పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - తెలుగు అనువాదం * - అనువాదాల విషయసూచిక

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

భావార్ధాల అనువాదం సూరహ్: సూరహ్ అజ్-జుమర్   వచనం:

సూరహ్ అజ్-జుమర్

تَنْزِیْلُ الْكِتٰبِ مِنَ اللّٰهِ الْعَزِیْزِ الْحَكِیْمِ ۟
ఈ గ్రంథ (ఖుర్ఆన్) అవతరణ సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడైన అల్లాహ్ తరఫు నుండి జరిగింది.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
اِنَّاۤ اَنْزَلْنَاۤ اِلَیْكَ الْكِتٰبَ بِالْحَقِّ فَاعْبُدِ اللّٰهَ مُخْلِصًا لَّهُ الدِّیْنَ ۟ؕ
(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా మేము ఈ గ్రంథాన్ని, సత్యంతో నీపై అవతరింపజేశాము. కావున నీవు అల్లాహ్ నే ఆరాధిస్తూ నీ భక్తిని కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకో!
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
اَلَا لِلّٰهِ الدِّیْنُ الْخَالِصُ ؕ— وَالَّذِیْنَ اتَّخَذُوْا مِنْ دُوْنِهٖۤ اَوْلِیَآءَ ۘ— مَا نَعْبُدُهُمْ اِلَّا لِیُقَرِّبُوْنَاۤ اِلَی اللّٰهِ زُلْفٰی ؕ— اِنَّ اللّٰهَ یَحْكُمُ بَیْنَهُمْ فِیْ مَا هُمْ فِیْهِ یَخْتَلِفُوْنَ ؕ۬— اِنَّ اللّٰهَ لَا یَهْدِیْ مَنْ هُوَ كٰذِبٌ كَفَّارٌ ۟
వినండి! భక్తి కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ప్రత్యేకించబడింది! ఇక ఆయనను వదలి ఇతరులను సంరక్షకులుగా చేసుకునే వారు (ఇలా అంటారు): "వారు మమ్మల్ని అల్లాహ్ సాన్నిధ్యానికి చేర్చుతారని మాత్రమే మేము వారిని ఆరాధిస్తున్నాము!" [1] నిశ్చయంగా అల్లాహ్ వారిలో ఉన్న భేదాభిప్రాయాలకు తగినట్లుగా వారి మధ్య తీర్పు చేస్తాడు. [2] నిశ్చయంగా, అల్లాహ్ అసత్యవాదికి, కృతఘ్నునికి మార్గదర్శకత్వం చేయడు.[3]
[1] సిఫారస్: అల్లాహ్ (సు.తా.) దగ్గర ఎవరి సిఫారసూ చెల్లదు. ఆయన అనుమతించిన వారి సిఫారస్ తప్ప! వారు దైవదూతలు గానీ ప్రవక్తలు గానీ లేక సద్పురుషులు కావచ్చు. కాని ముఖ్య విషయమేమిటంటే, అల్లాహ్ (సు.తా.), తనకు తప్ప ఇతరులకు ఆరాధన / దాస్యం , చేయటాన్ని ఎన్నటికీ క్షమించడు. దైవత్వంలో ఆయనకు భాగస్వాములను కల్పిస్తే, ఆయన (సు.తా.) దానిని ఎన్నటికీ క్షమించడు. అది తప్ప ఇతర ఏ పాపాన్నైనా, తాను కోరిన వారిని క్షమించవచ్చు!
[2] అంటే ఆరాధించిన వారి మరియు ఆరాధించబడే వారి మధ్య, తీర్పు చేస్తాడు. ఇంకా చూడండి, 34:31-33.
[3] చూడండి, 6:22-24
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
لَوْ اَرَادَ اللّٰهُ اَنْ یَّتَّخِذَ وَلَدًا لَّاصْطَفٰی مِمَّا یَخْلُقُ مَا یَشَآءُ ۙ— سُبْحٰنَهٗ ؕ— هُوَ اللّٰهُ الْوَاحِدُ الْقَهَّارُ ۟
ఒకవేళ అల్లాహ్ ఎవరినైనా కుమారునిగా చేసుకోదలిస్తే, [1] తన సృష్టిలో తాను కోరిన వానిని ఎన్నుకొని ఉండేవాడు. ఆయన సర్వలోపాలకు అతీతుడు. ఆయన అల్లాహ్! అద్వితీయుడు, తన సృష్టి మీద సంపూర్ణ అధికారం (ప్రాబల్యం) గలవాడు. [2]
[1] చూడండి, 6:100. అల్లాహ్ (సు.తా.) సంతానపు లోభానికి అతీతుడు. నిరపేక్షాపరుడు.
[2] చూడండి, 6:18 వ్యాఖ్యానం 1.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ بِالْحَقِّ ۚ— یُكَوِّرُ الَّیْلَ عَلَی النَّهَارِ وَیُكَوِّرُ النَّهَارَ عَلَی الَّیْلِ وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَ ؕ— كُلٌّ یَّجْرِیْ لِاَجَلٍ مُّسَمًّی ؕ— اَلَا هُوَ الْعَزِیْزُ الْغَفَّارُ ۟
ఆయన ఆకాశాలను మరియు భూమిని సత్యంతో సృష్టించాడు. [1] ఆయన రాత్రిని పగటి మీద చుట్టుతున్నాడు. మరియు పగటిని రాత్రి మీద చుట్టుతున్నాడు. [2] సూర్యుణ్ణి మరియు చంద్రుణ్ణి నియమబద్ధులుగా చేసి ఉంచాడు. వాటిలో ప్రతి ఒక్కటీ ఒక నిర్ణీత కాలంలో (నిర్ణీత పరిధిలో) పయనిస్తూ ఉన్నాయి. వినండి! ఆయన, సర్వశక్తిమంతుడు, క్షమించేవాడు.
[1] చూడండి, 10:5.
[2] చూడండి, 7:54
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
خَلَقَكُمْ مِّنْ نَّفْسٍ وَّاحِدَةٍ ثُمَّ جَعَلَ مِنْهَا زَوْجَهَا وَاَنْزَلَ لَكُمْ مِّنَ الْاَنْعَامِ ثَمٰنِیَةَ اَزْوَاجٍ ؕ— یَخْلُقُكُمْ فِیْ بُطُوْنِ اُمَّهٰتِكُمْ خَلْقًا مِّنْ بَعْدِ خَلْقٍ فِیْ ظُلُمٰتٍ ثَلٰثٍ ؕ— ذٰلِكُمُ اللّٰهُ رَبُّكُمْ لَهُ الْمُلْكُ ؕ— لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ۚ— فَاَنّٰی تُصْرَفُوْنَ ۟
ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి (ఆదమ్) నుండి సృష్టించాడు. తరువాత అతని నుండి అతని జంట (జౌజ్) ను పుట్టించాడు. [1] మరియు మీ కొరకు ఎనిమిది జతల (ఆడ మగ) పశువులను పుట్టించాడు. [2] ఆయన మిమ్మల్ని మీ తల్లుల గర్భాలలో మూడు చీకటి తెరలలో ఒక రూపం తరువాత మరొక రూపాన్ని ఇచ్చాడు. [3] ఆయనే అల్లాహ్! మీ ప్రభువు. విశ్వాధిపత్యం ఆయనదే. ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. అలాంటప్పుడు మీరు ఎలా (సత్యం నుండి) తప్పించబడుతున్నారు?
[1] చూడండి, 4:1. 'జౌజ: అంటే, జంట, జత, సహచరి, సహవాసి అనే అర్థాలున్నాయి.
[2] అంటే గొర్రె, మేక, ఆవు మరియు ఒంటె. ఇవ్ ఆడ-మగ కలిసి ఎనిమిది అవుతాయి, వివరాలు 6:143-144లలో వచ్చాయి.
