Check out the new design

Қуръони Карим маъноларининг таржимаси - Қуръон Карим мухтасар тафсирининг телгуча таржимаси * - Таржималар мундарижаси


Маънолар таржимаси Сура: Бақара   Оят:
وَاِذْ اَخَذْنَا مِیْثَاقَكُمْ لَا تَسْفِكُوْنَ دِمَآءَكُمْ وَلَا تُخْرِجُوْنَ اَنْفُسَكُمْ مِّنْ دِیَارِكُمْ ثُمَّ اَقْرَرْتُمْ وَاَنْتُمْ تَشْهَدُوْنَ ۟
మీలోని కొందరు కొందరి రక్తం చిందించటము యొక్క నిషేదము గురించి మరియు మీలోని కొందరు కొందరిని వారి ఇండ్ల నుండి వెలివేయటము యొక్క నిషేధము గురించి తౌరాతులో మేము మీపై తీసుకున్న దృఢమైన ప్రమాణమును మీరు గుర్తు చేసుకోండి. అప్పుడు మేము మీతో తీసుకున్న ప్రమాణమును మీరు అంగీకరించారు. మరియు మీరు అది సరి అవటంపై సాక్ష్యం పలికారు.
Арабча тафсирлар:
ثُمَّ اَنْتُمْ هٰۤؤُلَآءِ تَقْتُلُوْنَ اَنْفُسَكُمْ وَتُخْرِجُوْنَ فَرِیْقًا مِّنْكُمْ مِّنْ دِیَارِهِمْ ؗ— تَظٰهَرُوْنَ عَلَیْهِمْ بِالْاِثْمِ وَالْعُدْوَانِ ؕ— وَاِنْ یَّاْتُوْكُمْ اُسٰرٰی تُفٰدُوْهُمْ وَهُوَ مُحَرَّمٌ عَلَیْكُمْ اِخْرَاجُهُمْ ؕ— اَفَتُؤْمِنُوْنَ بِبَعْضِ الْكِتٰبِ وَتَكْفُرُوْنَ بِبَعْضٍ ۚ— فَمَا جَزَآءُ مَنْ یَّفْعَلُ ذٰلِكَ مِنْكُمْ اِلَّا خِزْیٌ فِی الْحَیٰوةِ الدُّنْیَا ۚ— وَیَوْمَ الْقِیٰمَةِ یُرَدُّوْنَ اِلٰۤی اَشَدِّ الْعَذَابِ ؕ— وَمَا اللّٰهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُوْنَ ۟
ఆ తరువాత మీరు ఈ ప్రమాణమును విబేధించారు. అప్పుడు మీలో కొందరు కొందరిని హతమార్చారు. మరియు మీలో నుండి ఒక వర్గమును మీరు వారికి వ్యతిరేకంగా శతృవులకు సహాయం చేస్తూ అన్యాయంగా,దుర్మార్గంగా వారి నివాసముల నుండి వెలివేశారు. మరియు వారు శతృవుల చేతిలో బందీలై మీ వద్దకు వచ్చినప్పుడు మీరు వారి బందీ నుండి వారిని విముక్తి కలిగించటం కొరకు విమోచనాధనం ఇవ్వటంలో మీరు కృషి చేశారు. వారిని వారి ఇండ్ల నుండి వెలివేయటం మీపై నిషేధమైనా కూడా. మీరు ఎలా తౌరాతులో ఉన్న కొన్నింటిని ఖైదీలకు విమోచనా ధనం ఇవ్వటం అనివార్యమును విశ్వసిస్తున్నారు మరియు అందులో ఉన్న కొన్నింటిని రక్తమును పరిరక్షించటం మరియు మీలోని కొందరిని వారి నివాసముల నుండి వెళ్ళ గొట్టటంను ఆపటమును తిరస్కరిస్తున్నారు ?! మీలో నుండి ఇలా చేసే వారికి ప్రతిఫలము ఇహలోకములో అవమానము మరియు పరాభవము మాత్రమే ఉంటుంది. ఇక పరలోకంలో అతడు తీవ్రమైన శిక్ష వైపుకు మరలించబడుతాడు. మరియు అల్లాహ్ మీరు చేసే వాటి నుండి పరధ్యానంలో లేడు. అంతే కాదు ఆయన వాటి గురించి తెలుసుకునేవాడు మరియు ఆయన తొందరలోనే వాటి పరంగా మీకు ప్రతిఫలం ప్రసాదిస్తాడు.
Арабча тафсирлар:
اُولٰٓىِٕكَ الَّذِیْنَ اشْتَرَوُا الْحَیٰوةَ الدُّنْیَا بِالْاٰخِرَةِ ؗ— فَلَا یُخَفَّفُ عَنْهُمُ الْعَذَابُ وَلَا هُمْ یُنْصَرُوْنَ ۟۠
వారందరు ఉండిపోయే దానిపై అంతమైపోయే దాన్ని ప్రాధాన్యతనిస్తూ పరలోకమునకు బదులుగా ఇహలోకజీవితమును కోరుకున్నారు. పరలోకంలో వారి నుండి శిక్ష తేలిక చేయబడదు. ఆ రోజు వారికి సహాయం చేయటానికి ఏ సహాయకుడు ఉండడు.
Арабча тафсирлар:
وَلَقَدْ اٰتَیْنَا مُوْسَی الْكِتٰبَ وَقَفَّیْنَا مِنْ بَعْدِهٖ بِالرُّسُلِ ؗ— وَاٰتَیْنَا عِیْسَی ابْنَ مَرْیَمَ الْبَیِّنٰتِ وَاَیَّدْنٰهُ بِرُوْحِ الْقُدُسِ ؕ— اَفَكُلَّمَا جَآءَكُمْ رَسُوْلٌۢ بِمَا لَا تَهْوٰۤی اَنْفُسُكُمُ اسْتَكْبَرْتُمْ ۚ— فَفَرِیْقًا كَذَّبْتُمْ ؗ— وَفَرِیْقًا تَقْتُلُوْنَ ۟
మరియు నిశ్చయంగా మేము మూసా అలైహిస్సలాంకు తౌరాతును ప్రసాదించాము. మరియు ఆయన తరువాత ప్రవక్తలను ఆయన అడుగుజాడలలో నడిపించాము. మరియు మేము మర్యమ్ కుమారుడగు ఈసా అలైహిస్సలాంకు ఆయన నిజాయితీని స్పష్టపరిచే మృతులను జీవింపజేయటం,పుట్టుగ్రుడ్డిని,కుష్టురోగిని నయం చేయటం లాంటి స్పష్టమైన సూచనలను ప్రసాదించాము. మరియు దైవదూత జిబ్రయీల్ ద్వారా మేము ఆయనను బలపరచాము. ఓ ఇస్రాయీలు సంతతివారా ఏమీ? మీ మనోవాంఛలకు ప్రతికూలంగా ఉన్న దాన్ని తీసుకుని ఏ ప్రవక్త అయినా అల్లాహ్ వద్ద నుండి మీ వద్దకు వస్తే మీరు సత్యం పట్ల అహంకారమును చూపుతారా మరియు మీరు అల్లాహ్ ప్రవక్తలపట్ల దురహంకారమును చూపి వారిలో నుండి ఒక వర్గమును మీరు తిరస్కరించి ఒక వర్గమును హతమారుస్తారా ?!
Арабча тафсирлар:
وَقَالُوْا قُلُوْبُنَا غُلْفٌ ؕ— بَلْ لَّعَنَهُمُ اللّٰهُ بِكُفْرِهِمْ فَقَلِیْلًا مَّا یُؤْمِنُوْنَ ۟
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించకపోవటంలో యూదుల వాదన వారి మాటాల్లో ఇలా ఉన్నది : నిశ్ఛయంగా మా హృదయములు గ్లాఫులలో ఉన్నవి నీవు పలికే మాటలు వాటికి ఏమాత్రం చేరవు మరియు అవి దాన్ని అర్ధం చేసుకోవు. వారు భావిస్తున్నట్లు పరిస్థితి అలా లేదు. కాని అల్లాహ్ వారి అవిశ్వాసం వలన తన కారుణ్యము నుండి వారిని గెంటివేశాడు. అల్లాహ్ అవతరింపజేసిన వాటిపై వారు చాలా తక్కువ విశ్వాసం చూపుతారు.
Арабча тафсирлар:
Ушбу саҳифадаги оят фойдаларидан:
• من أعظم الكفر: الإيمان ببعض ما أنزل الله والكفر ببعضه؛ لأن فاعل ذلك قد جعل إلهه هواه.
పెద్ద అవిశ్వాసములోంచిది ఏమిటంటే అల్లాహ్ అవతరించిన వాటిలో నుంచి కొన్నింటిని విశ్వసించి కొన్నింటిని అవిశ్వసించటం. ఎందుకంటే అలా చేసేవాడు తన మనోవాంఛలను తన ఆరాధ్య దైవంగా చేసుకున్నాడు.

