Check out the new design

قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى * - تەرجىمىلەر مۇندەرىجىسى


مەنالار تەرجىمىسى سۈرە: ئەنئام   ئايەت:
اَلَّذِیْنَ اٰمَنُوْا وَلَمْ یَلْبِسُوْۤا اِیْمَانَهُمْ بِظُلْمٍ اُولٰٓىِٕكَ لَهُمُ الْاَمْنُ وَهُمْ مُّهْتَدُوْنَ ۟۠
ఎవరైతే అల్లాహ్ ను విశ్వసించి ధర్మశాస్త్రమును అనుసరిస్తారో,తమ విశ్వాసము తోపాటు షిర్క్ ను కలగాపులగం చేయలేదో ఇతరులకు కాకుండా వారి కొరకే శాంతి,భద్రతలు కలవు.వారు సౌభాగ్యవంతులు.వారికి వారి ప్రభువు సన్మార్గపు మార్గము కోసం భాగ్యమును కలిగించాడు.
ئەرەپچە تەپسىرلەر:
وَتِلْكَ حُجَّتُنَاۤ اٰتَیْنٰهَاۤ اِبْرٰهِیْمَ عَلٰی قَوْمِهٖ ؕ— نَرْفَعُ دَرَجٰتٍ مَّنْ نَّشَآءُ ؕ— اِنَّ رَبَّكَ حَكِیْمٌ عَلِیْمٌ ۟
ఈ వాదన,అది అల్లాహ్ వాఖ్యము ( أَيُّ ٱلۡفَرِيقَيۡنِ أَحَقُّ بِٱلۡأَمۡنِۖ إِن كُنتُمۡ تَعۡلَمُونَ ) దేని ద్వారనైతే ఇబ్రాహీం తన జాతి వారిపై ఆధిక్యాన్ని పొందారో చివరికి వారి వాదనలు అంతమైపోయినవి అది (ఆ వాదన ) మా వాదన.దాని ద్వారా ఆయన తన జాతి వారితో వాదించటానికి మేము ఆయనకు ప్రసాదించాము.దానినే ఆయనకు ప్రసాదించాము.ఇహలోకంలో,పరలోకంలో మా దాసుల్లోంచి మేము కోరుకున్న వారికి ఉన్నత స్థానాలను ప్రసాదిస్తాము.ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువు తన సృష్టించటంలో,తన కార్య నిర్వహణలో వివేకవంతుడు,తన దాసుల గురించి అంతా తెలిసినవాడు.
ئەرەپچە تەپسىرلەر:
وَوَهَبْنَا لَهٗۤ اِسْحٰقَ وَیَعْقُوْبَ ؕ— كُلًّا هَدَیْنَا ۚ— وَنُوْحًا هَدَیْنَا مِنْ قَبْلُ وَمِنْ ذُرِّیَّتِهٖ دَاوٗدَ وَسُلَیْمٰنَ وَاَیُّوْبَ وَیُوْسُفَ وَمُوْسٰی وَهٰرُوْنَ ؕ— وَكَذٰلِكَ نَجْزِی الْمُحْسِنِیْنَ ۟ۙ
మరియు మేము ఇబ్రాహీంనకు ఇస్హాఖ్ ను ఆమన కుమారుడిగా,యాఖూబ్ ను ఆయన మనవడిగా ప్రసాదించాము.వారిద్దరిలోంచి ప్రతి ఒక్కరికి సన్మార్గమును పొందే అనుగ్రహమును కలిగించాము.వారికన్న ముందు నూహ్ నకు అనుగ్రహించాము.మరియు మేము నూహ్ సంతానములోంచి దావుద్,ఆయన కుమారుడు సులైమాన్,అయ్యూబ్,యూసుఫ్,మూసా,ఆయన సోదరుడు హారూన్ అలైహిముస్సలాం ప్రతి ఒక్కరికి సత్య మార్గము కొరకు సౌభాగ్యమును కలిగించాము.దైవ ప్రవక్తలు చేసిన మేలుకి ప్రతిఫలంగా మేము వారికి ప్రసాదించినటువంటి ఈ ప్రతిఫలము మాదిరిగా వారే కాకుండా ఇతరులకు వారు చేసే మేలుకి ప్రతిఫలాన్ని మేము ప్రసాదిస్తాము.
ئەرەپچە تەپسىرلەر:
وَزَكَرِیَّا وَیَحْیٰی وَعِیْسٰی وَاِلْیَاسَ ؕ— كُلٌّ مِّنَ الصّٰلِحِیْنَ ۟ۙ
మరియు మేము జక్రియా,యహ్యా,మర్యం కుమారుడగు ఈసా,ఇల్యాస్ లోంచి ప్రతి ఒక్కరికి ఇలాగే అనుగ్రహించాము.ఈ పుణ్యాత్ములైన ప్రవక్తలందరిని అల్లాహ్ సందేశములను చేరవేసె వారిగా (ప్రవక్తలుగా) ఎన్నుకున్నాడు.
ئەرەپچە تەپسىرلەر:
وَاِسْمٰعِیْلَ وَالْیَسَعَ وَیُوْنُسَ وَلُوْطًا ؕ— وَكُلًّا فَضَّلْنَا عَلَی الْعٰلَمِیْنَ ۟ۙ
