పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - అనువాదాల విషయసూచిక


భావార్ధాల అనువాదం వచనం: (150) సూరహ్: సూరహ్ అల్-అన్ఆమ్
قُلْ هَلُمَّ شُهَدَآءَكُمُ الَّذِیْنَ یَشْهَدُوْنَ اَنَّ اللّٰهَ حَرَّمَ هٰذَا ۚ— فَاِنْ شَهِدُوْا فَلَا تَشْهَدْ مَعَهُمْ ۚ— وَلَا تَتَّبِعْ اَهْوَآءَ الَّذِیْنَ كَذَّبُوْا بِاٰیٰتِنَا وَالَّذِیْنَ لَا یُؤْمِنُوْنَ بِالْاٰخِرَةِ وَهُمْ بِرَبِّهِمْ یَعْدِلُوْنَ ۟۠
ఓ ప్రవక్తా అల్లాహ్ హలాల్ చేసిన వాటిని హరామ్ చేసుకుని దానిని అల్లాహ్ యే హరామ్ చేశాడని వాదించే ఈ ముష్రికులందరితో ఇలా తెలపండి : మీరు నిషేదించుకున్న ఈ వస్తువులన్నింటిని అల్లాహ్ నిషేదించాడు అని సాక్షం పలకటానికి మీ సాక్షులను మీరు ప్రవేశపెట్టండి. ఒక వేళ వారు అల్లాహ్ నిషేదించాడు అనటానికి ఎటువంటి జ్ఞానం లేకుండా నిరాధారంగా సాక్షమిస్తే ఓ ప్రవక్తా మీరు వారిని వారి సాక్ష్యం విషయంలో అంగీకరించకండి. ఎందుకంటే అది అబద్ద సాక్ష్యం. తమ కోరికలను శాసించే వారి కోరికలను నీవు అనుసరించకు. ఎప్పుడైతే వారు అల్లాహ్ హలాల్ చేసిన వాటిని తమ కొరకు హరామ్ చేసుకున్నారో వారు మా ఆయతులను తిరస్కరించారు. పరలోకమును విశ్వసించని వారిని మీరు అనుసరించకండి. వారందరు తమ ప్రభువుతోపాటు వేరేవారిని సమానులుగా చేసి సాటి కల్పిస్తున్నారు. తన ప్రభువుతో ఎవరి నడవడి ఈ విధంగా ఉన్నదో అతడు ఎలా అనుసరించబడుతాడు ?.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
ఈ పేజీలోని వచనాల ద్వారా లభించే ప్రయోజనాలు:
• الحذر من الجرائم الموصلة لبأس الله؛ لأنه لا يُرَدُّ بأسه عن القوم المجرمين إذا أراده.
అల్లాహ్ శిక్షకు చేరవేసే పాపముల నుండి జాగ్రత్త పడటం ఎందుకంటే ఆయన దానిని పాపాత్ముల కొరకు నిర్ణయించినప్పుడు ఆయన శిక్ష వారి నుండి మరలించబడదు.

• الاحتجاج بالقضاء والقدر بعد أن أعطى الله تعالى كل مخلوق قُدْرة وإرادة يتمكَّن بهما من فعل ما كُلِّف به؛ ظُلْمٌ مَحْض وعناد صرف.
ప్రతి జీవికి అప్పగించబడిన వాటిని చేయటానికి అల్లాహ్ శక్తిని,సంకల్పాన్ని (నిర్ణయాధికారము) ప్రసాధించిన తరువాత దైవ నిర్ణయం (ఖజా), తఖ్దీరు గురించి వాదించటం శుద్ద అన్యాయం,శుద్ద మొండితనం.

• دَلَّتِ الآيات على أنه بحسب عقل العبد يكون قيامه بما أمر الله به.
అల్లాహ్ ఆదేశించినది చేయటం దాసుని బుద్ది ప్రకారం అని ఆయతులు సూచించినాయి.

• النهي عن قربان الفواحش أبلغ من النهي عن مجرد فعلها، فإنه يتناول النهي عن مقدماتها ووسائلها الموصلة إليها.
అశ్లీల కార్యాలు చేయటం కన్న ఎక్కువగా వాటి దరిదాపులకు వెళ్ళటం గురించి వారించటం జరిగింది. ఎందుకంటే అది వాటి ఆరంభాల నుండి,వాటికి చేరే కారకాల నుండి వారింపు కలుగుతుంది.

 
భావార్ధాల అనువాదం వచనం: (150) సూరహ్: సూరహ్ అల్-అన్ఆమ్
సూరాల విషయసూచిక పేజీ నెంబరు
 
పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - అనువాదాల విషయసూచిక

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

మూసివేయటం