Check out the new design

పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - తెలుగు అనువాదం * - అనువాదాల విషయసూచిక

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

భావార్ధాల అనువాదం సూరహ్: అన్-నబఅ   వచనం:

అన్-నబఅ

عَمَّ یَتَسَآءَلُوْنَ ۟ۚ
ఏ విషయాన్ని గురించి వారు (ఒకరినొకరు) ప్రశ్నించుకుంటున్నారు?[1]
[1] దైవప్రవక్త ('స'అస) పై అవతరింపజేయబడిన ఖుర్ఆన్ ను మరియు అతనిని ప్రవక్తగా అల్లాహ్ (సు.తా.) ఎన్నుకున్న విషయాన్ని నమ్మలేక సత్యతిరస్కారులు ఒకరితో నొకరు ఈ విధంగా ప్రశ్నించుకున్నారు: "ఏమీ? పునరుత్థానం నిజమేనా? ఇతడు వాస్తవంగానే ప్రవక్తనా?" మొదలైనవి. దానిని అల్లాహ్ (సు.తా.) స్వయంగా జవాబిచ్చాడు.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
عَنِ النَّبَاِ الْعَظِیْمِ ۟ۙ
ఆ మహా వార్తను గురించేనా?
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
الَّذِیْ هُمْ فِیْهِ مُخْتَلِفُوْنَ ۟ؕ
దేనిని గురించైతే వారు భేదాభిప్రాయాలను కలిగి ఉన్నారో?
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
كَلَّا سَیَعْلَمُوْنَ ۟ۙ
అది కాదు! వారు త్వరలోనే దానిని తెలుసుకోగలరు.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
ثُمَّ كَلَّا سَیَعْلَمُوْنَ ۟
ఎంత మాత్రము కాదు! వారు త్వరలోనే దానిని తెలుసుకోగలరు.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
اَلَمْ نَجْعَلِ الْاَرْضَ مِهٰدًا ۟ۙ
ఏమీ? మేము భూమిని పరుపుగా చేయలేదా?
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَّالْجِبَالَ اَوْتَادًا ۟ۙ
మరియు పర్వతాలను మేకులుగా?[1]
[1] చూడండి, 16:15.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَّخَلَقْنٰكُمْ اَزْوَاجًا ۟ۙ
మరియు మేము మిమ్మల్ని (స్త్రీ-పురుషుల) జంటలుగా సృష్టించాము.[1]
[1] మానవులలో, జంతువులలో మరియు ఇతర ప్రాణంలేని వస్తువులలో కూడా జంటలున్నాయి. ఉదా: రాత్రిం-బవళ్ళు, సూర్య-చంద్రులు, ఆకాశం-భూమి, నలుపు-తెలుపు మొదలైనవి. ఇంకా చూడండి, 36:36.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَّجَعَلْنَا نَوْمَكُمْ سُبَاتًا ۟ۙ
మరియు మేము నిద్రను, మీకు విశ్రాంతి నిచ్చేదిగా చేశాము.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَّجَعَلْنَا الَّیْلَ لِبَاسًا ۟ۙ
మరియు రాత్రిని ఆచ్ఛాదనగా చేశాము.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَّجَعَلْنَا النَّهَارَ مَعَاشًا ۟ۚ
మరియు పగటిని జీవనోపాధి సమయంగా చేశాము.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَبَنَیْنَا فَوْقَكُمْ سَبْعًا شِدَادًا ۟ۙ
మరియు మేము మీపైన పటిష్టమైన ఏడు (ఆకాశాలను) నిర్మించాము.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَّجَعَلْنَا سِرَاجًا وَّهَّاجًا ۟ۙ
మరియు (అందులో) ప్రకాశించే దీపాన్ని (సూర్యుణ్ణి) ఉంచాము.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَّاَنْزَلْنَا مِنَ الْمُعْصِرٰتِ مَآءً ثَجَّاجًا ۟ۙ
మరియు మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపించాము.[1]
[1] ము'అ'సిరాత్: నీటితో నిండి ఉండి ఇంకా కురవని మేఘాలు.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
لِّنُخْرِجَ بِهٖ حَبًّا وَّنَبَاتًا ۟ۙ
