Check out the new design

የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም ምዕራፍ: አር-ረዕድ   አንቀጽ:
اَفَمَنْ یَّعْلَمُ اَنَّمَاۤ اُنْزِلَ اِلَیْكَ مِنْ رَّبِّكَ الْحَقُّ كَمَنْ هُوَ اَعْمٰی ؕ— اِنَّمَا یَتَذَكَّرُ اُولُوا الْاَلْبَابِ ۟ۙ
ఓ ప్రవక్తా మీపై అల్లాహ్ అవతరింపజేసినది,నీ ప్రభువు తరపు నుండి సత్యం కావటంలో ఎటువంటి సందేహం లేదని తెలుసుకున్నవాడు మరియు అతడు అల్లాహ్ కి ప్రతిస్పందించే విశ్వాసపరుడు అతడు మరియు గ్రుడ్డివాడైనవాడు మరియు అతడు అల్లాహ్ కి ప్రతిస్పందించని అవిశ్వాసపరుడు సమానులు కారు. బుద్దిమంతులే దీనితో గుణపాఠం నేర్చుకుంటారు మరియు హితబోధన గ్రహిస్తారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
الَّذِیْنَ یُوْفُوْنَ بِعَهْدِ اللّٰهِ وَلَا یَنْقُضُوْنَ الْمِیْثَاقَ ۟ۙ
అల్లాహ్ కి ప్రతిస్పందించే వారే ఎవరైతే అల్లాహ్ తో చేసిన వాగ్దానమును లేదా ఆయన దాసులతో చేసిన వాగ్దానమును పూర్తి చేస్తారు.మరియు అల్లాహ్ తో లేదా ఇతరులతో పతిష్టపరచిన వాగ్దానాలను భంగపరచరు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَالَّذِیْنَ یَصِلُوْنَ مَاۤ اَمَرَ اللّٰهُ بِهٖۤ اَنْ یُّوْصَلَ وَیَخْشَوْنَ رَبَّهُمْ وَیَخَافُوْنَ سُوْٓءَ الْحِسَابِ ۟ؕ
మరియు వారే ఎవరైతే అల్లాహ్ కలపమన్న సంబంధాలను కలుపుతారు.మరియు తమ ప్రభువుతో ఆ భయమును కలిగి ఉంటారు ఏ భయమైతే వారిని ఆయన ఆదేశాలను పాటించటం వైపునకు మరియు ఆయన వారించిన వాటికి దూరంగా ఉండటం వైపునకు వారిని నెట్టుతుందో. మరియు వారు పాల్పడిన పాపములకు అల్లాహ్ లెక్క తీసుకుంటాడని భయమును కలిగి ఉంటారు. ఎవరి లెక్కతీసుకోవటం జరుగుతుందో వారు నాశనమైపోతారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَالَّذِیْنَ صَبَرُوا ابْتِغَآءَ وَجْهِ رَبِّهِمْ وَاَقَامُوا الصَّلٰوةَ وَاَنْفَقُوْا مِمَّا رَزَقْنٰهُمْ سِرًّا وَّعَلَانِیَةً وَّیَدْرَءُوْنَ بِالْحَسَنَةِ السَّیِّئَةَ اُولٰٓىِٕكَ لَهُمْ عُقْبَی الدَّارِ ۟ۙ
మరియు ఎవరైతే అల్లాహ్ పై విధేయత చూపటంలో మరియు వారికి సంతోషము కలిగించే లేదా బాధ కలిగించేవాటిని వారిపై అల్లాహ్ నిర్ణయించిన వాటిపై సహనం పాఠిస్తారో మరియు ఎవరైతే అల్లాహ్ ప్రసన్నతను ఆశిస్తూ ఆయన అవిధేయతను విడనాడుతారో మరియు నమాజులను పరిపూర్ణంగా పాఠిస్తారో మరియు మేము వారికి ప్రసాధించిన వాటిలోంచి విధిగావించబడిన హక్కుల్లో ఖర్చు చేస్తారో మరియు ప్రదర్శనా బుద్ధితో దూరంగా ఉండటం కొరకు వాటిలోంచి స్వచ్ఛందంగా,గోప్యంగాను మరియు ఇతరులు తమను నమూనాగా తీసుకోవటం కొరకు బహిరంగంగా ఖర్చు చేస్తారో మరియు తమకు అపకారం చేసిన వారికి ఉపకారమును చేసి వారి చెడును నిర్మూలిస్తారో ఈ గుణాలన్నింటిని కలిగిన వారందరి కొరకు ప్రళయదినాన ప్రశంసనీయమైన పరిణామం కలదు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
جَنّٰتُ عَدْنٍ یَّدْخُلُوْنَهَا وَمَنْ صَلَحَ مِنْ اٰبَآىِٕهِمْ وَاَزْوَاجِهِمْ وَذُرِّیّٰتِهِمْ وَالْمَلٰٓىِٕكَةُ یَدْخُلُوْنَ عَلَیْهِمْ مِّنْ كُلِّ بَابٍ ۟ۚ
ఈ ప్రశంసనీయమైన పరిణామం అవి స్వర్గ వనాలు వాటిలో వారు సుఖభోగాలను అనుభవిస్తూ శాస్వతంగా నివాసముంటారు.మరియు వాటిలో వారి అనుగ్రహాలు పరిపూర్ణవటంలో నుంచి వారి తండ్రులు,వారి తల్లులు, వారి భార్యలు,వారి సంతానము వారికి తోడుగా ఉన్నప్పుడు సద్వర్తునులుగా ఉన్న వారు వారితోపాటు ప్రవేశిస్తారు. మరియు స్వర్గంలో ఉన్న వారి భవనాలన్నింటి ద్వారముల నుండి దైవదూతలు వారికి స్వాగతం పలుకుతారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
سَلٰمٌ عَلَیْكُمْ بِمَا صَبَرْتُمْ فَنِعْمَ عُقْبَی الدَّارِ ۟ؕ