[3] ఈ తెరలు : 1) తల్లి కడుపు (Abdominal Wall), 2) గర్భాశయం (Uterine Wall), 3) మావిపొర (Amniotic Membrane). ఇంకా చూడండి, 22:5, 23:12-14.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
اِنْ تَكْفُرُوْا فَاِنَّ اللّٰهَ غَنِیٌّ عَنْكُمْ ۫— وَلَا یَرْضٰی لِعِبَادِهِ الْكُفْرَ ۚ— وَاِنْ تَشْكُرُوْا یَرْضَهُ لَكُمْ ؕ— وَلَا تَزِرُ وَازِرَةٌ وِّزْرَ اُخْرٰی ؕ— ثُمَّ اِلٰی رَبِّكُمْ مَّرْجِعُكُمْ فَیُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ تَعْمَلُوْنَ ؕ— اِنَّهٗ عَلِیْمٌۢ بِذَاتِ الصُّدُوْرِ ۟
ఒకవేళ మీరు సత్యాన్ని తిరస్కరిస్తే, నిశ్చయంగా, అల్లాహ్ మీ అక్కరలేని వాడు. [1] మరియు ఆయన తన దాసులు సత్యతిరస్కార వైఖరిని అవలంబించడాన్ని ఇష్ట పడడు. మరియు మీరు కృతజ్ఞులైనట్లయితే ఆయన మీ పట్ల ఎంతో సంతోషపడతాడు. మరియు బరువు మోసేవాడు ఎవ్వడూ ఇతరుల బరువును మోయడు. [2] చివరకు మీరందరికీ, మీ ప్రభువు వైపునకే మరల వలసి ఉంది! అప్పుడు ఆయన, మీరు ఏమేమి చేస్తూ ఉండేవారో మీకు తెలియజేస్తాడు. నిశ్చయంగా ఆయనకు హృదయాలలో ఉన్న విషయాలన్నీ బాగా తెలుసు.
[1] చూడండి, 14:8.
[2] ఈ వాక్యం ఖుర్ఆన్ లో ఐదుసార్లు వచ్చింది. ఇక్కడ మరియు 6:164, 17:15, 35:18, మరియు 53:38. ఇది : 'ఏసు క్రీస్తు, క్రైస్తవులందరి పాపభారాన్ని భరిస్తారు.' అని క్రైస్తవులు అనే సిద్ధాంతాన్ని ఖండిస్తోంది.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَاِذَا مَسَّ الْاِنْسَانَ ضُرٌّ دَعَا رَبَّهٗ مُنِیْبًا اِلَیْهِ ثُمَّ اِذَا خَوَّلَهٗ نِعْمَةً مِّنْهُ نَسِیَ مَا كَانَ یَدْعُوْۤا اِلَیْهِ مِنْ قَبْلُ وَجَعَلَ لِلّٰهِ اَنْدَادًا لِّیُضِلَّ عَنْ سَبِیْلِهٖ ؕ— قُلْ تَمَتَّعْ بِكُفْرِكَ قَلِیْلًا ۖۗ— اِنَّكَ مِنْ اَصْحٰبِ النَّارِ ۟
మానవునికి ఏదైనా కష్టం కలిగినప్పుడు అతడు పశ్చాత్తాపంలో తన ప్రభువు వైపునకు మరలి ఆయనను వేడుకుంటాడు. తరువాత ఆయన (అల్లాహ్) అతనికి తన అనుగ్రహాన్ని ప్రసాదించి నప్పుడు, అతడు పూర్వం దేనిని గురించి వేడుకుంటూ ఉండేవాడో దానిని మరచిపోతాడు. మరియు అల్లాహ్ కు సాటి కల్పించి, (ఇతరులను) ఆయన మార్గం నుండి తప్పిస్తాడు. [1] (అలాంటి వానితో) ఇలా అను: "నీవు, నీ సత్యతిరస్కార వైఖరితో కొంత కాలం సంతోషపడు. నిశ్చయంగా, నీవు నరకవాసుల్లోని వాడవవుతావు!"
[1] చూడండి, 2:22.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
اَمَّنْ هُوَ قَانِتٌ اٰنَآءَ الَّیْلِ سَاجِدًا وَّقَآىِٕمًا یَّحْذَرُ الْاٰخِرَةَ وَیَرْجُوْا رَحْمَةَ رَبِّهٖ ؕ— قُلْ هَلْ یَسْتَوِی الَّذِیْنَ یَعْلَمُوْنَ وَالَّذِیْنَ لَا یَعْلَمُوْنَ ؕ— اِنَّمَا یَتَذَكَّرُ اُولُوا الْاَلْبَابِ ۟۠
ఏమీ? ఎవడైతే శ్రద్ధతో రాత్రి ఘడియలలో సాష్టాంగం (సజ్దా) చేస్తూ మరియు నిలిచి (నమాజ్) చేస్తూ, పరలోక (జీవిత)మును గురించి భయపడుతూ, తన ప్రభువు కారుణ్యాన్ని ఆశిస్తూ ఉంటాడో! (అలాంటి వాడు, అలా చేయని వాడితో సమానుడా)? వారి నడుగు: "ఏమీ? విజ్ఞానులు మరియు అజ్ఞానులు సరిసమానులు కాగలరా? వాస్తవానికి బుద్ధిమంతులే హితబోధ స్వీకరిస్తారు."
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
قُلْ یٰعِبَادِ الَّذِیْنَ اٰمَنُوا اتَّقُوْا رَبَّكُمْ ؕ— لِلَّذِیْنَ اَحْسَنُوْا فِیْ هٰذِهِ الدُّنْیَا حَسَنَةٌ ؕ— وَاَرْضُ اللّٰهِ وَاسِعَةٌ ؕ— اِنَّمَا یُوَفَّی الصّٰبِرُوْنَ اَجْرَهُمْ بِغَیْرِ حِسَابٍ ۟
(ఓ ముహమ్మద్!) అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడని) అను: "ఓ విశ్వసించిన నా దాసులారా! మీ ప్రభువు నందు భయభక్తులు కలిగి ఉండండి. ఎవరైతే ఈ లోకంలో సత్పురుషులై ఉంటారో (వారికి పరలోకంలో) మేలు జరుగుతుంది. మరియు అల్లాహ్ భూమి చాలా విశాలమైనది. [1] నిశ్చయంగా, సహనం వహించిన వారికి లెక్క లేనంత ప్రతిఫలం ఇవ్వబడుతుంది."
[1] పాపం మరియు సత్యతిరస్కారం నుండి - పుణ్యం, సత్యం మరియు అల్లాహ్ (సు.తా.) వైపునకు - మరలే అవకాశం ఎల్లప్పుడూ ఉంది. ఇదే వాస్తవమైన 'హిజ్రత్' వలసపోవటం. ఇంకా చూడండి, 4:97. ఒక వ్యక్తికి తన నివాసస్థలంలో ఉంటూ ఈమాన్ పై ఉండటం దుర్భరమైతే! అతడు ఇతర చోట్లకు హిజ్రత్ చేసి తన ధర్మాన్ని కాపాడుకోవాలి.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
قُلْ اِنِّیْۤ اُمِرْتُ اَنْ اَعْبُدَ اللّٰهَ مُخْلِصًا لَّهُ الدِّیْنَ ۟ۙ
(ఓ ముహమ్మద్! ఇంకా) ఇలా అను: "నిశ్చయంగా, నేను అల్లాహ్ ను మాత్రమే ఆరాధిస్తూ, నా భక్తిని కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని ఆజ్ఞాపించబడ్డాను.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَاُمِرْتُ لِاَنْ اَكُوْنَ اَوَّلَ الْمُسْلِمِیْنَ ۟
మరియు నేను అందరి కంటే ముందు (అల్లాహ్ కు) విధేయుడను (ముస్లిం) అయి ఉండాలి" అని కూడా ఆజ్ఞాపించబడ్డాను.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
قُلْ اِنِّیْۤ اَخَافُ اِنْ عَصَیْتُ رَبِّیْ عَذَابَ یَوْمٍ عَظِیْمٍ ۟
(ఇంకా) ఇలా అను: "ఒకవేళ నేను నా ప్రభువుకు అవిధేయుడనైతే ఆ మహా దినవు శిక్షకు గురి అవుతానని భయపడుతున్నాను."
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
قُلِ اللّٰهَ اَعْبُدُ مُخْلِصًا لَّهٗ دِیْنِیْ ۟ۙۚ
(ఇంకా) ఇలా అను: "నేను కేవలం అల్లాహ్ నే ఆరాధిస్తూ నా భక్తిని (ఆరాధనను) కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకుంటాను;
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
فَاعْبُدُوْا مَا شِئْتُمْ مِّنْ دُوْنِهٖ ؕ— قُلْ اِنَّ الْخٰسِرِیْنَ الَّذِیْنَ خَسِرُوْۤا اَنْفُسَهُمْ وَاَهْلِیْهِمْ یَوْمَ الْقِیٰمَةِ ؕ— اَلَا ذٰلِكَ هُوَ الْخُسْرَانُ الْمُبِیْنُ ۟
కావున మీరు ఆయనను వదలి మీకు ఇష్టమైన వారిని ఆరాధించండి!" ఇంకా ఇలా అను: "పునరుత్థాన దినమున తమకు తాము మరియు తమ కుటుంబం వారికి నష్టం కలిగించుకున్న వారే నిశ్చయంగా నష్టపడ్డ వారు. వాస్తవానికి అదే స్పష్టమైన నష్టం!"