దానితో మేము ధాన్యం మరియు పచ్చికను (చెట్లు చేమలను) పెరిగించటానికి!
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَّجَنّٰتٍ اَلْفَافًا ۟ؕ
మరియు దట్టమైన తోటలను.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
اِنَّ یَوْمَ الْفَصْلِ كَانَ مِیْقَاتًا ۟ۙ
నిశ్చయంగా, తీర్పుదినం ఒక నిర్ణీత సమయం.[1]
[1] చూడండి, 77:13.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
یَّوْمَ یُنْفَخُ فِی الصُّوْرِ فَتَاْتُوْنَ اَفْوَاجًا ۟ۙ
ఆ రోజు బాకా ఊదబడినప్పుడు! అప్పుడు మీరంతా గుంపులు గుంపులుగా లేచి వస్తారు.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَّفُتِحَتِ السَّمَآءُ فَكَانَتْ اَبْوَابًا ۟ۙ
మరియు ఆకాశం తెరువబడుతుంది, అందులో ద్వారాలు ఏర్పడుతాయి;
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَّسُیِّرَتِ الْجِبَالُ فَكَانَتْ سَرَابًا ۟ؕ
మరియు పర్వతాలు ఎండమావులుగా అదృశ్యమై పోతాయి.[1]
[1] చూడండి, 69:14, 14:48, 101:5, 70:9, 56:6, 20:105, మొదలైనవి.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
اِنَّ جَهَنَّمَ كَانَتْ مِرْصَادًا ۟ۙ
నిశ్చయంగా, నరకం ఒక మాటు;
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
لِّلطَّاغِیْنَ مَاٰبًا ۟ۙ
ధిక్కారుల గమ్యస్థానం;
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
لّٰبِثِیْنَ فِیْهَاۤ اَحْقَابًا ۟ۚ
అందులో వారు యుగాల తరబడి ఉంటారు.[1]
[1] చూడండి 6:128 మరియు 11:107.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
لَا یَذُوْقُوْنَ فِیْهَا بَرْدًا وَّلَا شَرَابًا ۟ۙ
అందులో వారు ఎలాంటి చల్లదనాన్ని గానీ మరియు (చల్లని) పానీయాన్ని గానీ చవి చూడరు.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
اِلَّا حَمِیْمًا وَّغَسَّاقًا ۟ۙ
సలసల కాగే నీరు మరియు చీము లాంటి మురికి (పానీయం)[1]
[1] చూడండి, 38:57-58.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
جَزَآءً وِّفَاقًا ۟ؕ
(వారి కర్మలకు) తగిన పూర్తి ప్రతిఫలంగా!
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
اِنَّهُمْ كَانُوْا لَا یَرْجُوْنَ حِسَابًا ۟ۙ
వాస్తవానికి వారు లెక్క తీసుకోబడుతుందని ఆశించలేదు.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَّكَذَّبُوْا بِاٰیٰتِنَا كِذَّابًا ۟ؕ
పైగా వారు మా సూచనలను (ఆయాత్ లను) అసత్యాలని తిరస్కరించారు.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
وَكُلَّ شَیْءٍ اَحْصَیْنٰهُ كِتٰبًا ۟ۙ
మరియు మేము (వారు చేసిన) ప్రతిదానిని ఒక పుస్తకంలో వ్రాసి పెట్టాము.[1]
[1] చూడండి, 36:12.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
فَذُوْقُوْا فَلَنْ نَّزِیْدَكُمْ اِلَّا عَذَابًا ۟۠
కావున మీరు (మీ కర్మల ఫలితాన్ని) చవి చూడండి. ఎందుకంటే, మేము మీకు శిక్ష తప్ప మరేమీ అధికం చేయము.[1]
[1] చూడండి, 4:56, 17:97.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
 
భావార్ధాల అనువాదం సూరహ్: అన్-నబఅ
సూరాల విషయసూచిక పేజీ నెంబరు
 
పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - తెలుగు అనువాదం - అనువాదాల విషయసూచిక

దాని అనువాదకులు అబ్దుర్రహీమ్ ఇబ్నె ముహమ్మద్.

మూసివేయటం