Check out the new design

Қуръони Карим маъноларининг таржимаси - Қуръон Карим мухтасар тафсирининг телгуча таржимаси * - Таржималар мундарижаси


Маънолар таржимаси Сура: Тавба   Оят:
وَالَّذِیْنَ اتَّخَذُوْا مَسْجِدًا ضِرَارًا وَّكُفْرًا وَّتَفْرِیْقًا بَیْنَ الْمُؤْمِنِیْنَ وَاِرْصَادًا لِّمَنْ حَارَبَ اللّٰهَ وَرَسُوْلَهٗ مِنْ قَبْلُ ؕ— وَلَیَحْلِفُنَّ اِنْ اَرَدْنَاۤ اِلَّا الْحُسْنٰی ؕ— وَاللّٰهُ یَشْهَدُ اِنَّهُمْ لَكٰذِبُوْنَ ۟
కపట విశ్వాసుల్లోంచి వారందరు కూడా ఉన్నారు ఎవరైతే అల్లాహ్ అవిధేయత కొరకు ఒక మస్జిదు నిర్మాణం చేశారో.అంతే కాదు ముస్లిములకు హాని తలపెట్టటానికి,కపటవిశ్వాసుల బలము చేకూర్చి అవిశ్వాసమును బహిర్గతం చేయటానికి,విశ్వాసపరులను విడదీయటానికి,మస్జిదు నిర్మాణం కన్న ముందు అల్లాహ్ తో,ఆయన ప్రవక్తతో పోరాడిన వారి కొరకు సిద్ధం చేయటానికి,నిరీక్షించటానికి.మరియు ఈ కపటవిశ్వాసులందరూ మా ఉద్దేశం కేవలం ముస్లిముల పట్ల దయ చూపటం మాత్రమే అని మీ ముందట తప్పకుండా ప్రమాణం చేస్తారు.మరియు అల్లాహ్ నిశ్చయంగా వీరు తమ ఈ వాదనలో అబద్దము చెబుతున్నారని సాక్ష్యం పలుకుతున్నాడు.
Арабча тафсирлар:
لَا تَقُمْ فِیْهِ اَبَدًا ؕ— لَمَسْجِدٌ اُسِّسَ عَلَی التَّقْوٰی مِنْ اَوَّلِ یَوْمٍ اَحَقُّ اَنْ تَقُوْمَ فِیْهِ ؕ— فِیْهِ رِجَالٌ یُّحِبُّوْنَ اَنْ یَّتَطَهَّرُوْا ؕ— وَاللّٰهُ یُحِبُّ الْمُطَّهِّرِیْنَ ۟
ఓ ప్రవక్తా ఈ గుణాలు కల మస్జిదులో మీరు నమాజు చేయటానికి కపటుల పిలుపును అంగీకరించకండి.ఎందుకంటే ప్రప్రధమంగా దైవభీతిపై నిర్మితమైన ఖుబా మస్జిదు(లో నమాజ్ చేయటం),అవిశ్వాసము పై నిర్మితమైన ఈ మస్జిదులో నమాజు చేయటం కన్నా ఎంతో శ్రేయస్కరము.ఖుబా మస్జిదులో మాలిన్యముల నుండి,అశుద్ధతల నుండీ నీటి ద్వారా,పాపముల నుండి పశ్చాత్తాపము,మన్నింపును వేడుకోవటం ద్వారా పరిశుద్దత పొందటమును ఇష్టపడే ప్రజలు ఉన్నారు.మరియు అల్లాహ్ మాలిన్యముల నుండి,అశుద్ధతల నుండి,పాపముల నుండి పరిశుద్ధతను పాటించే వారిని ఇష్టపడుతాడు.
Арабча тафсирлар:
اَفَمَنْ اَسَّسَ بُنْیَانَهٗ عَلٰی تَقْوٰی مِنَ اللّٰهِ وَرِضْوَانٍ خَیْرٌ اَمْ مَّنْ اَسَّسَ بُنْیَانَهٗ عَلٰی شَفَا جُرُفٍ هَارٍ فَانْهَارَ بِهٖ فِیْ نَارِ جَهَنَّمَ ؕ— وَاللّٰهُ لَا یَهْدِی الْقَوْمَ الظّٰلِمِیْنَ ۟