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
لَهُمْ مِّنْ فَوْقِهِمْ ظُلَلٌ مِّنَ النَّارِ وَمِنْ تَحْتِهِمْ ظُلَلٌ ؕ— ذٰلِكَ یُخَوِّفُ اللّٰهُ بِهٖ عِبَادَهٗ ؕ— یٰعِبَادِ فَاتَّقُوْنِ ۟
వారిని, వారిపై నుండి అగ్ని జ్వాలలు క్రమ్ముకుంటాయి మరియు వారి క్రింది నుండి (అగ్ని జ్వాలలు) క్రమ్ముకుంటాయి. ఈ విధంగా, అల్లాహ్ తన దాసులను భయపెడుతున్నాడు [1]: "ఓ నా దాసులారా! నా పట్ల మాత్రమే భయభక్తులు కలిగి ఉండండి."
[1] ఇక్కడ అల్లాహ్ (సు.తా.) తన దాసులను మరొకసారి :'నరకాగ్ని నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి.' అని హెచ్చరిస్తున్నాడు. ఈ విధమైన హెచ్చరిక ఖుర్ఆన్ లో ఎన్నోసార్లు వచ్చింది. చూడండి, 74:35-36.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَالَّذِیْنَ اجْتَنَبُوا الطَّاغُوْتَ اَنْ یَّعْبُدُوْهَا وَاَنَابُوْۤا اِلَی اللّٰهِ لَهُمُ الْبُشْرٰی ۚ— فَبَشِّرْ عِبَادِ ۟ۙ
మరియు ఎవరైతే కల్పిత దైవాలను (తాగూత్ లను) త్యజించి, వాటిని ఆరాధించకుండా, పశ్చాత్తాపంతో అల్లాహ్ వైపునకు మరలుతారో! వారికి శుభవార్త ఉంది. [1] కావున నా దాసులకు ఈ శుభవార్తను ఇవ్వు.
[1] చూడండి, 10:62-64.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
الَّذِیْنَ یَسْتَمِعُوْنَ الْقَوْلَ فَیَتَّبِعُوْنَ اَحْسَنَهٗ ؕ— اُولٰٓىِٕكَ الَّذِیْنَ هَدٰىهُمُ اللّٰهُ وَاُولٰٓىِٕكَ هُمْ اُولُوا الْاَلْبَابِ ۟
ఎవరైతే మాటను శ్రద్ధగా విని, అందులోని ఉత్తమమైన దానిని అనుసరిస్తారో! అలాంటి వారే, అల్లాహ్ మార్గదర్శకత్వం పొందిన వారు మరియు అలాంటి వారే బుద్ధిమంతులు.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
اَفَمَنْ حَقَّ عَلَیْهِ كَلِمَةُ الْعَذَابِ ؕ— اَفَاَنْتَ تُنْقِذُ مَنْ فِی النَّارِ ۟ۚ
ఏమీ? ఎవడిని గురించి అయితే ఆయన (అల్లాహ్ తరఫు నుండి) శిక్ష నిర్ణయించబడి ఉందో, వానిని నీవు నరకాగ్నిలో నుండి బయటికి తీయగలవా?
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
لٰكِنِ الَّذِیْنَ اتَّقَوْا رَبَّهُمْ لَهُمْ غُرَفٌ مِّنْ فَوْقِهَا غُرَفٌ مَّبْنِیَّةٌ ۙ— تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ ؕ۬— وَعْدَ اللّٰهِ ؕ— لَا یُخْلِفُ اللّٰهُ الْمِیْعَادَ ۟
కాని ఎవరైతే తమ ప్రభువు యెడల భయభక్తులు కలిగి ఉన్నారో! వారి కొరకు అంతస్తుపై అంతస్తుగా, కట్టబడిన ఎత్తైన భవనాలు ఉంటాయి. వాటి క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. ఇది అల్లాహ్ వాగ్దానం. అల్లాహ్ తన వాగ్దానాన్ని ఎన్నడూ భంగపరచడు.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
اَلَمْ تَرَ اَنَّ اللّٰهَ اَنْزَلَ مِنَ السَّمَآءِ مَآءً فَسَلَكَهٗ یَنَابِیْعَ فِی الْاَرْضِ ثُمَّ یُخْرِجُ بِهٖ زَرْعًا مُّخْتَلِفًا اَلْوَانُهٗ ثُمَّ یَهِیْجُ فَتَرٰىهُ مُصْفَرًّا ثُمَّ یَجْعَلُهٗ حُطَامًا ؕ— اِنَّ فِیْ ذٰلِكَ لَذِكْرٰی لِاُولِی الْاَلْبَابِ ۟۠
ఏమీ? నీకు తెలియదా? నిశ్చయంగా, అల్లాహ్ ఆకాశం నుండి నీటిని కురిపించి, తరువాత దానిని భూమిలో ఊటలుగా ప్రవహింప జేస్తున్నాడని? ఆ తరువాత దాని వల్ల వివిధ రంగుల వృక్షకోటిని ఉత్పత్తి చేస్తాడు. ఆ తరువాత అది ఎండిపోయి నపుడు, నీవు దానిని పసుపు రంగుగా మారిపోవటాన్ని చూస్తావు. చివరకు ఆయన దానిని పొట్టుగా మార్చి వేస్తాడు. నిశ్చయంగా ఇందులో బుద్ధిమంతులకు హితబోధ ఉంది.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
اَفَمَنْ شَرَحَ اللّٰهُ صَدْرَهٗ لِلْاِسْلَامِ فَهُوَ عَلٰی نُوْرٍ مِّنْ رَّبِّهٖ ؕ— فَوَیْلٌ لِّلْقٰسِیَةِ قُلُوْبُهُمْ مِّنْ ذِكْرِ اللّٰهِ ؕ— اُولٰٓىِٕكَ فِیْ ضَلٰلٍ مُّبِیْنٍ ۟
ఏమీ? ఏ వ్యక్తి హృదయాన్నైతే అల్లాహ్ విధేయత (ఇస్లాం) కొరకు తెరుస్తాడో, అతడు తన ప్రభువు చూపిన వెలుగులో నడుస్తూ ఉంటాడో (అలాంటి వాడు సత్యతిరస్కారితో సమానుడు కాగలడా?) ఎవరి హృదయాలైతే అల్లాహ్ హితోపదేశం పట్ల కఠినమై పోయాయో, అలాంటి వారికి వినాశం ఉంది. అలాంటి వారు స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారు!
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
اَللّٰهُ نَزَّلَ اَحْسَنَ الْحَدِیْثِ كِتٰبًا مُّتَشَابِهًا مَّثَانِیَ تَقْشَعِرُّ مِنْهُ جُلُوْدُ الَّذِیْنَ یَخْشَوْنَ رَبَّهُمْ ۚ— ثُمَّ تَلِیْنُ جُلُوْدُهُمْ وَقُلُوْبُهُمْ اِلٰی ذِكْرِ اللّٰهِ ؕ— ذٰلِكَ هُدَی اللّٰهِ یَهْدِیْ بِهٖ مَنْ یَّشَآءُ ؕ— وَمَنْ یُّضْلِلِ اللّٰهُ فَمَا لَهٗ مِنْ هَادٍ ۟
అల్లాహ్ సర్వశ్రేష్ఠమైన బోధనలను ఒక గ్రంథ రూపంలో అవతరింపజేశాడు. దానిలో ఒకే రకమైన వాటిని (వచనాలను) మాటిమాటికీ ఎన్నో విధాలుగా (విశదీకరించాడు). [1] తమ ప్రభువుకు భయపడే వారి శరీరాలు (చర్మాలు) దానితో (ఆ పఠనంతో) గజగజ వణుకుతాయి. కాని తరువాత వారి చర్మాలు మరియు వారి హృదయాలు అల్లాహ్ ధ్యానం వలన మెత్తబడతాయి. ఇది అల్లాహ్ మార్గదర్శకత్వం. ఆయన దీనితో తాను కోరిన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు. మరియు ఏ వ్యక్తిని అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో వదలుతాడో, అతనికి మార్గదర్శకుడు ఎవ్వడూ ఉండడు. [2]
[1] చూడండి, 4:82 మరియు 25:32.
