిప్త వ్యాఖ్యానం * - అనువాదాల విషయసూచిక


భావార్ధాల అనువాదం సూరహ్: అల్-బఖరహ్   వచనం:
لَیْسَ الْبِرَّ اَنْ تُوَلُّوْا وُجُوْهَكُمْ قِبَلَ الْمَشْرِقِ وَالْمَغْرِبِ وَلٰكِنَّ الْبِرَّ مَنْ اٰمَنَ بِاللّٰهِ وَالْیَوْمِ الْاٰخِرِ وَالْمَلٰٓىِٕكَةِ وَالْكِتٰبِ وَالنَّبِیّٖنَ ۚ— وَاٰتَی الْمَالَ عَلٰی حُبِّهٖ ذَوِی الْقُرْبٰی وَالْیَتٰمٰی وَالْمَسٰكِیْنَ وَابْنَ السَّبِیْلِ ۙ— وَالسَّآىِٕلِیْنَ وَفِی الرِّقَابِ ۚ— وَاَقَامَ الصَّلٰوةَ وَاٰتَی الزَّكٰوةَ ۚ— وَالْمُوْفُوْنَ بِعَهْدِهِمْ اِذَا عٰهَدُوْا ۚ— وَالصّٰبِرِیْنَ فِی الْبَاْسَآءِ وَالضَّرَّآءِ وَحِیْنَ الْبَاْسِ ؕ— اُولٰٓىِٕكَ الَّذِیْنَ صَدَقُوْا ؕ— وَاُولٰٓىِٕكَ هُمُ الْمُتَّقُوْنَ ۟
అల్లాహ్ వద్ద స్వీకృతమయ్యే సత్కార్యం తూర్పు,పడమరల వైపు ముఖము త్రిప్పుకోవటం,వాటికి వ్యతిరేక దిశలో మారటం కాదు,కాని ఒకే అల్లాహ్ పై విశ్వాసం చూపిన,ప్రళయ దినం పై విశ్వాసం చూపిన,దైవ దూతలందరి పై విశ్వాసం చూపిన,అవతరింపబడిన గ్రంధాల పై,ఎటువంటి వ్యత్యాసం లేకుండా దైవ ప్రవక్తలందరి పై విశ్వాసం చూపిన వ్యక్తిలోని ప్రతి సత్కార్యం సత్కార్యం అవుతుంది,ధనం యొక్క ఇష్టత,దాని పై అత్యాశ ఉండి కూడా తన దగ్గరి బంధువుల పై,యుక్త వయస్సుకు చేరక ముందే తమ తల్లిదండ్రులను కోల్పోయిన వారి పై (అనాధలు),అగత్యపరుల పై,తన ఇంటి వారి నుంచి,తన ఊరు నుంచి దూరం అయిన ప్రయాణికుని పై,ప్రజలను అర్ధించడం తప్పనిసరి అయిన వారి పై ఖర్చు చేయటం,బానిసను బానిసత్వం నుండి,బంధి నుండి విముక్తి చేయటం కోసం ధనమును ఖర్చు చేయటం,అల్లాహ్ ఆదేశం మేరకు నమాజును సంపూర్ణంగా నెలకొల్పటం,విధిగావించబడిన జకాతును చెల్లించడం,ప్రమాణాలు చేసిన తరువాత తమ ప్రమాణాలు నెరవేర్చేవారు,పేదరికపు క్లిష్ట పరిస్థితుల్లో,అనారోగ్య పరిస్థితుల్లో,యద్ధం యొక్క కఠిన పరిస్థితుల్లో పారిపోకుండా సహనం చూపే వారు,ఈ గుణాలను కలిగిన వారందరు అల్లాహ్ పై తమ విశ్వాసం,తమ ఆచరణల ద్వారా సత్య విశ్వాసమును కనబరిచారు. వారందరే అల్లాహ్ ఆదేశాలను చేసి చూపించిన,వేటి నుంచైతే వారించాడో వాటి నుంచి దూరంగా ఉండిన దైవభీతి పరులు.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا كُتِبَ عَلَیْكُمُ الْقِصَاصُ فِی الْقَتْلٰی ؕ— اَلْحُرُّ بِالْحُرِّ وَالْعَبْدُ بِالْعَبْدِ وَالْاُ بِالْاُ ؕ— فَمَنْ عُفِیَ لَهٗ مِنْ اَخِیْهِ شَیْءٌ فَاتِّبَاعٌ بِالْمَعْرُوْفِ وَاَدَآءٌ اِلَیْهِ بِاِحْسَانٍ ؕ— ذٰلِكَ تَخْفِیْفٌ مِّنْ رَّبِّكُمْ وَرَحْمَةٌ ؕ— فَمَنِ اعْتَدٰی بَعْدَ ذٰلِكَ فَلَهٗ عَذَابٌ اَلِیْمٌ ۟ۚ