ఏమీ ఎవరైతే అల్లాహ్ ఆదేశాలను పాటిస్తూ,ఆయన వారించిన వాటి నుండి దూరంగా ఉంటూ,ఆచరణల్లో విశాలత్వముతో అల్లాహ్ యొక్క ప్రీతి ద్వారా అల్లాహ్ భయభీతి పై దాని నిర్మాణమును ఏర్పరచినవారు వారితో సమానులు కాగలరా ఎవరైతే ముస్లిములకు హాని తలపెట్టటానికి,అవిశ్వాసమును బలపరచటానికి,విశ్వాసపరులను విడదీయటానికి ఒక మస్జిదు నిర్మాణము చేశారో ?.వారిరువురు ఎన్నటికి సమానులు కాలేరు.మొదటి నిర్మాణము పడిపోవటానికి భయపడని ఒక బలమైన,అతుక్కుని ఉండే నిర్మాణం.మరియు ఇది దాని ఉపమానము ఆ వ్యక్తి ఉపమానములాగా ఉన్నది ఎవరైతే ఒక గుంత అంచున నిర్మాణమును ఏర్పరిస్తే అది నాశనమై పడిపోయింది.మరియు దానితో సహా ఆ నిర్మాణము నరకము అట్డడుగులో కుప్పకూలింది.మరియు అల్లాహ్ అవిశ్వాసము,కపటత్వము,ఇతర వాటి ద్వారా దుర్మార్గమునకు పాల్పడే ప్రజలను అనుగ్రహించడు.
Арабча тафсирлар:
لَا یَزَالُ بُنْیَانُهُمُ الَّذِیْ بَنَوْا رِیْبَةً فِیْ قُلُوْبِهِمْ اِلَّاۤ اَنْ تَقَطَّعَ قُلُوْبُهُمْ ؕ— وَاللّٰهُ عَلِیْمٌ حَكِیْمٌ ۟۠
వారు నిర్మించిన ఈ మస్జిదు వారి హృదయాలు మరణం ద్వారా లేదా ఖడ్గముతో హత మార్చటం ద్వారా ముక్కలైపోనంత వరకు వారి హృదయాల్లో కీడును,సందేహమును,కపటత్వమును నాటుతూనే ఉంటుంది.మరియు అల్లాహ్ తన దాసుల ఆచరణల గురించి బాగా తెలిసిన వాడు,మేలుపై లేదా చెడు పై ప్రతిఫలమును తాను నిర్ణయించే విషయంలో వివేకవంతుడు.
Арабча тафсирлар:
اِنَّ اللّٰهَ اشْتَرٰی مِنَ الْمُؤْمِنِیْنَ اَنْفُسَهُمْ وَاَمْوَالَهُمْ بِاَنَّ لَهُمُ الْجَنَّةَ ؕ— یُقَاتِلُوْنَ فِیْ سَبِیْلِ اللّٰهِ فَیَقْتُلُوْنَ وَیُقْتَلُوْنَ ۫— وَعْدًا عَلَیْهِ حَقًّا فِی التَّوْرٰىةِ وَالْاِنْجِیْلِ وَالْقُرْاٰنِ ؕ— وَمَنْ اَوْفٰی بِعَهْدِهٖ مِنَ اللّٰهِ فَاسْتَبْشِرُوْا بِبَیْعِكُمُ الَّذِیْ بَایَعْتُمْ بِهٖ ؕ— وَذٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِیْمُ ۟
నిశ్చయంగా పరిశుద్ధుడైన అల్లాహ్ విశ్వాసపరుల నుండి వారి ప్రాణములను, ఆయన సొత్తు అయినప్పటికీ తన వద్ద నుండి అనుగ్రహంగా అధిక ధర అయిన స్వర్గమునకు బదులుగా కొన్నాడు.ఏవిధంగా అంటే వారు అవిశ్వాసపరులతో అల్లాహ్ యొక్క మాట (కలిమ) గొప్పదవటం కొరకు పోరాడుతారు.అయితే వారు అవిశ్వాసపరులను హతమారుస్తారు మరియు వారిని అవిశ్వాసపరులు హతమారుస్తారు.అల్లాహ్ దీని గురించి మూసా అలైహిస్సలాం గారి గ్రంధమైన తౌరాతులో,ఈసా అలైహిస్సలాం గారి గ్రంధమైన ఇంజీలులో,ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గ్రంధమైన ఖుర్ఆన్ లో సత్య వాగ్దానం చేశాడు.పరిశుద్ధుడైన అల్లాహ్ కన్నా ఎక్కువగా తన వాగ్దానమును పూర్తి చేసేవాడు ఇంకెవరూ లేరు.అయితే ఓ విశ్వాసులారా మీరు అల్లాహ్ తో చేసిన మీ వ్యాపారము వలన సంబరపడండి,సంతోషపడండి.అందులో మీరు గొప్ప లాభమును పొందారు.మరియు ఆ వ్యాపారమే గొప్ప సాఫల్యము.
Арабча тафсирлар:
Ушбу саҳифадаги оят фойдаларидан:
• محبة الله ثابتة للمتطهرين من الأنجاس البدنية والروحية.
శారీరిక,ఆధ్యాత్మిక అశుద్ధతల నుండి పరిశుభ్రతను పాటించేవారి కొరకు అల్లాహ్ ప్రేమ స్థిరంగా ఉంటుంది.