[2] చూడండి, 14:4
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
اَفَمَنْ یَّتَّقِیْ بِوَجْهِهٖ سُوْٓءَ الْعَذَابِ یَوْمَ الْقِیٰمَةِ ؕ— وَقِیْلَ لِلظّٰلِمِیْنَ ذُوْقُوْا مَا كُنْتُمْ تَكْسِبُوْنَ ۟
ఏమీ? పునరుత్థాన దినవు కఠినమైన శిక్షను తన ముఖంతో కాపాడు కోవలసిన వాడు (స్వర్గంలో ప్రవేశించేవానితో సమానుడా)? మరియు (ఆ రోజు) దుర్మార్గులతో ఇలా అనబడుతుంది: "మీరు సంపాదించిన దానిని రుచి చూడండి."
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
كَذَّبَ الَّذِیْنَ مِنْ قَبْلِهِمْ فَاَتٰىهُمُ الْعَذَابُ مِنْ حَیْثُ لَا یَشْعُرُوْنَ ۟
వీరికి పూర్వమున్న వారు కూడా (అల్లాహ్ సందేశాలను) అబద్ధాలని తిరస్కరించారు, కాబట్టి వారు ఊహించలేని దిశ నుండి వారిపై శిక్ష వచ్చి పడింది.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
فَاَذَاقَهُمُ اللّٰهُ الْخِزْیَ فِی الْحَیٰوةِ الدُّنْیَا ۚ— وَلَعَذَابُ الْاٰخِرَةِ اَكْبَرُ ۘ— لَوْ كَانُوْا یَعْلَمُوْنَ ۟
ఈ విధంగా, అల్లాహ్ వారికి ఇహలోక జీవితంలో కూడా అవమానాన్ని రుచి చూపాడు. [1] మరియు వారి పరలోక శిక్ష దీని కంటే ఎంతో ఘోరమైనదిగా ఉంటుంది. వారు ఇది గ్రహిస్తే ఎంత బాగుండేది!
[1] చూడండి, 16:26.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَلَقَدْ ضَرَبْنَا لِلنَّاسِ فِیْ هٰذَا الْقُرْاٰنِ مِنْ كُلِّ مَثَلٍ لَّعَلَّهُمْ یَتَذَكَّرُوْنَ ۟ۚ
మరియు వాస్తవానికి మేము ఈ ఖుర్ఆన్ లో ప్రజల కొరకు అనేక రకాల దృష్టాంతాలు పేర్కొన్నాము, బహుశా వారు గుణపాఠం నేర్చుకుంటారని;
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
قُرْاٰنًا عَرَبِیًّا غَیْرَ ذِیْ عِوَجٍ لَّعَلَّهُمْ یَتَّقُوْنَ ۟
అరబ్బీ భాషలో ఉన్న ఈ ఖుర్ఆన్ ను, [1] ఏ విధమైన వక్రత లేకుండా అవతరింప జేశాము; బహుశా వారు దైవభీతి కలిగి వుంటారని.
[1] చూడండి, 12:2, 13:37, 14:4 మరియు 41:44.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
ضَرَبَ اللّٰهُ مَثَلًا رَّجُلًا فِیْهِ شُرَكَآءُ مُتَشٰكِسُوْنَ وَرَجُلًا سَلَمًا لِّرَجُلٍ ؕ— هَلْ یَسْتَوِیٰنِ مَثَلًا ؕ— اَلْحَمْدُ لِلّٰهِ ۚ— بَلْ اَكْثَرُهُمْ لَا یَعْلَمُوْنَ ۟
అల్లాహ్ ఒక దృష్టాంతం ఇస్తున్నాడు: ఒక మానవుడు (బానిస) పరస్పరం విరోధమున్న ఎంతో మంది యజమానులకు చెదినవాడు. మరొక మానవుడు (బానిస) పూర్తిగా ఒకే ఒక్క యజమానికి చెందిన వాడు, వారిద్దరి పరిస్థితి సమానంగా ఉంటుందా? [1] సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే! కాని వారిలో చాలా మందికి ఇది తెలియదు.
[1] ఇదే విధంగా ఎంతోమంది దైవాలను ఆరాధించేవాడు, ఒకే అల్లాహ్ (సు.తా.)ను ఆరాధించే వాడితో సమానుడు కాలేడు. బహుదైవారాధకుడు ఎల్లప్పుడు వారి కలహాలలో మునుగి ఉంటాడు.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
اِنَّكَ مَیِّتٌ وَّاِنَّهُمْ مَّیِّتُوْنَ ۟ؗ
(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, (ఒక రోజు) నీవు మరణిస్తావు మరియు నిశ్చయంగా వారు కూడా మరణిస్తారు.[1]
[1] చూడండి, 3:144 ఇతర మానవుల వలే దైవప్రవక్త ('స'అస) కు కూడా మరణం వచ్చింది. పునరుత్థాన దినం వరకు అతను కూడా బర్'జఖ్ లో ఉంటారు.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
ثُمَّ اِنَّكُمْ یَوْمَ الْقِیٰمَةِ عِنْدَ رَبِّكُمْ تَخْتَصِمُوْنَ ۟۠
ఆ తరువాత నిశ్చయంగా, పునరుత్థాన దినమున మీరంతా మీ ప్రభువు సమక్షంలో మీ వివాదాలను విన్నవించుకుంటారు.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
فَمَنْ اَظْلَمُ مِمَّنْ كَذَبَ عَلَی اللّٰهِ وَكَذَّبَ بِالصِّدْقِ اِذْ جَآءَهٗ ؕ— اَلَیْسَ فِیْ جَهَنَّمَ مَثْوًی لِّلْكٰفِرِیْنَ ۟
ఇక అల్లాహ్ ను గురించి అసత్యం కల్పించి, సత్యం తన ముందుకు వచ్చినప్పుడు దానిని తిరస్కరించే వాని కంటే పరమ దుర్మార్గుడెవడు? అందుకే! సత్యతిరస్కారులకు కేవలం నరకంలోనే కదా నివాసం ఉండేది?
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَالَّذِیْ جَآءَ بِالصِّدْقِ وَصَدَّقَ بِهٖۤ اُولٰٓىِٕكَ هُمُ الْمُتَّقُوْنَ ۟
మరియు సత్యాన్ని తెచ్చినవాడూ మరియు దానిని హృదయపూర్వకంగా నమ్మిన వాడూ, ఇలాంటి వారే దైవభీతి గలవారు.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
لَهُمْ مَّا یَشَآءُوْنَ عِنْدَ رَبِّهِمْ ؕ— ذٰلِكَ جَزٰٓؤُا الْمُحْسِنِیْنَ ۟ۚۖ
వారికి తమ ప్రభువు వద్ద వారు కోరిందంతా లభిస్తుంది. ఇదే సజ్జనులకు దొరికే ప్రతిఫలం.[1]
[1] చూము'హ్ సినీన్: దీనికి సజ్జనులు, పుణ్యవంతులు, సత్పురుషులు మొదలైన అర్థాలున్నాయి. దైవప్రవక్త ('స'అస) ప్రవచనం : 'మీరు అల్లాహ్ (సు.తా.) ను ఆరాధించేటప్పుడు మీరు ఆయన (సు.తా.)ను చూస్తున్నారని భావించండి. అది సాధ్యం కాకపోతే కనీసం ఆయన (సు.తా.) మిమ్మల్ని చూస్తున్నాడని భావించండి. (అన్ త'అబుదల్లాహ్ క అన్నక తరాహు; ఫ ఇన్ లమ్ తకున్ తరాహు, ఫ ఇన్నహు యరాక'.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
لِیُكَفِّرَ اللّٰهُ عَنْهُمْ اَسْوَاَ الَّذِیْ عَمِلُوْا وَیَجْزِیَهُمْ اَجْرَهُمْ بِاَحْسَنِ الَّذِیْ كَانُوْا یَعْمَلُوْنَ ۟
దానికి బదులుగా అల్లాహ్, వారు చేసిన ఘోర పాపకార్యాలను రద్దు చేయటానికి మరియు వారు చేస్తూ వచ్చిన మంచి పనులకు అత్యుత్తమ ప్రతిఫలం ఇవ్వటానికి!
