Check out the new design

የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም ምዕራፍ: አል-በቀራህ   አንቀጽ:
وَاِذْ قُلْنَا ادْخُلُوْا هٰذِهِ الْقَرْیَةَ فَكُلُوْا مِنْهَا حَیْثُ شِئْتُمْ رَغَدًا وَّادْخُلُوا الْبَابَ سُجَّدًا وَّقُوْلُوْا حِطَّةٌ نَّغْفِرْ لَكُمْ خَطٰیٰكُمْ ؕ— وَسَنَزِیْدُ الْمُحْسِنِیْنَ ۟
మేము మీతో ఇలా పలికినప్పుడు మీపై ఉన్నఅల్లాహ్ అనుగ్రహాలను మీరు గుర్తు చేసుకోండి : మీరు బైతుల్ మఖ్దిస్ లో (పరశుద్ధ గృహములో) ప్రవేశించండి. మరియు అందులో ఉన్న పరిశుద్ధ ఆహారముల్లోంచి మీరు కోరుకున్న చోటు నుండి ఆహ్లాదంగా విస్తృతంగా తినండి. మరియు మీరు ప్రవేశించేటప్పుడు అల్లాహ్ కొరకు రకూ చేస్తూ,అణుకువను చూపుతూ అయిపోండి. మరియు అల్లాహ్ తో ఇలా పలుకుతూ వేడుకోండి : ఓ మా ప్రభువా నీవు మా పాపములను మన్నించు. మేము మీ కొరకు స్వీకరిస్తాము. మరియు వారి కర్మలను మంచిగా చేసిన వారికి దానికన్న అధికంగా పుణ్యమును మేము ప్రసాదిస్తాము.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
فَبَدَّلَ الَّذِیْنَ ظَلَمُوْا قَوْلًا غَیْرَ الَّذِیْ قِیْلَ لَهُمْ فَاَنْزَلْنَا عَلَی الَّذِیْنَ ظَلَمُوْا رِجْزًا مِّنَ السَّمَآءِ بِمَا كَانُوْا یَفْسُقُوْنَ ۟۠
వారిలో నుండి దుర్మార్గమునకు పాల్పడిన వారికి వారు చర్యను మార్చటం మరియు మాటను మార్చటం తప్ప ఇంకేమి జరగలేదు. అప్పుడు వారు తమ పిరుదులపై ప్రాకుతూ ప్రవేశించారు. మరియు వారు అల్లాహ్ ఆదేశము పట్ల హేళన చేస్తూ వెన్నులో గింజ అని పలికారు. వారిలో నుండి దుర్మార్గులపై వారికి నిర్దేశించిన హద్దు నుండి వైదొలగిపోవటం వలన మరియు ఆదేశమును వ్యతిరేకించటం వలన అల్లాహ్ ప్రతిఫలంగా ఆకాశము నుండి శిక్షను దించటం జరిగింది.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَاِذِ اسْتَسْقٰی مُوْسٰی لِقَوْمِهٖ فَقُلْنَا اضْرِبْ بِّعَصَاكَ الْحَجَرَ ؕ— فَانْفَجَرَتْ مِنْهُ اثْنَتَا عَشْرَةَ عَیْنًا ؕ— قَدْ عَلِمَ كُلُّ اُنَاسٍ مَّشْرَبَهُمْ ؕ— كُلُوْا وَاشْرَبُوْا مِنْ رِّزْقِ اللّٰهِ وَلَا تَعْثَوْا فِی الْاَرْضِ مُفْسِدِیْنَ ۟
మరియు మీరు తీహ్ లో ఉన్నప్పుడు మీపై కలిగిన అల్లాహ్ అనుగ్రహములను గుర్తు చేసుకోండి. మరియు మీకు తీవ్రమైన దాహం కలిగినది. అప్పుడు మూసా అలైహిస్సలాం తన ప్రభువును కడువినయంగా ప్రార్ధించి మీకు నీళ్ళను త్రాపించమని ఆయనను అడిగాడు. అప్పుడు మేము ఆయనను తన చేతి కర్రను రాతిపై కొట్టమని ఆదేశించాము. ఆయన దాన్ని కొట్టగానే మీ తెగల లెక్క ప్రకారం పన్నెండు ఊటలు దాని నుండి ప్రవహించాయి. వాటి నుండి నీరు పొంగి ప్రవహించింది. మరియు మేము ప్రతీ తెగకు వాటి నుండి అది త్రాగే ప్రత్యేక చోటును స్పష్టపరచాము. వారి మధ్య తగాదా రాకుండా ఉండటానికి. మరియు మేము మీతో ఇలా పలికాము : మీరు మీ వద్దకు అల్లాహ్ మీ ఎటువంటి శ్రమ,చర్య లేకుండా తీసుకుని వచ్చిన అల్లాహ్ ఆహారములో నుంచి తినండి మరియు త్రాగండి. మరియు మీరు భూమిలో ఉపద్రవాలను తలపెట్టుతూ తిరగకండి.