Check out the new design

قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى * - تەرجىمىلەر مۇندەرىجىسى


مەنالار تەرجىمىسى سۈرە: بەقەرە   ئايەت:
وَاذْكُرُوا اللّٰهَ فِیْۤ اَیَّامٍ مَّعْدُوْدٰتٍ ؕ— فَمَنْ تَعَجَّلَ فِیْ یَوْمَیْنِ فَلَاۤ اِثْمَ عَلَیْهِ ۚ— وَمَنْ تَاَخَّرَ فَلَاۤ اِثْمَ عَلَیْهِ ۙ— لِمَنِ اتَّقٰی ؕ— وَاتَّقُوا اللّٰهَ وَاعْلَمُوْۤا اَنَّكُمْ اِلَیْهِ تُحْشَرُوْنَ ۟
మీరు నిర్ణీత రోజులు అల్లాహ్ గొప్పతనమును (తక్బీర్ పలుకుతూ) తెలుపుతూ,లా యిలాహ ఇల్లల్లాహ్ పలుకుతూ అల్లాహ్ ను స్మరించండి.అవి జిల్ హిజ్జా మాసపు 11,12,13 తేదీలు,ఎవరైన జిల్ హిజ్జా మాసపు 12వ తేదీన షైతాను పై రాళ్ళు రువ్విన తరువాత మినా నుండి బయలుదేరితే అది అతని కొరకు అవుతుంది,అతని పై ఎటువంటి దోషము లేదు,ఎందుకంటే అల్లాహ్ అతనికి సౌలభ్యాన్ని కలిగించాడు.ఎవరైన 13వ తేదీ వరకు ఉండి షైతాను పై రాళ్ళు రువ్వితే అది అతని కొరకు అవుతుంది,అతని పై ఎటువంటి దోషం లేదు.అతను పూర్తి స్థాయికు చేరుకున్నాడు.అతను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కార్యమును అనుసరించాడు.ఇదంతా తన హజ్ లో అల్లాహ్ కు భయపడి అల్లాహ్ ఆదేశించినట్లు దానిని పూర్తి చేసిన వారికొరకు,మీరు అల్లాహ్ ఆదేశాలను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి ఆయనకు భయపడుతూ ఉండండి.మరియు ఆయన ఒక్కరి వైపే మరలి వెళ్లవలసి ఉన్నదని నమ్మకమును కలిగి ఉండండి.తద్వారా ఆయన మీ ఆచరణలకు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.
ئەرەپچە تەپسىرلەر:
وَمِنَ النَّاسِ مَنْ یُّعْجِبُكَ قَوْلُهٗ فِی الْحَیٰوةِ الدُّنْیَا وَیُشْهِدُ اللّٰهَ عَلٰی مَا فِیْ قَلْبِهٖ ۙ— وَهُوَ اَلَدُّ الْخِصَامِ ۟
ఓ ప్రవక్త మనుషుల్లో కపటుడుంటాడు ఈ లోకంలో అతని మాటలు మీకు మంచిగా అనిపిస్తాయి,అతడు మీకు మంచిగా మాట్లాడే వాడిగా కనబడుతాడు,చివరికి అతనిని మీరు నీతిమంతునిగా,హితోక్తుడిగా భావిస్తారు,అతని ఉద్దేశం కేవలం తన ప్రాణమును,ధనమును కాపాడుకోవటం మాత్రమే.అతని మనసులో ఉన్న విశ్వాసము,మేలు విషయంలో అబద్దం పలుకుతున్నాడని అల్లాహ్ సాక్షమిస్తున్నాడు.అతడు ముస్లిముల యెడల ఎక్కువగా తగాదా పడేవాడు,ఎక్కువగా ద్వేషము కలవాడు.
ئەرەپچە تەپسىرلەر:
وَاِذَا تَوَلّٰی سَعٰی فِی الْاَرْضِ لِیُفْسِدَ فِیْهَا وَیُهْلِكَ الْحَرْثَ وَالنَّسْلَ ؕ— وَاللّٰهُ لَا یُحِبُّ الْفَسَادَ ۟
మరియు అతడు నీ నుంచి వీపుతిప్పుకున్నప్పుడు,నీ వద్ద నుంచి వేరైనప్పుడు పాపాల ద్వారా భూమిలో చెడును వ్యాపింప చేయటానికి ప్రయత్నాలు చేస్తాడు,పంటలను నాశనం చేస్తాడు,పశువులను చంపుతాడు.మరియు అల్లాహ్ భూమిలో చెడును సుతారం ఇష్టపడడు,చెడును వ్యాపింప చేసే వారిని ఇష్టపడడు.
ئەرەپچە تەپسىرلەر:
وَاِذَا قِیْلَ لَهُ اتَّقِ اللّٰهَ اَخَذَتْهُ الْعِزَّةُ بِالْاِثْمِ فَحَسْبُهٗ جَهَنَّمُ ؕ— وَلَبِئْسَ الْمِهَادُ ۟
