قرآن کریم کے معانی کا ترجمہ - تیلگو ترجمہ - عبدالرحیم بن محمد * - ترجمے کی لسٹ

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

معانی کا ترجمہ سورت: سورۂ صٓ   آیت:

సూరహ్ సాద్

صٓ وَالْقُرْاٰنِ ذِی الذِّكْرِ ۟ؕ
సాద్.[1] మరియు హితబోధతో నిండివున్న ఈ ఖుర్ఆన్ సాక్షిగా!
[1] సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.
عربی تفاسیر:
بَلِ الَّذِیْنَ كَفَرُوْا فِیْ عِزَّةٍ وَّشِقَاقٍ ۟
వాస్తవానికి, సత్యాన్ని తిరస్కరించిన వారు అహంకారంలో మరియు విరోధంలో పడివున్నారు.
عربی تفاسیر:
كَمْ اَهْلَكْنَا مِنْ قَبْلِهِمْ مِّنْ قَرْنٍ فَنَادَوْا وَّلَاتَ حِیْنَ مَنَاصٍ ۟
వారికి పూర్వం గతించిన ఎన్నో తరాలను మేము నాశనం చేశాము. అప్పుడు వారు మొర పెట్టుకోసాగారు, కాని అప్పుడు వారికి దాని నుండి తప్పించుకునే సమయం లేకపోయింది!
عربی تفاسیر:
وَعَجِبُوْۤا اَنْ جَآءَهُمْ مُّنْذِرٌ مِّنْهُمْ ؗ— وَقَالَ الْكٰفِرُوْنَ هٰذَا سٰحِرٌ كَذَّابٌ ۟ۖۚ
మరియు వారిని హెచ్చరించేవాడు, తమలో నుంచే రావటం చూసి వారు ఆశ్చర్యపడ్డారు! మరియు సత్యతిరస్కారులు ఇలా అన్నారు: "ఇతడు మాంత్రికుడు, అసత్యవాది."
عربی تفاسیر:
اَجَعَلَ الْاٰلِهَةَ اِلٰهًا وَّاحِدًا ۖۚ— اِنَّ هٰذَا لَشَیْءٌ عُجَابٌ ۟
"ఏమీ? ఇతను (ఈ ప్రవక్త) దైవాలందరినీ, ఒకే ఆరాధ్యదైవంగా చేశాడా? నిశ్చయంగా ఇది ఎంతో విచిత్రమైన విషయం!"
عربی تفاسیر:
وَانْطَلَقَ الْمَلَاُ مِنْهُمْ اَنِ امْشُوْا وَاصْبِرُوْا عَلٰۤی اٰلِهَتِكُمْ ۖۚ— اِنَّ هٰذَا لَشَیْءٌ یُّرَادُ ۟ۚ
మరియు వారి నాయకులు ఇలా అనసాగారు: "పదండి! మీరు మీ దైవాల (ఆరాధన) మీద స్థిరంగా ఉండండి." నిశ్చయంగా, ఇందులో (మీకు విరుద్ధంగా) ఏదో ఉద్దేశింపబడి ఉంది!
عربی تفاسیر:
مَا سَمِعْنَا بِهٰذَا فِی الْمِلَّةِ الْاٰخِرَةِ ۖۚ— اِنْ هٰذَاۤ اِلَّا اخْتِلَاقٌ ۟ۖۚ
"ఇలాంటి విషయాన్ని మేము ఇటీవలి కాలపు మతంలో విని ఉండలేదు. ఇది కేవలం కల్పన మాత్రమే!"
عربی تفاسیر:
ءَاُنْزِلَ عَلَیْهِ الذِّكْرُ مِنْ بَیْنِنَا ؕ— بَلْ هُمْ فِیْ شَكٍّ مِّنْ ذِكْرِیْ ۚ— بَلْ لَّمَّا یَذُوْقُوْا عَذَابِ ۟ؕ
"ఏమీ? మా అందరిలోనూ, కేవలం ఇతనిపైననే, ఈ హితబోధ అవతరింప జేయబడిందా?[1] వాస్తవానికి వారు నా హితబోధను గురించి సంశయంలో పడి వున్నారు.[2] అలా కాదు, వారు ఇంకా (నా) శిక్షను రుచి చూడలేదు!
[1] చూడండి, 43:31-32.
[2] వారు సంశయంలో పడింది ము'హమ్మద్ ('స'అస) అసత్యవాది అని కాదు. అతను బోధించే ధర్మం వారి దైవాలను వదలి, అగోచరుడైన ఏకైక దైవ అల్లాహ్ (సు.తా.)ను ఆరాధించమని చెప్పడం.
عربی تفاسیر:
اَمْ عِنْدَهُمْ خَزَآىِٕنُ رَحْمَةِ رَبِّكَ الْعَزِیْزِ الْوَهَّابِ ۟ۚ
లేక వారి దగ్గర సర్వశక్తుడు, సర్వప్రదుడు [1] అయిన నీ ప్రభువు యొక్క కారుణ్య నిధులు ఉన్నాయా?
[1] అల్-వహ్హాబ్: Bestower. సర్వప్రదుడు, సర్వవర ప్రదాత, పరమదాత. చూడండి, 3:8.
عربی تفاسیر:
اَمْ لَهُمْ مُّلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَمَا بَیْنَهُمَا ۫— فَلْیَرْتَقُوْا فِی الْاَسْبَابِ ۟
లేక! ఆకాశాలు మరియు భూమి మరియు వాటి మధ్య ఉన్న సమస్తం మీద వారికి సామ్రాజ్యాధిపత్యం ఉందా? అలా అయితే వారిని తమ సాధనాలతో పైకి (ఆకాశలోకి) ఎక్కమను!
عربی تفاسیر:
جُنْدٌ مَّا هُنَالِكَ مَهْزُوْمٌ مِّنَ الْاَحْزَابِ ۟
ఇంతకు ముందు ఓడించబడిన సైన్యాల వలే, ఒక వర్గం వీరిది కూడా ఉంటుంది!
عربی تفاسیر:
كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوْحٍ وَّعَادٌ وَّفِرْعَوْنُ ذُو الْاَوْتَادِ ۟ۙ
వీరికి పూర్వం నూహ్ మరియు ఆద్ (జాతి) వారు మరియు మేకుల ఫిర్ఔన్ జాతుల వారు సత్యాన్ని తిరస్కరించారు;
عربی تفاسیر:
وَثَمُوْدُ وَقَوْمُ لُوْطٍ وَّاَصْحٰبُ لْـَٔیْكَةِ ؕ— اُولٰٓىِٕكَ الْاَحْزَابُ ۟
మరియు సమూద్ మరియు లూత్ జాతుల వారు మరియు అయ్ కహ్ (మద్ యన్)[1] వాసులు అందరూ ఇలాంటి వర్గాలకు చెందినవారే.
