పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - అనువాదాల విషయసూచిక


భావార్ధాల అనువాదం వచనం: (34) సూరహ్: సూరహ్ లుఖ్మాన్
اِنَّ اللّٰهَ عِنْدَهٗ عِلْمُ السَّاعَةِ ۚ— وَیُنَزِّلُ الْغَیْثَ ۚ— وَیَعْلَمُ مَا فِی الْاَرْحَامِ ؕ— وَمَا تَدْرِیْ نَفْسٌ مَّاذَا تَكْسِبُ غَدًا ؕ— وَمَا تَدْرِیْ نَفْسٌ بِاَیِّ اَرْضٍ تَمُوْتُ ؕ— اِنَّ اللّٰهَ عَلِیْمٌ خَبِیْرٌ ۟۠
నిశ్చయంగా అల్లాహ్ ఆయన ఒక్కడి వద్దే ప్రళయదినము గురించి జ్ఞానము కలదు. కాబట్టి అది ఎప్పుడు వాటిల్లుతుందో ఆయనకు తెలుసు.ఆయన తలచుకున్నప్పుడు వర్షమును కురిపిస్తాడు. మరియు మాతృ గర్భములో ఉన్నది మగ శిసువా లేదా ఆడ శిసువా ?,దుష్టుడా,పుణ్యాత్ముడా ? అన్నది ఆయనకు తెలుసు. మరియు ఏ ప్రాణికీ తాను రేపటి దినమున సంపాదించేది మేలైనదా లేదా చెడుదైనదా తెలియదు. మరియు ఏ ప్రాణికీ తాను ఏ ప్రాంతములో మరణిస్తాడో తెలియదు. కానీ ఇవన్నీ అల్లాహ్ కు తెలుసు. నిశ్చయంగా అల్లాహ్ వీటన్నింటిగురించి బాగా తెలిసిన వాడు,ఎరుగువాడు. వీటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
ఈ పేజీలోని వచనాల ద్వారా లభించే ప్రయోజనాలు:
• نقص الليل والنهار وزيادتهما وتسخير الشمس والقمر: آيات دالة على قدرة الله سبحانه، ونعمٌ تستحق الشكر.
రాత్రింబవళ్ళ తగ్గుదల,వాటిలో పెరుగుదల,సూర్య,చంద్రుల ఉపయుక్తం చేయటం పరిశుద్ధుడైన అల్లాహ్ సామర్ధ్యమును సూచించే సూచనలు,కృతజ్ఞతకు యోగ్యమయ్యే అనుగ్రహములు.

• الصبر والشكر وسيلتان للاعتبار بآيات الله.
సహనం చూపటం,కృతజ్ఞతలు తెలుపుకోవటం అల్లాహ్ ఆయతులపట్ల గుణపాఠం నేర్చుకోవటానికి రెండు కారకాలు.

• الخوف من القيامة يقي من الاغترار بالدنيا، ومن الخضوع لوساوس الشياطين.
ప్రళయం నుండి భయము ఇహలోకముతో మోసపోకుండా మరియు షైతాను దుష్ప్రేరణలకు లొంగకుండా ఉండటానికి కాపాడుతుంది.

• إحاطة علم الله بالغيب كله.
ఆగోచరమైనవాటన్నింటికి అల్లాహ్ జ్ఞానం చుట్టుముట్టి ఉన్నది.

 
భావార్ధాల అనువాదం వచనం: (34) సూరహ్: సూరహ్ లుఖ్మాన్
సూరాల విషయసూచిక పేజీ నెంబరు
 
పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - అనువాదాల విషయసూచిక

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

మూసివేయటం