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
اَلَیْسَ اللّٰهُ بِكَافٍ عَبْدَهٗ ؕ— وَیُخَوِّفُوْنَكَ بِالَّذِیْنَ مِنْ دُوْنِهٖ ؕ— وَمَنْ یُّضْلِلِ اللّٰهُ فَمَا لَهٗ مِنْ هَادٍ ۟ۚ
ఏమిటి? అల్లాహ్ తన దాసునికి చాలడా? అయినా వారు ఆయన (అల్లాహ్) ను విడిచి, ఇతరులను గురించి నిన్ను భయపెడు తున్నారు. మరియు అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో పడనిచ్చిన వానికి మార్గదర్శకుడు ఎవ్వడూ ఉండడు.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَمَنْ یَّهْدِ اللّٰهُ فَمَا لَهٗ مِنْ مُّضِلٍّ ؕ— اَلَیْسَ اللّٰهُ بِعَزِیْزٍ ذِی انْتِقَامٍ ۟
మరియు అల్లాహ్ మార్గదర్శకత్వం చేసిన వానిని, మార్గభ్రష్టుడు చేయగల వాడెవ్వడూ లేడు! ఏమీ? అల్లాహ్ సర్వశక్తిమంతుడు, ప్రతీకారం చేయగలవాడు కాడా?
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَلَىِٕنْ سَاَلْتَهُمْ مَّنْ خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ لَیَقُوْلُنَّ اللّٰهُ ؕ— قُلْ اَفَرَءَیْتُمْ مَّا تَدْعُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ اِنْ اَرَادَنِیَ اللّٰهُ بِضُرٍّ هَلْ هُنَّ كٰشِفٰتُ ضُرِّهٖۤ اَوْ اَرَادَنِیْ بِرَحْمَةٍ هَلْ هُنَّ مُمْسِكٰتُ رَحْمَتِهٖ ؕ— قُلْ حَسْبِیَ اللّٰهُ ؕ— عَلَیْهِ یَتَوَكَّلُ الْمُتَوَكِّلُوْنَ ۟
మరియు ఒకవేళ నీవు వారితో: "భూమ్యాకాశాలను సృష్టించింది ఎవరు?" అని అడిగితే, వారు నిశ్చయంగా: "అల్లాహ్!" అని అంటారు. [1] వారిని ఇలా అడుగు: "ఏమీ? మీరు ఆలోచించరా? అల్లాహ్ ను వదలి మీరు ఆరాధించేవి - అల్లాహ్ నాకు కీడు చేయదలచుకుంటే - ఆయన కీడు నుండి, నన్ను తప్పించగలవా? లేక, ఆయన (అల్లాహ్) నన్ను కరుణించగోరితే ఇవి ఆయన కారుణ్యాన్ని ఆపగలవా?" వారితో ఇంకా ఇలా అను: "నాకు కేవలం అల్లాహ్ చాలు! ఆయన (అల్లాహ్) ను నమ్మేవారు (విశ్వాసులు), కేవలం ఆయన మీదే నమ్మక ముంచుకుంటారు."
[1] ఇటువంటి వాక్యానికి చూడండి, 31:25.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
قُلْ یٰقَوْمِ اعْمَلُوْا عَلٰی مَكَانَتِكُمْ اِنِّیْ عَامِلٌ ۚ— فَسَوْفَ تَعْلَمُوْنَ ۟ۙ
(ఓ ముహమ్మద్!) వారితో ఇలా అను: "ఓ నా జాతి ప్రజలారా! మీరు మీ ఇష్టప్రకారం మీ పని చేస్తూ ఉండండి; నిశ్చయంగా, నేనూ నా పని చేస్తూ ఉంటాను. తరువాత మీరు తెలుసుకోగలరు;
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
مَنْ یَّاْتِیْهِ عَذَابٌ یُّخْزِیْهِ وَیَحِلُّ عَلَیْهِ عَذَابٌ مُّقِیْمٌ ۟
(ఇహలోకంలో) ఎవరి మీద అవమానకరమైన శిక్ష వచ్చిపడుతుందో మరియు (పరలోక జీవితంలో) ఎవరి మీద శాశ్వతమైన శిక్ష పడనున్నదో!"
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
اِنَّاۤ اَنْزَلْنَا عَلَیْكَ الْكِتٰبَ لِلنَّاسِ بِالْحَقِّ ۚ— فَمَنِ اهْتَدٰی فَلِنَفْسِهٖ ۚ— وَمَنْ ضَلَّ فَاِنَّمَا یَضِلُّ عَلَیْهَا ۚ— وَمَاۤ اَنْتَ عَلَیْهِمْ بِوَكِیْلٍ ۟۠
నిశ్చయంగా, మేము మానవులందరి కొరకు, ఈ గ్రంథాన్ని, సత్యంతో నీపై అవతరింప జేశాము. కావున సన్మార్గంపై నడిచేవాడు తన మేలు కొరకే అలా చేస్తాడు. మరియు నిశ్చయంగా, మార్గభ్రష్టుడైన వాడు తన కీడు కొరకే మార్గభ్రష్టుడవుతాడు. మరియు నీవు వారి కొరకు బాధ్యుడవు కావు.[1]
[1] చూడండి, 17:2.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
اَللّٰهُ یَتَوَفَّی الْاَنْفُسَ حِیْنَ مَوْتِهَا وَالَّتِیْ لَمْ تَمُتْ فِیْ مَنَامِهَا ۚ— فَیُمْسِكُ الَّتِیْ قَضٰی عَلَیْهَا الْمَوْتَ وَیُرْسِلُ الْاُخْرٰۤی اِلٰۤی اَجَلٍ مُّسَمًّی ؕ— اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیٰتٍ لِّقَوْمٍ یَّتَفَكَّرُوْنَ ۟
అల్లాహ్ యే ఆత్మలను (ప్రాణాలను) మరణ కాలమున వశపరచుకునేవాడు మరియు మరణించని వాడి (ఆత్మలను) నిద్రావస్థలో (వశపరచుకునే వాడునూ). తరువాత దేనికైతే మరణం నిర్ణయింప బడుతుందో దానిని ఆపుకొని, మిగతా వారి (ఆత్మలను) ఒక నియమిత కాలం వరకు తిరిగి పంపుతాడు. [1] నిశ్చయంగా ఇందులో ఆలోచించే వారికి గొప్ప సూచనలు (ఆయాత్) ఉన్నాయి.
[1] చూడండి, 6:60-61.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
اَمِ اتَّخَذُوْا مِنْ دُوْنِ اللّٰهِ شُفَعَآءَ ؕ— قُلْ اَوَلَوْ كَانُوْا لَا یَمْلِكُوْنَ شَیْـًٔا وَّلَا یَعْقِلُوْنَ ۟
ఏమీ? వారు అల్లాహ్ ను వదలి ఇతరులను సిఫారసుదారులుగా చేసుకున్నారా? వారిని ఇలా అడుగు: "ఏమీ? వారికెలాంటి అధికారం లేకున్నా మరియు వారికి బుద్ధి లేకున్నానా?" [1]
[1] చూడండి, 2:255. అల్లాహ్ (సు.తా.) అనుమతిచ్చిన వాడు తప్ప మరెవ్వరూ సిఫారసు చేయలేరు. ఇంకా చూడండి 20:109, 21:28 లేక 34:23. పునరుత్థాన దినమున అల్లాహ్ (సు.తా.) తన ప్రవక్తలకు సిఫారసు చేయటానికి అనుమతిస్తాడు, అలాంటి వారి కొరకు ఎవరి పశ్చాత్తాపాన్నైతే అల్లాహ్ (సు.తా.) అంగీకరించాడో! చూడండి, 19:87. అల్లాహ్ (సు.తా.) దగ్గర ఎవ్వరి సిఫారసు అవసరం లేదు. ఆయన సర్వజ్ఞుడు. ఆయన తాను కోరినదే చేస్తాడు. అలాంటప్పుడు కేవలం ఆ ఏకైక ప్రభువు, అల్లాహ్ (సు.తా.) ఆరాధననే ఎందుకు చేయకూడదు? అప్పుడు ఎవ్వరి సిఫారసు అవసరముండదు.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
قُلْ لِّلّٰهِ الشَّفَاعَةُ جَمِیْعًا ؕ— لَهٗ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— ثُمَّ اِلَیْهِ تُرْجَعُوْنَ ۟
ఇలా అను: "సిఫారసు కేవలం అల్లాహ్ అధీనంలోనే ఉంది. భూమ్యాకాశాల సామ్రాజ్యాధి పత్యం కేవలం ఆయనకే చెందుతుంది. తరువాత ఆయన వైపునకే మీరంతా మరలింప బడతారు."