[1] అయ్ కహ్ వాసుల గాథ కొరకు చూడండి, 26:176.
عربی تفاسیر:
اِنْ كُلٌّ اِلَّا كَذَّبَ الرُّسُلَ فَحَقَّ عِقَابِ ۟۠
ఇక వీరిలో ఏ ఒక్కరూ ప్రవక్తలను అసత్యవాదులని తిరస్కరించకుండా ఉండలేదు, కావున నా శిక్ష అనివార్యమయ్యింది.
عربی تفاسیر:
وَمَا یَنْظُرُ هٰۤؤُلَآءِ اِلَّا صَیْحَةً وَّاحِدَةً مَّا لَهَا مِنْ فَوَاقٍ ۟
మరియు వీరందరూ కేవలం ఒక గర్జన (సయ్ హా) [1] కొరకు మాత్రమే ఎదురు చూస్తున్నారు, దానికి ఎలాంటి నిలుపుదల ఉండదు.
[1] పునరుత్థాన దినమున ఇస్రాఫీల్ ('అ.స.) ఊదే బాకా ధ్వని, అరుపు, ప్రేలుడు గర్జన లేక శబ్దం. ఇంకా చూడండి, 36:29, 49, 53.
عربی تفاسیر:
وَقَالُوْا رَبَّنَا عَجِّلْ لَّنَا قِطَّنَا قَبْلَ یَوْمِ الْحِسَابِ ۟
మరియు వారు: "ఓ మా ప్రభూ! లెక్క దినానికి ముందే మా భాగం మాకు తొందరగా ఇచ్చి వెయ్యి." [1] అని అంటారు.
[1] అంటే వారు పునరుత్థాన దినం గురించి పరిహాసం చేస్తూ: 'ఆ దినం రాకముందే మా భాగపు శిక్ష మాకు ఇవ్వు' అని అంటున్నారు. చూడండి, 8:32.
عربی تفاسیر:
اِصْبِرْ عَلٰی مَا یَقُوْلُوْنَ وَاذْكُرْ عَبْدَنَا دَاوٗدَ ذَا الْاَیْدِ ۚ— اِنَّهٗۤ اَوَّابٌ ۟
(ఓ ముహమ్మద్!) వారి మాటల యెడల నీవు సహనం వహించు మరియు బలవంతుడైన, మా దాసుడు దావూద్ ను జ్ఞాపకం చేసుకో. [1] నిశ్చయంగా, అతను ఎల్లప్పుడూ పశ్చాత్తాపంతో (అల్లాహ్ వైపునకు) మరలుతూ ఉండేవాడు.
[1] అల్లాహ్ (సు.తా.) కు ప్రియమైనవి దావూద్ ('అ.స.) నమా'జ్ మరియు అతని ఉపవాసం. అతను సగం రాత్రి నిద్రపోయే వారు, లేచి మూడోవంతు రాత్రి నమా'జ్ చేసేవారు. అతను రోజు విడిచి రోజు ఉపవాసం ఉండేవారు. అతను యుద్ధరంగాన్ని విడిచి ఎన్నడూ పారిపోలేదు ('స'హీ'హ్ బు'ఖారీ, ముస్లిం).
عربی تفاسیر:
اِنَّا سَخَّرْنَا الْجِبَالَ مَعَهٗ یُسَبِّحْنَ بِالْعَشِیِّ وَالْاِشْرَاقِ ۟ۙ
నిశ్చయంగా, మేము పర్వతాలను అతనితో బాటు సాయంత్రం మరియు ఉదయం మా పవిత్రతను కొనియాడుతూ ఉండేటట్లు చేశాము.
عربی تفاسیر:
وَالطَّیْرَ مَحْشُوْرَةً ؕ— كُلٌّ لَّهٗۤ اَوَّابٌ ۟
మరియు పక్షులు కూడా గుమికూడేవి. అంతా కలసి ఆయన (అల్లాహ్) వైపుకు మరలేవారు.
عربی تفاسیر:
وَشَدَدْنَا مُلْكَهٗ وَاٰتَیْنٰهُ الْحِكْمَةَ وَفَصْلَ الْخِطَابِ ۟
మరియు మేము అతని సామ్రాజ్యాన్ని పటిష్టపరిచాము మరియు మేము అతనికి వివేకాన్ని మరియు తిరుగులేని తీర్పు చేయడంలో, నేర్పరితనాన్ని ప్రసాదించాము.
عربی تفاسیر:
وَهَلْ اَتٰىكَ نَبَؤُا الْخَصْمِ ۘ— اِذْ تَسَوَّرُوا الْمِحْرَابَ ۟ۙ
మరియు తగవులాడుకొని వచ్చిన ఆ ఇద్దరి వార్త నీకు చేరిందా?[1] వారు గోడ ఎక్కి అతని ప్రార్థనా గదిలోకి వచ్చారు.
[1] చాలామంది వ్యాఖ్యాతల ప్రకారం ఆ ఇద్దరు ప్రత్యర్థులు దైవదూతలు.
عربی تفاسیر:
اِذْ دَخَلُوْا عَلٰی دَاوٗدَ فَفَزِعَ مِنْهُمْ قَالُوْا لَا تَخَفْ ۚ— خَصْمٰنِ بَغٰی بَعْضُنَا عَلٰی بَعْضٍ فَاحْكُمْ بَیْنَنَا بِالْحَقِّ وَلَا تُشْطِطْ وَاهْدِنَاۤ اِلٰی سَوَآءِ الصِّرَاطِ ۟
వారు దావూద్ వద్దకు వచ్చినపుడు, అతను వారిని చూసి బెదిరి పోయాడు. వారన్నారు: "భయపడకు! మేమిద్దరం ప్రత్యర్థులం, మాలో ఒకడు మరొకనికి అన్యాయం చేశాడు. కావున నీవు మా మధ్య న్యాయంగా తీర్పు చెయ్యి. మరియు నీతి మీరి నడువకు, మాకు సరైన మార్గం వైపునకు మార్గదర్శకత్వం చెయ్యి.
