Check out the new design

Қуръони Карим маъноларининг таржимаси - Қуръон Карим мухтасар тафсирининг телгуча таржимаси * - Таржималар мундарижаси


Маънолар таржимаси Сура: Моида   Оят:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اِذَا قُمْتُمْ اِلَی الصَّلٰوةِ فَاغْسِلُوْا وُجُوْهَكُمْ وَاَیْدِیَكُمْ اِلَی الْمَرَافِقِ وَامْسَحُوْا بِرُءُوْسِكُمْ وَاَرْجُلَكُمْ اِلَی الْكَعْبَیْنِ ؕ— وَاِنْ كُنْتُمْ جُنُبًا فَاطَّهَّرُوْا ؕ— وَاِنْ كُنْتُمْ مَّرْضٰۤی اَوْ عَلٰی سَفَرٍ اَوْ جَآءَ اَحَدٌ مِّنْكُمْ مِّنَ الْغَآىِٕطِ اَوْ لٰمَسْتُمُ النِّسَآءَ فَلَمْ تَجِدُوْا مَآءً فَتَیَمَّمُوْا صَعِیْدًا طَیِّبًا فَامْسَحُوْا بِوُجُوْهِكُمْ وَاَیْدِیْكُمْ مِّنْهُ ؕ— مَا یُرِیْدُ اللّٰهُ لِیَجْعَلَ عَلَیْكُمْ مِّنْ حَرَجٍ وَّلٰكِنْ یُّرِیْدُ لِیُطَهِّرَكُمْ وَلِیُتِمَّ نِعْمَتَهٗ عَلَیْكُمْ لَعَلَّكُمْ تَشْكُرُوْنَ ۟
ఓ విశ్వాసపరులారా మీరు నమాజును పాటించటానికి నిలబడదలచుకున్నప్పుడు మీరు చిన్న అశుద్ధతలో ఉంటే మీరు మీ ముఖములను కడుగక్కొని మరియు మీ చేతులను వాటి మోచేతితోసహా కడుక్కొని మరియు మీ తలలపై మసహ్ చేసుకుని మీ కాళ్ళను కాలి జాయింట్ నుండి వెలుపలికి పొడుచుకుని వచ్చిన రెండ మడమలతో సహా కడుక్కొని వజూ చేసుకోండి. ఒక వేళ మీరు పెద్ద అశుద్ధావస్తలో ఉంటే గుసుల్ చేసుకోండి. మరియు ఒక వేళ మీరు అనారోగ్యముతో ఉండి రోగము పెరిగిపోతుందని లేదా దాని నయం అవటం ఆలస్యం అవుతుందని మీకు భయం ఉంటే లేదా మీరు ఆరోగ్యముగానే ఉండి ప్రయాణంలో ఉంటే లేదా మీరు కాలకృత్యముల్లాంటి చిన్న అశుద్ధతలో ఉంటే లేదా మీరు భార్యలతో సంభోగము చేయటం వలన పెద్ద అశుద్దతావస్తలో ఉంటే మరియు మీకు వెతికిన తరువాత కూడా పరిశుద్ధత పొందటానికి నీరు లభించకపోతే నేల పై భాగము వైపునకు మరలి దానిపై మీ రెండు చేతులతో కొట్టి దాన్ని మీ ముఖములపై మరియు మీ చేతులపై స్పర్శించుకోండి (మసాహ్ చేసుకోండి). మీకు నష్టం వైపునకు తీసుకుని వెళ్ళే నీటిని వినియోగించటం మీపై తప్పనిసరి చేసి అల్లాహ్ తన ఆదేశముల్లో మీపై కష్టమును వేయదలచుకోలేదు. అందుకనే ఆయన మీ కొరకు అనారోగ్యం వలన లేదా నీరు లభించకపోవటం వలన ఇబ్బంది కలిగినప్పుడు దానికి బదులును ధర్మబద్ధం చేశాడు తన అనుగ్రహమును మీపై పరిపూర్ణం చేయటానికి బహుశా మీరు మీపై ఉన్న అల్లాహ్ అనుగ్రహమునకు కృతజ్ఞత తెలుపుకుంటారని మరియు దానికి కృతఘ్నులు కారని.
Арабча тафсирлар:
وَاذْكُرُوْا نِعْمَةَ اللّٰهِ عَلَیْكُمْ وَمِیْثَاقَهُ الَّذِیْ وَاثَقَكُمْ بِهٖۤ ۙ— اِذْ قُلْتُمْ سَمِعْنَا وَاَطَعْنَا ؗ— وَاتَّقُوا اللّٰهَ ؕ— اِنَّ اللّٰهَ عَلِیْمٌۢ بِذَاتِ الصُّدُوْرِ ۟
మరియు మీరు ఇస్లాం కొరకు మార్గదర్శకత్వం ద్వారా మీపై ఉన్న అల్లాహ్ అనుగ్రహమును గుర్తు చేసుకోండి మరియు మీరు ఆయనతో చేసిన ఆ ప్రమాణమును గుర్తు చేసుకోండి మీరు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిమిలో మరియు లేమిలో వినటం,విధేయత చూపటంపై మీరు బైత్ (మాట ఇచ్చినప్పుడు) చేసినప్పుడు మీరు ఇలా పలికినప్పటిది : మేము మీ మాట విన్నాము మరియు మీ ఆదేశమునకు కట్టుబడి ఉన్నాము. మరియు మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశములను పాటించి - వాటిలో నుండి ఆయనతో చేసిన ప్రమాణములను - మరియు ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి. నిశ్చయంగా హృదయముల్లో ఉన్నది అల్లాహ్ కు బాగా తెలుసు. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.