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَاِذْ قُلْتُمْ یٰمُوْسٰی لَنْ نَّصْبِرَ عَلٰی طَعَامٍ وَّاحِدٍ فَادْعُ لَنَا رَبَّكَ یُخْرِجْ لَنَا مِمَّا تُنْۢبِتُ الْاَرْضُ مِنْ بَقْلِهَا وَقِثَّآىِٕهَا وَفُوْمِهَا وَعَدَسِهَا وَبَصَلِهَا ؕ— قَالَ اَتَسْتَبْدِلُوْنَ الَّذِیْ هُوَ اَدْنٰی بِالَّذِیْ هُوَ خَیْرٌ ؕ— اِهْبِطُوْا مِصْرًا فَاِنَّ لَكُمْ مَّا سَاَلْتُمْ ؕ— وَضُرِبَتْ عَلَیْهِمُ الذِّلَّةُ وَالْمَسْكَنَةُ وَبَآءُوْ بِغَضَبٍ مِّنَ اللّٰهِ ؕ— ذٰلِكَ بِاَنَّهُمْ كَانُوْا یَكْفُرُوْنَ بِاٰیٰتِ اللّٰهِ وَیَقْتُلُوْنَ النَّبِیّٖنَ بِغَیْرِ الْحَقِّ ؕ— ذٰلِكَ بِمَا عَصَوْا وَّكَانُوْا یَعْتَدُوْنَ ۟۠
మరియు మీరు మీ ప్రభువు అనుగ్రహమును తిరస్కరించినప్పటి వైనమును గుర్తు చేసుకోండి అప్పుడు మీరు అల్లాహ్ మీపై అవతరింపజేసిన మన్న,సల్వాను తినటం నుండి విసిగిపోయి ఇలా పలికారు : మారని ఒకేరకమైన ఆహారమును మేము సహించము. అప్పుడు మీరు మూసా అలైహిస్సలాంను అల్లాహ్ తో తమ కొరకు భూమి ఉత్పత్తి చేసే కాయగూరలను,ఆకుగూరలను,దోసకాయలను (దోసకాయ లాంటిదే కాని దాని కన్నపెద్దది),ధాన్యములను,పప్పును,ఉల్లిపాయలను ఆహారంగా వెలికితీయమని వేడుకోమని కోరారు. అప్పుడు మూసా అలైహిస్సలాం అయిష్టతను చూపుతూ ఇలా పలికారు : మీరు బదులుగా కోరుకున్న మీ కోరిక మన్న,సల్వా కన్న చాలా తక్కువైనది మరియు అల్పమైనది. మరియు అది (మన్న,సల్వా) మేలైనది,గౌరవప్రధమైనది. వాస్తవానికి అది మీ వద్దకు ఎటువంటి అలసట,శ్రమ లేకుండా వస్తున్నది. మీరు ఈ ఊరు నుండి ఏ ఉరుకైనా వెళ్ళండి అక్కడి పొలాల్లో,బజారులలో మీరు అడిగిన వాటిని పొందుతారు. మరియు వారు తమ మనోవాంఛలను అనుసరించటం వలన మరియు అల్లాహ్ వారి కొరకు ఎంపిక చేసిన వాటి నుండి పదేపదే విముఖత చూపటం వలన వారికి అవమానము,పేదరికం,కష్టాలు చుట్టుకున్నాయి. మరియు వారు ఆయన ధర్మము పట్ల విముఖత చూపటం వలన మరియు వారు ఆయన ఆయతులను తిరస్కరించటం వలన మరియు ఆయన ప్రవక్తలను దుర్మార్గముగా శతృత్వముగా హతమార్చటం వలన అల్లాహ్ ఆగ్రహమునకు లోనయ్యారు. ఇదంతా వారు అల్లాహ్ కు అవిధేయతకు పాల్పడటం వలన మరియు ఆయన హద్దులను అతిక్రమించటం వలన.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• كل من يتلاعب بنصوص الشرع ويحرّفها فيه شَبَهٌ من اليهود، وهو مُتوعَّد بعقوبة الله تعالى.
ధర్మ ఆధారాలతో ఆటలాడి వాటిని తారుమారు చేసే ప్రతీ ఒక్కడు యూదులు లాంటివాడు. మరియు అతడు మహోన్నతుడైన అల్లాహ్ శిక్షతో వాగ్దానం చేయబడ్డాడు.

• عِظَمُ فضل الله تعالى على بني إسرائيل، وفي مقابل ذلك شدة جحودهم وعنادهم وإعراضهم عن الله وشرعه.
ఇశ్రాయీలు సంతతి వారిపై సర్వశక్తిమంతుడైన అల్లాహ్ అనుగ్రహ గొప్పతనం, దీనికి ప్రతిగా వారి అవిశ్వాసం, మొండితనం మరియు వారు అల్లాహ్ నుండి మరియు ఆయన ధర్మ శాసనం నుండి తప్పుకోవడం.

• أن من شؤم المعاصي وتجاوز حدود الله تعالى ما ينزل بالمرء من الذل والهوان، وتسلط الأعداء عليه.
నిశ్చయంగా అవిధేయ కార్యాలు మరియు మహోన్నతుడైన అల్లాహ్ హద్దులను అతిక్రమించటం యొక్క దుష్ప్రభావములోంచిది మవిషిపై దిగే అవమానము మరియు పరాభవము మరియు అతని శతృవుల ఆధిక్యత.

 
የይዘት ትርጉም ምዕራፍ: አል-በቀራህ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ - የትርጉሞች ማዉጫ

ከቁርአን ተፍሲር ጥናት ማዕከል የተገኘ

መዝጋት