Check out the new design

قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى * - تەرجىمىلەر مۇندەرىجىسى


مەنالار تەرجىمىسى سۈرە: بەقەرە   ئايەت:
اَلْحَجُّ اَشْهُرٌ مَّعْلُوْمٰتٌ ۚ— فَمَنْ فَرَضَ فِیْهِنَّ الْحَجَّ فَلَا رَفَثَ وَلَا فُسُوْقَ وَلَا جِدَالَ فِی الْحَجِّ ؕ— وَمَا تَفْعَلُوْا مِنْ خَیْرٍ یَّعْلَمْهُ اللّٰهُ ؔؕ— وَتَزَوَّدُوْا فَاِنَّ خَیْرَ الزَّادِ التَّقْوٰی ؗ— وَاتَّقُوْنِ یٰۤاُولِی الْاَلْبَابِ ۟
హజ్జ్ మాసములు నిర్ధారితమై ఉన్నాయి.షవ్వాల్ మాసము నుండి మొదలై జిల్ హిజ్జ మాసపు పదవ తారీకున ముగిస్తాయి.ఈ నెలలో ఎవరైతే హజ్జ్ చేయాలని నిర్ణయించుకుంటాడో దాని కొరకు ఇహ్రామ్ కట్టుకుంటాడో అతనిపై సంబోగము,దానికి సంబంధించిన రతి క్రీడలు (ముద్దు పెట్టుకోవటం,వాటేసుకోవటం) నిషేదము.ఆ సమయం,ప్రదేశము గొప్పతనము వలన పాప కార్యము చేసి అల్లాహ్ విధేయత నుండి దూరం అవకూడదని అతని హక్కులో తాకీదు చేయబడింది.కోపాలకి,తగాదాలకి దారితీసే వివాదాలు అతనిపై నిషేదం.మీరు ఏ మంచి కార్యం చేసిన దానిని అల్లాహ్ గుర్తించి దాని ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.హజ్జ్ నిర్వర్తించడం కొరకు మీకు అవసరమైన తినే,త్రాగే వస్తువులను ఏర్పాటు చేసుకుని సహాయమును అర్ధించండి.మీ వ్యవహారాలన్నింటిలో దేని ద్వారానైతే మీరు సహాయమును అర్ధిస్తున్నారో అందులో ఉత్తమమైనది అల్లాహ్ భయభీతి అన్న విషయమును మీరు గుర్తించండి.ఓ సరైన బుద్ధి కలవారా మీరు నా ఆదేశాలను పాటించి,నేను వారించిన వాటికి దూరంగా ఉండి నాకు భయపడుతూ ఉండండి.
ئەرەپچە تەپسىرلەر:
لَیْسَ عَلَیْكُمْ جُنَاحٌ اَنْ تَبْتَغُوْا فَضْلًا مِّنْ رَّبِّكُمْ ؕ— فَاِذَاۤ اَفَضْتُمْ مِّنْ عَرَفٰتٍ فَاذْكُرُوا اللّٰهَ عِنْدَ الْمَشْعَرِ الْحَرَامِ ۪— وَاذْكُرُوْهُ كَمَا هَدٰىكُمْ ۚ— وَاِنْ كُنْتُمْ مِّنْ قَبْلِهٖ لَمِنَ الضَّآلِّیْنَ ۟
హజ్ సమయంలో హలాల్ ఆహారమును వ్యాపారము,ఇతర పద్దతుల ద్వారా కోరటంలో మీ పై ఎటువంటి దోషం లేదు,జిల్ హిజ్జ తొమ్మిదో తారీకున మీరు అరఫాలో బస చేసిన తరువాత వాపసు అవుతూ పదో తారీకు రాత్రి (తొమ్మిదో తారీకు సూర్యాస్తమయం నుండి పదోవ తారీకు మొదలవుతుంది) ముజ్దలిఫ చేరుకోవాలి.ముజ్దలిఫ లో మష్అరె హరమ్ వద్ద అల్లాహ్ పరిశుద్దతను తెలుపుతూ,లా యిలాహ ఇల్లల్లాహ్ పలుకుతూ,దుఆ చేస్తూ అల్లాహ్ ను స్మరించండి.మీకు ఆయన ధర్మం యొక్క జ్ఞానమును కలిగించినందుకు,ఆయన గృహపు హజ్ కార్యాలు (మనాసికె హజ్) తెలియజేసినందుకు మీరు అల్లాహ్ ను స్మరించండి.దీనికన్న ముందు మీరు ఆయన ధర్మము గురించి జ్ఞానము లేని వారై ఉండేవారు.
ئەرەپچە تەپسىرلەر:
ثُمَّ اَفِیْضُوْا مِنْ حَیْثُ اَفَاضَ النَّاسُ وَاسْتَغْفِرُوا اللّٰهَ ؕ— اِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِیْمٌ ۟
మీరు అజ్ఞానులు అరఫాలో విడిది చేయకుండా వెళ్ళి పోయినట్లు కాకుండా ఇబ్రాహీమ్ అలైహిస్సలామ్ ను అనుసరించే ప్రజలు ఏ విధంగా అరఫాలో విడిది చేసి వాపసు అయ్యేవారో అలా వాపసు అవ్వండి.అల్లాహ్ నిర్దేశించిన దానిని పాటించటంలో మీరు లోపం చేసిన దానిపై అల్లాహ్ తో మన్నింపు వేడుకోండి నిశ్చయంగా అల్లాహ్ తన దాసుల్లోంచి పశ్చాత్తాప్పడే వారిని మన్నించే వాడును,వారిపై కరుణించే వాడును.
ئەرەپچە تەپسىرلەر:
فَاِذَا قَضَیْتُمْ مَّنَاسِكَكُمْ فَاذْكُرُوا اللّٰهَ كَذِكْرِكُمْ اٰبَآءَكُمْ اَوْ اَشَدَّ ذِكْرًا ؕ— فَمِنَ النَّاسِ مَنْ یَّقُوْلُ رَبَّنَاۤ اٰتِنَا فِی الدُّنْیَا وَمَا لَهٗ فِی الْاٰخِرَةِ مِنْ خَلَاقٍ ۟
మీరు హజ్జ్ కార్యాలను సమాప్తం చేసి,వాటిని పూర్తి గావించినప్పుడు అల్లాహ్ ను స్మరించండి,మీ తాతముత్తాతల గొప్పలు చెప్పుకున్నట్లు వారిని పొగిడినట్లు ఆయనను ఎక్కువగా స్థుతించండి,పొగడండి.మీ తాతముత్తాతల కన్న ఇంకా ఎక్కువగా అల్లాహ్ ను స్మరించండి.ఎందుకంటే మీరు అనుభవిస్తున్న అనుగ్రహాలన్నీ ఆయన వద్దవే.మరియు ప్రజల్లో రకరకాల వారున్నారు,వారిలోంచి బహు దైవారాధకులైన సత్య తిరస్కారులున్నారు.వారికి ఇహలోక జీవితం పైనే నమ్మకం ఉన్నది.వారు తమ ప్రభువును కేవలం ఇహలోకమును,దాని హంగు బంగులైన ఆరోగ్యం,ధనము,సంతానమును అర్ధిస్తారు.అల్లాహ్ పరలోకంలో తన దాసుల్లోంచి విశ్వాసపరులైన వారి కొరకు ఏవైతే తయారు చేసి ఉంచాడో అందులో కొంచెము భాగం కూడా వారి ఇహలోకం పై ఇష్టత,పరలోకము పై అయిష్టత వలన వారికి లభించదు.
ئەرەپچە تەپسىرلەر:
وَمِنْهُمْ مَّنْ یَّقُوْلُ رَبَّنَاۤ اٰتِنَا فِی الدُّنْیَا حَسَنَةً وَّفِی الْاٰخِرَةِ حَسَنَةً وَّقِنَا عَذَابَ النَّارِ ۟
ప్రజల్లోంచి ఒక వర్గం అల్లాహ్ పై,అంతిమ దినం పై విశ్వాసమును కలిగి ఉంటారు,వారు తమ ప్రభువుతో ఏ విధంగానైతే స్వర్గం ద్వారా సాఫల్యంను,నరకాగ్ని శిక్ష నుండి శ్రేయస్సును అర్ధిస్తారో ఆ విధంగా ఇహలోక అనుగ్రహాలను,అందులోని సత్కార్యాలను అర్ధిస్తారు.
ئەرەپچە تەپسىرلەر:
اُولٰٓىِٕكَ لَهُمْ نَصِیْبٌ مِّمَّا كَسَبُوْا ؕ— وَاللّٰهُ سَرِیْعُ الْحِسَابِ ۟
వారందరు ఇహ,పరలోకాల శ్రేయస్సును అర్ధిస్తారు.వారికి ఇహలోకంలో సత్కార్యాల్లోంచి వారు సంపాదించిన వాటి ద్వారా గొప్ప పుణ్యములోంచి భాగము లభించును మరియు అల్లాహ్ కర్మల లెక్కను తొందరగా తీసుకుంటాడు.
ئەرەپچە تەپسىرلەر:
بۇ بەتتىكى ئايەتلەردىن ئېلىنغان مەزمۇنلار:
• يجب على المؤمن التزود في سفر الدنيا وسفر الآخرة، ولذلك ذكر الله أن خير الزاد هو التقوى.
విశ్వాసపరుని పై ఇహలోక ప్రయాణపు,పరలోక ప్రయాణపు సామగ్రిని సమకూర్చుకోవటం తప్పనిసరి,అందుకనే అల్లాహ్ మేలైన సామగ్రి దైవభీతి అని తెలియపరచాడు.

