Check out the new design

قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى * - تەرجىمىلەر مۇندەرىجىسى


مەنالار تەرجىمىسى سۈرە: ئەنئام   ئايەت:
وَمَا لَكُمْ اَلَّا تَاْكُلُوْا مِمَّا ذُكِرَ اسْمُ اللّٰهِ عَلَیْهِ وَقَدْ فَصَّلَ لَكُمْ مَّا حَرَّمَ عَلَیْكُمْ اِلَّا مَا اضْطُرِرْتُمْ اِلَیْهِ ؕ— وَاِنَّ كَثِیْرًا لَّیُضِلُّوْنَ بِاَهْوَآىِٕهِمْ بِغَیْرِ عِلْمٍ ؕ— اِنَّ رَبَّكَ هُوَ اَعْلَمُ بِالْمُعْتَدِیْنَ ۟
ఓ విశ్వాసపరులారా అల్లాహ్ పేరు ఉచ్చరించబడిన జంతువుల్లోంచి తినటానికి మిమ్మల్ని ఏది ఆపుతుంది. వాస్తవానికి అల్లాహ్ మీపై నిషేధించిన వాటిని తెలియపరచాడు. మీకు ఏదైన అవసరం గత్యంతరం లేని పరిస్థితులు ఏర్పరిస్తే తప్ప వాటిని వదిలివేయటం మీపై తప్పనిసరి. అత్యవసర పరిస్థితి నిషేధిత వస్తువులను అనుమతిస్తుంది. నిశ్చయంగా చాలామంది ముష్రికులు తమ అజ్ఞానంతో తప్పుడు సలహాల ద్వారా తమను అనుసరించే వారిని సత్యం నుండి దూరం చేస్తున్నారు. ఎలాగంటే అల్లాహ్ వారిపై నిషేధించిన మృత జంతువులు,తదితర వాటిని వారు హలాల్ చేసుకుంటున్నారు. మరియు అల్లాహ్ వారి కొరకు హలాల్ చేసిన బహీరా,వసీలా,హామ్ తదితర వాటిని నిషేధించుకుంటున్నారు. ఓ ప్రవక్తా నిశ్చయంగా నీ యొక్క ప్రభువు అల్లాహ్ హద్దులను అదిగమించే వాడి గురించి బాగా తెలిసిన వాడు. వారు ఆయన హద్దులను దాటటం వలన వారికి ఆయన తొందరలోనే ప్రతిఫలాన్ని ప్రసాధిస్తాడు.
ئەرەپچە تەپسىرلەر:
وَذَرُوْا ظَاهِرَ الْاِثْمِ وَبَاطِنَهٗ ؕ— اِنَّ الَّذِیْنَ یَكْسِبُوْنَ الْاِثْمَ سَیُجْزَوْنَ بِمَا كَانُوْا یَقْتَرِفُوْنَ ۟
ఓ ప్రజలారా బహిరంగంగా,గోప్యంగా పాపములను చేయటం వదలండి. నిశ్చయంగా బహిరంగంగా,గోప్యంగా పాపాలకు పాల్పడేవారిని అల్లాహ్ తొందరలోనే వారి పాపముల ప్రతిఫలాన్ని ప్రసాధిస్తాడు.
ئەرەپچە تەپسىرلەر:
وَلَا تَاْكُلُوْا مِمَّا لَمْ یُذْكَرِ اسْمُ اللّٰهِ عَلَیْهِ وَاِنَّهٗ لَفِسْقٌ ؕ— وَاِنَّ الشَّیٰطِیْنَ لَیُوْحُوْنَ اِلٰۤی اَوْلِیٰٓـِٕهِمْ لِیُجَادِلُوْكُمْ ۚ— وَاِنْ اَطَعْتُمُوْهُمْ اِنَّكُمْ لَمُشْرِكُوْنَ ۟۠
ఓ ముస్లిములారా అల్లాహ్ నామము స్మరించబడని దానిని తినకండి. దానిపై అల్లాహ్ నామము తీసుకొనకపోయిన లేదా ఇతరుల నామం తీసుకున్నా ఒక్కటే. అందులో నుంచి తినటం అల్లాహ్ విధేయత నుండి అవిధేయతకు పాల్పడటమే. నిశ్చయంగా షైతానులు మృత జంతువులను తినే విషయంలో సందేహములో పడవేసి మీతో వాదులాడటానికి తమ మితృలను ఉసిగొల్పుతుంటారు. ఓ ముస్లిములారా మృత జంతువును తినటం ధర్మసమ్మతం చేసుకోవటంలో సందేహపడిన విషయంలో ఒక వేళ మీరు వారి మాట విన్నారనుకోండి మీరు మరియు వారు షిర్క్ లో సమానమైపోతారు.
ئەرەپچە تەپسىرلەر:
اَوَمَنْ كَانَ مَیْتًا فَاَحْیَیْنٰهُ وَجَعَلْنَا لَهٗ نُوْرًا یَّمْشِیْ بِهٖ فِی النَّاسِ كَمَنْ مَّثَلُهٗ فِی الظُّلُمٰتِ لَیْسَ بِخَارِجٍ مِّنْهَا ؕ— كَذٰلِكَ زُیِّنَ لِلْكٰفِرِیْنَ مَا كَانُوْا یَعْمَلُوْنَ ۟