అల్లాహ్ ను విశ్వసించి ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ను అనుసరించేవారా ఉద్దేశపూర్వకంగా,ద్వేషంతో ఇతరులను హత్య చేసే వారి విషయంలో హంతకునికి అతని నేరము మాదిరిగా శిక్షించటం మీ పై విధిగావించబడినది.స్వతంతృనికి బదులుగా స్వతంతృడిని హత్య చేయాలి,బానిసకు బదులుగా బానిసను హత్య చేయాలి,స్తీకు బదులుగా స్తీని హత్య చేయాలి. ఒక వేళ హతుడు మరణం ముందు క్షమించివేస్తే లేదా హతుడి సంరక్షకుడు రక్తపరిహారం (రక్త ధనం) కొరకు క్షమించివేస్తే అది కూడా ఒక పరిమాణం ధనం నుంచి క్షమాభీక్ష కొరకు హంతకుడు తన తరుపు నుంచి చెల్లిస్తాడు,క్షమించేవాడు తప్పకుండా రక్తపరిహారం ను కోరటంలో చాటింపు వేయటానికి,బాధ పెట్టటానికి కాకుండా న్యాయసమ్మతంగా హంతకుడి మాట వినాలి,అలాగే హతుడు కూడా రక్త పరిహారంను తప్పించుకునే ఉద్దేశంతో కాకుండా,కాలయాపన లేకుండా ఉత్తమ రీతిలో చెల్లించాలి.ఈ క్షమాపణ,రక్తపరిహారం మీపై మీ ప్రభువు తరపు నుండి ఒక వెసులుబాటు,ఈ సమాజం పై ఒక కారుణ్యం. రక్తపరిహారం,క్షమాపణ తరువాత ఎవరైతే హంతకునిపై అతిక్రమిస్తే అతని పై అల్లాహ్ తరపునుంచి బాధాకరమైన శిక్ష ఉంటుంది.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَلَكُمْ فِی الْقِصَاصِ حَیٰوةٌ یّٰۤاُولِی الْاَلْبَابِ لَعَلَّكُمْ تَتَّقُوْنَ ۟
మరియు అల్లాహ్ మీ కొరకు మీ రక్తమును చిందించకుండా,మీ మధ్య ద్వేషాలు లేకుండా శాసనంగా నిర్దేశించిన ప్రతీకారంలోనే మీ కొరకు జీవనం ఉంది,అల్లాహ్ శాసనాలకు కట్టుబడి ఉండి,ఆయన ఆదేశాలను పాటించేవారైన అల్లాహ్ భయభీతి కల బుద్దిమంతులే దీనిని గ్రహించగలరు.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
كُتِبَ عَلَیْكُمْ اِذَا حَضَرَ اَحَدَكُمُ الْمَوْتُ اِنْ تَرَكَ خَیْرَا ۖۚ— ١لْوَصِیَّةُ لِلْوَالِدَیْنِ وَالْاَقْرَبِیْنَ بِالْمَعْرُوْفِ ۚ— حَقًّا عَلَی الْمُتَّقِیْنَ ۟ؕ
మీలో ఎవరికైన మరణ సూచనలు,దానికి కారకాలు సమీపించినప్పుడు ఒక వేళ మీవద్ద సంపద ఉంటే తల్లిదండ్రుల కొరకు,సమీప బంధువుల కొరకు ధర్మంలో నిర్దేశించబడిన శాసనం ప్రకారం సంపద నుంచి మూడో వంతు కన్న ఎక్కువ కాకుండా వీలునామ వ్రాయటం విధిగావించబడినది. అల్లాహ్ మన్నత కొరకు ఈ కార్యం చేయటం దైవ భీతి కలవారి పై తాకీదు చేయబడిన విద్యుక్త ధర్మం.ఈ ఆదేశం ఆస్తుల పంపకము ఆయతుల అవతరణ ముందుది,ఆస్తుల పంపకము ఆయతుల అవతరణ తరువాత మృతుని ఆస్తిలో ఎవరికి ఎంత భాగమున్నదో,ఎవరు ఎంత భాగమునకు వారసుడవుతాడో వివరించ బడినది.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
فَمَنْ بَدَّلَهٗ بَعْدَ مَا سَمِعَهٗ فَاِنَّمَاۤ اِثْمُهٗ عَلَی الَّذِیْنَ یُبَدِّلُوْنَهٗ ؕ— اِنَّ اللّٰهَ سَمِیْعٌ عَلِیْمٌ ۟ؕ
వీలునామాలో పెంచి లేదా తగ్గించి లేదా వీలునామా గురించి తెలిసిన తరువాత మార్చివేస్తే వీలునామా వ్రాసిన వారిపై ఎటువంటి దోషం లేదు,వీలునామాను మార్చిన వారిపైనే దోషం,నిశ్చయంగా అల్లాహ్ తన దాసుల మాటలను వినేవాడును,వారి కార్యాల గురించి జ్ఞానం కలవాడును వారి స్థితుల్లోంచి ఏవి కూడా అతనిని దాటి వెళ్ళవు.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
ఈ పేజీలోని వచనాల ద్వారా లభించే ప్రయోజనాలు:
• البِرُّ الذي يحبه الله يكون بتحقيق الإيمان والعمل الصالح، وأما التمسك بالمظاهر فقط فلا يكفي عنده تعالى.
అల్లాహ్ ఇష్టపడే పుణ్యకార్యం విశ్వాసం,సత్కార్యంతో కూడుకుని ఉంటుంది,కేవలం ఆచరణలను ప్రదర్శించటం ఒక్కటే అల్లాహ్ వద్ద సరిపోదు.

