Check out the new design

የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም ምዕራፍ: አር-ረዕድ   አንቀጽ:
وَیَسْتَعْجِلُوْنَكَ بِالسَّیِّئَةِ قَبْلَ الْحَسَنَةِ وَقَدْ خَلَتْ مِنْ قَبْلِهِمُ الْمَثُلٰتُ ؕ— وَاِنَّ رَبَّكَ لَذُوْ مَغْفِرَةٍ لِّلنَّاسِ عَلٰی ظُلْمِهِمْ ۚ— وَاِنَّ رَبَّكَ لَشَدِیْدُ الْعِقَابِ ۟
ఓ ప్రవక్తా ముష్రికులు శిక్ష గురించి మీకు తొందర పెడుతున్నారు.మరియు వారి కొరకు అల్లాహ్ నిర్ణయించిన అనుగ్రహాలు వారిపై పూర్తి కాక మునుపు వారిపై దాని (శిక్ష) దిగటమును నెమ్మదిస్తున్నారు. వారికన్న ముందు వారి లాంటి తిరస్కార జాతులపై శిక్షలు జరిగినవి.అయితే వారు ఎందుకని వాటితో గుణపాఠం నేర్చుకోవటం లేదు ?.ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువు ప్రజలు దుర్మార్గమునకు పాల్పడినా వారి కొరకు మన్నించేవాడు.అయినా వారు అల్లాహ్ వద్ద పశ్చాత్తాప్పడాలని వారిపై శిక్షను తొందర చేయడు.మరియు నిశ్చయంగా ఆయన తమ అవిశ్వాసంపై మొండిగా వ్యవహరించే వారు ఒక వేళ పశ్చాత్తాప్పడకపోతే వారికి కఠినంగా శిక్షించేవాడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَیَقُوْلُ الَّذِیْنَ كَفَرُوْا لَوْلَاۤ اُنْزِلَ عَلَیْهِ اٰیَةٌ مِّنْ رَّبِّهٖ ؕ— اِنَّمَاۤ اَنْتَ مُنْذِرٌ وَّلِكُلِّ قَوْمٍ هَادٍ ۟۠
మరియు అల్లాహ్ పై అవిశ్వాసమును కనబరిచేవారు ఆటంకమును కలిగించటంలో మరియు వ్యతిరేకించటంలో మొండిగా కొనసాగే వారు ఇలా అంటున్నారు : మూసా మరియు ఈసా పై అవతరించినట్లుగా ముహమ్మద్ పై తన ప్రభువు తరపు నుండి ఏదైన సూచన ఎందుకు అవతరించబడలేదు. ఓ ప్రవక్తా మీరు ప్రజలను అల్లాహ్ శిక్ష నుండి హెచ్చరించే వారు,భయపెట్టేవారు మాత్రమే. మీకు అల్లాహ్ ప్రసాధించినవి తప్ప వేరే సూచనలు లేవు.మరియు ప్రతీ జాతి వారి కొరకు వారికి సత్య మార్గము వైపు మార్గమును నిర్దేశించే మరియ వారిని దానిపై నడిపించే ఒక ప్రవక్త ఉంటారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
اَللّٰهُ یَعْلَمُ مَا تَحْمِلُ كُلُّ اُ وَمَا تَغِیْضُ الْاَرْحَامُ وَمَا تَزْدَادُ ؕ— وَكُلُّ شَیْءٍ عِنْدَهٗ بِمِقْدَارٍ ۟
ప్రతీ స్త్రీ తన గర్భంలో ఏమి దాల్చుతుందో అల్లాహ్ కు తెలుసు.దాని గురించి ప్రతీది ఆయనకు తెలుసు.గర్భాల్లో జరిగే హెచ్చు,తగ్గులు మరియు ఆరోగ్యాలు,అనారోగ్యాలు ఆయనకు తెలుసు. మరియు పరిశుద్ధుడైన ఆయన వద్ద ప్రతీ వస్తువు యొక్క ఒక పరిమాణం నిర్ణయించబడి ఉన్నది అది దానికన్న పెరగదు మరియు దానికన్న తరగదు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
عٰلِمُ الْغَیْبِ وَالشَّهَادَةِ الْكَبِیْرُ الْمُتَعَالِ ۟
ఎందుకంటే పరిశుద్ధుడైన ఆయన తన సృష్టితాల ఇంద్రియాల నుండి గోప్యంగా ఉన్నవాటిని తెలిసినవాడు.మరియు వారి ఇంద్రియాలకు తెలిసిన వాటిని తెలిసినవాడు. తన గుణాల్లో,తన నామాల్లో మరియు తన కార్యాల్లో మహోన్నతుడు. తన అస్తిత్వములో మరియు తన గుణాల్లో తన సృష్టితాల్లో నుండి ప్రతి సృష్టి కన్న అధికముగా ఉన్నవాడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
سَوَآءٌ مِّنْكُمْ مَّنْ اَسَرَّ الْقَوْلَ وَمَنْ جَهَرَ بِهٖ وَمَنْ هُوَ مُسْتَخْفٍ بِالَّیْلِ وَسَارِبٌ بِالنَّهَارِ ۟