عربی تفاسیر:
اِنَّ هٰذَاۤ اَخِیْ ۫— لَهٗ تِسْعٌ وَّتِسْعُوْنَ نَعْجَةً وَّلِیَ نَعْجَةٌ وَّاحِدَةٌ ۫— فَقَالَ اَكْفِلْنِیْهَا وَعَزَّنِیْ فِی الْخِطَابِ ۟
వాస్తవానికి, ఇతడు నా సోదరుడు, ఇతని వద్ద తొంభై తొమ్మిది ఆడ గొర్రెలున్నాయి. మరియు నా దగ్గర కేవలం ఒకే ఒక్క ఆడ గొర్రె ఉంది, అయినా ఇతడు అంటున్నాడు: 'దీనిని నాకివ్వు.' మరియు తన మాటల నేర్పులోత నన్ను వశపరచుకుంటున్నాడు."
عربی تفاسیر:
قَالَ لَقَدْ ظَلَمَكَ بِسُؤَالِ نَعْجَتِكَ اِلٰی نِعَاجِهٖ ؕ— وَاِنَّ كَثِیْرًا مِّنَ الْخُلَطَآءِ لَیَبْغِیْ بَعْضُهُمْ عَلٰی بَعْضٍ اِلَّا الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ وَقَلِیْلٌ مَّا هُمْ ؕ— وَظَنَّ دَاوٗدُ اَنَّمَا فَتَنّٰهُ فَاسْتَغْفَرَ رَبَّهٗ وَخَرَّ رَاكِعًا وَّاَنَابَ ۟
(దావూద్) అన్నాడు: "వాస్తవంగా, నీ ఆడగొర్రెను తన గొర్రెలలో కలుపుకోవటానికి అడిగి, ఇతడు నీపై అన్యాయం చేస్తున్నాడు. మరియు వాస్తవానికి, చాలా మంది భాగస్థులు ఒకరి కొకరు అన్యాయం చేసుకుంటూ ఉంటారు, విశ్వసించి సత్కార్యాలు చేసేవారు తప్ప! కాని అటువంటి వారు కొందరు మాత్రమే!" వాస్తవానికి మేము అతనిని (దావూద్ ను) పరీక్షిస్తున్నామని అతను అర్థం చేసుకున్నాడు. కాబట్టి తన ప్రభువును క్షమాపణ వేడుకున్నాడు. మరియు సాష్టాంగం (సజ్దా)లో పడిపోయాడు మరియు పశ్చాత్తాపంతో (అల్లాహ్ వైపుకు) మరలాడు.
عربی تفاسیر:
فَغَفَرْنَا لَهٗ ذٰلِكَ ؕ— وَاِنَّ لَهٗ عِنْدَنَا لَزُلْفٰی وَحُسْنَ مَاٰبٍ ۟
అప్పుడు మేము అతనిని (ఆ తప్పును) క్షమించాము. మరియు నిశ్చయంగా, మా వద్ద అతనికి సాన్నిహిత్యం మరియు మంచి స్థానం కూడా ఉన్నాయి.
عربی تفاسیر:
یٰدَاوٗدُ اِنَّا جَعَلْنٰكَ خَلِیْفَةً فِی الْاَرْضِ فَاحْكُمْ بَیْنَ النَّاسِ بِالْحَقِّ وَلَا تَتَّبِعِ الْهَوٰی فَیُضِلَّكَ عَنْ سَبِیْلِ اللّٰهِ ؕ— اِنَّ الَّذِیْنَ یَضِلُّوْنَ عَنْ سَبِیْلِ اللّٰهِ لَهُمْ عَذَابٌ شَدِیْدٌۢ بِمَا نَسُوْا یَوْمَ الْحِسَابِ ۟۠
(మేము అతనితో ఇలా అన్నాము): "ఓ దావూద్! నిశ్చయంగా, మేము నిన్ను భూమిలో ఉత్తరాధికారిగా నియమించాము. కావున నీవు ప్రజల మధ్య న్యాయంగా తీర్పు చెయ్యి మరియు నీ మనోకాంక్షలను అనుసరించకు, ఎందుకంటే అవి నిన్ను అల్లాహ్ మార్గం నుండి తప్పిస్తాయి." నిశ్చయంగా, ఎవరైతే అల్లాహ్ మార్గం నుండి తప్పిపోతారో, వారికి లెక్క దినమున మరచి పోయిన దాని ఫలితంగా, కఠినమైన శిక్ష పడుతుంది.
عربی تفاسیر:
وَمَا خَلَقْنَا السَّمَآءَ وَالْاَرْضَ وَمَا بَیْنَهُمَا بَاطِلًا ؕ— ذٰلِكَ ظَنُّ الَّذِیْنَ كَفَرُوْا ۚ— فَوَیْلٌ لِّلَّذِیْنَ كَفَرُوْا مِنَ النَّارِ ۟ؕ
మరియు మేము ఈ ఆకాశాన్ని మరియు ఈ భూమిని మరియు వాటి మధ్య ఉన్న దాన్నంతా వృథాగా సృష్టించలేదు! ఇది సత్యాన్ని తిరస్కరించిన వారి భ్రమ మాత్రమే.[1] కావున అట్టి సత్యతిరస్కారులకు నరకాగ్ని బాధ పడనున్నది!
[1] చూడండి, 3:191, 10:5.
عربی تفاسیر:
اَمْ نَجْعَلُ الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ كَالْمُفْسِدِیْنَ فِی الْاَرْضِ ؗ— اَمْ نَجْعَلُ الْمُتَّقِیْنَ كَالْفُجَّارِ ۟
ఏమీ? మేము విశ్వసించి, సత్కార్యాలు చేసేవారిని భూమిలో కల్లోలం రేకెత్తించే వారితో సమానులుగా చేస్తామా? లేక మేము దైవభీతి గలవారిని దుష్టులతో సమానులుగా చేస్తామా?[1]
[1] ఇహ లోకంలో కొందరు దుర్మార్గులు ఎన్నో సుఖసంతోషాలను అనుభవిస్తూ ఉండవచ్చు మరియు దైవభీతి గల సద్పురుషులు ఆర్థిక మరియు భౌతిక కష్టాలకు గురి కావచ్చు. దీని అర్థం మేమిటంటే అల్లాహ్ (సు.తా.) దగ్గర ప్రతి దాని లెక్క ది కాబట్టి రాబోయే శాశ్వతమైన పరలోక జీవితంలో ప్రతి వానికి తన కర్మలకు తగిన ప్రతిఫలం దొరుకుతుంది. ఎవవ్రికీ ఎలాంటి అన్యాయం జరుగదు. అల్లాహ్ (సు.తా.) ప్రతి దానికి ఒక గడువు నియమించి ఉన్నాడు.
