Check out the new design

قرآن کریم کے معانی کا ترجمہ - المختصر فی تفسیر القرآن الکریم کا تیلگو ترجمہ * - ترجمے کی لسٹ


معانی کا ترجمہ آیت: (31) سورت: نور
وَقُلْ لِّلْمُؤْمِنٰتِ یَغْضُضْنَ مِنْ اَبْصَارِهِنَّ وَیَحْفَظْنَ فُرُوْجَهُنَّ وَلَا یُبْدِیْنَ زِیْنَتَهُنَّ اِلَّا مَا ظَهَرَ مِنْهَا وَلْیَضْرِبْنَ بِخُمُرِهِنَّ عَلٰی جُیُوْبِهِنَّ ۪— وَلَا یُبْدِیْنَ زِیْنَتَهُنَّ اِلَّا لِبُعُوْلَتِهِنَّ اَوْ اٰبَآىِٕهِنَّ اَوْ اٰبَآءِ بُعُوْلَتِهِنَّ اَوْ اَبْنَآىِٕهِنَّ اَوْ اَبْنَآءِ بُعُوْلَتِهِنَّ اَوْ اِخْوَانِهِنَّ اَوْ بَنِیْۤ اِخْوَانِهِنَّ اَوْ بَنِیْۤ اَخَوٰتِهِنَّ اَوْ نِسَآىِٕهِنَّ اَوْ مَا مَلَكَتْ اَیْمَانُهُنَّ اَوِ التّٰبِعِیْنَ غَیْرِ اُولِی الْاِرْبَةِ مِنَ الرِّجَالِ اَوِ الطِّفْلِ الَّذِیْنَ لَمْ یَظْهَرُوْا عَلٰی عَوْرٰتِ النِّسَآءِ ۪— وَلَا یَضْرِبْنَ بِاَرْجُلِهِنَّ لِیُعْلَمَ مَا یُخْفِیْنَ مِنْ زِیْنَتِهِنَّ ؕ— وَتُوْبُوْۤا اِلَی اللّٰهِ جَمِیْعًا اَیُّهَ الْمُؤْمِنُوْنَ لَعَلَّكُمْ تُفْلِحُوْنَ ۟
మరియు మీరు విశ్వాసపరులైన స్త్రీలతో తమకు చూడటం సమ్మతం కాని మర్మావయవాల వైపు చూడటం నుండి తమ చూపులను ఆపి ఉంచమని,తమ మర్మాంగాలను అశ్లీలత నుండి దూరంగా ఉండి,వస్త్రంతో కప్పి పరిరక్షించమని,తమ అలంకరణను పరాయి వారి ముందు ప్రదర్శించవద్దని కాని అందులోంచి బహిర్గతమైపోయేవి వేటినైతే దాయటం అసంభవమో అవి తప్ప ఉదాహరణకు : వస్త్రములు, తమ దుపట్టాలను తమ వస్త్రముల పై భాగములో తెరవబడిన భాగములపై నుండు తమ శిరోజాలను,తమ ముఖములను,తమ మెడలను కప్పుకోవటానికి వేసుకోమని, తమ దాచిన అలంకరణను తమ భర్తల ముందు లేక తమ తండ్రుల ముందు లేక తమ మామల ముందు లేక తమ కొడుకుల ముందు లేక తమ భర్తల కొడుకుల ముందు లేక తమ సోదరుల ముందు లేక తమ సోదరుల కుమారుల ముందు లేక తమ అక్కాచెల్లెళ్ల కుమారుల ముందు లేక తమతో కలిసి ఉండే స్త్రీల ముందు వారు ముస్లిములైన లేదా ముస్లిమేతరులైనా లేక స్త్రీ అయిన లేదా పురుషుడైన బానిస ముందు లేక స్త్రిలలో ఇతరత్రా ఉద్దేశాలు లేని లోబడి ఉన్న పురుషుల ముందు లేక తమ బాల్యము వలన స్త్రీల మర్మావయవాల అవగాహన లేని పిల్లల ముందు మాత్రమే బహిర్గతం చేయాలని చెప్పండి. మరియు కాలి పట్టీలు, వాటిని పోలినటువంటి తాము దాచి పెట్టుకున్న అలంకరణను తెలియాలనే ఉద్ధేశంతో తమ కాళ్ళను (నేలమీద) కొట్టకూడదు. ఓ విశ్వాసపరులారా మీరందరు మీ కొరకు సంభవించిన చూపులు మొదలగు వాటి గురించి మీరు కోరుకున్న వాటి ద్వారా మీరు సాఫల్యం చెందుతారని,భయపడే వాటి నుండి విముక్తి పొందుతారని ఆశిస్తూ అల్లాహ్ యందు తౌబా చేయండి.
عربی تفاسیر:
حالیہ صفحہ میں آیات کے فوائد:
• جواز دخول المباني العامة دون استئذان.
ప్రజా భవనాల్లో అనుమతి లేకుండా ప్రవేశము సమ్మతము.

• وجوب غض البصر على الرجال والنساء عما لا يحلّ لهم.
స్త్రీ,పురుషులపై తమకు సమ్మతం కాని వాటి నుండి చూపులను క్రిందకు పెట్టటం తప్పనిసరి.

• وجوب الحجاب على المرأة.
పరదా (హిజాబ్) స్త్రీపై విధి.

• منع استخدام وسائل الإثارة.
ప్రేరేపించే కారకాలను ఉపయోగించటం నిరోధం.

 
معانی کا ترجمہ آیت: (31) سورت: نور
سورتوں کی لسٹ صفحہ نمبر
 
قرآن کریم کے معانی کا ترجمہ - المختصر فی تفسیر القرآن الکریم کا تیلگو ترجمہ - ترجمے کی لسٹ

مرکز تفسیر للدراسات القرآنیۃ سے شائع ہوا ہے۔

بند کریں