• مشروعية الإكثار من ذكر الله تعالى عند إتمام نسك الحج.
హజ్జ్ కార్యాలు పరిపూర్ణమైనప్పుడు అల్లాహ్ యొక్క స్మరణ ఎక్కువగా చేయటం చట్టబద్దమైనది.

• اختلاف مقاصد الناس؛ فمنهم من جعل همّه الدنيا، فلا يسأل ربه غيرها، ومنهم من يسأله خير الدنيا والآخرة، وهذا هو الموفَّق.
మనుషుల యొక్క ఉద్దేశాలు వేరువేరు; అయితే వారిలోంచి కొందరు ఇహలోకమే తమ యొక్క ధ్యేయము చేసుకున్నారు,వారు తమ ప్రభువుతో అది కాక వేరేది అర్ధించరు,వారిలోంచి మరి కొందరు ఆయనతో ఇహ,పరలోకాల శ్రేయస్సును అర్ధిస్తారు.మరియు ఇదే ప్రసాదము.

 
مەنالار تەرجىمىسى سۈرە: بەقەرە
سۈرە مۇندەرىجىسى بەت نومۇرى
 
قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى - تەرجىمىلەر مۇندەرىجىسى

قۇرئان تەتقىقاتى تەپسىر مەركىزى چىقارغان.

تاقاش