Check out the new design

የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም ምዕራፍ: ዩሱፍ   አንቀጽ:
وَاتَّبَعْتُ مِلَّةَ اٰبَآءِیْۤ اِبْرٰهِیْمَ وَاِسْحٰقَ وَیَعْقُوْبَ ؕ— مَا كَانَ لَنَاۤ اَنْ نُّشْرِكَ بِاللّٰهِ مِنْ شَیْءٍ ؕ— ذٰلِكَ مِنْ فَضْلِ اللّٰهِ عَلَیْنَا وَعَلَی النَّاسِ وَلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا یَشْكُرُوْنَ ۟
మరియు నేను నా తండ్రితాతలైన ఇబ్రాహీం,ఇస్హాఖ్,యాఖూబ్ ధర్మమును అనుసరించాను. మరియు అది అల్లాహ్ కొరకు ఏకత్వము యొక్క ధర్మము. అల్లాహ్ తోపాటు ఇతరులను సాటి కల్పించటం నాకు సరికాదు. మరియు అతను ఏకత్వములో అతీతుడు.ఈ ఏకత్వము,విశ్వాసము దేనిపైనైతే నేను,నా తాతముత్తాతలు ఉన్నామో అది మాపై ఉన్న అల్లాహ్ అనుగ్రహము దాన్ని మాకు అనుగ్రహించాడు. మరియు ఎప్పుడైతే ఆయన వారి వద్దకు ప్రవక్తలను దానిని ఇచ్చి పంపించాడో అది ప్రజలందరిపై ఆయన అనుగ్రహము. కాని చాలా మంది అల్లాహ్ అనుగ్రహాలపై ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోరు ,అంతేకాదు వారు ఆయనను తిరస్కరిస్తున్నారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
یٰصَاحِبَیِ السِّجْنِ ءَاَرْبَابٌ مُّتَفَرِّقُوْنَ خَیْرٌ اَمِ اللّٰهُ الْوَاحِدُ الْقَهَّارُ ۟ؕ
ఆ తరువాత యూసుఫ్ చెరసాలలో ఉన్న ఇద్దరు వ్యక్తులను ఉద్దేశించి ఇలా పలికారు : ఏమీ చాలా దేవుళ్లను ఆరాధించటం మేలైనదా లేదా ఎటువంటి సాటి లేని,ఇతరులపై ఆధిక్యత కలిగి తనపై ఎవరూ ఆధిక్యత చూపని ఒక్కడైన అల్లాహ్ ఆరాధన మేలైనదా ?.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
مَا تَعْبُدُوْنَ مِنْ دُوْنِهٖۤ اِلَّاۤ اَسْمَآءً سَمَّیْتُمُوْهَاۤ اَنْتُمْ وَاٰبَآؤُكُمْ مَّاۤ اَنْزَلَ اللّٰهُ بِهَا مِنْ سُلْطٰنٍ ؕ— اِنِ الْحُكْمُ اِلَّا لِلّٰهِ ؕ— اَمَرَ اَلَّا تَعْبُدُوْۤا اِلَّاۤ اِیَّاهُ ؕ— ذٰلِكَ الدِّیْنُ الْقَیِّمُ وَلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا یَعْلَمُوْنَ ۟
మీరు,మీ తాత ముత్తాతలు పేర్లు లేని పేర్లు పెట్టుకున్న కొన్ని దేవుళ్ళను మాత్రమే మీరు అల్లాహ్ ను వదిలి ఆరాధిస్తున్నారు. వాటి కొరకు దైవత్వములో ఎటువంటి భాగము లేదు. మీరు పేరు పెట్టుకున్నవి సరి అయినవి అనటానికి అల్లాహ్ ఎటువంటి ఆధారమును అవతరింపచేయలేదు. సృష్టితాలన్నింటి విషయంలో అల్లాహ్ ఒక్కడికి మాత్రమే ఆదేశించే అధికారము ఉంది. మీరు,మీ తాతముత్తాతలు పేర్లు పెట్టుకున్న వీటికి ఆ అధికారము లేదు. పరిశుద్ధుడైన అల్లాహ్ మీరు ఆయన ఒక్కడినే ఆరాధించమని ఆదేశించాడు. మరియు ఆయనతోపాటు వేరేవారిని మీరు సాటి కల్పించటం నుండి వారించాడు. ఈ తౌహీదే (ఏకత్వము) ఎటువంటి వంకరతనం లేని తిన్నని ధర్మము.కాని అది చాలా మందికి తెలియదు.అందుకనే వారు అల్లాహ్ తోపాటు సాటి కల్పిస్తున్నారు. అయితే వారు ఆయన సృష్టితాల్లోంచి కొన్నింటిని ఆరాధిస్తున్నారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
یٰصَاحِبَیِ السِّجْنِ اَمَّاۤ اَحَدُكُمَا فَیَسْقِیْ رَبَّهٗ خَمْرًا ۚ— وَاَمَّا الْاٰخَرُ فَیُصْلَبُ فَتَاْكُلُ الطَّیْرُ مِنْ رَّاْسِهٖ ؕ— قُضِیَ الْاَمْرُ الَّذِیْ فِیْهِ تَسْتَفْتِیٰنِ ۟ؕ
ఓ నా చెరసాల ఇద్దరు మిత్రులారా సారాయి తయారు చేయటానికి ద్రాక్ష పండ్లను పిండుతున్నట్లు చూసిన వాడు చెరసాల నుండి బయటకు వస్తాడు మరియు తన పని వైపునకు మరలి రాజుకు (సారాయి) త్రాపిస్తాడు. కాని తన తలపై రొట్టెను ఎత్తుకుని ఉంటే అందులో నుంచి పక్షులు తింటుండగా చూసిన వ్యక్తి అతడు హతమార్చబడుతాడు.మరియు సిలువపై ఎక్కించబడుతాడు.అప్పుడు అతని తల మాంసమును పక్షులు తింటూ ఉంటాయి. మీరిద్దరు ఫత్వా అడిగిన ఆదేశం ముగిసింది మరియు అది పూర్తయ్యింది.అయితే అది ఖచ్చితంగా జరుగుతుంది.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَقَالَ لِلَّذِیْ ظَنَّ اَنَّهٗ نَاجٍ مِّنْهُمَا اذْكُرْنِیْ عِنْدَ رَبِّكَ ؗ— فَاَنْسٰىهُ الشَّیْطٰنُ ذِكْرَ رَبِّهٖ فَلَبِثَ فِی السِّجْنِ بِضْعَ سِنِیْنَ ۟۠
వారిద్దరిలో నుంచి బ్రతికి బయటపడుతాడని భావించిన వాడు మరియు అతడు రాజుకి (సారాయి) త్రాపించే వాడు అతనితో యూసుఫ్ అలైహిస్సలాం ఇలా పలికారు : నీవు నా గాధను మరియు నా విషయమును రాజు వద్ద ప్రస్తావించు.బహుశా అతను నన్ను చెరసాల నుండి బయటకు తీస్తాడు. అయితే షైతాను త్రాపించేవాడిని రాజు వద్ద యూసుఫ్ అలైహిస్సలాం యొక్క ప్రస్తావన చేయటమును మరిపింపజేశాడు. అప్పుడు యూసుఫ్ అలైహిస్సలాం దాని తరువాత చెరసాలలో కొన్ని సంవత్సరాలు ఉండిపోయారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَقَالَ الْمَلِكُ اِنِّیْۤ اَرٰی سَبْعَ بَقَرٰتٍ سِمَانٍ یَّاْكُلُهُنَّ سَبْعٌ عِجَافٌ وَّسَبْعَ سُنْۢبُلٰتٍ خُضْرٍ وَّاُخَرَ یٰبِسٰتٍ ؕ— یٰۤاَیُّهَا الْمَلَاُ اَفْتُوْنِیْ فِیْ رُءْیَایَ اِنْ كُنْتُمْ لِلرُّءْیَا تَعْبُرُوْنَ ۟
మరియు రాజు ఇలా పలికాడు : నిశ్చయంగా నేను కలలో ఏడు లావుగా బలిసిన ఆవులను ఏడు బక్కచిక్కిన (బలహీనమైన) ఆవులు తింటున్నట్లు చూశాను.మరియు ఏడు పచ్చటి వెన్నులను మరియు ఏడు ఎండిన వెన్నులను చూశాను.ఓ నాయకులారా మరియు పెద్దవారా మీరు ఒక వేళ కలల తాత్పర్యం తెలిసిన వారైతే నాకు నా ఈ కల యొక్క తాత్పర్యమును తెలుపండి.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• وجوب اتباع ملة إبراهيم، والبراءة من الشرك وأهله.
ఇబ్రాహీం యొక్క ధర్మమును అనుసరించటం మరియు షిర్కు నుండి ,ముష్రికుల నుండి విసుగు చెందటం తప్పనిసరి.

