Check out the new design

የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም ምዕራፍ: ዩሱፍ   አንቀጽ:
قَالَ مَعَاذَ اللّٰهِ اَنْ نَّاْخُذَ اِلَّا مَنْ وَّجَدْنَا مَتَاعَنَا عِنْدَهٗۤ ۙ— اِنَّاۤ اِذًا لَّظٰلِمُوْنَ ۟۠
యూసుఫ్ అలైహిస్సలాం ఇలా పలికారు : మేము ఎవరి సామానులో రాజు కొలిచే పాత్రను పొందామో అతన్ని వదిలేసి ఇతరులను అట్టిపెట్టుకొని దుర్మార్గుని దుష్చర్యపై నిర్దోషిని మేము హింసించటం నుండి అల్లాహ్ రక్షించుగాక. మేము పాపాత్ముడిని వదిలేసి నిర్దోషిని శిక్షించినప్పుడు మేము అలా చేస్తే నిశ్చయంగా మేము దుర్మార్గులము.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
فَلَمَّا اسْتَیْـَٔسُوْا مِنْهُ خَلَصُوْا نَجِیًّا ؕ— قَالَ كَبِیْرُهُمْ اَلَمْ تَعْلَمُوْۤا اَنَّ اَبَاكُمْ قَدْ اَخَذَ عَلَیْكُمْ مَّوْثِقًا مِّنَ اللّٰهِ وَمِنْ قَبْلُ مَا فَرَّطْتُّمْ فِیْ یُوْسُفَ ۚ— فَلَنْ اَبْرَحَ الْاَرْضَ حَتّٰی یَاْذَنَ لِیْۤ اَبِیْۤ اَوْ یَحْكُمَ اللّٰهُ لِیْ ۚ— وَهُوَ خَیْرُ الْحٰكِمِیْنَ ۟
అయితే తమకోరికను యూసుఫ్ అంగీకరించటం నుండి వారు నిరాశులైనప్పుడు ఒకరినొకరు సలహాలు తీసుకోవటం కొరకు (చర్చించుకోవటం కొరకు) ప్రజల నుండి వేరైపోయారు. వారిలో పెద్ద సోదరుడు ఇలా పలికాడు : మీరు తొలగించలేని దానితో మీరు చుట్టు ముడితే తప్ప మీరు తన కుమారుడిని తనకు తిరిగి అప్పజెప్పుతారని ఖచ్చితమైన అల్లాహ్ ప్రమాణమును మీ తండ్రి మీతో తీసుకున్న విషయమును మీకు గుర్తు చేస్తున్నాను.దీనికన్నా ముందు మీరు యూసుఫ్ విషయంలో మాట తప్పారు.ఆయన విషయంలో మీరు మీ తండ్రికి ఇచ్చిన మాటాను పూర్తి చేయలేదు.అయితే నా తండ్రి తన వైపునకు మరలటానికి నాకు అనుమతించనంతవరకు లేదా నా సోదరుడిని తీసుకుని రావటానికి అల్లాహ్ తీర్పునివ్వనంత వరకు నేను మిసర్ ప్రాంతమును వదలను. ఆయన సత్యముతో మరియు న్యాయముతో తీర్పునిస్తాడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
اِرْجِعُوْۤا اِلٰۤی اَبِیْكُمْ فَقُوْلُوْا یٰۤاَبَانَاۤ اِنَّ ابْنَكَ سَرَقَ ۚ— وَمَا شَهِدْنَاۤ اِلَّا بِمَا عَلِمْنَا وَمَا كُنَّا لِلْغَیْبِ حٰفِظِیْنَ ۟
మరియు పెద్ద సోదరుడు ఇలా పలికాడు : మీరందరు మీ తండ్రి వద్దకు వెళ్ళి ఆయనతో ఇలా పలకండి : నిశ్చయంగా మీ కుమారుడు దొంగతనం చేశాడు.మిసర్ రాజు అతని దొంగతనమునకు అతనికి శిక్షగా అతన్ని బానిసగా చేసుకున్నాడు.మేము అతని సామాను నుండి కొలిచే పాత్ర దొరకటం మేము చూసినది మాకు తెలిసినది మాత్రమే మీకు తెలియపరుస్తున్నాము.అతడు దొంగతనం చేస్తాడని మాకు తెలియదు.ఒక వేళ అది మాకు తెలిసి ఉంటే మేము అతన్ని మీకు తిరిగి అప్పగిస్తామని మాట ఇచ్చేవారము కాదు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَسْـَٔلِ الْقَرْیَةَ الَّتِیْ كُنَّا فِیْهَا وَالْعِیْرَ الَّتِیْۤ اَقْبَلْنَا فِیْهَا ؕ— وَاِنَّا لَصٰدِقُوْنَ ۟
ఓ మా తండ్రి మా నిజాయితీని నిర్ధారించుకోవటానికి మీరు మేము ఉండి వచ్చిన మిసర్ వాసులను అడగండి మరియు మేము ఎవరితోపాటు వచ్చామో ఆ బిడారము వారిని అడగండి.నిశ్చయంగా అతని దొంగతనం గురించి మీకు మేము ఇచ్చిన సమాచారములో వాస్తవానికి మేము సత్యవంతులము.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
