Check out the new design

పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - తెలుగు అనువాదం - అల్ ఖుర్ఆన్ అల్ కరీమ్ సంక్షిప్త వ్యాఖ్యానం * - అనువాదాల విషయసూచిక


భావార్ధాల అనువాదం సూరహ్: అజ్-జుఖ్రుఫ్   వచనం:
وَمَا نُرِیْهِمْ مِّنْ اٰیَةٍ اِلَّا هِیَ اَكْبَرُ مِنْ اُخْتِهَا ؗ— وَاَخَذْنٰهُمْ بِالْعَذَابِ لَعَلَّهُمْ یَرْجِعُوْنَ ۟
మరియు మేము ఫిర్ఔన్ కి మరియు అతని జాతి వారిలో నుండి నాయకులకు మూసా అలైహిస్సలాం తీసుకుని వచ్చినది సరి అయినదన్న దానిపై చూపించిన ఆధారము దాని కన్న ముందు ఉన్న ఆధారము కన్న ఎంతో గొప్పది. మరియు మేము వారిని ఇహలోకంలో శిక్షకు గురి చేశాము. వారు ఉన్న అవిశ్వాసము నుండి మరలుతారా అని ఆశిస్తూ. కాని ఎటువంటి ప్రయోజనం లేకపోయినది.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَقَالُوْا یٰۤاَیُّهَ السّٰحِرُ ادْعُ لَنَا رَبَّكَ بِمَا عَهِدَ عِنْدَكَ ۚ— اِنَّنَا لَمُهْتَدُوْنَ ۟
వారికి కొంత శిక్ష కలిగినప్పుడు మూసా అలైహిస్సలాంతో ఇలా పలికేవారు : ఓ మంత్రజాలకుడా ఒక వేళ మేము విశ్వసిస్తే నీ ప్రభువు శిక్షను తొలగిస్తానని నీతో ప్రస్తావించిన దాని గురించి నీ ప్రభువుతో మా కొరకు వేడుకో. ఒక వేళ ఆయన మా నుండి దాన్ని తొలగిస్తే నిశ్ఛయంగా మేము ఆయన వైపునకు మార్గం పొందుతాము.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
فَلَمَّا كَشَفْنَا عَنْهُمُ الْعَذَابَ اِذَا هُمْ یَنْكُثُوْنَ ۟
ఎప్పుడైతే మేము వారి నుండి శిక్షను తొలగించామో వారు తమ వాగ్దానమును భంగపరిచి దాన్ని పూర్తి చేసేవారు కాదు.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَنَادٰی فِرْعَوْنُ فِیْ قَوْمِهٖ قَالَ یٰقَوْمِ اَلَیْسَ لِیْ مُلْكُ مِصْرَ وَهٰذِهِ الْاَنْهٰرُ تَجْرِیْ مِنْ تَحْتِیْ ۚ— اَفَلَا تُبْصِرُوْنَ ۟ؕ
మరియు ఫిర్ఔన్ తన రాజ్యము పై ప్రగల్భాలను పలుకుతూ తన జాతిలో ఇలా ప్రకటించాడు : ఓ నా జాతి వారా ఏమీ మిసర్ యొక్క సామ్రాజ్యాధికారం మరియు నైలు నది నుండి నా భవనముల క్రింది నుండి ప్రవహించే ఈ కాలువలు నాయి కావా ?. ఏమీ మీరు నా సామ్రాజ్యాధికారమును చూడటంలేదా మరియు నా గొప్పతనమును గుర్తించటంలేదా ?.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
اَمْ اَنَا خَیْرٌ مِّنْ هٰذَا الَّذِیْ هُوَ مَهِیْنٌ ۙ۬— وَّلَا یَكَادُ یُبِیْنُ ۟
మరియు నేను గెంటివేయబడిన,మంచిగా మాట్లాడలేని బలహీనుడైన మూసా కన్న ఉత్తముడిని.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
فَلَوْلَاۤ اُلْقِیَ عَلَیْهِ اَسْوِرَةٌ مِّنْ ذَهَبٍ اَوْ جَآءَ مَعَهُ الْمَلٰٓىِٕكَةُ مُقْتَرِنِیْنَ ۟
మరియు అతడు ప్రవక్త అని స్పష్టపరచటానికి అతన్ని ప్రవక్తగా పంపించిన అల్లాహ్ అతనిపై ఎందుకని బంగారపు కంకణాలను వేయలేదు ?. లేదా ఎందుకని అతనితో పాటు ఒకరినొకరు అనుసరించే దైవదూతలు రాలేదు ?.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
فَاسْتَخَفَّ قَوْمَهٗ فَاَطَاعُوْهُ ؕ— اِنَّهُمْ كَانُوْا قَوْمًا فٰسِقِیْنَ ۟
అప్పుడు ఫిర్ఔన్ తన జాతి వారిని ఉసిగొల్పాడు. వారు అతని అపమార్గంలో అతన్ని అనుసరించారు. నిశ్చయంగా వారు అల్లాహ్ విధేయత నుండి తొలగిపోయిన జనులు.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
فَلَمَّاۤ اٰسَفُوْنَا انْتَقَمْنَا مِنْهُمْ فَاَغْرَقْنٰهُمْ اَجْمَعِیْنَ ۟ۙ
