పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - తెలుగు అనువాదం * - అనువాదాల విషయసూచిక

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

భావార్ధాల అనువాదం సూరహ్: సూరహ్ అన్-నస్ర్   వచనం:

సూరహ్ అన్-నస్ర్

اِذَا جَآءَ نَصْرُ اللّٰهِ وَالْفَتْحُ ۟ۙ
(ఓ ముహమ్మద్!) ఎప్పుడైతే అల్లాహ్ సహాయం వస్తుందో మరియు విజయం (లభిస్తుందో)!
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَرَاَیْتَ النَّاسَ یَدْخُلُوْنَ فِیْ دِیْنِ اللّٰهِ اَفْوَاجًا ۟ۙ
మరియు నీవు ప్రజలను గుంపులు గుంపులుగా అల్లాహ్ ధర్మం (ఇస్లాం)లో ప్రవేశించడం చూస్తావో![1]
[1] చూడండి, 3:19.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
فَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ وَاسْتَغْفِرْهُ ؔؕ— اِنَّهٗ كَانَ تَوَّابًا ۟۠
అప్పుడు నీవు నీ ప్రభువు స్తోత్రంతో పాటు ఆయన పవిత్రతను కొనియాడు మరియు ఆయన క్షమాభిక్షను అర్థించు. నిశ్చయంగా, ఆయనే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు.[1]
[1] అంటే నీ ధర్మ ప్రచారం ముగిసే సమయం వచ్చిందనుకో! కాబట్టి నీవు నీ ప్రభువు పవిత్రతను కొనియాడటంలో మరియు ఆయన స్తోత్రం చేయటంలో మునిగి ఉండు. ప్రతివాడు తన జీవితపు చివరి దినాలలో, వృద్ధాప్యంలో వీలైనంత వరకు ప్రభువు ధ్యానంలో మునిగి ఉండటం ఉత్తమమని, దీని సందేశం.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
 
భావార్ధాల అనువాదం సూరహ్: సూరహ్ అన్-నస్ర్
సూరాల విషయసూచిక పేజీ నెంబరు
 
పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - తెలుగు అనువాదం - అనువాదాల విషయసూచిక

ఖుర్ఆన్ యొక్క అర్థాలను తెలుగులొ అనువదించడం. దాని అనువాదకులు అబ్దుర్రహీమ్ ఇబ్నె ముహమ్మద్.

మూసివేయటం