قَالَ بَلْ سَوَّلَتْ لَكُمْ اَنْفُسُكُمْ اَمْرًا ؕ— فَصَبْرٌ جَمِیْلٌ ؕ— عَسَی اللّٰهُ اَنْ یَّاْتِیَنِیْ بِهِمْ جَمِیْعًا ؕ— اِنَّهٗ هُوَ الْعَلِیْمُ الْحَكِیْمُ ۟
వారితో వారి తండ్రి ఇలా పలికారు : అతడు దొంగతనం చేశాడని మీరు తెలిపినట్లు విషయం అలా లేదు.కాని ముందు అతని సోదరడు యూసుఫ్ విషయంలో మీరు పధకం పన్నినట్లు ఇతని విషయంలో మీరు పధకం పన్నటానికి మీ మనస్సులు మీ కొరకు మంచిగా చేసి చూపాయి. నా సహనం సుందరమైనది. అందులో ఎటువంటి ఫిర్యాదు లేదు కాని అల్లాహ్ వద్ద మాత్రమే.యూసుఫ్,అతని సొంత సోదరుడు మరియు వారిద్దరి పెద్ద సోదరుడు అందరిని నా వద్దకు మరలిస్తాడని అల్లాహ్ పై ఆశ ఉన్నది.నిశ్చయంగా పరిశుద్ధుడైన ఆయన నా స్థితిని గురించి బాగా తెలిసిన వాడు,నా వ్యవహారము కొరకు తన పర్యాలోచనలో వివేకవంతుడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَتَوَلّٰی عَنْهُمْ وَقَالَ یٰۤاَسَفٰی عَلٰی یُوْسُفَ وَابْیَضَّتْ عَیْنٰهُ مِنَ الْحُزْنِ فَهُوَ كَظِیْمٌ ۟
మరియు ఆయన వారి నుండి ముఖం త్రిప్పుకుని దూరముగా జరిగి ఇలా పలికారు : "అయ్యో యూసుఫ్ పై నా దుఃఖ తీవ్రతా".అతన్ని తలచుకుని ఎక్కువగా ఏడవటం వలన ఆయన రెండు కళ్ల నల్లదనం తెల్లగా అయిపోయింది. ఆయన దుఃఖముతో,బాధతో నిండపోయి ఉన్నారు.ప్రజల నుండి తన బాధను దాచి ఉంచారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
قَالُوْا تَاللّٰهِ تَفْتَؤُا تَذْكُرُ یُوْسُفَ حَتّٰی تَكُوْنَ حَرَضًا اَوْ تَكُوْنَ مِنَ الْهٰلِكِیْنَ ۟
యూసుఫ్ సోదరులు తమ తండ్రితో ఇలా పలికారు ఓ మా తండ్రి అల్లాహ్ సాక్షిగా మీరు తీవ్ర జబ్బు పడే వరకు లేదా నిజంగా నశించే వరకు యూసుఫ్ ను నిరంతరంగా తలచుకుంటుంటారు మరుయు అతనిపై దుఃఖిస్తూ ఉంటారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
قَالَ اِنَّمَاۤ اَشْكُوْا بَثِّیْ وَحُزْنِیْۤ اِلَی اللّٰهِ وَاَعْلَمُ مِنَ اللّٰهِ مَا لَا تَعْلَمُوْنَ ۟
వారితో వారి తండ్రి ఇలా పలికారు : నాకు కలిగిన ఆవేదన,దుఃఖము గురించి ఒక్కడైన అల్లాహ్ వద్ద మాత్రమే నేను ఫిర్యాదు చేసుకుంటాను.మరియు అల్లాహ్ దయాదాక్షిణ్యాలు,కష్టాల్లో ఉన్న వాడి పట్ల ఆయన స్పందన మరియు ఆపదకి గురైన వారికి ఆయన ఇచ్చే ప్రతిఫలము గురించి మీకు తెలియనిది నాకు తెలుసు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• لا يجوز أخذ بريء بجريرة غيره، فلا يؤخذ مكان المجرم شخص آخر.
ఇంకొకరి తప్పిదముపై అమాయకుడిని (నిర్దోషిని) శిక్షించటం అధర్మము.నేరస్తుడి స్థానములో మరొకరిని పట్టుకోవటం జరగదు.

• الصبر الجميل هو ما كانت فيه الشكوى لله تعالى وحده.
మంచి సహనము అన్నది అందులో ఒక్కడైన అల్లాహ్ కొరకే ఫిర్యాదు ఉంటుంది.

• على المؤمن أن يكون على تمام يقين بأن الله تعالى يفرج كربه.
మహోన్నతుడైన అల్లాహ్ తన బాధను తొలగిస్తాడని పూర్తి నమ్మకమును కలిగి ఉండటం ఒక విశ్వాసపరునిపై తప్పనిసరి.

 
የይዘት ትርጉም ምዕራፍ: ዩሱፍ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ - የትርጉሞች ማዉጫ

ከቁርአን ተፍሲር ጥናት ማዕከል የተገኘ

መዝጋት