• لا يستوي من عمل عملًا قصد به وجه الله؛ فهذا العمل هو الذي سيبقى ويسعد به صاحبه، مع من قصد بعمله نصرة الكفر ومحاربة المسلمين؛ وهذا العمل هو الذي سيفنى ويشقى به صاحبه.
అల్లాహ్ మన్నతను ఆశిస్తూ ఏదైన ఆచరణ చేసే వ్యక్తి ,అయితే ఆ ఆచరణ శాస్వతంగా ఉండిపోయేది,దాన్ని చేసేవాడు సంతోషముగా ఉంటాడు ఆ వ్యక్తితో సమానుడు కాడు ఎవరైతే తన ఆచరణ ద్వారా అవిశ్వాసపరునికి సహాయపడటం,ముస్లిములతో పోరాడటం నిర్ణయించుకుంటాడో.ఈ కార్యము నాశనమవుతుంది,దాని వలన ఆ కార్యం చేసేవాడు ప్రయాసకు లోనవుతాడు.

• مشروعية الجهاد والحض عليه كانت في الأديان التي قبل الإسلام أيضًا.
ధర్మ పోరాటం యొక్క చట్టబద్దత మరియు దానిపై ప్రేరేపించటం ఇస్లాంకు ముందు ఉన్న ధర్మాలలో కూడా ఉండేది.

• كل حالة يحصل بها التفريق بين المؤمنين فإنها من المعاصي التي يتعين تركها وإزالتها، كما أن كل حالة يحصل بها جمع المؤمنين وائتلافهم يتعين اتباعها والأمر بها والحث عليها.
విశ్వాసపరులను విడదీసే ప్రతి సందర్బము నిశ్చయంగా అది ఆ పాపకార్యములోనిదే దేనినైతే వదిలివేయటం,దూరంచేయటం అవసరమో.ఎలాగైతే విశ్వాసపరులను సమీకరంచి,వారి మధ్యన ఐకమత్యమును కలుగజేసే ప్రతి సందర్భము దాన్ని అనుసరంచటం,దాని గురించి ఆదేశించటం,దానిపై ప్రోత్సహించటం అనివార్యమవుతుందో.

 
Маънолар таржимаси Сура: Тавба
Суралар мундарижаси Бет рақами
 
Қуръони Карим маъноларининг таржимаси - Қуръон Карим мухтасар тафсирининг телгуча таржимаси - Таржималар мундарижаси

Тафсир маркази томонидан нашр қилинган.

Ёпиш