ఎవడైతే అల్లాహ్ సన్మార్గము చూపక మునుపు అవిశ్వాసంలో,అజ్ఞానంలో,అవిధేయతలో ఉండటం వలన మృతునిగా ఉన్నాడో మేము అతనికి విశ్వాసం,జ్ఞానం,విధేయత కొరకు సన్మార్గము చూపినాము. అతను ఆ వ్యక్తితో సమానుడవుతాడా ? ఎవరైతే అవిశ్వాసం,అజ్ఞానం,అవిధేయత చీకట్లలో ఉండి అందులో నుంచి బయటపడటానికి అతనికి శక్తి లేదు. అతనిపై దారులు సందిగ్దమైపోయినవి,అతనిపై మార్గములు చీకటిమయమై పోయినవి. ఏ విధంగానైతే ఈ ముష్రికులందరి కొరకు వారు చేస్తున్న షిర్కు,మృత జంతువులను తినటం,అసత్యము ద్వారా వాదన అలంకరించ బడినదో అదేవిధంగా అవిశ్వాసపరుల కొరకు వారు చేస్తున్న పాప కార్యాలు అలంకరించబడినవి. వాటి పరంగా వారు ప్రళయ దినాన భాధకరమైన శిక్ష ద్వారా ప్రతిఫలం ప్రసాధించబడటానికి.
ئەرەپچە تەپسىرلەر:
وَكَذٰلِكَ جَعَلْنَا فِیْ كُلِّ قَرْیَةٍ اَكٰبِرَ مُجْرِمِیْهَا لِیَمْكُرُوْا فِیْهَا ؕ— وَمَا یَمْكُرُوْنَ اِلَّا بِاَنْفُسِهِمْ وَمَا یَشْعُرُوْنَ ۟
మక్కాలో అల్లాహ్ మార్గము నుండి ఆపే కార్యక్రమం ఏదైతే ముష్రికుల నాయకుల ద్వారా జరిగినదో అదే విధంగా ప్రతి పట్టణంలో నాయకులను,పెద్ద వారిని తయారు చేశాము. వారి పన్నాగాలు,ఎత్తుగడలు షైతాన్ మార్గం వైపునకు పిలవటంలో,ప్రవక్తలతో,వారిని అనుసరించే వారితో పోట్లాడటంలో అమలు చేసేవి. వాస్తవానికి వారి కుయుక్తులు,ఎత్తుగడలు వారిపైనే వచ్చి పడుతున్నవి. కాని వారు తమ అజ్ఞానం వలన,తమ మనోవాంచనలకు లోనవటం వలన దానిని గ్రహించలేకపోతున్నారు.
ئەرەپچە تەپسىرلەر:
وَاِذَا جَآءَتْهُمْ اٰیَةٌ قَالُوْا لَنْ نُّؤْمِنَ حَتّٰی نُؤْتٰی مِثْلَ مَاۤ اُوْتِیَ رُسُلُ اللّٰهِ ؔۘؕ— اَللّٰهُ اَعْلَمُ حَیْثُ یَجْعَلُ رِسَالَتَهٗ ؕ— سَیُصِیْبُ الَّذِیْنَ اَجْرَمُوْا صَغَارٌ عِنْدَ اللّٰهِ وَعَذَابٌ شَدِیْدٌۢ بِمَا كَانُوْا یَمْكُرُوْنَ ۟
అల్లాహ్ తన ప్రవక్తపై అవతరింపజేసిన సూచనల్లోంచి ఏదైన సూచన అవిశ్వాసపరుల పెద్దల వద్దకు వచ్చినప్పుడు వారు అంటారు : "అల్లాహ్ దైవ ప్రవక్తలకు ఇచ్చినటువంటి దైవదౌత్యము,సందేశాలను చేరవేసే బాధ్యత మాకు ప్రసాధించనంతవరకు మేము విశ్వసించమంటే విశ్వసించము". అల్లాహ్ వారి మాటలను ఖండించాడు. ఎందుకంటే సందేశాలను చేరవేయటానికి తగినవాడు ఎవడో,దాని బాధ్యత భారమును మోసేవాడు ఎవడో ఆయనకు బాగా తెలుసు. అయితే ఆయన దైవదౌత్యము ద్వారా,సందేశాలను చేరవేసే బాధ్యత ద్వారా అతన్ని ప్రత్యేకిస్తాడు. ఈ నిరంకుశులందరు సత్యమును స్వీకరించటం నుండి తమ అహంకారం వలన అవమానము,పరాభవము వాటిల్లుతుంది,వారి కుయుక్తుల వలన కఠినమైన శిక్ష వచ్చిపడుతుంది.
ئەرەپچە تەپسىرلەر:
بۇ بەتتىكى ئايەتلەردىن ئېلىنغان مەزمۇنلار:
• الأصل في الأشياء والأطعمة الإباحة، وأنه إذا لم يرد الشرع بتحريم شيء منها فإنه باق على الإباحة.
వస్తువుల,ఆహారపదార్దాల విషయంలో ధర్మసమ్మతమైన ఆదేశం ఉన్నది. ధర్మంలో ఏదైన వస్తువు యొక్క నిషిద్ధ ఆదేశం రానంత వరకు అది ధర్మసమ్మతమే అవుతుంది.