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَاِذَا ذُكِرَ اللّٰهُ وَحْدَهُ اشْمَاَزَّتْ قُلُوْبُ الَّذِیْنَ لَا یُؤْمِنُوْنَ بِالْاٰخِرَةِ ۚ— وَاِذَا ذُكِرَ الَّذِیْنَ مِنْ دُوْنِهٖۤ اِذَا هُمْ یَسْتَبْشِرُوْنَ ۟
మరియు ఒకవేళ అద్వితీయుడైన అల్లాహ్ ను గురించి ప్రస్తావన జరిగినపుడు, పరలోకాన్ని విశ్వసించని వారి హృదయాలు క్రుంగిపోతాయి. మరియు ఒకవేళ ఆయన తప్ప ఇతరుల ప్రస్తావన జరిగినపుడు వారు సంతోషంతో పొంగిపోతారు!
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
قُلِ اللّٰهُمَّ فَاطِرَ السَّمٰوٰتِ وَالْاَرْضِ عٰلِمَ الْغَیْبِ وَالشَّهَادَةِ اَنْتَ تَحْكُمُ بَیْنَ عِبَادِكَ فِیْ مَا كَانُوْا فِیْهِ یَخْتَلِفُوْنَ ۟
ఇలా అను: "ఓ అల్లాహ్! భూమ్యాకాశాల సృష్టికి మాలాధారుడా! అగోచర గోచరాలను ఎరిగినవాడా! నీవే నీ దాసుల మధ్య ఉన్న భేదాభిప్రాయాలను గురించి తీర్పు చేసేవాడవు."
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَلَوْ اَنَّ لِلَّذِیْنَ ظَلَمُوْا مَا فِی الْاَرْضِ جَمِیْعًا وَّمِثْلَهٗ مَعَهٗ لَافْتَدَوْا بِهٖ مِنْ سُوْٓءِ الْعَذَابِ یَوْمَ الْقِیٰمَةِ ؕ— وَبَدَا لَهُمْ مِّنَ اللّٰهِ مَا لَمْ یَكُوْنُوْا یَحْتَسِبُوْنَ ۟
మరియు ఒకవేళ వాస్తవానికి ఈ దుర్మార్గుల వద్ద భూమిలో ఉన్న సమస్తమూ మరియు దానితో పాటు దానంత (రెట్టింపు) సంపద ఉన్నా పునరుత్థాన దినపు ఘోరశిక్ష నుండి తప్పించుకోవటానికి, వారు దానిని పరిహారంగా ఇవ్వగోరుతారు.[1] ఎందుకంటే! అల్లాహ్ తరఫు నుండి వారి ముందు, వారు ఎన్నడూ లెక్కించనిదంతా ప్రత్యక్షమవుతుంది.
[1] చూడండి, 3:91. కాని అది, స్వీకరించబడదు. దీనికి ఇంకా చూడండి 2:48.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَبَدَا لَهُمْ سَیِّاٰتُ مَا كَسَبُوْا وَحَاقَ بِهِمْ مَّا كَانُوْا بِهٖ یَسْتَهْزِءُوْنَ ۟
మరియు వారు చేసి వున్న దుష్టకార్యాలన్నీ స్పష్టంగా వారి ముందుకు వస్తాయి. మరియు వారు ఎగతాళి చేస్తూ వచ్చిందే వారిని చుట్టుకుంటుంది.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
فَاِذَا مَسَّ الْاِنْسَانَ ضُرٌّ دَعَانَا ؗ— ثُمَّ اِذَا خَوَّلْنٰهُ نِعْمَةً مِّنَّا ۙ— قَالَ اِنَّمَاۤ اُوْتِیْتُهٗ عَلٰی عِلْمٍ ؕ— بَلْ هِیَ فِتْنَةٌ وَّلٰكِنَّ اَكْثَرَهُمْ لَا یَعْلَمُوْنَ ۟
ఒకవేళ మానవునికి ఆపద వస్తే అతడు మమ్మల్ని వేడుకుంటాడు. ఆ తరువాత మేము మా దిక్కు నుండి అతనికి అనుగ్రహాన్ని ప్రసాదిస్తే అతడు: "నిశ్చయంగా, ఇది నాకున్న తెలివి వల్ల నాకు ఇవ్వబడింది!" [1] అని అంటాడు. వాస్తవానికి, అది ఒక పరీక్ష, కాని చాలా మంది ఇది తెలుసుకోలేరు.
[1] చూడండి, 28:78.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
قَدْ قَالَهَا الَّذِیْنَ مِنْ قَبْلِهِمْ فَمَاۤ اَغْنٰی عَنْهُمْ مَّا كَانُوْا یَكْسِبُوْنَ ۟
వాస్తవానికి, వీరికి పూర్వం గతించిన వారు కూడా ఇలాగే అన్నారు, కాని వారు సంపాదించినదంతా వారికి ఏ విధంగానూ పనికి రాలేదు.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
فَاَصَابَهُمْ سَیِّاٰتُ مَا كَسَبُوْا ؕ— وَالَّذِیْنَ ظَلَمُوْا مِنْ هٰۤؤُلَآءِ سَیُصِیْبُهُمْ سَیِّاٰتُ مَا كَسَبُوْا ۙ— وَمَا هُمْ بِمُعْجِزِیْنَ ۟
కావున, వారు చేసిన దుష్కార్యాల ఫలితాలు వారిపై పడ్డాయి. మరియు వారిలోని దుర్మార్గులు తాము చేసిన దుష్కార్యాల ఫలితాలను త్వరలోనే అనుభవించగలరు. మరియు వారు ఏ విధంగానూ తప్పించుకోలేరు.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
اَوَلَمْ یَعْلَمُوْۤا اَنَّ اللّٰهَ یَبْسُطُ الرِّزْقَ لِمَنْ یَّشَآءُ وَیَقْدِرُ ؕ— اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیٰتٍ لِّقَوْمٍ یُّؤْمِنُوْنَ ۟۠
ఏమీ? వారికి తెలియదా? నిశ్చయంగా అల్లాహ్ తాను కోరిన వారికి జీవనోపాధిని పుష్కలంగా ప్రసాదిస్తాడని మరియు (తాను కోరిన వారికి) మితంగా ఇస్తాడని? నిశ్చయంగా, ఇందులో విశ్వసించేవారికి ఎన్నో సూచనలు (ఆయాత్) ఉన్నాయి.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
قُلْ یٰعِبَادِیَ الَّذِیْنَ اَسْرَفُوْا عَلٰۤی اَنْفُسِهِمْ لَا تَقْنَطُوْا مِنْ رَّحْمَةِ اللّٰهِ ؕ— اِنَّ اللّٰهَ یَغْفِرُ الذُّنُوْبَ جَمِیْعًا ؕ— اِنَّهٗ هُوَ الْغَفُوْرُ الرَّحِیْمُ ۟
ఇలా అను: "స్వయంగా మీకు (మీ ఆత్మలకు) మీరే అన్యాయం చేసుకున్న నా దాసులారా! అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా, అల్లాహ్ అన్ని పాపాలను క్షమిస్తాడు. [1] నిశ్చయంగా ఆయన! కేవలం ఆయనే క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత."
[1] చూడండి, 6:54 మరియు 4:110..
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَاَنِیْبُوْۤا اِلٰی رَبِّكُمْ وَاَسْلِمُوْا لَهٗ مِنْ قَبْلِ اَنْ یَّاْتِیَكُمُ الْعَذَابُ ثُمَّ لَا تُنْصَرُوْنَ ۟
మరియు మీరు పశ్చాత్తాపంతో మీ ప్రభువు వైపునకు మరలండి మరియు మీ పైకి శిక్ష రాకముందే, మీరు ఆయనకు విధేయులు (ముస్లింలు) అయి ఉండండి, తరువాత మీకు ఎలాంటి సహాయం లభించదు.[1]
[1] మరణం ఆసన్నమైనప్పుడు పడే పశ్చాత్తాపం అంగీకరించబడదు. చూడండి, 4:18.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَاتَّبِعُوْۤا اَحْسَنَ مَاۤ اُنْزِلَ اِلَیْكُمْ مِّنْ رَّبِّكُمْ مِّنْ قَبْلِ اَنْ یَّاْتِیَكُمُ الْعَذَابُ بَغْتَةً وَّاَنْتُمْ لَا تَشْعُرُوْنَ ۟ۙ
మరియు మీకు తెలియకుండానే అకస్మాత్తుగా, మీపైకి శిక్ష రాకముందే మీ ప్రభువు తరఫు నుండి మీ కొరకు అవతరింప జేయబడిన శ్రేష్ఠమైన దానిని (ఈ ఖుర్ఆన్ ను) అనుసరించండి.[1]
[1] ఈ శిక్ష ఇహలోకంలో వచ్చే ఆపదలు.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
اَنْ تَقُوْلَ نَفْسٌ یّٰحَسْرَتٰی عَلٰی مَا فَرَّطْتُ فِیْ جَنْۢبِ اللّٰهِ وَاِنْ كُنْتُ لَمِنَ السّٰخِرِیْنَ ۟ۙ
లేకపోతే మానవుడు: "నా పాడుగానూ! నేను అల్లాహ్ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉండకపోతే మరియు ఎగతాళి చేసేవారిలో చేరి ఉండకపోతే ఎంత బాగుండేది!" అని పశ్చాత్తాప పడవచ్చు!