దైవదూతలు వారి వద్దకు వచ్చినపిపుడల్లా తమ మాటల్లో ఈ విధంగా సలాం చేస్తారు : మీపై శుభాలు కురియుగాక అంటే మీరు అల్లాహ్ పై విధేయత చూపటంలో సహనం చూపినందుకు మరియు ఆయన భవితవ్యము జరగటంపై మరియు ఆయనకు అవిధేయత చూపటమును మీ విడనాడటం వలన మీరు ఆపదల నుండి పరిరక్షించబడ్డారు.మీ పరిణామమైన పరలోక పరిణామము ఎంతో మేలైనది.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَالَّذِیْنَ یَنْقُضُوْنَ عَهْدَ اللّٰهِ مِنْ بَعْدِ مِیْثَاقِهٖ وَیَقْطَعُوْنَ مَاۤ اَمَرَ اللّٰهُ بِهٖۤ اَنْ یُّوْصَلَ وَیُفْسِدُوْنَ فِی الْاَرْضِ ۙ— اُولٰٓىِٕكَ لَهُمُ اللَّعْنَةُ وَلَهُمْ سُوْٓءُ الدَّارِ ۟
మరియు ఎవరైతే అల్లాహ్ తో చేసుకున్న వాగ్దానమును దాని తాకీదు చేయబడిన తరువాత భంగపరుస్తారో మరియు అల్లాహ్ ఏ సంబంధాలను కలపమని ఆదేశించాడో వాటిని త్రెంచేవారు వారందరు దూరం చేయబడిన దుష్టులు. వారి కొరకు అల్లాహ్ కారుణ్యం నుండి ధూత్కారము ఉండును. మరియు వారి కొరకు చెడ్డ పరిణామము కలుగును. అది నరకము.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
اَللّٰهُ یَبْسُطُ الرِّزْقَ لِمَنْ یَّشَآءُ وَیَقْدِرُ ؕ— وَفَرِحُوْا بِالْحَیٰوةِ الدُّنْیَا ؕ— وَمَا الْحَیٰوةُ الدُّنْیَا فِی الْاٰخِرَةِ اِلَّا مَتَاعٌ ۟۠
అల్లాహ్ తన దాసుల్లోంచి తాను కోరిన వారి కొరకు జీవనోపాధిని పుష్కలంగా ప్రసాధిస్తాడు.మరియు తాను కోరిన వారికి కుదించివేస్తాడు.జీవనోపాధిలో విస్తరణ సత్స్వభావమునకు మరియు అల్లాహ్ ఇష్టతకు సూచకము కాదు. మరియు అందులో సంకటము నిర్భాగ్యమునకు సూచకము కాదు. మరియు అవిశ్వాసపరులు ఇహలోకజీవితంతో సంతోషం చెందారు. అయితే వారు దాని వైపు మగ్గు చూపి సంతుష్ట చెందారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَیَقُوْلُ الَّذِیْنَ كَفَرُوْا لَوْلَاۤ اُنْزِلَ عَلَیْهِ اٰیَةٌ مِّنْ رَّبِّهٖ ؕ— قُلْ اِنَّ اللّٰهَ یُضِلُّ مَنْ یَّشَآءُ وَیَهْدِیْۤ اِلَیْهِ مَنْ اَنَابَ ۟ۖۚ
మరియు అల్లాహ్ ను మరియు ఆయన ఆయతులను విశ్వసించనివారు ఎందుకని ముహమ్మద్ పై అతని ప్రభువు తరపు నుండి అతని నిజాయితీని దృవీకరించే ఏదైన ఇంద్రియ సూచన మేము అతన్ని విశ్వసించటానికి అవతరింపబడలేదు అని అంటున్నారు.ఓ ప్రవక్తా మీరు ఈ ప్రతిపాదకులందరితో ఇలా పలకండి : నిశ్చయంగా అల్లాహ్ తన న్యాయము ద్వారా తాను కోరిన వారికి మర్గభ్రష్టులు చేస్తాడు.మరియు తన వైపు పశ్చాత్తాప్పడి మరలే వారికి తన అనుగ్రహము ద్వారా సన్మార్గము చూపుతాడు.వారు సన్మార్గమును ఆయతుల అవతరణతో అనుసంధానించే వరకు సన్మార్గము వారి చేతులో లేదు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
اَلَّذِیْنَ اٰمَنُوْا وَتَطْمَىِٕنُّ قُلُوْبُهُمْ بِذِكْرِ اللّٰهِ ؕ— اَلَا بِذِكْرِ اللّٰهِ تَطْمَىِٕنُّ الْقُلُوْبُ ۟ؕ
అల్లాహ్ సన్మార్గం చూపిన వారందరు వారే విశ్వసించిన వారు. మరియు వారి హృదయాలు అల్లాహ్ స్మరణ ద్వారా,ఆయన పరిశుద్ధతను తెలపటం ద్వారా,ఆయన స్థుతులను పలకటం ద్వారా మరియు ఆయన గ్రంధ పారాయణం ద్వారా మరియు దాన్ని వినటం ద్వారా తృప్తి పొందుతాయి. వినండి అల్లాహ్ ఒక్కడి స్మరణ ద్వారా హృదయాలు తృప్తి చెందుతాయి. దాని కోసమే అవి సృష్టించబడినవి.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• الترغيب في جملة من فضائل الأخلاق الموجبة للجنة، ومنها: حسن الصلة، وخشية الله تعالى، والوفاء بالعهود، والصبر والإنفاق، ومقابلة السيئة بالحسنة والتحذير من ضدها.
స్వర్గమును అనివార్యం చేసే సుగుణాలన్నింటిలో ప్రోత్సహించటం.మరియు సత్సంభంధం కలపటం,మహోన్నతుడైన అల్లాహ్ భయము,ప్రమాణాలను నిర్వర్తించటం,సహనం చూపటం,ఖర్చు చేయటం,అపకారమునకు బదులుగా ఉపకారము చేయటం,దాని విరుద్ధంగా చేయటం నుండి జాగ్రత్తపడటం వాటిలోంచివి.

