పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - అనువాదాల విషయసూచిక


భావార్ధాల అనువాదం వచనం: (67) సూరహ్: సూరహ్ గాఫిర్
هُوَ الَّذِیْ خَلَقَكُمْ مِّنْ تُرَابٍ ثُمَّ مِنْ نُّطْفَةٍ ثُمَّ مِنْ عَلَقَةٍ ثُمَّ یُخْرِجُكُمْ طِفْلًا ثُمَّ لِتَبْلُغُوْۤا اَشُدَّكُمْ ثُمَّ لِتَكُوْنُوْا شُیُوْخًا ۚ— وَمِنْكُمْ مَّنْ یُّتَوَفّٰی مِنْ قَبْلُ وَلِتَبْلُغُوْۤا اَجَلًا مُّسَمًّی وَّلَعَلَّكُمْ تَعْقِلُوْنَ ۟
ఆయనే మీ తండ్రి అయిన ఆదమ్ ను మట్టితో సృష్టించాడు. మరల ఆయన మిమ్మల్ని దాని తరువాత వీర్యబిందువుతో ఆ పిదప వీర్య బిందువు తరువాత రక్తపు గడ్డతో మిమ్మల్ని సృష్టించాడు. దాని తరువాత ఆయన మిమ్మల్ని మీ తల్లుల గర్భముల నుండి చిన్న పిల్లలుగా వెలికి తీస్తాడు. ఆ తరువాత మీరు దృఢమైన శరీరములు కల వయసుకు చేరుకుని ఆ తరువాత మీరు పెద్దవారై వృద్ధులయ్యే వరకు (మిమ్మల్ని పెంచుతాడు). మరియు మీలో నుండి కొందరు దాని కన్న ముందే చనిపోయేవారున్నారు. మరియు (ఆయన మిమ్మల్ని వదిలేస్తాడు) మీరు అల్లాహ్ జ్ఞానంలో నిర్ణీత కాలమునకు చేరుకోవటానికి. మీరు దాని నుండి తగ్గించలేరు. మరియు మీరు దానికన్న పెంచలేరు. మరియు బహుశ మీరు ఆయన సామర్ధ్యంపై,ఆయన ఏకత్వంపై సూచించే ఈ వాదనలు,ఆధారల ద్వారా ప్రయోజనం చెందుతారని.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
ఈ పేజీలోని వచనాల ద్వారా లభించే ప్రయోజనాలు:
• التدرج في الخلق سُنَّة إلهية يتعلم منها الناس التدرج في حياتهم.
సృష్టిలో సోపానక్రమము దైవిక సంప్రదాయము దాని నుండి ప్రజలు తమ జీవితములో సోపానక్రమమును నేర్చుకుంటారు.

• قبح الفرح بالباطل.
అసత్యము పట్ల ఆనందము యొక్క చెడ్డతనం.

• أهمية الصبر في حياة الناس، وبخاصة الدعاة منهم.
ప్రజల జీవితాలలో సహనం యొక్క ప్రాముఖ్యత,ముఖ్యంగా వారిలో నుండి సందేశ ప్రచారకుల.

 
భావార్ధాల అనువాదం వచనం: (67) సూరహ్: సూరహ్ గాఫిర్
సూరాల విషయసూచిక పేజీ నెంబరు
 
పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - అనువాదాల విషయసూచిక

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

మూసివేయటం