عربی تفاسیر:
كِتٰبٌ اَنْزَلْنٰهُ اِلَیْكَ مُبٰرَكٌ لِّیَدَّبَّرُوْۤا اٰیٰتِهٖ وَلِیَتَذَكَّرَ اُولُوا الْاَلْبَابِ ۟
(ఓ ముహమ్మద్!) మేము ఎంతో శుభవంతమైన ఈ గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) నీపై అవతరింప జేశాము. ప్రజలు దీని సూచనలను (ఆయాత్ లను) గురించి యోచించాలని మరియు బుద్ధిమంతులు దీని నుండి హితబోధ గ్రహించాలని.
عربی تفاسیر:
وَوَهَبْنَا لِدَاوٗدَ سُلَیْمٰنَ ؕ— نِعْمَ الْعَبْدُ ؕ— اِنَّهٗۤ اَوَّابٌ ۟ؕ
మరియు మేము దావూద్ కు సులైమాన్ ను ప్రసాదించాము. అతను ఉత్తమ దాసుడు! నిశ్చయంగా, అతను ఎల్లప్పుడు మా వైపునకు పశ్చాత్తాపంతో మరలుతూ ఉండేవాడు.
عربی تفاسیر:
اِذْ عُرِضَ عَلَیْهِ بِالْعَشِیِّ الصّٰفِنٰتُ الْجِیَادُ ۟ۙ
ఒకరోజు సాయంకాలం అతని ముందు మేలు జాతి, వడి గల గుర్రాలు ప్రవేశపెట్టబడినప్పుడు;
عربی تفاسیر:
فَقَالَ اِنِّیْۤ اَحْبَبْتُ حُبَّ الْخَیْرِ عَنْ ذِكْرِ رَبِّیْ ۚ— حَتّٰی تَوَارَتْ بِالْحِجَابِ ۟۫
అతను అన్నాడు: "అయ్యో! వాస్తవంగా నేను నా ప్రభువు స్మరణకు బదులుగా ఈ సంపదను (గుర్రాలను) ప్రేమించాను." చివరకు (సూర్యుడు) కనుమరుగై పోయాడు.
عربی تفاسیر:
رُدُّوْهَا عَلَیَّ ؕ— فَطَفِقَ مَسْحًا بِالسُّوْقِ وَالْاَعْنَاقِ ۟
(అతను ఇంకా ఇలా అన్నాడు): "వాటిని నా వద్దకు తిరిగి తీసుకురండి." తరువాత అతను వాటి పిక్కలను మరియు మెడలను నిమరసాగాడు.[1]
[1] ఆయత్ లు 32 మరియు 33 యొక్క ఈ అనువాదం ఇమామ్ ఇబ్నె-జరీర్ 'తబరీ వ్యాఖ్యానాన్ని అనుసరించి ఉంది.
عربی تفاسیر:
وَلَقَدْ فَتَنَّا سُلَیْمٰنَ وَاَلْقَیْنَا عَلٰی كُرْسِیِّهٖ جَسَدًا ثُمَّ اَنَابَ ۟
మరియు వాస్తవానికి మేము సులైమాన్ ను పరీక్షకు గురి చేశాము మరియు అతని సింహాసనంపై ఒక కళేబరాన్ని [1] పడవేశాము, అప్పుడతను పశ్చాత్తాపంతో మా వైపునకు మరలాడు.
[1] జసదన్: కళేబరం, దీనిని గురించిన వివరాలు ఖుర్ఆన్ మరియు 'హదీస్'లలో లేవు. ఒక బు'ఖారీ (ర'హ్మా) 'హదీస్' ప్రకారం : అది వికలాంగుడిగా పుట్టిన అతన కుమారుని శరీరం. నోబుల్ ఖుర్ఆన్ ఈ శబ్దాన్ని షై'తాన్ అని వివరించింది. అల్లాహు ఆలమ్.
عربی تفاسیر:
قَالَ رَبِّ اغْفِرْ لِیْ وَهَبْ لِیْ مُلْكًا لَّا یَنْۢبَغِیْ لِاَحَدٍ مِّنْ بَعْدِیْ ۚ— اِنَّكَ اَنْتَ الْوَهَّابُ ۟
అతను ఇలా ప్రార్థించాడు: "ఓ నా ప్రభూ! నన్ను క్షమించు, నా తరువాత మరెవ్వరికీ లభించనటువంటి సామ్రాజ్యాన్ని నాకు ప్రసాదించు. నిశ్చయంగా, నీవే సర్వప్రదుడవు!"
عربی تفاسیر:
فَسَخَّرْنَا لَهُ الرِّیْحَ تَجْرِیْ بِاَمْرِهٖ رُخَآءً حَیْثُ اَصَابَ ۟ۙ
అప్పుడు మేము గాలిని అతనికి వశ పరచాము. అది అతని ఆజ్ఞానుసారంగా, అతడు కోరిన వైపునకు తగినట్లుగా మెల్లగా వీచేది.[1]
[1] చూడండి, 21:81-82. అక్కడ తీవ్రమైన గాలి వీచినట్లు చెప్పబడింది. ఆ తీవ్రమైన గాలి కూడా అల్లాహ్ (సు.తా.) అనుమతితో సులైమాన్ ('అ.స.) ఇచ్ఛానుసారంగా వీచేది.
عربی تفاسیر:
وَالشَّیٰطِیْنَ كُلَّ بَنَّآءٍ وَّغَوَّاصٍ ۟ۙ
మరియు షైతానులలో (జిన్నాతులలో) నుండి కూడా రకరకాల కట్టడాలు నిర్మించే వాటినీ మరియు సముద్రంలో మునిగి (ముత్యాలు తీసే) వాటినీ (అతనికి వశ పరచి ఉన్నాము).
عربی تفاسیر:
وَّاٰخَرِیْنَ مُقَرَّنِیْنَ فِی الْاَصْفَادِ ۟
మరికొన్ని సంకెళ్ళతో బంధింపబడినవి కూడా ఉండేవి.
عربی تفاسیر:
هٰذَا عَطَآؤُنَا فَامْنُنْ اَوْ اَمْسِكْ بِغَیْرِ حِسَابٍ ۟
(అల్లాహ్ అతనితో అన్నాడు): "ఇది నీకు మా కానుక, కావున నీవు దీనిని (ఇతరులకు) ఇచ్చినా, లేక నీవే ఉంచుకున్నా, నీతో ఎలాంటి లెక్క తీసుకోబడదు."[1]
[1] సులైమాన్ ('అ.స.) ప్రార్థన ప్రకారం అతనికి ఒక గొప్ప రాజ్యధికారం మరియు అతని సంపత్తుల నుండి తన ఇష్టం వచ్చిన వారికి ఇవ్వవచ్చని అనుమతి కూడా ఇవ్వబడింది.
