పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - తెలుగు అనువాదం * - అనువాదాల విషయసూచిక

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

భావార్ధాల అనువాదం సూరహ్: సూరహ్ అన్-నాస్   వచనం:

సూరహ్ అన్-నాస్

قُلْ اَعُوْذُ بِرَبِّ النَّاسِ ۟ۙ
ఇలా అను: "నేను మానవుల ప్రభువు (అల్లాహ్) ను శరణుకై వేడుకుంటున్నాను![1]
[1] రబ్బున్: పర్ వర్ దిగార్ (ఉర్దూ), పోషకుడు, చాలా మట్టుకు తెలుగు అనువాదాలలో ఈ పదానికి ప్రభువు అని అనువాదం చేశారు. మానవుడు తన తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి వానిని సరిదిద్ది పోషిస్తాడు. మరియు అతని అంతిమ ఘడియ వరకు పోషిస్తాడు. కేవలం మానవుడే కాక సమస్త సృష్టికి కూడా పోషకుడు ఆయనే!
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
مَلِكِ النَّاسِ ۟ۙ
మానవుల సార్వభౌముడు![1]
[1] ఇటువంటి పోషకుడే వారి సార్వభౌముడు.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
اِلٰهِ النَّاسِ ۟ۙ
మానవుల ఆరాధ్యదైవం (అయిన అల్లాహ్ యొక్క శరణు)!"
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
مِنْ شَرِّ الْوَسْوَاسِ ۙ۬— الْخَنَّاسِ ۟ۙ
కలతలు రేకెత్తించి తొలగిపోయేవాని కీడు నుండి;
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
الَّذِیْ یُوَسْوِسُ فِیْ صُدُوْرِ النَّاسِ ۟ۙ
ఎవడైతే మానవుల హృదయాలలో కలతలు రేకెత్తిస్తాడో![1]
[1] అల్-వస్ వాసు: అంటే మెల్లని ధ్వనితో మాట్లాడటం, గుసగుసలాడటం, షై'తాన్ కూడా మానవునికి తెలియకుండానే అతని హృదయంలో చెడ్డ ఆలోచనలు రేకెత్తిస్తాడు, ఇదే వస్ వస.
అల్-'ఖన్నాస్: నెమ్మదిగా జారుకునే వాడు, అంటే షై'తాన్.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
مِنَ الْجِنَّةِ وَالنَّاسِ ۟۠
వాడు జిన్నాతులలోని వాడూ కావచ్చు లేదా మానవులలోని వాడూ కావచ్చు![1]
[1] ఈ వస్ వస - చేసేవారు రెండు రకాల వారు. ఒకరు జిన్నాతులలోని షై'తానులు. అల్లాహ్ (సు.తా.) వాటికి మానవులను, మార్గభ్రష్టత్వం వైపుకు ఆకర్షించే యుక్తిని ఇచ్చాడు. ప్రతి మానవుని వెంట ఒక షై'తాను ఉంటాడు. వాడు అతన్ని మార్గభ్రష్టత్వం వైపుకు ఆకర్షిస్తూ ఉంటాడు. ఈ మాట విని ఒక 'స'హాబీ (ర'ది.'అ.) ఇలా అడిగారు: "ఓ ప్రవకా ('స'అస) ఏమీ? మీతో పాటు కూడా షై'తాన్ ఉన్నాడా?" అతను జవాబిచ్చారు: "అవును! ఉన్నాడు, కాని అల్లాహ్ (సు.తా.) నాకు వాడిపై ఆధిక్యతనిచ్చాడు అందుకని వాటు నాకు విధేయుడిగా ఉంటాడు. వాడు, నాక మేలు తప్ప మరొక విషయాన్ని ప్రోత్సహించడు." ('స'హీ'హ్ ముస్లిం)
రెండవ రకమైన షై'తాన్ లు మానవులలో ఉన్నారు. వారు, తాము మంచి ఉపదేశం ఇస్తున్నామని చెబుతూ మానవులను మార్గభ్రష్టత్వం వైపుకు ఆకర్షిస్తూ ఉంటారు.
షైతాన్ మానవులనే కాక జిన్నాతులను కూడా మార్గభ్రష్టత్వం వైపుకు ఆకర్షిస్తూ ఉంటాడని మరి కొందరి అభిప్రాయం.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
 
భావార్ధాల అనువాదం సూరహ్: సూరహ్ అన్-నాస్
సూరాల విషయసూచిక పేజీ నెంబరు
 
పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - తెలుగు అనువాదం - అనువాదాల విషయసూచిక

ఖుర్ఆన్ యొక్క అర్థాలను తెలుగులొ అనువదించడం. దాని అనువాదకులు అబ్దుర్రహీమ్ ఇబ్నె ముహమ్మద్.

మూసివేయటం