Check out the new design

قرآن کریم کے معانی کا ترجمہ - المختصر فی تفسیر القرآن الکریم کا تیلگو ترجمہ * - ترجمے کی لسٹ


معانی کا ترجمہ سورت: بقرہ   آیت:
اَوَلَا یَعْلَمُوْنَ اَنَّ اللّٰهَ یَعْلَمُ مَا یُسِرُّوْنَ وَمَا یُعْلِنُوْنَ ۟
ఈ యూదులందరు ఈ అవమానకరమైన మార్గాన్ని అనుసరిస్తారు, వారు తమ మాటలు మరియు చర్యల నుండి వారు ఏమి దాచిపెడుతున్నారో మరియు వారు ప్రకటించిన వాటి గురించి అల్లాహ్ కు తెలుసు అన్న విషయం నుండి వారు నిర్లక్ష్యం చేసినట్లు, మరియు అతను వాటిని తన దాసులకు వెల్లడిస్తాడు మరియు వారిని అపవాదు చేస్తాడు.
عربی تفاسیر:
وَمِنْهُمْ اُمِّیُّوْنَ لَا یَعْلَمُوْنَ الْكِتٰبَ اِلَّاۤ اَمَانِیَّ وَاِنْ هُمْ اِلَّا یَظُنُّوْنَ ۟
మరియు యూదుల్లోంచి ఒక వర్గమున్నది. వారికి తౌరాత్ గురించి పఠించటం తప్ప ఏమి తెలియదు. అది దేనిపై సూచిస్తుందో వారికి అర్ధం కాలేదు. వారి వద్ద తమ పెద్దల నుండి తీసుకున్న అబద్దాలు మాత్రమే ఉన్నాయి. వాటిని వారు అల్లాహ్ అవతరింపజేసిన తౌరాత్ అని భావిస్తున్నారు.
عربی تفاسیر:
فَوَیْلٌ لِّلَّذِیْنَ یَكْتُبُوْنَ الْكِتٰبَ بِاَیْدِیْهِمْ ۗ— ثُمَّ یَقُوْلُوْنَ هٰذَا مِنْ عِنْدِ اللّٰهِ لِیَشْتَرُوْا بِهٖ ثَمَنًا قَلِیْلًا ؕ— فَوَیْلٌ لَّهُمْ مِّمَّا كَتَبَتْ اَیْدِیْهِمْ وَوَیْلٌ لَّهُمْ مِّمَّا یَكْسِبُوْنَ ۟
ఎవరైతే తమ చేతులతో పుస్తకమును వ్రాసి ఆ తరువాత ఇది అల్లాహ్ వద్ద నుండి వచ్చినదని అబద్దమును పలుతుతున్నారో వారి కొరకు వినాశనము మరియు కఠినమైన శిక్ష నిరీక్షిస్తున్నది. వారు సత్యమునకు మరియు సన్మార్గమును అనుసరించటమునకు బదులుగా ధనము,రాజ్యము లాంటి ఇహలోకంలో అల్పమైన ధరను ఆశిస్తున్నారు. తమ చేతులారా వ్రాసి దాన్ని అల్లాహ్ వద్ద నుండి అని అబద్దమును కల్పించటం పై వారి కొరకు వినాశనము మరియు కఠినమైన శిక్ష కలదు. దీని వెనుక వారు సంపాదించిన సంపద మరియు రాజ్యమునకు బదులుగా వారి కొరకు వినాశనము మరియు కఠినమైన శిక్ష కలదు.
عربی تفاسیر:
وَقَالُوْا لَنْ تَمَسَّنَا النَّارُ اِلَّاۤ اَیَّامًا مَّعْدُوْدَةً ؕ— قُلْ اَتَّخَذْتُمْ عِنْدَ اللّٰهِ عَهْدًا فَلَنْ یُّخْلِفَ اللّٰهُ عَهْدَهٗۤ اَمْ تَقُوْلُوْنَ عَلَی اللّٰهِ مَا لَا تَعْلَمُوْنَ ۟
మరియు వారు అసత్యంగా,అహంకారంగా ఇలా పలికారు : మాకు అగ్ని తాకదు. మరియు మేము కొన్ని రోజులు మాత్రమే అందులో ప్రవేశిస్తాము. ఓ ప్రవక్తా వారందరితో ఇలా పలకండి : వీటికి: మీరు అల్లాహ్ నుండి ఒక దృఢమైన వాగ్దానం తీసుకున్నారా ?. ఒక వేళ అది మీకు ఉంటే ; నిశ్ఛయంగా అల్లాహ్ తన ప్రమాణమునకు విరుద్ధంగా చేయడు. లేదా మీరు అల్లాహ్ పై మీకు తెలియని అబద్దమును మరియు అసత్యమును పలుకుతున్నారు.
عربی تفاسیر:
بَلٰی مَنْ كَسَبَ سَیِّئَةً وَّاَحَاطَتْ بِهٖ خَطِیْٓـَٔتُهٗ فَاُولٰٓىِٕكَ اَصْحٰبُ النَّارِ ۚ— هُمْ فِیْهَا خٰلِدُوْنَ ۟
వీరందరు ఊహించుకున్నట్లు విషయం కాదు. నిశ్చయంగా అల్లాహ్ అవిశ్వాసము యొక్క చెడును సంపాదించిన ప్రతి ఒక్కరిని శిక్షిస్తాడు. మరియు అతని పాపములు అతన్ని అన్నివైపుల నుండి చుట్టుముడుతాయి. వారందరికి నరకంలో ప్రవేశింపజేయటం ద్వారా మరియు దాన్ని అంటిపెట్టుకునే విధంగా ప్రతిఫలం ప్రసాదించటం జరుగును. వారు అందులో శాశ్వతంగా ఉంటారు.
عربی تفاسیر:
وَالَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ اُولٰٓىِٕكَ اَصْحٰبُ الْجَنَّةِ ۚ— هُمْ فِیْهَا خٰلِدُوْنَ ۟۠
మరియు ఎవరైతే అల్లాహ్ పై,ఆయన ప్రవక్త పై విశ్వాసమును కనబరచి సత్కర్మలు చేస్తారో వారందరి ప్రతిఫలం అల్లాహ్ వద్ద స్వర్గములో ప్రవేశము మరియు దాన్ని అంటిపెట్టుకుని ఉండటం. వారు అందులో శాశ్వతంగా ఉంటారు.
عربی تفاسیر:
وَاِذْ اَخَذْنَا مِیْثَاقَ بَنِیْۤ اِسْرَآءِیْلَ لَا تَعْبُدُوْنَ اِلَّا اللّٰهَ ۫— وَبِالْوَالِدَیْنِ اِحْسَانًا وَّذِی الْقُرْبٰی وَالْیَتٰمٰی وَالْمَسٰكِیْنِ وَقُوْلُوْا لِلنَّاسِ حُسْنًا وَّاَقِیْمُوا الصَّلٰوةَ وَاٰتُوا الزَّكٰوةَ ؕ— ثُمَّ تَوَلَّیْتُمْ اِلَّا قَلِیْلًا مِّنْكُمْ وَاَنْتُمْ مُّعْرِضُوْنَ ۟
ఓ ఇస్రాయీలు సంతతివారా మేము మీపై తీసుకున్న దృఢమైన ప్రమాణమును గుర్తు చేసుకోండి. మీరు అల్లాహ్ ఏకేశ్వరోపాసన చేయటం ద్వారా మరియు ఆయనతో పాటు మీరు ఇతరులను ఆరాధించకుండా మరియు తల్లిదండ్రులకు,దగ్గరి బంధువులకు,అనాధలకు,నిరుపేదలకు మరియు అవసరం కలవారికి మీరు మేలు చేయటం ద్వారా మరియు మీరు ప్రజలకు మంచి మాట పలకటం ద్వారా,మంచిని ఆదేశించటం మరియు చెడు నుండి వారించటం ఎటువంటి కఠినత,తీవ్రత లేకుండా మరియు మీకు ఆదేశించబడిన విధంగా నమాజును పరిపూర్ణంగా మీరు పాటించటం ద్వారా మరియు జకాతును దానికి అర్హులైనవారికి మీకు మంచి అనిపించిన విధంగా వారికి ఇవ్వటం ద్వారా. ఈ ఒప్పందం తరువాత మీతో తీసుకున్న దాన్ని పూర్తి చేయటం నుండి మీరు విముఖత చూపుతూ తిరిగిపోవటం తప్ప మీ నుండి ఇంకేమి జరగలేదు. కాని అల్లాహ్ మీలో నుండి ఎవరినైతే రక్షించాడో వారు అల్లాహ్ తో చేసిన ఒప్పందమును,ప్రమాణమును పూర్తిచేశారు.
عربی تفاسیر:
حالیہ صفحہ میں آیات کے فوائد:
• بعض أهل الكتاب يدّعي العلم بما أنزل الله، والحقيقة أن لا علم له بما أنزل الله، وإنما هو الوهم والجهل.
కొంత మంది గ్రంధవహులు అల్లాహ్ అవతరింపజేసిన వాటి గురించి జ్ఞానమున్నదని వాదిస్తున్నారు. వాస్తవానికి అల్లాహ్ అవతరించిన వాటి గురించి వారికి జ్ఞానం లేదు. అది భ్రమ,అజ్ఞానం మాత్రమే.