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
اَوْ تَقُوْلَ لَوْ اَنَّ اللّٰهَ هَدٰىنِیْ لَكُنْتُ مِنَ الْمُتَّقِیْنَ ۟ۙ
లేక, ఇలా అనవచ్చు: "ఒకవేళ అల్లాహ్ నాకు సన్మార్గం చూపి వుంటే, నేను కూడా దైవభీతి గలవారిలో చేరిపోయేవాడిని కదా!" [1]
[1] చూడండి, 6:148.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
اَوْ تَقُوْلَ حِیْنَ تَرَی الْعَذَابَ لَوْ اَنَّ لِیْ كَرَّةً فَاَكُوْنَ مِنَ الْمُحْسِنِیْنَ ۟
లేక శిక్షను చూసి ఇలా అనవచ్చు: "ఒకవేళ నాకు మరల (ఇహలోకానికి) పోయే అవకాశం దొరికి ఉంటే నేను తప్పక సజ్జనులలో చేరి పోయేవాడిని కదా!" [1]
[1] చూడండి, 2:167, 26:102 మరియు 6:27-28.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
بَلٰی قَدْ جَآءَتْكَ اٰیٰتِیْ فَكَذَّبْتَ بِهَا وَاسْتَكْبَرْتَ وَكُنْتَ مِنَ الْكٰفِرِیْنَ ۟
(అప్పుడు అతనికి అల్లాహ్ ఇలా సెలవిస్తాడు): "అలా కాదు! వాస్తవానికి నా సూచనలు (ఆయాత్) నీ వద్దకు వచ్చాయి. కాని నీవు వాటిని అబద్ధాలని తిరస్కరించావు మరియు గర్వానికి లోనయ్యావు మరియు నీవు సత్యతిరస్కారులలో చేరిపోయావు."
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَیَوْمَ الْقِیٰمَةِ تَرَی الَّذِیْنَ كَذَبُوْا عَلَی اللّٰهِ وُجُوْهُهُمْ مُّسْوَدَّةٌ ؕ— اَلَیْسَ فِیْ جَهَنَّمَ مَثْوًی لِّلْمُتَكَبِّرِیْنَ ۟
మరియు పునరుత్థాన దినమున అల్లాహ్ పై అబద్ధాలు పలికిన వారి ముఖాలను నల్లగా మారిపోవటాన్ని నీవు గమనిస్తావు. ఏమీ? ఈ గర్విష్టుల నివాసం నరకంలోనే ఉండదా?
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَیُنَجِّی اللّٰهُ الَّذِیْنَ اتَّقَوْا بِمَفَازَتِهِمْ ؗ— لَا یَمَسُّهُمُ السُّوْٓءُ وَلَا هُمْ یَحْزَنُوْنَ ۟
మరియు అల్లాహ్, భయభక్తులు గలవారిని వారి సాఫల్యానికి బదులుగా వారికి ముక్తిని ప్రసాదిస్తాడు. ఎలాంటి బాధ వారిని ముట్టుకోదు మరియు వారు దుఃఖపడరు కూడా!
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
اَللّٰهُ خَالِقُ كُلِّ شَیْءٍ ؗ— وَّهُوَ عَلٰی كُلِّ شَیْءٍ وَّكِیْلٌ ۟
అల్లాహ్ యే ప్రతి దాని సృష్టికర్త మరియు ఆయనే ప్రతి దానికి కార్యకర్త. [1]
[1] అల్- వకీలు: కార్యకర్త, చూడండి, 3:173 వ్యాఖ్యాత 2.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
لَهٗ مَقَالِیْدُ السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— وَالَّذِیْنَ كَفَرُوْا بِاٰیٰتِ اللّٰهِ اُولٰٓىِٕكَ هُمُ الْخٰسِرُوْنَ ۟۠
ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న నిక్షేపాల తాళపు చెవులు ఆయన వద్దనే ఉన్నాయి. మరియు ఎవరైతే అల్లాహ్ సూచనలను (ఆయాత్ లను) తిరస్కరిస్తారో అలాంటి వారు. వారే! నష్టానికి గురి అయ్యే వారు.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
قُلْ اَفَغَیْرَ اللّٰهِ تَاْمُرُوْٓنِّیْۤ اَعْبُدُ اَیُّهَا الْجٰهِلُوْنَ ۟
(ఓ ప్రవక్తా!) ఇలా అను: "ఓ మూర్ఖులారా! ఏమీ? అల్లాహ్ ను వదలి, ఇతరులను ఆరాధించమని, మీరు నన్ను ఆజ్ఞాపిస్తున్నారా?"
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَلَقَدْ اُوْحِیَ اِلَیْكَ وَاِلَی الَّذِیْنَ مِنْ قَبْلِكَ ۚ— لَىِٕنْ اَشْرَكْتَ لَیَحْبَطَنَّ عَمَلُكَ وَلَتَكُوْنَنَّ مِنَ الْخٰسِرِیْنَ ۟
మరియు వాస్తవానికి! నీకూ మరియు నీకంటే ముందు వచ్చిన (ప్రతి ప్రవక్తకూ) దివ్యజ్ఞానం (వహీ) ద్వారా ఇలా తెలుపబడింది: "ఒకవేళ నీవు బహుదైవారాధన (షిర్కు) చేసినట్లైతే నీ కర్మలన్నీ వ్యర్థమై పోతాయి మరియు నిశ్చయంగా, నీవు నష్టానికి గురి అయిన వారిలో చేరిపోతావు."
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
بَلِ اللّٰهَ فَاعْبُدْ وَكُنْ مِّنَ الشّٰكِرِیْنَ ۟
అలా కాదు! నీవు కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించు మరియు కృతజ్ఞులలో చేరిపో!
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَمَا قَدَرُوا اللّٰهَ حَقَّ قَدْرِهٖ ۖۗ— وَالْاَرْضُ جَمِیْعًا قَبْضَتُهٗ یَوْمَ الْقِیٰمَةِ وَالسَّمٰوٰتُ مَطْوِیّٰتٌ بِیَمِیْنِهٖ ؕ— سُبْحٰنَهٗ وَتَعٰلٰی عَمَّا یُشْرِكُوْنَ ۟
వారు అల్లాహ్ సామర్ధ్యాన్ని గుర్తించ వలసిన విధంగా గుర్తించలేదు; పునరుత్థాన దినమున భూమి అంతా ఆయన పిడికిలిలో ఉంటుంది; మరియు ఆకాశాలన్నీ చుట్టబడి ఆయన కుడిచేతిలో ఉంటాయి. [1] ఆయన సర్వలోపాలకు అతీతుడు మరియు వారు కల్పించే భాగస్వాముల కంటే అత్యున్నతుడు.
[1] ఇటువంటి వాక్యం కోసం చూడండి, 21:104.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَنُفِخَ فِی الصُّوْرِ فَصَعِقَ مَنْ فِی السَّمٰوٰتِ وَمَنْ فِی الْاَرْضِ اِلَّا مَنْ شَآءَ اللّٰهُ ؕ— ثُمَّ نُفِخَ فِیْهِ اُخْرٰی فَاِذَا هُمْ قِیَامٌ یَّنْظُرُوْنَ ۟
మరియు బాకా (సూర్) ఊదబడినప్పుడు ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న వారందరూ మూర్ఛిల్లి పడిపోతారు అల్లాహ్ కోరిన వారు తప్ప. ఆ తరువాత రెండవసారి (బాకా) ఊదబడుతుంది అప్పుడు వారందరూ లేచి చూడటం ప్రారంభిస్తారు. [1]
[1] రెండవసారి ఊదబడే బాకాకై చూడండి, 37:19. అబూ-హురైరహ్ కథనం. దైవప్రవక్త ('స'అస) అన్నారు : "రెండవ బాకా ఊదబడిన తరువాత, నేనే అందరి కంటే ముందు తలెత్తి చూస్తాను. అప్పుడు మూసా ('అ.స.) 'అర్ష్ ను పట్టుకొని ఉంటారు. అతను ('అ.స.) ఆ స్థితిలో మొదటి నుండే ఉన్నారా లేక రెండవ బాకా ఊదబడిన తరువాతనా అనేది, నాకు తెలియదు." ('స'హీ'హ్ బు'ఖారీ పు. 6 'హ. నం. 337).
