Check out the new design

قرآن کریم کے معانی کا ترجمہ - المختصر فی تفسیر القرآن الکریم کا تیلگو ترجمہ * - ترجمے کی لسٹ


معانی کا ترجمہ سورت: غافر   آیت:
وَقَالَ فِرْعَوْنُ ذَرُوْنِیْۤ اَقْتُلْ مُوْسٰی وَلْیَدْعُ رَبَّهٗ ۚؕ— اِنِّیْۤ اَخَافُ اَنْ یُّبَدِّلَ دِیْنَكُمْ اَوْ اَنْ یُّظْهِرَ فِی الْاَرْضِ الْفَسَادَ ۟
మరియు ఫిర్ఔన్ ఇలా పలికాడు : మీరు నన్ను వదలండి నేను మూసాను అతనికి శిక్షగా చంపివేస్తాను. మరియు అతడు నా నుండి అతడిని ఆపటానికి తన ప్రభువును పిలుచుకోవాలి. అతను తన ప్రభువును పిలుచుకోవటమును నేను లెక్కచేయను. మీరు ఉన్న ధర్మమును అతడు మార్చి వేస్తాడని లేదా హతమార్చటం మరియు విధ్వంసం చేయటం ద్వారా భూమిలో చెడును వ్యాపింపజేస్తాడని నేను భయపడుతున్నాను.
عربی تفاسیر:
وَقَالَ مُوْسٰۤی اِنِّیْ عُذْتُ بِرَبِّیْ وَرَبِّكُمْ مِّنْ كُلِّ مُتَكَبِّرٍ لَّا یُؤْمِنُ بِیَوْمِ الْحِسَابِ ۟۠
మరియు మూసా అలైహిస్సలాం తన కొరకు ఫిర్ఔన్ బెదిరింపులను తెలుసుకున్నప్పుడు ఇలా పలికారు : సత్యము నుండి మరియు దానిపై విశ్వాసము నుండి అహంకారమును చూపే,ప్రళయదినము పై మరియు అందులో ఉన్న లెక్క తీసుకోవటం మరియు శిక్షంచటం పై విశ్వాసమును కనబరచని ప్రతీ వ్యక్తి నుండి నిశ్ఛయంగా నేను నా ప్రభువు, మీ ప్రభువుని(అల్లాహ్ని) ఆశ్రయించి రక్షణను కోరుతాను.
عربی تفاسیر:
وَقَالَ رَجُلٌ مُّؤْمِنٌ ۖۗ— مِّنْ اٰلِ فِرْعَوْنَ یَكْتُمُ اِیْمَانَهٗۤ اَتَقْتُلُوْنَ رَجُلًا اَنْ یَّقُوْلَ رَبِّیَ اللّٰهُ وَقَدْ جَآءَكُمْ بِالْبَیِّنٰتِ مِنْ رَّبِّكُمْ ؕ— وَاِنْ یَّكُ كَاذِبًا فَعَلَیْهِ كَذِبُهٗ ۚ— وَاِنْ یَّكُ صَادِقًا یُّصِبْكُمْ بَعْضُ الَّذِیْ یَعِدُكُمْ ؕ— اِنَّ اللّٰهَ لَا یَهْدِیْ مَنْ هُوَ مُسْرِفٌ كَذَّابٌ ۟
మరియు ఫిర్ఔన్ వంశము నుండి అల్లాహ్ పై విశ్వాసముంచిన ఒక వ్యక్తి తన విశ్వాసమును తన జాతి వారి నుండి దాచి ఉంచినవాడు మూసా హత్య గురించి వారు చేసుకున్న దృఢ సంకల్పమును విభేదిస్తూ ఇలా పలికాడు : ఏమీ మీరు ఏ పాపము చేయని ఒక వ్యక్తిని నా ప్రభువు అల్లాహ్ అని చెప్పినంత మాత్రాన చంపేస్తారా ?. వాస్తవానికి అతను తన ప్రభువు వద్ద నుండి పంపించబడ్డ ప్రవక్త అని అతని వాదనలో అతని నిజాయితీ పై సూచించే వాదనలను మరియు ఆధారాలను మీ వద్దకు తీసుకుని వచ్చాడు. ఒక వేళ అతడు అసత్యపరుడని అనుకుంటే అతని అసత్యము యొక్క కీడు అతనిపైనే మరలుతుంది. ఒక వేళ అతడు నిజాయితీపరుడైతే మీకు అతను వాగ్దానం చేసిన శిక్ష నుండి కొంత భాగము తొందరగా మీకు చేరుతుంది. నిశ్ఛయంగా అల్లాహ్ తన హద్దులను అతిక్రమించే వాడిని,తనపై మరియు తన ప్రవక్త పై అబద్దములను అపాదించేవాడికి సత్యము వైపునకు భాగ్యమును కలిగించడు.
عربی تفاسیر:
یٰقَوْمِ لَكُمُ الْمُلْكُ الْیَوْمَ ظٰهِرِیْنَ فِی الْاَرْضِ ؗ— فَمَنْ یَّنْصُرُنَا مِنْ بَاْسِ اللّٰهِ اِنْ جَآءَنَا ؕ— قَالَ فِرْعَوْنُ مَاۤ اُرِیْكُمْ اِلَّا مَاۤ اَرٰی وَمَاۤ اَهْدِیْكُمْ اِلَّا سَبِیْلَ الرَّشَادِ ۟
