Check out the new design

Қуръони Карим маъноларининг таржимаси - Телугуча таржима - Абдураҳим ибн Муҳаммад * - Таржималар мундарижаси

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

Маънолар таржимаси Сура: Анъом   Оят:
وَمَا لَكُمْ اَلَّا تَاْكُلُوْا مِمَّا ذُكِرَ اسْمُ اللّٰهِ عَلَیْهِ وَقَدْ فَصَّلَ لَكُمْ مَّا حَرَّمَ عَلَیْكُمْ اِلَّا مَا اضْطُرِرْتُمْ اِلَیْهِ ؕ— وَاِنَّ كَثِیْرًا لَّیُضِلُّوْنَ بِاَهْوَآىِٕهِمْ بِغَیْرِ عِلْمٍ ؕ— اِنَّ رَبَّكَ هُوَ اَعْلَمُ بِالْمُعْتَدِیْنَ ۟
మరియు మీకేమయింది? అల్లాహ్ పేరు స్మరించబడిన దానిని మీరెందుకు తినకూడదు? వాస్తవానికి - గత్యంతరం లేని సంకట పరిస్థితులలో తప్ప - ఏవేవి మీకు (తినటానికి) నిషేధింపబడ్డాయో, మీకు విశదీకరించబడింది కదా?మరియు నిశ్చయంగా, చాలా మంది అజ్ఞానంతో (ఇతరులను) తమ ఇష్టానుసారంగా మార్గభ్రష్టత్వానికి గురి చేస్తున్నారు. నిశ్చయంగా, నీ ప్రభువు, ఆయనకు హద్దులు మీరి ప్రవర్తించేవారి గురించి బాగా తెలుసు.
Арабча тафсирлар:
وَذَرُوْا ظَاهِرَ الْاِثْمِ وَبَاطِنَهٗ ؕ— اِنَّ الَّذِیْنَ یَكْسِبُوْنَ الْاِثْمَ سَیُجْزَوْنَ بِمَا كَانُوْا یَقْتَرِفُوْنَ ۟
మరియు పాపాన్ని - బహిరంగంగా గానీ, రహస్యంగా గానీ - చేయటాన్ని మానుకోండి. నిశ్చయంగా, పాపం అర్జించిన వారు తాము చేసిన దుష్కృత్యాలకు తగిన ప్రతిఫలం పొందగలరు.
Арабча тафсирлар:
وَلَا تَاْكُلُوْا مِمَّا لَمْ یُذْكَرِ اسْمُ اللّٰهِ عَلَیْهِ وَاِنَّهٗ لَفِسْقٌ ؕ— وَاِنَّ الشَّیٰطِیْنَ لَیُوْحُوْنَ اِلٰۤی اَوْلِیٰٓـِٕهِمْ لِیُجَادِلُوْكُمْ ۚ— وَاِنْ اَطَعْتُمُوْهُمْ اِنَّكُمْ لَمُشْرِكُوْنَ ۟۠
మరియు అల్లాహ్ పేరు స్మరించబడని దానిని తినకండి. మరియు అది (తినటం) నిశ్చయంగా పాపం. మరియు నిశ్చయంగా, మీతో వాదులాడటానికి షైతానులు తమ స్నేహితులను (అవులియాలను) ప్రేరేపింపజేస్తారు[1]. ఒకవేళ మీరు వారిని అనుసరిస్తే! నిశ్చయంగా, మీరు కూడా అల్లాహ్ కు సాటి (భాగస్వాములు) కల్పించిన వారవుతారు.
[1] చూడండి, 2:14 మరియు 14:22.
Арабча тафсирлар:
اَوَمَنْ كَانَ مَیْتًا فَاَحْیَیْنٰهُ وَجَعَلْنَا لَهٗ نُوْرًا یَّمْشِیْ بِهٖ فِی النَّاسِ كَمَنْ مَّثَلُهٗ فِی الظُّلُمٰتِ لَیْسَ بِخَارِجٍ مِّنْهَا ؕ— كَذٰلِكَ زُیِّنَ لِلْكٰفِرِیْنَ مَا كَانُوْا یَعْمَلُوْنَ ۟
