Қуръони Карим маъноларининг таржимаси - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Таржималар мундарижаси


Маънолар таржимаси Оят: (7) Сура: Зумар сураси
اِنْ تَكْفُرُوْا فَاِنَّ اللّٰهَ غَنِیٌّ عَنْكُمْ ۫— وَلَا یَرْضٰی لِعِبَادِهِ الْكُفْرَ ۚ— وَاِنْ تَشْكُرُوْا یَرْضَهُ لَكُمْ ؕ— وَلَا تَزِرُ وَازِرَةٌ وِّزْرَ اُخْرٰی ؕ— ثُمَّ اِلٰی رَبِّكُمْ مَّرْجِعُكُمْ فَیُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ تَعْمَلُوْنَ ؕ— اِنَّهٗ عَلِیْمٌۢ بِذَاتِ الصُّدُوْرِ ۟
ఓ ప్రజలారా ఒక వేళ మీరు మీ ప్రభువు పట్ల అవిశ్వాసమును కనబరిస్తే నిశ్ఛయంగా అల్లాహ్ మీ విశ్వాసము అక్కర లేని వాడు. మరియు మీ అవిశ్వాసం ఆయనకు నష్టం కలిగించదు. మరియు మీ అవిశ్వాసము యొక్క నష్టము మీ వైపునకు మాత్రమే మరలుతుంది. మరియు ఆయన తన దాసుల కొరకు తనను అవిశ్వసించటమును ఇష్టపడడు. మరియు వారిని అవిశ్వసించమని ఆదేశించడు. ఎందుకంటే అల్లాహ్ అశ్లీలత గురించి,చెడు గురించి ఆదేశించడు. మరియు ఒక వేళ మీరు అల్లాహ్ కు ఆయన అనుగ్రహాలపై కృతజ్ఞత తెలిపి ఆయనపై విశ్వాసమును కనబరిస్తే ఆయన మీ కృతజ్ఞత నుండి సంతుష్టపడి మీకు దాని ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. మరియు ఒక ప్రాణం వేరే ప్రాణము యొక్క పాపమును మోయదు. అంతేకాదు ప్రతీ వ్యక్తి తాను చేసుకున్న దానికి ప్రతిగా తాకట్టుగా ఉంటాడు. ఆ తరువాత మీరు ప్రళయదినమున మీ మరలటం ఒక్కడైన మీ ప్రభువు వైపునకు జరుగును. అప్పుడు ఆయన ఇహలోకంలో మీరు చేసుకున్న కర్మల గురించి మీకు సమాచారమిస్తాడు. మరియు ఆయన మీ కర్మలపరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. నిశ్ఛయంగా పరిశుద్ధుడైన ఆయన తన దాసుల హృదయములలో ఉన్న వాటి గురించి బాగా తెలిసినవాడు. వాటిలో ఉన్నది ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.
Арабча тафсирлар:
Ушбу саҳифадаги оят фойдаларидан:
• رعاية الله للإنسان في بطن أمه.
మానవునికి తన తల్లి గర్భంలో అల్లాహ్ పరిరక్షణ

• ثبوت صفة الغنى وصفة الرضا لله.
అక్కరలేకపోయే గుణం మరియు సంతృప్తి కలిగించే గుణం అల్లాహ్ కొరకే అని నిరూపణ.

• تعرّف الكافر إلى الله في الشدة وتنكّره له في الرخاء، دليل على تخبطه واضطرابه.
అవిశ్వాసపరుడు లేమిలో అల్లాహ్ ను గుర్తుంచుకొని కలిమిలో ఆయనను పట్టించుకోకపోవటం అతని మూర్ఖత్వమునకు మరియు అతని గందరగోళమునకు ఆధారము.

• الخوف والرجاء صفتان من صفات أهل الإيمان.
భయము మరియు ఆశ విశ్వాసపరుల లక్షణాల్లోంచి రెండు లక్షణాలు.

 
Маънолар таржимаси Оят: (7) Сура: Зумар сураси
Суралар мундарижаси Бет рақами
 
Қуръони Карим маъноларининг таржимаси - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Таржималар мундарижаси

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Ёпиш