పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - అనువాదాల విషయసూచిక


భావార్ధాల అనువాదం వచనం: (15) సూరహ్: సూరహ్ అల్ ఫతహ్
سَیَقُوْلُ الْمُخَلَّفُوْنَ اِذَا انْطَلَقْتُمْ اِلٰی مَغَانِمَ لِتَاْخُذُوْهَا ذَرُوْنَا نَتَّبِعْكُمْ ۚ— یُرِیْدُوْنَ اَنْ یُّبَدِّلُوْا كَلٰمَ اللّٰهِ ؕ— قُلْ لَّنْ تَتَّبِعُوْنَا كَذٰلِكُمْ قَالَ اللّٰهُ مِنْ قَبْلُ ۚ— فَسَیَقُوْلُوْنَ بَلْ تَحْسُدُوْنَنَا ؕ— بَلْ كَانُوْا لَا یَفْقَهُوْنَ اِلَّا قَلِیْلًا ۟
ఓ విశ్వాసపరులారా మీరు హుదేబియా ఒప్పందము తరువాత అల్లాహ్ మీకు వాగ్దానం చేసిన ఖైబర్ విజయధనము గురించి మీరు వాటిని తీసుకోవటానికి వెళ్ళినప్పుడు అల్లాహ్ వెనుక ఉంచిన వారు మీతో ఇలా పలుకుతారు : మీరు మమ్మల్ని వదలండి మేము దాని నుండి మా భాగమును పొందటానికి మీతో పాటు బయలుదేరుతాము. వెనుక ఉండిపోయిన వీరందరు తమ ఈ కోరిక వలన అల్లాహ్ హుదేబియ ఒప్పందము తరువాత విశ్వాసపరులకొక్కరికే ఖైబర్ విజయ ధనమును ఇస్తానని చేసిన వాగ్దానమును మార్చివేయాలనుకున్నారు. ఓ ప్రవక్తా మీరు వారితో ఇలా పలకండి : ఈ విజయ ధనము పొందటానికి మీరు మా వెంట రాకండి. నిశ్చయంగా అల్లాహ్ ఖైబర్ విజయ ధనమును ప్రత్యేకించి హుదేబియాలో హాజరు అయిన వారికి మాత్రమే ఇస్తానని మాకు వాగ్దానం చేశాడు. అప్పుడు వారు ఇలా సమాధానమిస్తారు : ఖైబర్ వైపునకు మేము మీ వెంట రావటం నుండి మీరు మమ్మల్ని ఆపటం అన్నది అల్లాహ్ ఆదేశం కాదు. అది మాపై మీ అసూయ వలన. మరియు విషయం వెనుక ఉండిపోయిన వీరందరు అనుకున్నట్లు కాదు. కాని వారందరు అల్లాహ్ ఆదేశములను మరియు ఆయన వారింపులను చాలా తక్కువగా అర్ధం చేసుకునేవారు. అందుకనే వారు ఆయనకు అవిధేయత చూపటంలో పడిపోయారు.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
ఈ పేజీలోని వచనాల ద్వారా లభించే ప్రయోజనాలు:
• مكانة بيعة الرضوان عند الله عظيمة، وأهلها من خير الناس على وجه الأرض.
బైఅతే రిజ్వాన్ యొక్క స్థానము అల్లాహ్ వద్ద ఎంతో గొప్పది. మరియు అందులో పాల్గొన్నవారు భూమిపై ఉన్న ప్రజల్లోకెల్ల గొప్పవారు.

• سوء الظن بالله من أسباب الوقوع في المعصية وقد يوصل إلى الكفر.
అల్లాహ్ పట్ల దురాలోచనను కలిగి ఉండటం పాపాములో పడవేసే కారకాల్లోంచిది. ఒకొక్కసారి అది అవిశ్వాసము వైపునకు చేరవేస్తుంది.

• ضعاف الإيمان قليلون عند الفزع، كثيرون عند الطمع.
బలహీన విశ్వాసవంతులు ఆందోళన సమయంలో తక్కువగా ఉంటారు మరియు అత్యాశ ఉన్నప్పుడు అధికంగా ఉంటారు.

 
భావార్ధాల అనువాదం వచనం: (15) సూరహ్: సూరహ్ అల్ ఫతహ్
సూరాల విషయసూచిక పేజీ నెంబరు
 
పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - అనువాదాల విషయసూచిక

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

మూసివేయటం