మరియు ఇలా చెడును వ్యాపింపజేసే వాడితో నీవు అల్లాహ్ హద్దులను గౌరవించడంలో,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండటంలో అల్లాహ్ కు భయపడుతూ ఉండు అని హితోపదేశంగా చెప్పినప్పుడు అతనిని గర్వం,అహంకారం సత్యం వైపునకు మరలటం నుండి ఆపుతుంది,అతడు పాపంలో కొనసాగుతూ పోతాడు,అతనికి నరకంలో ప్రవేశం ప్రతిఫలంగా సరిపోతుంది.నరక వాసుల కొరకు అది ఎంతో చెడ్డదైన స్థావరము,నివాస స్థలము.
ئەرەپچە تەپسىرلەر:
وَمِنَ النَّاسِ مَنْ یَّشْرِیْ نَفْسَهُ ابْتِغَآءَ مَرْضَاتِ اللّٰهِ ؕ— وَاللّٰهُ رَءُوْفٌۢ بِالْعِبَادِ ۟
ప్రజల్లోంచి విశ్వాసపరుడు తన ప్రాణములను పణంగా పెట్టి తన ప్రభువుకు విధేయతగా,ఆయన మార్గంలో ధర్మ పోరాటాలు చేస్తూ,ఆయన మన్నతను కోరుకుంటూ దానిని వినియోగిస్తాడు.అల్లాహ్ తన దాసుల పట్ల విశాలమైన కరుణ కలవాడు,వారి పట్ల వాత్సల్యం కలవాడు.
ئەرەپچە تەپسىرلەر:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوا ادْخُلُوْا فِی السِّلْمِ كَآفَّةً ۪— وَلَا تَتَّبِعُوْا خُطُوٰتِ الشَّیْطٰنِ ؕ— اِنَّهٗ لَكُمْ عَدُوٌّ مُّبِیْنٌ ۟
అల్లాహ్ పై విశ్వాసమును కనబరిచి ఆయన ప్రవక్తను అనుసరించేవారా మీరు ఇస్లాంలో పూర్తిగా ప్రవేశించండి,గ్రంధవహులు గ్రంధములోంచి కొన్ని విషయాలపై విశ్వాసమును కనబరిచి కొన్నింటిని తిరస్కరించి ఏ విధంగా చేశారో ఆవిధంగా మీరు అందులో (ధర్మంలో) ఉన్న ఏ విషయాన్నీ వదలకండి.మరియు మీరు షైతాన్ మార్గములను అనుసరించకండి,అతడు మీకు శతృత్వం బహిర్గంగా కనబడుతున్న బద్ద శతృవు.
ئەرەپچە تەپسىرلەر:
فَاِنْ زَلَلْتُمْ مِّنْ بَعْدِ مَا جَآءَتْكُمُ الْبَیِّنٰتُ فَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ عَزِیْزٌ حَكِیْمٌ ۟
మీ వద్దకు ఎటువంటి సందేహం లేని స్పష్టమైన ఆధారాలు వచ్చిన తరువాత కూడా మీరు ఒక వైపునకు వాలిపోవటం,ఒక వైపుకు జారిపోవటం జరిగితే గుర్తించుకోండి అల్లాహ్ తన శక్తి మరియు అణచి వేయటంలో ధీటుడు.తన వ్యవహారాల నిర్వహణలో,తన శాసనాలను శాసించటంలో వివేకవంతుడు,అయితే మీరు ఆయనతో భయపడండి,ఆయన గొప్పలు తెలియపరచండి.
ئەرەپچە تەپسىرلەر:
هَلْ یَنْظُرُوْنَ اِلَّاۤ اَنْ یَّاْتِیَهُمُ اللّٰهُ فِیْ ظُلَلٍ مِّنَ الْغَمَامِ وَالْمَلٰٓىِٕكَةُ وَقُضِیَ الْاَمْرُ ؕ— وَاِلَی اللّٰهِ تُرْجَعُ الْاُمُوْرُ ۟۠
సత్య మార్గము నుండి దూరమై షైతాను మార్గమును అనుసరించే వీరందరు అల్లాహ్ వారి మధ్య తీర్పునివ్వటం కొరకు తనకు తగినట్లు ప్రళయ దినాన మేఘముల నీడల్లో వారి వద్దకు రావాలని దైవ దూతలు వారి నలుమూలల నుండి రావాలని వారు వేచి చూస్తున్నారు,అప్పుడు వారి మధ్య అల్లాహ్ తీర్పు జరుగుతుంది,దానిని పూర్తిగావిస్తాడు,ఒకే అల్లాహ్ వైపునే మనుషుల వ్యవహారాలు,కార్యాలు మరలించబడుతాయి.
ئەرەپچە تەپسىرلەر:
بۇ بەتتىكى ئايەتلەردىن ئېلىنغان مەزمۇنلار:
• التقوى حقيقة لا تكون بكثرة الأعمال فقط، وإنما بمتابعة هدي الشريعة والالتزام بها.
వాస్తవానికి దైవభీతి అన్నది కేవలం ఆచరణలు ఎక్కువగా ఉండటంలో లేదు,ధర్మం యొక్క మార్గమును అనుసరించటంలో,దాని పై నిలకడ చూపటంలో ఉన్నది.

