Check out the new design

قرآن کریم کے معانی کا ترجمہ - تیلگو ترجمہ - عبدالرحیم بن محمد * - ترجمے کی لسٹ

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

معانی کا ترجمہ سورت: بقرہ   آیت:
وَقَالَتِ الْیَهُوْدُ لَیْسَتِ النَّصٰرٰی عَلٰی شَیْءٍ ۪— وَّقَالَتِ النَّصٰرٰی لَیْسَتِ الْیَهُوْدُ عَلٰی شَیْءٍ ۙ— وَّهُمْ یَتْلُوْنَ الْكِتٰبَ ؕ— كَذٰلِكَ قَالَ الَّذِیْنَ لَا یَعْلَمُوْنَ مِثْلَ قَوْلِهِمْ ۚ— فَاللّٰهُ یَحْكُمُ بَیْنَهُمْ یَوْمَ الْقِیٰمَةِ فِیْمَا كَانُوْا فِیْهِ یَخْتَلِفُوْنَ ۟
మరియు యూదులు: "క్రైస్తవుల వద్ద (సత్యధర్మమనేది) ఏదీ లేదు." అని అంటారు. మరియు క్రైస్తవులు: "యూదుల వద్ద (సత్యధర్మమనేది) ఏదీ లేదు." అని అంటారు. మరియు వారందరూ చదివేదు దివ్యగ్రంథమే. ఇలాగే (దివ్యగ్రంథ) జ్ఞానం లేనివారు (బహుదైవారాధకులు) కూడా ఇదే విధంగా పలుకు తుంటారు. కావున వారందరిలో ఉన్న అభిప్రాయభేదాలను గురించి, అల్లాహ్ పునరుత్థాన దినమున వారి మధ్య తీర్పు చేస్తాడు.
عربی تفاسیر:
وَمَنْ اَظْلَمُ مِمَّنْ مَّنَعَ مَسٰجِدَ اللّٰهِ اَنْ یُّذْكَرَ فِیْهَا اسْمُهٗ وَسَعٰی فِیْ خَرَابِهَا ؕ— اُولٰٓىِٕكَ مَا كَانَ لَهُمْ اَنْ یَّدْخُلُوْهَاۤ اِلَّا خَآىِٕفِیْنَ ؕ۬— لَهُمْ فِی الدُّنْیَا خِزْیٌ وَّلَهُمْ فِی الْاٰخِرَةِ عَذَابٌ عَظِیْمٌ ۟
మరియు అల్లాహ్ మస్జిద్ లలో ఆయన నామస్మరణం నిషేధించి వాటిని నాశనం చేయటానికి పాటుపడే వారి కంటే ఎక్కువ దుర్మార్గులెవరు? అలాంటి వారు వాటిలో (మస్జిద్ లలో) ప్రవేశించటానికి అర్హులు కారు; వారు (ఒకవేళ ప్రవేశించినా) భయపడుతూ ప్రవేశించాలి. వారికి ఇహలోకంలో పరాభవం ఉంటుంది మరియు పరలోకంలో ఘోర శిక్ష ఉంటుంది.
عربی تفاسیر:
وَلِلّٰهِ الْمَشْرِقُ وَالْمَغْرِبُ ۗ— فَاَیْنَمَا تُوَلُّوْا فَثَمَّ وَجْهُ اللّٰهِ ؕ— اِنَّ اللّٰهَ وَاسِعٌ عَلِیْمٌ ۟
మరియు తూర్పు పడమరలు అల్లాహ్ కే చెందినవి. కావున మీరు (మీ ముఖాలను) ఏ దిక్కుకు త్రిప్పినా మీకు అల్లాహ్ సముఖమే లభిస్తుంది. నిశ్చయంగా, అల్లాహ్, సర్వవ్యాప్తి,[1] సర్వజ్ఞుడు.
[1] అల్-వాసి'ఉ: The All-Embracing, Infinite, Pervading, Bountiful, Comprehending all, Having ample Powr or ability. Has full knowledge of all things, All-Sufficient, సర్వవ్యాప్తి, సర్వోపగతుడు, విస్తారుడు, అంతం లేనివాడు, అపారుడు, అత్యంత ఉదారుడు, సంపలొసంగు వాడు, అల్లాహ్ జ్ఞానం ప్రతి దానిని ఆవరించు (ఇముడ్చు)కొని ఉంది. దివ్యఖుర్ఆన్ లో, వాసి'ఉన్ 'అలీమున్ అనే పదాలు ఇంకా 6 చోట్లలో వచ్చాయి. అవి: 2:247, 261, 268, 3:73, 5:54, 24:32. ఈ రెండూ అల్లాహుతా'ఆలా అత్యుత్తమ పేర్లు. ఇంకా చూడండి, వాసి'ఉన్ కొరకు, 4:130, 7:156, 53:32.
عربی تفاسیر:
وَقَالُوا اتَّخَذَ اللّٰهُ وَلَدًا ۙ— سُبْحٰنَهٗ ؕ— بَلْ لَّهٗ مَا فِی السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— كُلٌّ لَّهٗ قٰنِتُوْنَ ۟