మరియు మేము ఇదే విదంగ ఇస్మాయీల్,యస్అ,యూనుస్,లూత్ అలైహిముస్సలాంలను అనుగ్రహించాము.మరియు మేము ఈ ప్రవక్తలందరిని,వారందరిలో ప్రత్యేకించి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ,వాందరిని సర్వలోకాల్లొ ప్రాధాన్యతను ప్రసాదించాము.
ئەرەپچە تەپسىرلەر:
وَمِنْ اٰبَآىِٕهِمْ وَذُرِّیّٰتِهِمْ وَاِخْوَانِهِمْ ۚ— وَاجْتَبَیْنٰهُمْ وَهَدَیْنٰهُمْ اِلٰی صِرَاطٍ مُّسْتَقِیْمٍ ۟
మరియు వారి తాతముత్తాతల్లోంచి కొందరిని,వారి కుమారుల్లోంచి కొందరిని,వారి సోదరుల్లోంచి కొందరిని మేము కోరుకున్న వారికి దానిని అనుగ్రహించాము.వారిని మేము ఎన్నుకున్నాము,మరియు మేము వారందరికి సన్మార్గమైన అల్లాహ్ యొక్క తౌహీద్,ఆయన విధేయత యొక్క మార్గము పై నడవడిక భాగ్యమును ప్రసాదించాము.
ئەرەپچە تەپسىرلەر:
ذٰلِكَ هُدَی اللّٰهِ یَهْدِیْ بِهٖ مَنْ یَّشَآءُ مِنْ عِبَادِهٖ ؕ— وَلَوْ اَشْرَكُوْا لَحَبِطَ عَنْهُمْ مَّا كَانُوْا یَعْمَلُوْنَ ۟
వారికి లభించిన ఈ భాగ్యము అల్లాహ్ అనుగ్రహము.ఆయన తన దాసుల్లోంచి ఎవరిని కోరుకుంటే వారికి దానిని అనుగ్రహిస్తాడు.ఒకవేళ వారు అల్లాహ్ తోపాటు ఇతరులను సాటి కల్పిస్తే వారి ఆచరణ వృధా అవుతుంది ఎందుకంటే షిర్క్ సత్కార్యమును వృధా చేస్తుంది.
ئەرەپچە تەپسىرلەر:
اُولٰٓىِٕكَ الَّذِیْنَ اٰتَیْنٰهُمُ الْكِتٰبَ وَالْحُكْمَ وَالنُّبُوَّةَ ۚ— فَاِنْ یَّكْفُرْ بِهَا هٰۤؤُلَآءِ فَقَدْ وَكَّلْنَا بِهَا قَوْمًا لَّیْسُوْا بِهَا بِكٰفِرِیْنَ ۟
ఈ ప్రస్తావించబడిన ప్రవక్తలందరికి మేము గ్రంధాన్ని ప్రసాదించాము,వారికి వివేకమును ప్రసాధించాము, వారికి దైవదౌత్యమును ప్రసాదించాము.ఒకవేళ మీ జాతి వారు మేము ప్రసాదించిన ఈ మూడింటిని తిరస్కరిస్తే వాటి కొరకు మేము ఒక జాతి వారిని తయారుచేసి ఉంచాము.వారు వాటిని తిరస్కరించరు.అంతే కాక వారు దాన్ని విశ్వసించి పాటిస్తారు. వారు ముహాజిర్ లు,అన్సార్ లు,ప్రళయ దినం వరకు వారిని మంచిగా అనుసరించిన వారు.
ئەرەپچە تەپسىرلەر:
اُولٰٓىِٕكَ الَّذِیْنَ هَدَی اللّٰهُ فَبِهُدٰىهُمُ اقْتَدِهْ ؕ— قُلْ لَّاۤ اَسْـَٔلُكُمْ عَلَیْهِ اَجْرًا ؕ— اِنْ هُوَ اِلَّا ذِكْرٰی لِلْعٰلَمِیْنَ ۟۠
ఈ ప్రవక్తలందరు,వారితోపాటు ప్రస్తావించబడిన వారి తాతముత్తాతలు,వారి కుమారులు,వారి సోదరులు వాస్తవానికి వారందరు సన్మార్గమును పొందినవారు.మీరు వారిని అనుసరించండి,వారిపై విధేయత చూపండి.ఓ ప్రవక్తా మీ జాతి వారితో ఇలా అనండి : నేను ఈ ఖుర్ఆన్ ను చేరవేయటం పై మీ నుండి ఎటువంటి ప్రతిఫలాన్ని కోరటం లేదు.అయితే ఖుర్ఆన్ సర్వలోకాల్లొ ఉన్న మానవులకు,జిన్నులకు సన్మార్గమును,నిజమైన మార్గమును పొందటం కొరకు హితోపదేశము మాత్రమే.
ئەرەپچە تەپسىرلەر:
بۇ بەتتىكى ئايەتلەردىن ئېلىنغان مەزمۇنلار:
• من فضائل التوحيد أنه يضمن الأمن للعبد، خاصة في الآخرة حين يفزع الناس.
దాసునికి భద్రత హామినివ్వటం,ప్రత్యేకించి పరలోకంలో ప్రజలందరు భయాందోళనలకు గురైనప్పుడు ఇది తౌహీదు యొక్క సుగుణం.