• من أعظم ما يحفظ الأنفس، ويمنع من التعدي والظلم؛ تطبيق مبدأ القصاص الذي شرعه الله في النفس وما دونها.
అతి గొప్పదైనది ఏదైతే ప్రాణమును సంరక్షిస్తుంది,అతిక్రమణ,అన్యాయమును నిరోదిస్తుంది అదేమిటంటే ప్రాణం విషయంలో,ఇతర విషయాల్లో అల్లాహ్ నిర్దేశించిన న్యాయ ప్రతీకారమును అమలు పరచటం.

• عِظَمُ شأن الوصية، ولا سيما لمن كان عنده شيء يُوصي به، وإثمُ من غيَّر في وصية الميت وبدَّل ما فيها.
వీలునామా గొప్పతనం ప్రత్యేకించి తన వద్ద ఉన్న వాటి గురించి వీలునామా వ్రాస్తే దాని గురించి గొప్పతనం,మృతుని వీలునామాను మార్చే వాడి పాపం.

 
భావార్ధాల అనువాదం సూరహ్: అల్-బఖరహ్
సూరాల విషయసూచిక పేజీ నెంబరు
 
పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - తెలుగు అనువాదం - అల్ ఖుర్ఆన్ అల్ కరీమ్ సంక్షిప్త వ్యాఖ్యానం - అనువాదాల విషయసూచిక

మర్కజ్ తఫ్సీర్ లిల్ దిరాసాత్ అల్ ఖురానియ్యహ్ ప్రచురణ.

మూసివేయటం