• الحكم على الناس لا يكون بمجرد أشكالهم وأقوالهم، بل بحقيقة أفعالهم الدالة على ما أخفته صدورهم.
ప్రజల మధ్య కేవలం వారి రూపాలను,వారి మాటలను చూసి తీర్పునివ్వటం జరగదు,కాని వారి మనస్సులలో దాగి ఉన్న సంకల్పాలను తెలిపే ఆచరణలపై తీర్పునివ్వటం జరుగుతుంది.

• الإفساد في الأرض بكل صوره من صفات المتكبرين التي تلازمهم، والله تعالى لا يحب الفساد وأهله.
భూమిలో చెడు అన్నది అహంకారుల్లో ఉండే గుణాల రూపాల వలన వ్యాపిస్తుంది,అల్లాహ్ చెడును,చెడును వ్యాపింప చేసేవారిని ఇష్టపడడు.

• لا يكون المرء مسلمًا حقيقة لله تعالى حتى يُسَلِّم لهذا الدين كله، ويقبله ظاهرًا وباطنًا.
మనిషి ఈ ధర్మము(ఇస్లాం) కొరకు పూర్తిగా సమర్పించుకునే వరకు,దాన్ని బాహ్యంగా అంతరంగా స్వీకరించే వరకు వాస్తవానికి అల్లాహ్ కొరకు ముస్లిం కాలేడు.

 
مەنالار تەرجىمىسى سۈرە: بەقەرە
سۈرە مۇندەرىجىسى بەت نومۇرى
 
قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى - تەرجىمىلەر مۇندەرىجىسى

قۇرئان تەتقىقاتى تەپسىر مەركىزى چىقارغان.

تاقاش