• تُقَرِّر الآيات أن جميع من سبق من الأنبياء إنما بَلَّغوا دعوتهم بتوفيق الله تعالى لا بقدرتهم.
గతించిన ప్రవక్తలందరు తమ శక్తిసామర్ధ్యాలతో కాక మహోన్నతుడైన అల్లాహ్ అనుగ్రహము వలన తమ సందేశాలను చేరవేశారని ఆయతులు నిరూపిస్తున్నవి.

• الأنبياء يشتركون جميعًا في الدعوة إلى توحيد الله تعالى مع اختلاف بينهم في تفاصيل التشريع.
ప్రవక్తలందరు ఆరాధన విషయాలలో వారి నియమాలు,శాసనాలు వేరు వేరుగా ఉన్నా అల్లాహ్ తౌహీదు వైపునకు పిలవటంలో అందరు ఒక్కటే.

• الاقتداء بالأنبياء سنة محمودة، وخاصة في أصول التوحيد.
ప్రవక్తలను అనుసరించటం మెచ్చుకోదగిన విధానము,ఫ్రత్యేకించి తౌహీదు నియమాల్లో.

 
مەنالار تەرجىمىسى سۈرە: ئەنئام
سۈرە مۇندەرىجىسى بەت نومۇرى
 
قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى - تەرجىمىلەر مۇندەرىجىسى

قۇرئان تەتقىقاتى تەپسىر مەركىزى چىقارغان.

تاقاش