గోప్యంగా ఉన్న వాటిని తెలుసుకునేవాడు మరియు గోప్యంగా ఉంచేవాడు. ఓ ప్రజలారా మీలో నుండి గోప్యంగా మాట్లాడేవారు మరియు వాటిని బహిర్గతం చేసేవారు ఆయన జ్ఞానంలో సమానము. మరియు అలాగే ప్రజల దృష్టి నుండి రాత్రి చీకటిలో దాగి ఉండే వారు మరియు పగటి వెలుగులో తమ కార్యములను బహిర్గతం చేసే వారు ఆయన జ్ఞానములో సమానము.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
لَهٗ مُعَقِّبٰتٌ مِّنْ بَیْنِ یَدَیْهِ وَمِنْ خَلْفِهٖ یَحْفَظُوْنَهٗ مِنْ اَمْرِ اللّٰهِ ؕ— اِنَّ اللّٰهَ لَا یُغَیِّرُ مَا بِقَوْمٍ حَتّٰی یُغَیِّرُوْا مَا بِاَنْفُسِهِمْ ؕ— وَاِذَاۤ اَرَادَ اللّٰهُ بِقَوْمٍ سُوْٓءًا فَلَا مَرَدَّ لَهٗ ۚ— وَمَا لَهُمْ مِّنْ دُوْنِهٖ مِنْ وَّالٍ ۟
పరిశుధ్ధుడైన మరియు మహోన్నతుడైన ఆయనకు దైవ దూతలున్నారు వారిలో నుండి కొందరు కొందరి తరువాత మానవుల వెనుక వస్తుంటారు. వారిలో నుండి కొందరు రాత్రిపూట వస్తారు. మరియు కొందరు పగటిపూట వస్తారు. వారు అల్లాహ్ వారి కొరకు రాసి ఉంచిన సామర్ధ్యాల్లో నుండి అల్లాహ్ ఆదేశము ద్వారా మానవుడిని రక్షిస్తారు. మరియు వారు అతని మాటలను మరియు అతని కర్మలను వ్రాస్తారు. నిశ్చయంగా అల్లాహ్ ఏదైన జాతి వారు తాము స్వయంగా కృతజ్ఞత స్థితిని మార్చుకోనంత వరకు మంచి స్థితి నుండి వేరే స్థితికి వారిని సంతోషము కలిగించని స్థితికి మార్చడు.మరియు పరిశుద్ధుడైన అల్లాహ్ ఏదైన జాతి వారిని తుదిముట్టించదలచితే ఆయన తలచుకున్న దాన్ని మరల్చే వాడు ఎవడూ ఉండడు. ఓ ప్రజలారా అల్లాహ్ కాకుండా మీ వ్యవహారాలను పరిరక్షించే ఎటువంటి పరిరక్షకుడు మీ కొరకు ఎవరూ ఉండరు. అయితే మీరు మీకు కలిగిన ఆపదలను తొలగించుకోవటానికి ఆయన్నే ఆశ్రయించండి.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
هُوَ الَّذِیْ یُرِیْكُمُ الْبَرْقَ خَوْفًا وَّطَمَعًا وَّیُنْشِئُ السَّحَابَ الثِّقَالَ ۟ۚ
ఓ ప్రజలారా ఆయనే మీకు మెరుపులను చూపిస్తాడు.మరియు మీ కొరకు దాని ద్వారా పిడుగుల నుండి భయమును మరియు వర్షములో ఆశను సమీకరిస్తాడు. మరియు ఆయనే భారీ వర్షపు నీటితో బరువెక్కిన మేఘములను సృష్టించినవాడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَیُسَبِّحُ الرَّعْدُ بِحَمْدِهٖ وَالْمَلٰٓىِٕكَةُ مِنْ خِیْفَتِهٖ ۚ— وَیُرْسِلُ الصَّوَاعِقَ فَیُصِیْبُ بِهَا مَنْ یَّشَآءُ وَهُمْ یُجَادِلُوْنَ فِی اللّٰهِ ۚ— وَهُوَ شَدِیْدُ الْمِحَالِ ۟ؕ
మరియు ఉరుము తన ప్రభువు పరిశుద్ధతను పరిశుద్ధుడైన ఆయన స్థుతులతో కొనియాడుతుంది. మరియు దైవ దూతలు తమ ప్రభువు పరిశుద్ధతను ఆయన భయముతో మరియు ఆయన కొరకు గౌరవముగా,మర్యాదగా కొనియాడుతారు. మరియు ఆయన తన సృష్టితాల్లోంచి తాను ఎవరిని తుదిముట్టించదలచుకుంటే వారిపై కాలుతున్న పిడుగుల గర్జనలను పంపిస్తాడు. మరియు అవిశ్వాసపరులు అల్లాహ్ ఏకత్వ విషయంలో వాదులాడుతున్నారు. మరియు అల్లాహ్ తన పట్ల అవిధేయత చూపే వారి కొరకు మహా శక్తిమంతుడు మరియు యుక్తిపరుడు. తాను నిర్ణయించుకున్న దానిని చేసి తీరుతాడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• عظيم مغفرة الله وحلمه عن خطايا بني آدم، فهم يستكبرون ويَتَحَدَّوْنَ رسله وأنبياءه، ومع هذا يرزقهم ويعافيهم ويحلم عنهم.
ఆదమ్ సంతతి యొక్క పాపముల నుండి అల్లాహ్ యొక్క గొప్ప మన్నింపు మరియు ఆయన క్షమాపణ.అయితే వారు అహంకారమును చూపుతున్నారు.మరియు అతని ప్రవక్తలను మరియు అతని సందేశహరులను విభేదిస్తున్నారు. ఇలా ఉన్నా కూడా వారికి ఆయన ఆహారోపాదిని కల్పిస్తున్నాడు మరియు ఆయన వారిని మన్నిస్తున్నాడు మరియు వారిని క్షమిస్తున్నాడు.