عربی تفاسیر:
وَاِنَّ لَهٗ عِنْدَنَا لَزُلْفٰی وَحُسْنَ مَاٰبٍ ۟۠
మరియు నిశ్చయంగా, అతనికి మా సాన్నిహిత్యం మరియు ఉత్తమ గమ్యస్థానం ఉన్నాయి.
عربی تفاسیر:
وَاذْكُرْ عَبْدَنَاۤ اَیُّوْبَ ۘ— اِذْ نَادٰی رَبَّهٗۤ اَنِّیْ مَسَّنِیَ الشَّیْطٰنُ بِنُصْبٍ وَّعَذَابٍ ۟ؕ
మరియు మా దాసుడు అయ్యూబ్ ను గురించి ప్రస్తావించు; అతను తన ప్రభువుతో ఇలా మొరపెట్టుకున్నాడు: "నిశ్చయంగా షైతాన్ నన్ను ఆపదకు మరియు శిక్షకు గురి చేశాడు." [1]
[1] అయ్యూబ్ ('అ.స.) యొక్క పరీక్ష కూడా చాలా ప్రసిద్ధమైనది. అతను రోగంతో మరియు ధన, సంతాన నష్టంతో పరీక్షించబడ్డారు. అతనితోబాటు కేవలం అతని భార్య మాత్రమే మిగిలింది.
عربی تفاسیر:
اُرْكُضْ بِرِجْلِكَ ۚ— هٰذَا مُغْتَسَلٌۢ بَارِدٌ وَّشَرَابٌ ۟
(మేము అతనితో అన్నాము): "నీ కాలును నేల మీద కొట్టు. అదిగో చల్ల (నీటి చెలిమ)! నీవు స్నానం చేయటానికి మరియు త్రాగుటకూను."
عربی تفاسیر:
وَوَهَبْنَا لَهٗۤ اَهْلَهٗ وَمِثْلَهُمْ مَّعَهُمْ رَحْمَةً مِّنَّا وَذِكْرٰی لِاُولِی الْاَلْبَابِ ۟
మరియు మేము అతని కుటుంబం వారిని మరియు వారితో బాటు, వారి వంటి వారిని మా కరుణతో అతనికి తిరిగి ఇచ్చాము మరియు బుద్ధిమంతులకు ఇది ఒక హితబోధ. [1]
[1] అల్లాహ్ (సు.తా.) చివరకు అయ్యూబ్ ('అ.స.) ప్రార్థనను అంగీకరించి అతని రోగాన్ని దూరం చేశాడు. మరియు అతను కోల్పోయిన ధనాన్ని, సంతానాన్ని తిరిగి ఇచ్చాడు. అంతేగాక అతనికి రెండింతలు అధికంగా ప్రసాదించాడు.
عربی تفاسیر:
وَخُذْ بِیَدِكَ ضِغْثًا فَاضْرِبْ بِّهٖ وَلَا تَحْنَثْ ؕ— اِنَّا وَجَدْنٰهُ صَابِرًا ؕ— نِّعْمَ الْعَبْدُ ؕ— اِنَّهٗۤ اَوَّابٌ ۟
(అల్లాహ్ అతనితో అన్నాడు): "ఒక పుల్లల కట్టను నీ చేతిలోకి తీసికొని దానితో (నీ భార్యను) కొట్టు మరియు నీ ఒట్టును భంగపరచుకోకు." [1]వాస్తవానికి, మేము అతనిని ఎంతో సహనశీలునిగా పొందాము. అతను ఉత్తమ దాసుడు! నిశ్చయంగా, ఎల్లపుడు మా వైపునకు పశ్చాత్తాపంతో మరలుతూ ఉండేవాడు.
[1] రోగపీడుతుడుగా ఉన్న కాలంలో అయ్యూబ్ ('అ.స.) కోపంతో తన భార్యను - ఆమె తెలియకుండా చేసిన ఒక అపరాధానికి క్రోధితుడై - నూరు కొరడా దెబ్బలు కొడతానని ప్రమాణం చేస్తారు. ఆ ప్రమాణం పూర్తి చేయటానికి అల్లాహ్ (సు.తా.) అతనితో నూరు పుల్లల కట్టతో ఒకసారి నీ భార్యను కొట్టి నీ ప్రమాణం పూర్తి చేసుకో అని ఆదేశిస్తాడు. చూడండి, 5:89. ఈ ఆజ్ఞ కేవలం అయ్యూబ్ ('అ.స.) కొరకేనా, లేక అందరి కొరకా అనే విషయంలో వ్యాఖ్యాతల మధ్య భేదాభిప్రాయాలున్నాయి. కొందరు అంటారు : ఒకవేళ మొదట ప్రమాణం చేసినప్పుడు కఠినంగా శిక్షించదలిచే అభిప్రాయం లేకుంటే ఇలా చేయవచ్చు, (ఫ'త్హ్ అల్-ఖదీర్). ఒక 'హదీస్' ద్వారా తెలుస్తోంది : ఒకసారి దైవప్రవక్త ('స'అస) ఒక బలహీనుడైన వ్యభిచారికి, నూరు కొరడా దెబ్బలకు బదులుగా నూరు పుల్లల్లున్న చీపురు కట్టతో ఒకేసారి కొట్టి వదిలారు (ముస్నద్ అ'హ్మద్, 5/222, ఇబ్నె మాజా).
عربی تفاسیر:
وَاذْكُرْ عِبٰدَنَاۤ اِبْرٰهِیْمَ وَاِسْحٰقَ وَیَعْقُوْبَ اُولِی الْاَیْدِیْ وَالْاَبْصَارِ ۟
మరియు మా దాసులైన ఇబ్రాహీమ్, ఇస్ హాఖ్ మరియు యఅఖూబ్ లను జ్ఞాపకం చేసుకో! వారు గొప్ప కార్యశీలురు మరియు దూరదృష్టి గలవారు.
عربی تفاسیر:
اِنَّاۤ اَخْلَصْنٰهُمْ بِخَالِصَةٍ ذِكْرَی الدَّارِ ۟ۚ
నిశ్చయంగా, మేము వారిని ఒక విశిష్ట గుణం కారణంగా ఎన్నుకున్నాము, అది వారి పరలోక చింతన.
عربی تفاسیر:
وَاِنَّهُمْ عِنْدَنَا لَمِنَ الْمُصْطَفَیْنَ الْاَخْیَارِ ۟ؕ
మరియు నిశ్చయంగా, మా దృష్టిలో వారు ఎన్నుకోబడిన ఉత్తమ (పుణ్య) పురుషులలోని వారు!