వారు అవిశ్వాసంపై కొనసాగి మాకు కోపం కలిగించినప్పుడు మేము వారితో ప్రతీకారం తీర్చుకున్నాము. అప్పుడు మేము వారందరిని ముంచివేశాము.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
فَجَعَلْنٰهُمْ سَلَفًا وَّمَثَلًا لِّلْاٰخِرِیْنَ ۟۠
అయితే మేము ఫిర్ఔన్ ను మరియు అతని సభా ప్రముఖులను ప్రజలకు ముందుండే వారిగా మరియు మీ జాతి లో నుండి అవిశ్వాసపరులను వారి అడుగుజాడలో నడిచే వారిగా చేశాము. మరియు మేము వారిని గుణపాఠం నేర్చుకునే వారికి గుణపాఠంగా చేశాము వారికి ఏదైతే సంభవించినదో వారికి సంభవించకుండా ఉండటానికి వారి కార్యమునకు వారు పాల్పడకుండా ఉండటానికి.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَلَمَّا ضُرِبَ ابْنُ مَرْیَمَ مَثَلًا اِذَا قَوْمُكَ مِنْهُ یَصِدُّوْنَ ۟
మరియు ఎప్పుడైతే క్రైస్తవులు ఆరాధించే ఈసా అలైహిస్సలాం ను ముష్రికులు మహోన్నతుడైన ఆయన ఈ వాక్యంలో ఉన్నాడని భావించారో : {إِنَّكُمْ وَمَا تَعْبُدُونَ مِنْ دُونِ اللَّهِ حَصَبُ جَهَنَّمَ أَنْتُمْ لَهَا وَارِدُونَ} నిశ్ఛయంగా మీరు మరియు అల్లాహ్ ను వదిలి మీరు ఆరాధించే దైవాలు నరకానికి ఇంధనం అవుతారు. మీరంతా దానిలో ప్రవేశిస్తారు (అల్ అన్బియా). వాస్తవానికి అల్లాహ్ విగ్రహాలను ఆరాధించటం నుండి వారించినట్లుగానే ఆయన ఆరాధన నుండి వారించాడు. అప్పుడు ఓ ప్రవక్తా మీ జాతివారు తగువులాటలో ఇలా పలుకుతూ అరిచేవారు మరియు కేకలు వేసేవారు : ఈసా యొక్క స్థానంలో మా దైవాలు అవటమును మేము ఇష్టపడుతున్నాము. అప్పుడు అల్లాహ్ వారిని ఖండిస్తూ ఇలా అవతరింపజేశాడు : "నిశ్చయంగా ముందు నుంచే మా వద్ద ఎవరి కొరకు మేలు ఖరారై ఉందో వారంతా నరకానికి దూరంగా ఉంచబడుతారు" (అల్ అన్బియా) {إِنَّ الَّذِينَ سَبَقَتْ لَهُمْ مِنَّا الْحُسْنَى أُولَئِكَ عَنْهَا مُبْعَدُونَ}.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَقَالُوْۤا ءَاٰلِهَتُنَا خَیْرٌ اَمْ هُوَ ؕ— مَا ضَرَبُوْهُ لَكَ اِلَّا جَدَلًا ؕ— بَلْ هُمْ قَوْمٌ خَصِمُوْنَ ۟
మరియు వారు ఇలా పలికారు : మా ఆరాధ్యదైవాలు మేలైనవా లేదా ఈసా ?. ఇబ్నే జిబఅర మరియు అతని లాంటి వారు ఈ ఉపమానమును సత్యమునకు చేరుకోవటానికి ఇష్టపడుతూ ఇవ్వలేదు కాని తగువులాడటమును ఇష్టపడుతూ ఇచ్చారు. మరియు వారు తగాదా పడటమునకే సృష్టించబడిన జనులు.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
اِنْ هُوَ اِلَّا عَبْدٌ اَنْعَمْنَا عَلَیْهِ وَجَعَلْنٰهُ مَثَلًا لِّبَنِیْۤ اِسْرَآءِیْلَ ۟ؕ
మర్యమ్ కుమారుడగు ఈసా మేము దైవదౌత్యం ప్రసాదించిన అల్లాహ్ దాసుల్లోంచి ఒక దాసుడు మాత్రమే. మరియు మేము అతన్నిఇస్రాయీలు సంతతి వారికి ఒక ఉపమానముగా చేశాము. వారు ఆయన ఆదం ను తల్లిదండ్రులు లేకుండా సృష్టించినట్లే ఆయనను తండ్రి లేకుండా సృష్టించినప్పుడు అల్లాహ్ సామర్ధ్యముపై దాని ద్వారా ఆధారం చూపేవారు.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَلَوْ نَشَآءُ لَجَعَلْنَا مِنْكُمْ مَّلٰٓىِٕكَةً فِی الْاَرْضِ یَخْلُفُوْنَ ۟
ఓ ఆదం సంతతివారా ఒక వేళ మేము మీ వినాశనమును తలచుకుంటే మిమ్మల్ని నాశనం చేసి మీకు బదులుగా దైవదూతలను తీసుకుని వచ్చేవారము. వారు భూమిలో మీకు ప్రాతినిధ్యం వహిస్తారు. అల్లాహ్ ఆరాధన చేస్తారు,ఆయనతో పాటు దేనినీ సాటి కల్పించరు.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
ఈ పేజీలోని వచనాల ద్వారా లభించే ప్రయోజనాలు:
• نَكْث العهود من صفات الكفار.
ప్రమాణాలను భంగపరచటం అవిశ్వాసపరుల లక్షణం.