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَاَشْرَقَتِ الْاَرْضُ بِنُوْرِ رَبِّهَا وَوُضِعَ الْكِتٰبُ وَجِایْٓءَ بِالنَّبِیّٖنَ وَالشُّهَدَآءِ وَقُضِیَ بَیْنَهُمْ بِالْحَقِّ وَهُمْ لَا یُظْلَمُوْنَ ۟
మరియు భూమి తన ప్రభువు తేజస్సుతో వెలిగి పోతుంది [1] మరియు కర్మపత్రం వారి యెదుట ఉంచబడుతుంది, [2] ప్రవక్తలు మరియు (ఇతర) సాక్షులు రప్పింపబడతారు. [3] మరియు వారి మధ్య న్యాయంగా తీర్పు చేయబడుతుంది మరియు వారికెట్టి అన్యాయం జరుగదు.
[1] చూడండి, 14:48. "పునరుత్థాన దినమున ఈ భూమి మరొక భూమిగా మార్చబడుతుంది మరియు ఆకాశాలు కూడా." ఇంకా చూడండి 20:105-107.
[2] చూడండి 17:13-14 మరియు 18:49.
[3] చూడండి 6:130, 17:14, 24:24, 36:65 మరియు 41:20 వీటన్నింటిలో మానవుని అవయవాలు, అతనికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాయని ఉంది. ఇక 4:41 లో ప్రవక్తలందరూ తమ తమ సమాజం వారికి సాక్ష్యులుగా ఉంటారని ఉంది.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَوُفِّیَتْ كُلُّ نَفْسٍ مَّا عَمِلَتْ وَهُوَ اَعْلَمُ بِمَا یَفْعَلُوْنَ ۟۠
మరియు ప్రతి వ్యక్తి (ఆత్మ) తాను చేసిన కర్మలకు పూర్తి ప్రతిఫలం పొందుతాడు. [1] ఎందుకంటే వారు చేస్తున్న దంతా ఆయనకు బాగా తెలుసు.
[1] చూడండి, 99:7-8.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَسِیْقَ الَّذِیْنَ كَفَرُوْۤا اِلٰی جَهَنَّمَ زُمَرًا ؕ— حَتّٰۤی اِذَا جَآءُوْهَا فُتِحَتْ اَبْوَابُهَا وَقَالَ لَهُمْ خَزَنَتُهَاۤ اَلَمْ یَاْتِكُمْ رُسُلٌ مِّنْكُمْ یَتْلُوْنَ عَلَیْكُمْ اٰیٰتِ رَبِّكُمْ وَیُنْذِرُوْنَكُمْ لِقَآءَ یَوْمِكُمْ هٰذَا ؕ— قَالُوْا بَلٰی وَلٰكِنْ حَقَّتْ كَلِمَةُ الْعَذَابِ عَلَی الْكٰفِرِیْنَ ۟
సత్యాన్ని తిరస్కరించిన వారు గుంపులు గుంపులుగా నరకం వైపునకు తోలబడతారు. చివరకు వారు దాని వద్దకు వచ్చినపుడు, దాని ద్వారాలు తెరువబడతాయి మరియు వారితో దాని రక్షకులు ఇలా అంటారు: "ఏమీ? మీలో నుండి, మీ ప్రభువు సూచనలను వినిపించే సందేశహరులు మీ వద్దకు రాలేదా? మరియు వారు మిమ్మల్ని ఈనాటి మీ సమావేశాన్ని గురించి హెచ్చరించలేదా?" వారంటారు: "అవును (హెచ్చరించారు)!" కాని (అప్పటికే) సత్యతిరస్కారులపై శిక్షా నిర్ణయం తీసుకోబడి ఉంటుంది. [1]
[1] చూడండి, 67:8-10 చూడండి,.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
قِیْلَ ادْخُلُوْۤا اَبْوَابَ جَهَنَّمَ خٰلِدِیْنَ فِیْهَا ۚ— فَبِئْسَ مَثْوَی الْمُتَكَبِّرِیْنَ ۟
వారితో ఇలా అనబడుతుంది: "నరక ద్వారాలలోనికి ప్రవేశించండి, ఇక్కడ మీరు శాశ్వతంగా ఉంటారు. గర్విష్ఠుల నివాస స్థలం ఎంత చెడ్డది!"
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَسِیْقَ الَّذِیْنَ اتَّقَوْا رَبَّهُمْ اِلَی الْجَنَّةِ زُمَرًا ؕ— حَتّٰۤی اِذَا جَآءُوْهَا وَفُتِحَتْ اَبْوَابُهَا وَقَالَ لَهُمْ خَزَنَتُهَا سَلٰمٌ عَلَیْكُمْ طِبْتُمْ فَادْخُلُوْهَا خٰلِدِیْنَ ۟
మరియు తమ ప్రభువు పట్ల భయభక్తులు గలవారు గుంపులు గుంపులుగా స్వర్గం వైపునకు తీసుకొని పోబడతారు. చివరకు వారు దాని దగ్గరికి వచ్చినప్పుడు, దాని ద్వారాలు తెరువ బడతాయి [1] మరియు దాని రక్షకులు వారితో అంటారు: "మీకు శాంతి కలుగు గాక (సలాం)! మీరు మంచిగా ప్రవర్తించారు, కావున ఇందులో శాశ్వతంగా ఉండటానికి ప్రవేశించండి!"
[1] చూడండి, 38:50 స్వర్గానికి ఎనిమిది ద్వారాలున్నాయి. వాటిలో ఒకటి 'రయ్యాన్' దాని గుండా ఉపవాసాలు ఉండే వారు ప్రవేశిస్తారు. ('స'హీ'హ్ బు'ఖారీ, నం. 2257, ముస్లిం నం. 808) ఇతర ద్వారాలకు కూడా పేర్లున్నాయి. బాబ్ అ'స్సలాహ్, బాబ్ అ'స్సదఖహ్, బాబ్ అజ్జిహాద్ మొదలైనవి ('స'హీ'హ్ బు'ఖారీ, 'స'హీ'హ్ ముస్లిం).
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَقَالُوا الْحَمْدُ لِلّٰهِ الَّذِیْ صَدَقَنَا وَعْدَهٗ وَاَوْرَثَنَا الْاَرْضَ نَتَبَوَّاُ مِنَ الْجَنَّةِ حَیْثُ نَشَآءُ ۚ— فَنِعْمَ اَجْرُ الْعٰمِلِیْنَ ۟
మరియు వారంటారు: "మాకు చేసిన వాగ్దానాన్ని నిజం చేసి చూపిన అల్లాహ్ యే సర్వస్తోత్రాలకు అర్హుడు మరియు ఆయనే మమ్మల్ని ఈ నేలకు వారసులుగా చేశాడు. స్వర్గంలో మేము కోరిన చోట స్థిరనివాసం ఏర్పరచుకోగలము! సత్కార్యాలు చేసేవారి ప్రతిఫలం ఎంత ఉత్తమమైనది!"
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَتَرَی الْمَلٰٓىِٕكَةَ حَآفِّیْنَ مِنْ حَوْلِ الْعَرْشِ یُسَبِّحُوْنَ بِحَمْدِ رَبِّهِمْ ۚ— وَقُضِیَ بَیْنَهُمْ بِالْحَقِّ وَقِیْلَ الْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعٰلَمِیْنَ ۟۠
మరియు దైవదూతలను తమ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ, ఆయనను స్తుతిస్తూ, ఆయన సింహాసనాన్ని (అర్ష్ ను) అన్ని వైపుల నుండి చుట్టుకొని ఉండటాన్ని నీవు చూస్తావు. [1] మరియు వారి (సర్వ ప్రాణుల) మధ్య న్యాయంగా తీర్పు చేయబడుతుంది మరియు : "సర్వస్తోత్రాలకు అర్హుడైన అల్లాహ్ యే సమస్త లోకాలకు ప్రభువు." అని పలుకబడుతుంది.
[1] చూడండి, 7:54.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
 
భావార్ధాల అనువాదం సూరహ్: సూరహ్ అజ్-జుమర్
సూరాల విషయసూచిక పేజీ నెంబరు
 
పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - తెలుగు అనువాదం - అనువాదాల విషయసూచిక

ఖుర్ఆన్ యొక్క అర్థాలను తెలుగులొ అనువదించడం. దాని అనువాదకులు అబ్దుర్రహీమ్ ఇబ్నె ముహమ్మద్.

మూసివేయటం