عربی تفاسیر:
وَاذْكُرْ اِسْمٰعِیْلَ وَالْیَسَعَ وَذَا الْكِفْلِ ؕ— وَكُلٌّ مِّنَ الْاَخْیَارِ ۟ؕ
మరియు ఇస్మాయీల్, అల్ యస్అ మరియు జుల్ కిప్ల్ [1] ను కూడా జ్ఞాపకం చేసుకో. మరియు వారందరూ ఎన్నుకొనబడిన ఉత్తమ పురుషులలోని వారు.
[1] అల్-యస'అ (Elisha 'అ.స.), ఇల్యాస్ (Elijah, 'అ.స.) తరువాత వచ్చిన ప్రవక్త. యస'అ, 'అరబ్బీ పదం కాదు. జు'ల్-కిఫ్ల్ కొరకు చూడండి, 21:85.
عربی تفاسیر:
هٰذَا ذِكْرٌ ؕ— وَاِنَّ لِلْمُتَّقِیْنَ لَحُسْنَ مَاٰبٍ ۟ۙ
ఇది ఒక ప్రస్తావన. మరియు నిశ్చయంగా! దైవభీతి గలవారికి ఉత్తమ గమ్యస్థానం ఉంది.
عربی تفاسیر:
جَنّٰتِ عَدْنٍ مُّفَتَّحَةً لَّهُمُ الْاَبْوَابُ ۟ۚ
శాశ్వతమైన స్వర్గవనాలు, వాటి ద్వారాలు వారి కొరకు తెరువబడి ఉంటాయి.
عربی تفاسیر:
مُتَّكِـِٕیْنَ فِیْهَا یَدْعُوْنَ فِیْهَا بِفَاكِهَةٍ كَثِیْرَةٍ وَّشَرَابٍ ۟
అందులో వారు దిండ్లను ఆనుకొని కూర్చొని; అందులో వారు అనేక ఫలాలను మరియు పానీయాలను అడుగుతూ ఉంటారు.
عربی تفاسیر:
وَعِنْدَهُمْ قٰصِرٰتُ الطَّرْفِ اَتْرَابٌ ۟
మరియు వారి దగ్గర సమవయస్కులు మరియు తమ చూపులను వారి కొరకే ప్రత్యేకించుకొనే శీలవతులైన స్త్రీలు ఉంటారు[1].
[1] ఇలాంటి వివరణ ఖుర్ఆన్ లో మూడు సార్లు వచ్చింది. ఇక్కడ, 37:48 మరియు 55:56లలో. ఇంకా చూడండి, 4:124, 16:97 మరియు 40:40 9:72 విశ్వసించి సత్కార్యాలు చేసే వారంతా (పురుషులు, స్త్రీలు) స్వర్గవాసులవుతారు. కావున ప్రతి పురుషునికి శీలవతి, విశ్వాసురాలైన తన భార్య స్వర్గంలో సహవాసి ( 'జౌజ)గా ఉంటుంది. ఇంకా చూడండి, 36:56: 'వారు మరియు వారి సహవాసులు (అ'జ్వాజ్), చల్లని నీడలలో, ఆసనాల మీద ఆనుకొని హాయిగా కూర్చొని ఉంటారు.'
عربی تفاسیر:
هٰذَا مَا تُوْعَدُوْنَ لِیَوْمِ الْحِسَابِ ۟
లెక్కదినం కొరకు మీతో (దైవభీతి గలవారితో) చేయబడిన వాగ్దానం ఇదే!
عربی تفاسیر:
اِنَّ هٰذَا لَرِزْقُنَا مَا لَهٗ مِنْ نَّفَادٍ ۟ۚۖ
నిశ్చయంగా, ఇదే మేమిచ్చే జీవనోపాధి. దానికి తరుగులేదు;
عربی تفاسیر:
هٰذَا ؕ— وَاِنَّ لِلطّٰغِیْنَ لَشَرَّ مَاٰبٍ ۟ۙ
ఇదే (విశ్వాసులకు లభించేది). మరియు నిశ్చయంగా, తలబిరుసుతనం గల దుష్టులకు అతి చెడ్డ గమ్యస్థానం ఉంటుంది -
عربی تفاسیر:
جَهَنَّمَ ۚ— یَصْلَوْنَهَا ۚ— فَبِئْسَ الْمِهَادُ ۟
నరకం - వారందులో కాలుతారు. ఎంత బాధాకరమైన విరామ (నివాస) స్థలము.
عربی تفاسیر:
هٰذَا ۙ— فَلْیَذُوْقُوْهُ حَمِیْمٌ وَّغَسَّاقٌ ۟ۙ
ఇదే (దుష్టులకు లభించేది), కావున వారు దాని రుచి చూస్తారు; సలసలకాగే నీరు మరియు చీము.
عربی تفاسیر:
وَّاٰخَرُ مِنْ شَكْلِهٖۤ اَزْوَاجٌ ۟ؕ
ఇంకా ఇలాంటివే అనేకం ఉంటాయి!
عربی تفاسیر:
هٰذَا فَوْجٌ مُّقْتَحِمٌ مَّعَكُمْ ۚ— لَا مَرْحَبًا بِهِمْ ؕ— اِنَّهُمْ صَالُوا النَّارِ ۟
"ఇదొక దళం, మీ వైపునకు త్రోయబడుతూ వస్తున్నది. వారికి ఎలాంటి స్వాగతం లేదు! నిశ్చయంగా, వారు నరకాగ్నిలో కాలుతారు."
عربی تفاسیر:
قَالُوْا بَلْ اَنْتُمْ ۫— لَا مَرْحَبًا بِكُمْ ؕ— اَنْتُمْ قَدَّمْتُمُوْهُ لَنَا ۚ— فَبِئْسَ الْقَرَارُ ۟
(సత్యతిరస్కారులు తమను మార్గం తప్పించిన వారితో) అంటారు: "అయితే మీకు కూడా స్వాగతం లేదు కదా! ఈ పర్యవసానాన్ని మా ముందుకు తెచ్చిన వారు మీరే కదా! ఎంత చెడ్డ నివాస స్థలము."
عربی تفاسیر:
قَالُوْا رَبَّنَا مَنْ قَدَّمَ لَنَا هٰذَا فَزِدْهُ عَذَابًا ضِعْفًا فِی النَّارِ ۟
వారు ఇంకా ఇలా అంటారు: "ఓ మా ప్రభూ! మా యెదుట దీనిని (నరకాన్ని) తెచ్చిన వానికి రెట్టింపు నరకాగ్ని శిక్షను విధించు!" [1]
[1] చూడండి, 7:38 మరియు 33:67-68. అక్కడ కూడా ఇలాగే అంటారు.