మరియు ఏమీ? ఒక మరణించిన వ్యక్తిని (అవిశ్వాసిని), మేము సజీవునిగా (విశ్వాసిగా) చేసి జ్యోతిని ప్రసాదించగా! దానితో ప్రజల మధ్య సంచరిస్తున్నవాడూ మరియు అంధకారంలో (అవిశ్వాసంలో) చిక్కుకొని, వాటి నుండి బయటకు రాజాలనివాడూ ఇద్దరూ సమానులా?[1] ఇదే విధంగా సత్యతిరస్కారులకు, వారు చేస్తున్న కర్మలు, మరోహరమైనవిగా చేయబడ్డాయి.
[1] ఈ ఆయత్ లో అల్లాహ్ (సు.తా.) సత్యతిరస్కారులను మృతులతో మరియు విశ్వాసులను సజీవులతో పోల్చాడు. చూడండి, 2:257, 11:24 మరియు 35:19-22.
Арабча тафсирлар:
وَكَذٰلِكَ جَعَلْنَا فِیْ كُلِّ قَرْیَةٍ اَكٰبِرَ مُجْرِمِیْهَا لِیَمْكُرُوْا فِیْهَا ؕ— وَمَا یَمْكُرُوْنَ اِلَّا بِاَنْفُسِهِمْ وَمَا یَشْعُرُوْنَ ۟
మరియు ఇదే విధంగా మేము ప్రతి నగరంలో, దానిలోని నేరస్థులైన పెద్దవారిని, కుట్రలు పన్నేవారిగా చేశాము[1]. మరియు వారు చేసే కుట్రలు కేవలం వారికే ప్రతికూలమైనవి, కాని వారది గ్రహించడం లేదు[2].
[1] చూడండి, 34:31-33, 43:23 మరియు 71:22. [2] చూడండి, 16:25 మరియు 29:13.
Арабча тафсирлар:
وَاِذَا جَآءَتْهُمْ اٰیَةٌ قَالُوْا لَنْ نُّؤْمِنَ حَتّٰی نُؤْتٰی مِثْلَ مَاۤ اُوْتِیَ رُسُلُ اللّٰهِ ؔۘؕ— اَللّٰهُ اَعْلَمُ حَیْثُ یَجْعَلُ رِسَالَتَهٗ ؕ— سَیُصِیْبُ الَّذِیْنَ اَجْرَمُوْا صَغَارٌ عِنْدَ اللّٰهِ وَعَذَابٌ شَدِیْدٌۢ بِمَا كَانُوْا یَمْكُرُوْنَ ۟
మరియు వారి వద్దకు ఏదైనా సూచన వచ్చినప్పుడు వారు: "అల్లాహ్ యొక్క సందేశహరులకు ఇవ్వబడినట్లు, మాకు కూడా (దివ్యజ్ఞానం)[1] ఇవ్వబడనంత వరకు మేము విశ్వసించము." అని అంటారు. తన సందేశాన్ని ఎవరిపై అవతరింపజేయాలో అల్లాహ్ కు బాగా తెలుసు. త్వరలోనే అపరాధులు అల్లాహ్ దగ్గర అవమానింపబడగలరు. మరియు వారి కుట్రల ఫలితంగా వారికి తీవ్రమైన శిక్ష విధించబడగలదు.
[1] అంటే ప్రవక్తృత్వం మరియు దివ్యజ్ఞానం (వ'హీ) అవతరింపజేయబడటం.
Арабча тафсирлар:
 
Маънолар таржимаси Сура: Анъом
Суралар мундарижаси Бет рақами
 
Қуръони Карим маъноларининг таржимаси - Телугуча таржима - Абдураҳим ибн Муҳаммад - Таржималар мундарижаси

Абдураҳим ибн Муҳаммад таржимаси.

Ёпиш