Арабча тафсирлар:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا كُوْنُوْا قَوّٰمِیْنَ لِلّٰهِ شُهَدَآءَ بِالْقِسْطِ ؗ— وَلَا یَجْرِمَنَّكُمْ شَنَاٰنُ قَوْمٍ عَلٰۤی اَلَّا تَعْدِلُوْا ؕ— اِعْدِلُوْا ۫— هُوَ اَقْرَبُ لِلتَّقْوٰی ؗ— وَاتَّقُوا اللّٰهَ ؕ— اِنَّ اللّٰهَ خَبِیْرٌ بِمَا تَعْمَلُوْنَ ۟
ఓ అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించినవారా మీరు మీపై ఉన్న అల్లాహ్ హక్కులను వాటి ద్వారా ఆయన మన్నతను ఆశిస్తూ నెలకొల్పేవారై అయిపోండి. మరియు మీరు అన్యాయంగా కాకుండా న్యాయముతో సాక్ష్యం పలికే వారైపోండి. జాతి పట్ల ద్వేషము మిమ్మల్ని న్యాయమును వదలటంపై ప్రేరేపించకూడదు. కాబట్టి న్యాయమన్నది స్నేహితునితో మరియు శతృవునితో పాటు ఆశించబడును. కావున మీరు వారిద్దరికి న్యాయం చేయండి. న్యాయము అన్నది అల్లాహ్ నుండి భయమునకు చాలా దగ్గర ఉంటుంది. మరియు అన్యాయం అన్నది ఆయనకు వ్యతిరేకంగా ధైర్యమునకు చాలా దగ్గర ఉంటుంది. మరియు మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి. నిశ్చయంగా అల్లాహ్ మీరు చేసే కర్మల గురించి తెలుసుకునేవాడు. మీ కర్మల్లోంచి ఆయనపై ఏది గోప్యంగా ఉండదు. మరియు తొందరలోనే ఆయన వాటిపరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
Арабча тафсирлар:
وَعَدَ اللّٰهُ الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ ۙ— لَهُمْ مَّغْفِرَةٌ وَّاَجْرٌ عَظِیْمٌ ۟
వాగ్దానమునకు వ్యతిరేకంగా చేయని అల్లాహ్, అల్లాహ్ ను ఆయన ప్రవక్తలను విశ్వసించి సత్కర్మలు చేసేవారికి వారి పాపముల మన్నింపు మరియు గొప్ప ప్రతిఫల వాగ్దానం చేశాడు అది స్వర్గములో ప్రవేశము.
Арабча тафсирлар:
Ушбу саҳифадаги оят фойдаларидан:
• الأصل في الطهارة هو استعمال الماء بالوضوء من الحدث الأصغر، والغسل من الحدث الأكبر.
తహారత్ లో (శుద్ధతను పాటించటంలో) సూత్రం ఏమిటంటే చిన్న మలినం సమయంలో వజుతో మరియు పెద్ద మలినం సమయంలో గుసుల్ తో నీటిని వినియోగించటం.

• في حال تعذر الحصول على الماء، أو تعذّر استعماله لمرض مانع أو برد قارس، يشرع التيمم (بالتراب) لرفع حكم الحدث (الأصغر أو الأكبر).
నీటిని పొందటం అసంభవమైతే లేదా ఆటంకపరిచే ఏదైన రోగము వలన లేదా తీవ్రమైన చలి వలన నీటిని వినియోగించటం సాధ్యం కానప్పుడు అశుద్ధాదేశమును (పెద్దదైన లేదా చిన్నదైన) తొలగించటం కొరకు తయమ్ముమ్ చేసుకోవటం ధర్మబద్దమైనది.

• الأمر بتوخي العدل واجتناب الجور حتى في معاملة المخالفين.
న్యాయంగా ఉండాలని మరియు అన్యాయాన్ని నివారించాలని ఆదేశం చివరికి వ్యతిరేకులతో వ్యవహరించే విషయంలో కూడాను.

 
Маънолар таржимаси Сура: Моида
Суралар мундарижаси Бет рақами
 
Қуръони Карим маъноларининг таржимаси - Қуръон Карим мухтасар тафсирининг телгуча таржимаси - Таржималар мундарижаси

Тафсир маркази томонидан нашр қилинган.

Ёпиш