عربی تفاسیر:
وَقَالُوْا مَا لَنَا لَا نَرٰی رِجَالًا كُنَّا نَعُدُّهُمْ مِّنَ الْاَشْرَارِ ۟ؕ
ఇంకా వారు ఇలా అంటారు: "మాకేమయింది? మనం చెడ్డవారిగా ఎంచిన వారు ఇక్కడ మనకు కనబడటం లేదేమిటి?
عربی تفاسیر:
اَتَّخَذْنٰهُمْ سِخْرِیًّا اَمْ زَاغَتْ عَنْهُمُ الْاَبْصَارُ ۟
మనం ఊరికే వారిని ఎగతాళి చేశామా? లేదా వారు మనకు కనుమరుగయ్యారా?"
عربی تفاسیر:
اِنَّ ذٰلِكَ لَحَقٌّ تَخَاصُمُ اَهْلِ النَّارِ ۟۠
నిశ్చయంగా, ఇదే నిజం! నరకవాసులు ఇలాగే వాదులాడుకుంటారు.
عربی تفاسیر:
قُلْ اِنَّمَاۤ اَنَا مُنْذِرٌ ۖۗ— وَّمَا مِنْ اِلٰهٍ اِلَّا اللّٰهُ الْوَاحِدُ الْقَهَّارُ ۟ۚ
(ఓ ముహమ్మద్!) వారితో ఇలా అను: "వాస్తవానికి నేను హెచ్చరించేవాడను మాత్రమే! అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు! ఆయన అద్వితీయుడు తన సృష్టి మీద సంపూర్ణ అధికారం గలవాడు."[1]
[1] అల్-వాహిద్-అల్-ఖహ్హార్ : అద్వితీయుడు-ప్రబలుడు, చూడండి, 6:18. వ్యాఖ్యానం 1
عربی تفاسیر:
رَبُّ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَمَا بَیْنَهُمَا الْعَزِیْزُ الْغَفَّارُ ۟
ఆకాశాలు, భూమి మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికి ప్రభువు, సర్వశక్తిమంతుడు, క్షమాశీలుడు."
عربی تفاسیر:
قُلْ هُوَ نَبَؤٌا عَظِیْمٌ ۟ۙ
వారితో అను: "ఇది (ఈ ఖుర్ఆన్) ఒక గొప్ప సందేశం.
عربی تفاسیر:
اَنْتُمْ عَنْهُ مُعْرِضُوْنَ ۟
దాని నుండి మీరు విముఖులవు తున్నారు!"
عربی تفاسیر:
مَا كَانَ لِیَ مِنْ عِلْمٍ بِالْمَلَاِ الْاَعْلٰۤی اِذْ یَخْتَصِمُوْنَ ۟
(ఓ ముహమ్మద్! ఇలా అను): "ఉన్నత స్థానాలలో ఉన్న ముఖ్యుల (దేవదూతల) మధ్య (ఆదమ్ సృష్టి గురించి) ఒకప్పుడు జరిగిన వివాదం గురించి నాకు తెలియదు.[1]
[1] ఈ వివాదం గురించి చూడండి, 2:30-34. ఆదమ్ ('అ.స.) ను గురించి చూడండి, 7:11-18, 15:26-44, 17:61-65, 18:50, 38:69-85. ఈ ఆయత్ వీటన్నింటి కంటే మొదట అవతరింప జేయబడింది.
عربی تفاسیر:
اِنْ یُّوْحٰۤی اِلَیَّ اِلَّاۤ اَنَّمَاۤ اَنَا نَذِیْرٌ مُّبِیْنٌ ۟
కాని అది నాకు దివ్యజ్ఞానం (వహీ) ద్వారానే తెలుపబడింది. వాస్తవానికి, నేను స్పష్టంగా హెచ్చరిక చేసేవాణ్ణి మాత్రమే!"
عربی تفاسیر:
اِذْ قَالَ رَبُّكَ لِلْمَلٰٓىِٕكَةِ اِنِّیْ خَالِقٌۢ بَشَرًا مِّنْ طِیْنٍ ۟
నీ ప్రభువు దేవదూతలతో ఇలా అన్న మాటను (జ్ఞాపకం చేసుకో): "నేను మట్టితో ఒక మనిషిని సృష్టించబోతున్నాను.[1]
[1] బషరున్: అంటే ప్రదర్శన, ఇతరులకు కనిపించగలది.
عربی تفاسیر:
فَاِذَا سَوَّیْتُهٗ وَنَفَخْتُ فِیْهِ مِنْ رُّوْحِیْ فَقَعُوْا لَهٗ سٰجِدِیْنَ ۟
ఇక ఎప్పుడైతే, నేను అతని సృష్టిని పూర్తి చేసి అతనిలో నా (తరఫు నుండి) ఆత్మను (జీవాన్ని) ఊదుతానో అప్పుడు, [1] మీరు అతని ముందు సాష్టాంగం (సజ్దా)లో పడిపోండి.[2]
[1] రూహున్: ఆత్మ (ప్రాణం), దీని యజమాని కేవలం అల్లాహ్ (సు.తా.) మాత్రమే. ఆత్మ అనేది అల్లాహ్ (సు.తా.) తప్ప ఇతరుల ఆధీనంలో లేదు. అది (ఆత్మ) ఊదగానే మానవుడు చలనంలోకి వస్తాడు. మానవునిలో అల్లాహ్ (సు.తా.) ఆత్మను ఊదాడు. ఇది ఎంత గౌరవప్రదమైన విషయం.
[2] ఈ సజ్దా గౌరవార్థం చేసిందే. అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞను శిరసావహించటానికి. ఇది ఆరాధనగా చేసిన సజ్దా కాదు. దైవప్రవక్త ము'హమ్మద్ ('స'అస) సున్నత్ లో గౌరవార్థం చేసే సజ్దా కూడా హరాం చేయబడింది. దైవప్రవక్త ('స'అస) ప్రవచనం : 'ఒకవేళ ఇది అనుమతిచబడి ఉంటే నేను స్త్రీకి తన భర్తకు సజ్దా చేసే అనుమతి ఇచ్చేవాడిని.' (తిర్మిజీ', అల్బానీ ప్రమాణీకం).
عربی تفاسیر:
فَسَجَدَ الْمَلٰٓىِٕكَةُ كُلُّهُمْ اَجْمَعُوْنَ ۟ۙ
అప్పుడు దేవదూతలందరూ కలసి అతనికి సజ్దా చేశారు.[1]
[1] దైవదూతలందరూ కలసి ఒకే సారి సజ్దా చేశారు.
