పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - తెలుగు అనువాదం * - అనువాదాల విషయసూచిక

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

భావార్ధాల అనువాదం వచనం: (143) సూరహ్: సూరహ్ అన్-నిసా
مُّذَبْذَبِیْنَ بَیْنَ ذٰلِكَ ۖۗ— لَاۤ اِلٰی هٰۤؤُلَآءِ وَلَاۤ اِلٰی هٰۤؤُلَآءِ ؕ— وَمَنْ یُّضْلِلِ اللّٰهُ فَلَنْ تَجِدَ لَهٗ سَبِیْلًا ۟
వారు (విశ్వాస - అవిశ్వాసాల) మధ్య ఊగిసలాడుతున్నారు. వారు పూర్తిగా ఇటు (విశ్వాసులు) కాకుండా, పూర్తిగా అటు (సత్యతిరస్కారులు) కాకుండా ఉన్నారు. మరియు ఎవడినైతే అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో పడవేస్తాడో అలాంటి వాడికి నీవు (సరైన) మార్గం చూపలేవు.[1]
[1] ఎవరైతే బుద్ధిపూర్వకంగా మార్గభ్రష్టత్వాన్ని, కుఫ్ర్ మరియు షిర్క్ ను ఎన్నుకుంటారో! వారికి అల్లాహ్ (సు.తా.) సన్మార్గం వైపుకు మార్గదర్శకత్వం చేయడు. ఎందుకంటే అల్లాహుతా'ఆలా మానవులకు మరియు జిన్నాతులకు విచక్షణా బుద్ధినిచ్చాడు. ప్రవక్తల ద్వారా మరియు దివ్యగ్రంథాల ద్వారా వారి వద్దకు మార్గదర్శకత్వాన్ని పంపాడు. అయినా వారు తమ తలబిరుసుతనంతో షై'తాన్ వలలో పడిపోయి, షై'తాన్ అడుగుజాడలలో నడుస్తున్నారు. అల్లాహ్ (సు.తా.)కు జరిగిపోయింది, జరగనున్నది అంతా తెలుసు. అల్లాహుతా'ఆలా ఆలిముల్'గైబ్. దుష్టులు సన్మార్గం వైపునకు రారని అల్లాహ్ (సు.తా.) కు తెలుసు కాబట్టి, వారిని మార్గభ్రష్టత్వంలో పడి ఉండనిస్తాడే కానీ, వారిని బలవంతంగా మార్బ్గభ్రష్టత్వంలోకి త్రోయడు.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
 
భావార్ధాల అనువాదం వచనం: (143) సూరహ్: సూరహ్ అన్-నిసా
సూరాల విషయసూచిక పేజీ నెంబరు
 
పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - తెలుగు అనువాదం - అనువాదాల విషయసూచిక

ఖుర్ఆన్ యొక్క అర్థాలను తెలుగులొ అనువదించడం. దాని అనువాదకులు అబ్దుర్రహీమ్ ఇబ్నె ముహమ్మద్.

మూసివేయటం