• عِظَم ما بلغه اليهود من العناد، واتباع الهوى، والتلاعب بما أنزل الله تعالى.
యూదుల తలబిరుసుతనము మరియు మనోవాంఛల అనుసరణ మరియు మహోన్నతుడైన అల్లాహ్ అవతరించిన వాటి పట్ల ఆటలాడటం యొక్క పెద్ద తప్పిదము యొక్క వివరణ.

• فضل الله تعالى ورحمته بخلقه، حيث تابع عليهم إرسال الرسل وإنزال الكتب لهدايتهم للرشاد.
మహోన్నతుడైన అల్లాహ్ అనుగ్రహము మరియు ఆయన దాసుల పట్ల ఆయన కారుణ్యము ఎందుకంటే వారికి సన్మార్గము యొక్క మార్గ దర్శకము కొరకు ఒకరి తరువాత ఒకరు ప్రవక్తలను వారి వద్దకు పంపించటం మరియు గ్రంధముల అవతరణ జరిగినది.

• أن الله يعاقب المعرضين عن الهدى المعاندين لأوامره بالطبع على قلوبهم وطردهم من رحمته؛ فلا يهتدون إلى الحق، ولا يعملون به.
నిశ్ఛయంగా అల్లాహ్ సన్మార్గము నుండి విముఖత చూపేవారికి,ఆయన ఆదేశములను వ్యతిరేకించే వారికి వారి హృదయములపై సీలు వేసి మరియు వారిని తన కారుణ్యము నుండి గెంటివేసి శిక్షిస్తాడు. అప్పుడు వారు సత్యము వైపునకు మార్గము పొందరు మరియు దాని ప్రకారం ఆచరించరు.

 
Маънолар таржимаси Сура: Бақара
Суралар мундарижаси Бет рақами
 
Қуръони Карим маъноларининг таржимаси - Қуръон Карим мухтасар тафсирининг телгуча таржимаси - Таржималар мундарижаси

Тафсир маркази томонидан нашр қилинган.

Ёпиш