عربی تفاسیر:
اِلَّاۤ اِبْلِیْسَ ؕ— اِسْتَكْبَرَ وَكَانَ مِنَ الْكٰفِرِیْنَ ۟
ఒక్క ఇబ్లీస్ [1] తప్ప! అతడు గర్వితుడయ్యాడు మరియు సత్యతిరస్కారులలో కలిసి పోయాడు.
[1] ఇబ్లీస్ దైవదూత కాడు, అతడు జిన్, అగ్నితో సృష్టించబడ్డాడు. దైవదూత ('అలైహిమ్ స.) లు జ్యోతి (నూర్) తో సృష్టించబడ్డారు. ఆదమ్ కు దైవదూతలు సజ్దా చేసినప్పుడు అతడు అక్కడ ఉండి కూడా అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞను శిరసావహించలేదు, కాబట్టి అల్లాహ్ (సు.తా.) అతన్ని శపించాడు (బహిష్కరించాడు).
عربی تفاسیر:
قَالَ یٰۤاِبْلِیْسُ مَا مَنَعَكَ اَنْ تَسْجُدَ لِمَا خَلَقْتُ بِیَدَیَّ ؕ— اَسْتَكْبَرْتَ اَمْ كُنْتَ مِنَ الْعَالِیْنَ ۟
(అల్లాహ్) ఇలా అన్నాడు: "ఓ ఇబ్లీస్! నేను నా రెండు చేతులతో సృష్టించిన వానికి సాష్టాంగం (సజ్దా) చేయకుండా నిన్ను ఆపింది ఏమిటీ? నీవు గర్వితుడవై పోయావా! లేదా నిన్ను, నీవు ఉన్నత శ్రేణికి చెందిన వాడవనుకున్నావా?"
عربی تفاسیر:
قَالَ اَنَا خَیْرٌ مِّنْهُ ؕ— خَلَقْتَنِیْ مِنْ نَّارٍ وَّخَلَقْتَهٗ مِنْ طِیْنٍ ۟
(ఇబ్లీస్) అన్నాడు: "నేను అతని కంటే శ్రేష్ఠుడను. నీవు నన్ను అగ్నితో సృష్టించావు మరియు అతనిని మట్టితో సృష్టించావు."
عربی تفاسیر:
قَالَ فَاخْرُجْ مِنْهَا فَاِنَّكَ رَجِیْمٌ ۟ۙۖ
(అల్లాహ్) అన్నాడు: "ఇక ఇక్కడి నుండి వెళ్ళిపో! నిశ్చయంగా నీవు భ్రష్టుడవు.
عربی تفاسیر:
وَّاِنَّ عَلَیْكَ لَعْنَتِیْۤ اِلٰی یَوْمِ الدِّیْنِ ۟
మరియు నిశ్చయంగా, తీర్పుదినం వరకు నీపై నా శాపం (బహిష్కారం) ఉంటుంది."
عربی تفاسیر:
قَالَ رَبِّ فَاَنْظِرْنِیْۤ اِلٰی یَوْمِ یُبْعَثُوْنَ ۟
(అప్పుడు ఇబ్లీస్) ఇలా మనవి చేసుకున్నాడు: "ఓ నా ప్రభూ! మృతులు తిరిగి లేపబడే దినం వరకు నాకు వ్యవధినివ్వు!"
عربی تفاسیر:
قَالَ فَاِنَّكَ مِنَ الْمُنْظَرِیْنَ ۟ۙ
(అల్లాహ్) సెలవిచ్చాడు: "సరే! నీకు వ్యవధి ఇవ్వబడుతోంది!
عربی تفاسیر:
اِلٰی یَوْمِ الْوَقْتِ الْمَعْلُوْمِ ۟
ఆ నియమిత దినపు ఆ గడువు వచ్చే వరకు."
عربی تفاسیر:
قَالَ فَبِعِزَّتِكَ لَاُغْوِیَنَّهُمْ اَجْمَعِیْنَ ۟ۙ
(ఇబ్లీస్) అన్నాడు: "నీ శక్తి సాక్షిగా నేను వారందరినీ తప్పు దారి పట్టిస్తాను;
عربی تفاسیر:
اِلَّا عِبَادَكَ مِنْهُمُ الْمُخْلَصِیْنَ ۟
వారిలో నుండి నీవు ఎన్నుకున్న నీ దాసుల్ని తప్ప!"
عربی تفاسیر:
قَالَ فَالْحَقُّ ؗ— وَالْحَقَّ اَقُوْلُ ۟ۚ
(అల్లాహ్) అన్నాడు: "అయితే సత్యం ఇదే! మరియు నేను సత్యం పలుకుతున్నాను;
عربی تفاسیر:
لَاَمْلَـَٔنَّ جَهَنَّمَ مِنْكَ وَمِمَّنْ تَبِعَكَ مِنْهُمْ اَجْمَعِیْنَ ۟
నీవు మరియు వారిలో నుండి నిన్ను అనుసరించే వారందరితో నేను నరకాన్ని నింపుతాను!"
عربی تفاسیر:
قُلْ مَاۤ اَسْـَٔلُكُمْ عَلَیْهِ مِنْ اَجْرٍ وَّمَاۤ اَنَا مِنَ الْمُتَكَلِّفِیْنَ ۟
(ఓ ప్రవక్తా!) వారితో అను: "నేను దీని (ఈ సందేశం) కొరకు మీ నుండి, ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు మరియు నేను వంచకులలోని వాడను కాను.
عربی تفاسیر:
اِنْ هُوَ اِلَّا ذِكْرٌ لِّلْعٰلَمِیْنَ ۟
ఇది (ఈ ఖుర్ఆన్) సమస్త లోకాల వారందరికీ కేవలం ఒక జ్ఞాపిక (హితబోధ)!
عربی تفاسیر:
وَلَتَعْلَمُنَّ نَبَاَهٗ بَعْدَ حِیْنٍ ۟۠
మరియు అచిర కాలంలోనే దీని ఉద్దేశాన్ని (వార్తను) మీరు తప్పక తెలుసుకుంటారు."
عربی تفاسیر:
 
معانی کا ترجمہ سورت: سورۂ صٓ
سورتوں کی لسٹ صفحہ نمبر
 
قرآن کریم کے معانی کا ترجمہ - تیلگو ترجمہ - عبدالرحیم بن محمد - ترجمے کی لسٹ

قرآن کریم کے معانی کا تیلگو زبان میں ترجمہ: مولانا عبدالرحیم بن محمد نے کیا ہے ۔

بند کریں