Check out the new design

የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም ምዕራፍ: አል-በቀራህ   አንቀጽ:
وَاِذْ قَالَ اِبْرٰهٖمُ رَبِّ اَرِنِیْ كَیْفَ تُحْیِ الْمَوْتٰی ؕ— قَالَ اَوَلَمْ تُؤْمِنْ ؕ— قَالَ بَلٰی وَلٰكِنْ لِّیَطْمَىِٕنَّ قَلْبِیْ ؕ— قَالَ فَخُذْ اَرْبَعَةً مِّنَ الطَّیْرِ فَصُرْهُنَّ اِلَیْكَ ثُمَّ اجْعَلْ عَلٰی كُلِّ جَبَلٍ مِّنْهُنَّ جُزْءًا ثُمَّ ادْعُهُنَّ یَاْتِیْنَكَ سَعْیًا ؕ— وَاعْلَمْ اَنَّ اللّٰهَ عَزِیْزٌ حَكِیْمٌ ۟۠
ఓ ప్రవక్త! ఇబ్రాహీము ఇలా ప్రశ్నించిన విషయాన్ని జ్ఞాపకం చేసుకో, 'నా ప్రభూ, చనిపోయినవారు తిరిగి ఎలా సజీవులు అవుతారో నాకు చూపించు'. దానికి అల్లాహ్ ఇలా బదులిచ్చాడు, ‘నీకు ఇందులో విశ్వాసం లేదా?’. ఇబ్రాహీము ఇలా జవాబిచ్చాడు, ‘నాకు విశ్వాసం ఉన్నది. కానీ, నా మనస్తృప్తి కోసం కోరుతున్నాను’. అప్పుడు అల్లాహ్ అతనికి ఇలా ఆదేశించాడు, ‘నాలుగు పక్షులను తీసుకుని, వాటిని మచ్చిక చేసుకో. ఆ తర్వాత వాటిని ముక్కలు ముక్కలు చేసి, ఆ ముక్కలను కలిపివేయి. తరువాత ఆ ముక్కలను నీ చుట్టుప్రక్కల ఉన్న ఒక్కో కొండపై ఉంచు. ఆ తర్వాత ఆ పక్షులను పిలువు. వెంటనే (వేర్వేరు కొండలపై ఉన్న పక్షుల ముక్కలలో ఆ యా పక్షులకు చెందిన ముక్కలు ఒక చోట చేరి,) అవి సజీవులై, ఎగురుకుంటూ నీ వద్దకు వస్తాయి. తెలుసుకో ఓ ఇబ్రాహీము! అల్లాహ్ తన అధికారము, ఆధిపత్యములో సాటిలేని వాడు, అంతేగాక తన ఉత్తర్వులలో మరియు శాసనాలలో ఎంతో వివేకవంతుడూను’.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
مَثَلُ الَّذِیْنَ یُنْفِقُوْنَ اَمْوَالَهُمْ فِیْ سَبِیْلِ اللّٰهِ كَمَثَلِ حَبَّةٍ اَنْۢبَتَتْ سَبْعَ سَنَابِلَ فِیْ كُلِّ سُنْۢبُلَةٍ مِّائَةُ حَبَّةٍ ؕ— وَاللّٰهُ یُضٰعِفُ لِمَنْ یَّشَآءُ ؕ— وَاللّٰهُ وَاسِعٌ عَلِیْمٌ ۟
అల్లాహ్ మార్గంలో తమ సంపదను ఖర్చు చేసే విశ్వాసుల ప్రతిఫలం యొక్క ఉపమానం తన సారవంతమైన భూమిలో ఒక రైతు నాటిన ధాన్యపు గింజను పోలి ఉన్నది. ఈ ధాన్యపు గింజ ఏడు కంకులను ఉత్పత్తి చేస్తుంది, ప్రతీ కంకి వంద ధాన్యపు గింజలు కలిగి ఉంటుంది. అల్లాహ్ తన దాసులలో తనకు ఇష్టమైన వారి ప్రతిఫలాన్ని అనేక రెట్లు హెచ్చిస్తాడు మరియు వారికి లెక్కించలేనన్ని పుణ్యాలు ప్రసాదిస్తాడు. అల్లాహ్ అమితంగా దాతృత్వము చేసేవాడు మరియు అమితంగా ప్రసాదించేవాడు. తమ ప్రతిఫలం గుణించ బడటానికి ఎవరు అర్హులో ఆయనకు బాగా తెలుసు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
اَلَّذِیْنَ یُنْفِقُوْنَ اَمْوَالَهُمْ فِیْ سَبِیْلِ اللّٰهِ ثُمَّ لَا یُتْبِعُوْنَ مَاۤ اَنْفَقُوْا مَنًّا وَّلَاۤ اَذًی ۙ— لَّهُمْ اَجْرُهُمْ عِنْدَ رَبِّهِمْ ۚ— وَلَا خَوْفٌ عَلَیْهِمْ وَلَا هُمْ یَحْزَنُوْنَ ۟
అల్లాహ్ యొక్క విధేయత మరియు మెప్పు కోసం తమ సంపద ఖర్చు పెట్టేవారు తమ మాటలు లేదా చర్యల ద్వారా తాము చేసిన ఉపకారాన్ని ప్రజలకు ఎత్తి చూపుతూ తమ ప్రతిఫలాన్ని నాశనం చేసుకోరు మరియు తమ ప్రభువు నుండి వారు తప్పకుండా తమ ప్రతిఫలం అందుకుంటారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
قَوْلٌ مَّعْرُوْفٌ وَّمَغْفِرَةٌ خَیْرٌ مِّنْ صَدَقَةٍ یَّتْبَعُهَاۤ اَذًی ؕ— وَاللّٰهُ غَنِیٌّ حَلِیْمٌ ۟
ఒక విశ్వాసిని సంతోషపెట్టే మాట పలకడం లేదా చెడుగా వ్యవహరించిన వారిని క్షమించడం అనేది మాటిమాటికీ చేసిన ఉపకారాన్ని ఆ వ్యక్తికి ఎత్తి చూపటం వలన కలిగే హాని కంటే ఉత్తమమైనది. అల్లాహ్ కు తన దాసుల అవసరం లేదు; ఆయన వారిపై సహనం చూపిస్తూ ఉండటం వలన తరుచుగా ఆయన వారిని త్వరగా శిక్షించడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تُبْطِلُوْا صَدَقٰتِكُمْ بِالْمَنِّ وَالْاَذٰی ۙ— كَالَّذِیْ یُنْفِقُ مَالَهٗ رِئَآءَ النَّاسِ وَلَا یُؤْمِنُ بِاللّٰهِ وَالْیَوْمِ الْاٰخِرِ ؕ— فَمَثَلُهٗ كَمَثَلِ صَفْوَانٍ عَلَیْهِ تُرَابٌ فَاَصَابَهٗ وَابِلٌ فَتَرَكَهٗ صَلْدًا ؕ— لَا یَقْدِرُوْنَ عَلٰی شَیْءٍ مِّمَّا كَسَبُوْا ؕ— وَاللّٰهُ لَا یَهْدِی الْقَوْمَ الْكٰفِرِیْنَ ۟
అల్లాహ్ ను విశ్వసించే మరియు ఆయన ప్రవక్తను అనుసరించే ప్రజలారా! మీ దాతృత్వం గురించి ప్రగల్భాలు పలుకుతూ మరియు మీరు దానం ఇచ్చిన వ్యక్తిని బాధపెట్టడం ద్వారా మీ ప్రతిఫలాన్ని నాశనం చేసుకో వద్దు. అలాంటి తప్పు చేసే వ్యక్తి ప్రజలకు చూపడానికి మరియు ప్రశంసలు పొందటానికి ఖర్చు చేసిన వాడిగా, అల్లాహ్ పై విశ్వాసం మరియు పునరుత్థాన రోజున లభించబోయే ప్రతిఫలం మరియు శిక్షలపై విశ్వాసం లేనివాడిగా పరిగణించబడతాడు. దీని ఉపమానం, కొంత దుమ్మూ, ధూళి పడి ఉన్న మృదువైన రాయిని పోలి ఉన్నది: ఆ రాయిపై భారీ వర్షం పడినప్పుడు, దానిపై చేరిన దుమ్ము, ధూళి కొట్టుకు పోతుంది మరియు దానిపై ఏమీ లేకుండా, అది నున్నగా కనబడుతుంది. అదేవిధంగా, ఇతరులకు చూపించాలని చేసే పనుల మరియు దానధర్మాల ప్రతిఫలం అల్లాహ్ దృష్టిలో ఏమీ మిగలదు. అల్లాహ్ అవిశ్వాసులకు తను మెచ్చే వాటి వైపు మరియు వారికి ప్రయోజనం చేకూర్చే వాటి వైపు మార్గనిర్దేశం చేయడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• مراتب الإيمان بالله ومنازل اليقين به متفاوتة لا حد لها، وكلما ازداد العبد نظرًا في آيات الله الشرعية والكونية زاد إيمانًا ويقينًا.
విశ్వాసం యొక్క స్థాయిలు మరియు విశ్వాసం యొక్క దశలకు ఎలాంటి పరిమితి లేదు. దాసుడు అల్లాహ్ యొక్క షరయీ,విశ్వపు సూచనలను చూసినపప్పుడల్లా విశ్వసపరంగా,నమ్మకపరంగా అధికమవుతాడు.