మరియు వారు: "అల్లాహ్ ఒక కుమారుణ్ణి కలిగి ఉన్నాడు (కన్నాడు)." అని అంటారు. ఆయన సర్వలోపాలకు అతీతుడు.[1] వాస్తవానికి భూమ్యాకాశాలలో ఉన్న వన్నీ ఆయనకు చెందినవే. అవన్నీ ఆయనకు విధేయులై ఉన్నాయి.[2]
[1] సుబ్ హాన: సర్వలోపాలకు అతీతుడు, పరిశుద్ధుడు, పరమ పవిత్రుడు, చూడండి, 2:32 [2] ఇబ్నె - 'అబ్బాస్ (ర'.ది.'అ.) కథనం. ('స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం - 6, 'హదీస్' నం. 9).
عربی تفاسیر:
بَدِیْعُ السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— وَاِذَا قَضٰۤی اَمْرًا فَاِنَّمَا یَقُوْلُ لَهٗ كُنْ فَیَكُوْنُ ۟
ఆయనే ఆకాశాలనూ మరియు భూమినీ ఏ నమూనా లేకుండా ఆరంభించిన (సృష్టించిన)[1] వాడు. మరియు ఆయన ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నప్పుడు దానిని కేవలం: "అయిపో!" అని ఆజ్ఞాపిస్తాడు. అంతే అది అయిపోతుంది. [2]
[1] బదీ'ఉ (అల్-బదీ'ఉ) : Innovator. ఏ నమూనా లేకుండా ఆరంభించిన వాడు (ఆరంభకుడు), ప్రారంభకుడు, మొదటిసారి క్రొత్తగా సృష్టించినవాడు. ప్రభవింపబజేసేవాడు. ఇది అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి. చూడండి, 6:101. [2] అల్లాహుతా'ఆలా ఏదైనా చేయదలచుకుంటే దానిని కేవలం: 'అయిపో!' అని ఆజ్ఞాపిస్తాడు. అంతే అది అయిపోతుంది. అలాంటప్పుడు ఆయనకు సంతానం కనే అవసరం ఎందుకుంటుంది. ఈ విధమైన వాక్యం 'కున్ ఫ యకూన్' ఖుర్ఆన్ లో 8 సార్లు వచ్చింది. చూడండి, 3:47, 59, 6:73, 16:40, 19:35, 36:82, 40:68.
عربی تفاسیر:
وَقَالَ الَّذِیْنَ لَا یَعْلَمُوْنَ لَوْلَا یُكَلِّمُنَا اللّٰهُ اَوْ تَاْتِیْنَاۤ اٰیَةٌ ؕ— كَذٰلِكَ قَالَ الَّذِیْنَ مِنْ قَبْلِهِمْ مِّثْلَ قَوْلِهِمْ ؕ— تَشَابَهَتْ قُلُوْبُهُمْ ؕ— قَدْ بَیَّنَّا الْاٰیٰتِ لِقَوْمٍ یُّوْقِنُوْنَ ۟
మరియు అజ్ఞానులు: "అల్లాహ్ మాతో ఎందుకు మాట్లాడడు? లేక మా వద్దకు ఏదైనా సూచన (ఆయత్) ఎందుకు రాదు? అని అడుగుతారు. వారికి పూర్వం వారు కూడా ఇదే విధంగా అడిగేవారు.[1] వారందరి మనస్తత్వాలు (హృదయాలు) ఒకే విధమైనవి. వాస్తవానికి, దృఢనమ్మకం ఉన్న వారికి మేము మా సూచన (ఆయత్) లను సృష్టపరుస్తాము.
[1] చూడండి, 17:90-93.
عربی تفاسیر:
اِنَّاۤ اَرْسَلْنٰكَ بِالْحَقِّ بَشِیْرًا وَّنَذِیْرًا ۙ— وَّلَا تُسْـَٔلُ عَنْ اَصْحٰبِ الْجَحِیْمِ ۟
నిశ్చయంగా, మేము నిన్ను (ఓ ముహమ్మద్) సత్యాన్ని ప్రసాదించి, శుభవార్త నిచ్చేవానిగా మరియు హెచ్చరిక చేసే వానిగా పంపాము. మరియు భగ-భగ మండే నరకాగ్నికి గురి అయ్యే వారిని గురించి నీవు ప్రశ్నించబడవు.[1]
[1] చూడండి, 3:85
عربی تفاسیر:
 
معانی کا ترجمہ سورت: بقرہ
سورتوں کی لسٹ صفحہ نمبر
 
قرآن کریم کے معانی کا ترجمہ - تیلگو ترجمہ - عبدالرحیم بن محمد - ترجمے کی لسٹ

عبد الرحیم بن محمد نے ترجمہ کیا۔

بند کریں