• من أعظم الناس إثمًا من يكذب على الله تعالى ورسله ؛ فينسب إليهم ما لم يكن منهم.
ప్రజల్లోంచి పెద్ద పాపాత్ముడు ఎవడంటే అతడే మహోన్నతుడైన అల్లాహ్ పై మరియు ఆయన ప్రవక్తపై అబద్ధము పలికి వారిలో నుంచి కాని వాటిని వారికి ఆపాదించువాడు.

• مع عظم المواثيق التي أخذها الله تعالى على اليهود وشدة التأكيد عليها، لم يزدهم ذلك إلا إعراضًا عنها ورفضًا لها.
మహోన్నతుడైన అల్లాహ్ యూదులతో పెద్ద ప్రమాణాలు తీసుకుని వాటి గురించి కఠినంగా తాకీదు చేసినా కూడా అవి వారికి వాటి నుండి విముఖతను మరియు తిరస్కారమును మాత్రమే అధికం చేసినవి.

 
معانی کا ترجمہ سورت: بقرہ
سورتوں کی لسٹ صفحہ نمبر
 
قرآن کریم کے معانی کا ترجمہ - المختصر فی تفسیر القرآن الکریم کا تیلگو ترجمہ - ترجمے کی لسٹ

مرکز تفسیر للدراسات القرآنیۃ سے شائع ہوا ہے۔

بند کریں