ఓ నా జాతి వారా ఈ రోజు రాజ్యాధికారం మీదే ,మిసర్ భూ బాగములో విజయమును పొందేవారు మీరే. మూసాను హతమార్చటం వలన మాపై అల్లాహ్ శిక్ష వచ్చిపడితే మాకు సహాయం చేసేవాడు ఎవడు ?!. ఫిర్ఔన్ ఇలా పలికాడు : నాదే నిర్ణయం మరియు నాదే ఆదేశం. మరియు నేను కీడును,చెడును తొలగించటానికి మూసాను హతమార్చదలిచాను. మరియు నేను మిమ్మల్ని మాత్రం సరైన,సముచితమైన మార్గమును మాత్రమే మీకు చూపుతాను.
عربی تفاسیر:
وَقَالَ الَّذِیْۤ اٰمَنَ یٰقَوْمِ اِنِّیْۤ اَخَافُ عَلَیْكُمْ مِّثْلَ یَوْمِ الْاَحْزَابِ ۟ۙ
విశ్వసించిన వాడు తన జాతివారిని హితోపదేశం చేస్తూ ఇలా పలికాడు : ఒక వేళ మీరు దుర్మార్గముతో ,శతృత్వముతో మూసా ను హతమారిస్తే మీ పై నేను పూర్వ ప్రవక్తలపై వర్గాలుగా వచ్చిన వర్గముల శిక్ష లాంటి శిక్ష మీ పై వచ్చిపడతుందని నేను భయపడుతున్నాను. అప్పుడు అల్లాహ్ వారిని నాశనం చేశాడు.
عربی تفاسیر:
مِثْلَ دَاْبِ قَوْمِ نُوْحٍ وَّعَادٍ وَّثَمُوْدَ وَالَّذِیْنَ مِنْ بَعْدِهِمْ ؕ— وَمَا اللّٰهُ یُرِیْدُ ظُلْمًا لِّلْعِبَادِ ۟
నూహ్ జాతి ,ఆద్, సమూద్ మరియు వారి తరువాత వచ్చినటువంటివారు ఎవరైతే అవిశ్వశించి ప్రవక్తలను తిరస్కరించిన వారి అలవాటు లాంటిది. నిశ్ఛయంగా అల్లాహ్ వారిని వారి అవిశ్వాసము,తన ప్రవక్తను వారు తిరస్కరించటం వలన తుదిముట్టించాడు. మరియు అల్లాహ్ దాసుల కొరకు హింసను కోరుకోడు. ఆయన మాత్రం వారిని వారి పాపముల వలన శిక్షిస్తాడు. పూర్తి ప్రతిఫలంగా.
عربی تفاسیر:
وَیٰقَوْمِ اِنِّیْۤ اَخَافُ عَلَیْكُمْ یَوْمَ التَّنَادِ ۟ۙ
ఓ నా జాతి ప్రజలారా నిశ్చయంగా నేను మీపై ప్రళయదినము గురించి భయపడుతున్నాను. ఆ రోజు ప్రజలు ఒకరినొకరు బంధుత్వం వలన లేదా ఉన్నత స్థానం వలన ఈ వర్గము ఈ భయానక స్థితిలో ప్రయోజనం కలిగిస్తుందని భావించి పిలుస్తారు.
عربی تفاسیر:
یَوْمَ تُوَلُّوْنَ مُدْبِرِیْنَ ۚ— مَا لَكُمْ مِّنَ اللّٰهِ مِنْ عَاصِمٍ ۚ— وَمَنْ یُّضْلِلِ اللّٰهُ فَمَا لَهٗ مِنْ هَادٍ ۟
ఆ రోజు మీరు నరకాగ్ని నుండి భయపడి వెనుతిప్పి పారిపోతారు. అల్లాహ్ శిక్ష నుండి మిమ్మల్ని ఆపేవాడు మీ కొరకు ఎవడూ ఉండడు. మరియు అల్లాహ్ ఎవరినైతే నిస్సహాయ స్థితిలో వదిలివేసి అతనికి విశ్వాసము కొరకు భాగ్యమును కలిగించడో అతడికి సన్మార్గం చూపేవాడు ఎవడూ ఉండడు. ఎందుకంటే సన్మార్గము యొక్క భాగ్యమును కలిగించటం అల్లాహ్ ఒక్కడి చేతిలోనే ఉన్నది.
عربی تفاسیر:
حالیہ صفحہ میں آیات کے فوائد:
• لجوء المؤمن إلى ربه ليحميه من كيد أعدائه.
విశ్వాసపరుడు తన శతృవుల కుట్రల నుండి రక్షణ కొరకు తన ప్రభువును ఆశ్రయించడం.

• جواز كتم الإيمان للمصلحة الراجحة أو لدرء المفسدة.
ఉత్తమ ప్రయోజనం కొరకు లేదా చెడును అరికట్టటానికి విశ్వాసమును దాచి ఉంచటం సమ్మతము.

• تقديم النصح للناس من صفات أهل الإيمان.
ప్రజల కొరకు ఉపదేశాలు ఇవ్వటం విశ్వాసపరుల లక్షణం.

 
معانی کا ترجمہ سورت: غافر
سورتوں کی لسٹ صفحہ نمبر
 
قرآن کریم کے معانی کا ترجمہ - المختصر فی تفسیر القرآن الکریم کا تیلگو ترجمہ - ترجمے کی لسٹ

مرکز تفسیر للدراسات القرآنیۃ سے شائع ہوا ہے۔

بند کریں