• كل من تكلم في الدين بما لا يعلمه، أو دعا الناس إلى شيء لا يعلم أنه حق أو باطل، فهو معتدٍ ظالم لنفسه وللناس، وكذلك كل من أفتى وليس هو بكفء للإفتاء.
ధర్మ విషయంలో తనకు జ్ఞానం లేకుండా మాట్లాడే ప్రతీ వ్యక్తి లేదా సత్యమో,అసత్యమో తెలియని విషయాల వైపు ప్రజలను పిలిచే ప్రతి వ్యక్తి తన కొరకు,ప్రజల కొరకు హద్దు మీరేవాడు,దుర్మార్గుడు. అలాగే ఫత్వా ఇవ్వటానికి అర్హత లేకుండా ఫత్వా ఇచ్చే ప్రతీ వ్యక్తి.

• منفعة المؤمن ليست مقتصرة على نفسه، بل مُتَعدِّية لغيره من الناس.
విశ్వాసపరుని యొక్క ప్రయోజనం తనకే పరిమితం కాదు. అతనికే కాకుండా ప్రజల్లోంచి ఇతరులకీ చేకూరుతుంది.

 
مەنالار تەرجىمىسى سۈرە: ئەنئام
سۈرە مۇندەرىجىسى بەت نومۇرى
 
قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى - تەرجىمىلەر مۇندەرىجىسى

قۇرئان تەتقىقاتى تەپسىر مەركىزى چىقارغان.

تاقاش