• الفاسق خفيف العقل يستخفّه من أراد استخفافه.
అవిధేయుడు బుద్ది తక్కువ వాడై ఉంటాడు అతనిని ఎవరైన మూర్ఖుడు చేయదలచుకుంటే మూర్ఖుడిగా చేసేస్తాడు.

• غضب الله يوجب الخسران.
అల్లాహ్ ఆగ్రహం నష్టమును అనివార్యం చేస్తుంది.

• أهل الضلال يسعون إلى تحريف دلالات النص القرآني حسب أهوائهم.
మార్గభ్రష్టులు తమ అంచనాలకు తగ్గట్టుగా ఖుర్ఆన్ ఆధారాలను మార్చివేయటానికి ప్రయత్నిస్తారు.

 
భావార్ధాల అనువాదం సూరహ్: అజ్-జుఖ్రుఫ్
సూరాల విషయసూచిక పేజీ నెంబరు
 
పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - తెలుగు అనువాదం - అల్ ఖుర్ఆన్ అల్ కరీమ్ సంక్షిప్త వ్యాఖ్యానం - అనువాదాల విషయసూచిక

మర్కజ్ తఫ్సీర్ లిల్ దిరాసాత్ అల్ ఖురానియ్యహ్ ప్రచురణ.

మూసివేయటం