• سعة علم الله تعالى بما في ظلمة الرحم، فهو يعلم أمر النطفة الواقعة في الرحم، وصَيْرُورتها إلى تخليق ذكر أو أنثى، وصحته واعتلاله، ورزقه وأجله، وشقي أو سعيد، فعلمه بها عام شامل.
గర్భం యొక్క చీకటిలో ఉన్న వాటితో సహా మహోన్నతుడైన అల్లాహ్ జ్ఞానం యొక్క సామర్ధ్యం (విశాలత్వం).అయితే ఆయన గర్భంలో పడిన వీర్య బిందువు విషయం గురించి అది మగ లేదా ఆడగా మారి పుట్టటం,మరియు దాని ఆరోగ్యము,దాని అనారోగ్యము,దాని ఆహారము,దాని ఆయుషు,దుష్టుడవటం లేదా పుణ్యాత్ముడవటం గురించి తెలుసినవాడు. దాని గురించి అతని జ్ఞానం సాధారణంగా పొందుపరచబడి ఉన్నది.

• عظيم عناية الله ببني آدم، وإثبات وجود الملائكة التي تحرسه وتصونه وغيرهم مثل الحَفَظَة.
ఆదమ్ సంతతిపై అల్లాహ్ గొప్ప అనుగ్రహము.మరియు అతన్ని పర్యవేక్షించే,అతన్ని పరిరక్షించే మరియు పరిరక్షించే లాంటి ఇతర దైవదూతలు ఉండటం నిరూపణ.

• أن الله تعالى يغير حال العبد إلى الأفضل متى ما رأى منه اتباعًا لأسباب الهداية، فهداية التوفيق منوطة باتباع هداية البيان.
నిశ్చయంగా దాసుడు సన్మార్గపు కారకాలను అనుసరించటమును అల్లాహ్ చూసినప్పుడు అతడి స్థితిని ఉన్నత స్థానములోకి మార్చి వేస్తాడు.కావున సన్మార్గము యొక్క సౌభాగ్యము ప్రకటించబడిన సన్మార్గమును అనుసరించడంతో ముడిపడి ఉన్నది.

 
የይዘት ትርጉም ምዕራፍ: አር-ረዕድ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ - የትርጉሞች ማዉጫ

ከቁርአን ተፍሲር ጥናት ማዕከል የተገኘ

መዝጋት