• بَعْثُ الله تعالى للخلق بعد موتهم دليل ظاهر على كمال قدرته وتمام عظمته سبحانه.
ప్రజలు మరణించిన తరువాత మరలా వారి పునరుత్థానం అల్లాహ్ యొక్క పరిపూర్ణ సామర్థ్యం మరియు గొప్పతనానికి స్పష్టమైన నిదర్శనం.

• فضل الإنفاق في سبيل الله وعظم ثوابه، إذا صاحبته النية الصالحة، ولم يلحقه أذى ولا مِنّة محبطة للعمل.
ఎలాంటి చూపుగోలు మరియు చేసిన ఉపకారాన్ని ఎత్తి చూపడం వంటివి లేకుండా మంచి ఉద్దేశ్యంతో అల్లాహ్ మార్గంలో ఖర్చు చేస్తే, దానికి బదులుగా గొప్ప అనుగ్రహం మరియు గొప్ప ప్రతిఫలం ఉన్నది.

• من أحسن ما يقدمه المرء للناس حُسن الخلق من قول وفعل حَسَن، وعفو عن مسيء.
ఒక వ్యక్తి చేయగలిగే ఒక ఉత్తమ పని ఏమిటంటే, మంచి పలుకుల ద్వారా లేదా మంచి పనుల ద్వారా, ఇంకా తనకు చెడు చేసిన వ్యక్తిని క్షమించడం ద్వారా తన మంచి ప్రవర్తన ప్రదర్శించడం.

 
የይዘት ትርጉም ምዕራፍ: አል-በቀራህ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ - የትርጉሞች ማዉጫ

ከቁርአን ተፍሲር ጥናት ማዕከል የተገኘ

መዝጋት