• أن مقاليد الرزق بيد الله سبحانه وتعالى، وأن توسعة الله تعالى أو تضييقه في رزق عبدٍ ما لا ينبغي أن يكون موجبًا لفرح أو حزن، فهو ليس دليلًا على رضا الله أو سخطه على ذلك العبد.
జీవనోపాధి యొక్క పగ్గాలు పరిశుద్ధుడైన,మహోన్నతుడైన అల్లాహ్ చేతిలో ఉన్నవి. మరియు ఏ దాసుని జీవనోపాధిలో అల్లాహ్ విస్తరింపజేయటం లేదా ఆయన యొక్క కుదించటం ఆనందానికి లేదా దుఃఖమునకు కారణం కాకూడదు.అయితే అది ఆ దాసునిపై అల్లాహ్ ప్రసన్నత లేదా ఆయన ఆగ్రహానికి ఆధారం కాదు.

• أن الهداية ليست بالضرورة مربوطة بإنزال الآيات والمعجزات التي اقترح المشركون إظهارها.
మార్గదర్శకత్వం (సన్మార్గం) ముష్రికులు బహిర్గతం చేయమని ప్రతిపాదించిన సూచనల,మహిమల ప్రదర్శనతో ముడిపడి ఉండదు.

• من آثار القرآن على العبد المؤمن أنه يورثه طمأنينة في القلب.
విశ్వాసపరుడైన దాసునిపై ఖుర్ఆన్ యొక్క ప్రభావాలలో ఒకటి అతని హృదయంలో ప్రశాంతతను పొందుతాడు.

 
የይዘት ትርጉም ምዕራፍ: አር-ረዕድ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ - የትርጉሞች ማዉጫ

ከቁርአን ተፍሲር ጥናት ማዕከል የተገኘ

መዝጋት