పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - అనువాదాల విషయసూచిక


భావార్ధాల అనువాదం వచనం: (3) సూరహ్: సూరహ్ అల్-ముమ్తహనహ్
لَنْ تَنْفَعَكُمْ اَرْحَامُكُمْ وَلَاۤ اَوْلَادُكُمْ ۛۚ— یَوْمَ الْقِیٰمَةِ ۛۚ— یَفْصِلُ بَیْنَكُمْ ؕ— وَاللّٰهُ بِمَا تَعْمَلُوْنَ بَصِیْرٌ ۟
మీ బంధుత్వము మరియు మీ సంతానము మీరు అవిశ్వాసపరులతో వారి మూలంగా స్నేహం చేసినప్పుడు మీకు ఏ విధంగాను ప్రయోజనం చేకూర్చరు. ప్రళయదినమున అల్లాహ్ మీ మధ్య వేరు పరుస్తాడు. కావున ఆయన మీలో నుండి స్వర్గ వాసులను స్వర్గములో ప్రవేశింపజేస్తాడు మరియు నరక వాసులను నరకంలో ప్రవేశింపజేస్తాడు. మీలో నుండి ఒకరు ఇంకొకరికి లాభం కలిగించరు. మరియు మీరు చేస్తున్నది అల్లాహ్ చూస్తున్నాడు. మీ కర్మల్లోంచి ఏదీ పరిశుద్ధుడైన ఆయనపై గోప్యంగా ఉండదు. వాటి పరంగా ఆయన మీకు తొందరలోనే ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
ఈ పేజీలోని వచనాల ద్వారా లభించే ప్రయోజనాలు:
• تسريب أخبار أهل الإسلام إلى الكفار كبيرة من الكبائر.
ముస్లిముల సమాచారములను అవిశ్వాసపరలకు చేరవేయటం మహా పాపమల్లోంచిది.

• عداوة الكفار عداوة مُتَأصِّلة لا تؤثر فيها موالاتهم.
అవిశ్వాసపరులతో శతృత్వమనేది నాటుకుపోయే శతృత్వము అందులో వారితో స్నేహము ఏవిధంగాను ప్రభావితం చేయదు.

• استغفار إبراهيم لأبيه لوعده له بذلك، فلما نهاه الله عن ذلك لموته على الكفر ترك الاستغفار له.
ఇబ్రాహీం అలైహిస్సలాం తన తండ్రి కొరకు మన్నింపు కోరటము దాని గురించి ఆయనకు వాగ్దానం చేయటం జరిగినది. ఆయన మరణం అవిశ్వాసంపై జరగటం వలన అల్లాహ్ ఆయనను దాని నుండి వారించి నప్పుడు ఆయన కొరకు మన్నింపును వేడు కోవటమును ఆయన వదిలి వేశారు.

 
భావార్ధాల అనువాదం వచనం: (3) సూరహ్: సూరహ్ అల్-ముమ్తహనహ్
సూరాల విషయసూచిక పేజీ నెంబరు
 
పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - అనువాదాల విషయసూచిక

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

మూసివేయటం