• في قوله:﴿ءَأَرْبَابٌ مُّتَفَرِّقُونَ ...﴾ دليل على أن هؤلاء المصريين كانوا أصحاب ديانة سماوية لكنهم أهل إشراك.
ఆయన సుబహానహు తఆలా వాక్యములో {ءَأَرْبَابٌ مُّتَفَرِّقُونَ} మిసర్ వాసులందరు పరలోక ధర్మం వారు అనటానికి ఆధారం ఉన్నది. కాని వారందరు షిర్కు చేసే వారు.

• كلُّ الآلهة التي تُعبد من دون الله ما هي إلا أسماء على غير مسميات، ليس لها في الألوهية نصيب.
మీరు అల్లాహ్ ను వదిలి ఆరాధిస్తున్న ఆరాధ్య దైవాలన్నీ పేర్లు లేని పేర్లు మాత్రమే.వాటి కొరకు దైవత్వంలో ఎటువంటి భాగము లేదు.

• استغلال المناسبات للدعوة إلى الله، كما استغلها يوسف عليه السلام في السجن.
అల్లాహ్ వైపు పిలుపు నివ్వటానికి సంధర్భాలను ఉపయోగించటం ఏ విధంగానైతే యూసుఫ్ అలైహిస్సలాం వాటిని (సందర్భాలను) చెరసాలలో ఉపయోగించారో ఆ విధంగా.

 
የይዘት ትርጉም ምዕራፍ: ዩሱፍ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ - የትርጉሞች ማዉጫ

ከቁርአን ተፍሲር ጥናት ማዕከል የተገኘ

መዝጋት